శాతవాహనుల యుగం 5
శాతవాహనుల పరిపాలన వ్యవస్థ
- బావుల నుండి నీళ్లు తోడటానికి ఉడక యంత్రాలను వాడేవారు
- ఉదగ యంత్రం - భూమిని దున్నే యంత్రం
- ఘటిక - యంత్రం - నీటిని పైకి లాగటానికి
- గరిక యంత్రం - ముడి ప్రత్తి నుండి విత్తనాలు వేరు చేయడానికి వాడే యంత్రం
- రజ్జగాహకుడు భూమి శిస్తును నిర్ణయించి ఆ శిస్తును వసూలు చేసేవారు.
- అప్పట్లో 18 వృత్తి శ్రేణి వారు / అష్టాదశ వర్గాల వారు ఉండేవారు.
- కొలికులు -- నేత కారులు
- తిలిషకులు -- నూనె తీసేవారు
- కాసకారులు -- ఇత్తడి పనివారు
- కులరికులు / కుమారులు -- కుమ్మరులు
- తెసకారులు -- మెరుగు పట్టేవారు
- మణికారులు -- రత్నపని వారు
- మాల కారులు -- పూల వర్తకులు
- ఓద యాంత్రికులు -- ఉదయ యంత్రాలు చేసేవారు
- లోహవాణియులు -- ఇనుప వర్తకులు
- సువణ కారులు -- సువర్ణకారులు
- వథకులు -- వడ్రంగులు
- సెలవధకులు -- రాతపనివారు
- అవేసినులు -- చేతివృత్తివారు
- లేఖకులు -- రాయసగాళ్లు
- చమ్మకారులు -- చర్మకారులు
- పాసకారులు -- మేదరివారు
- మీఠీకులు -- రాయి మెరుగు పెట్టేవారు
- గధికులు -- సుగంధ ద్రవ్యాల వర్తకులు
- ఒక్కొక్క వృత్తిని అనుసరించేవారు ఒక్కొక్క శ్రేణిగా ఏర్పడ్డారు. వీరికి శ్రేష్టి అనే అధ్యక్షులు ఉండేవారు.
- వడ్డీ వ్యాపారులు 12% వడ్డీని వసూలు చేసేవారు
- స్వదేశీ వర్తకులు సంఘాలుగా ఏర్పడేవారు. ఈ సంఘాలనే నిభయ లేదా నికాయ లేదా నిగమ
- అనేవారు.
- సంఘాల సమావేశాన్ని "గోష్ఠి" అనేవారు.
- గోష్ఠి అధ్యక్షుడుని శెట్టి అంటారు.
- శాతవాహనుల కాలంలో అత్యధికంగా సీసం నాణెములు ముద్రించబడ్డాయి.
- వీరికాలంలో రోమ్ దేశంతో వర్తకం బాగా జరిగేది.
- ఫ్లీని యొక్క గ్రంధం - "Natural History "
- ఒక బంగారు నాణెం 35 వెండి నాణెములతో సమానం
- అప్పట్లో శాతవాహనుల ముఖ్యమైన ఓడ రేవు - మైసోలి(తూర్పు తీరం), కోల్డురా, కంటక సేల, అల్లోసిగ్నే.
- పశ్చిమతీరం - బారుకాచ్(బ్రోచే-గుజరాత్) , సోహాల్, కళ్యాణ్.
- వీరికాలంలో ప్రధాన ఎగుమతులు - సుగంధ ద్రవ్యాలు, ముత్యాలు, మణులు, పట్టు వస్త్రాలు
- వీరికాలంలో ప్రధాన దిగుమతులు - వెండి, బంగారం, వైన్