గెలిచినవాడికి ఓడినవాడికి తేడా కొంచమే ఉంటుంది. ఇద్దరి కష్టం దాదాపుగా సమానంగా ఉంటుంది. కానీ ఈ సమాజం గెలిచిన వాడిని మాత్రమే గుర్తిస్తుంది ఓడిన వాడిని చీదరించుకుంటుంది. ఆ చిన్న తేడా మీదనే మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని మర్చిపోకండి. సమాజంలో మనకు గౌరవం లభించాలంటే ఆ చిన్న తేడాను జయించాలి. నేను ఆ చిన్న తేడాను జయించలేక ఒక నిరుద్యోగిగానే మిగిలిపోయాను. ఎన్నో అవరోధాలు ఎదుర్కొంటున్నాను.
నాపేరు వి కిరణ్ కుమార్. నేను B.Tech 2004 లో, M.Tech 2008 లో JNTU యూనివర్సిటీ లో చేశాను, 2008 నుంచి ఇంజనీరింగ్ కళాశాలలో టీచింగ్ వృత్తిలో కొనసాగుతున్నాను. ప్రస్తుతం ప్రైవేట్ యాజమాన్యాల దురాక్రమణలపై పోరాడుతున్నాను(All India Private Colleges Employees Union-Telangana).
2011 లో SI జాబ్ కొద్ది తేడాలో కోల్పోయాను. ఇంకా వేరే వేరే ఉద్యోగాలు కూడా 1 or 2 మార్క్స్ తేడాలో చాలా పోగొట్టుకున్నాను చివరికి వయసు పైబడి అర్హత కోల్పోయాను. సరైన అవగాహనతో చదవక పోవడం వల్ల Govt. ఉద్యోగాన్ని పొందలేకపోయాను. ఇప్పుడు మంచి అనుభవం వచ్చింది కానీ exams రాయడానికి వయసు లేదు. నేను ఆ తప్పుల నుంచే నేర్చుకుని నాకు లాగా కష్టపడే మీ అందరికోసం ఈ Material తయారు చేస్తున్నాను.
ఏదైనా Exam కోసం చదవటం మొదలు పెట్టినప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది. అయినను ఓపిక తెచ్చుకుని కాన్సెప్ట్ మొత్తం Speed గా ఒకసారి చదివేయండి. తరువాత 2వ సారి చదివేటప్పుడు ప్రతి ఒక్క Sentence మరియు Related Terms గురించి తెలుసుకోండి, అలా చేయడం వల్ల మీకు Concept ఎక్కువ రోజులు ఈజీగా గుర్తుంటుంది. మరియు Exam ముందు Revision చేసుకోవడానికి చాల తేలిక అవుతుంది. ముందు కాన్సెప్ట్ చదివిన తరువాత మాత్రమే Bits ప్రాక్టీస్ చేయండి. కాన్సెప్ట్ ను మాత్రమే నమ్ముకుని చదవండి. బిట్స్ చదివి ఎగ్జామ్స్ కు సన్నధం అవ్వకండి. బిట్స్ కేవలం ప్రాక్టీస్ కోసం అని గుర్తుంచుకోండి.
మీకు Coaching Centers లలో కొత్తగా చెప్పేది ఏమి ఉండదు Text Books లో ఉన్నదానినే మీకు బోధిస్తారు. మీ పైన మీకు నమ్మకం ఉన్నప్పుడు అంత డబ్బు మీరు కోచింగ్ Centers కి పెట్టనవసరం లేదు. మీరు నాలుగైదు రకాల బుక్స్ మాత్రం ప్రిపేర్ అవ్వకండి ఏది చదివిన In-Depth చదవండి, One or Two బుక్స్ మాత్రమే ప్రిపేర్ అవ్వండి, చదివిందే మళ్ళి మళ్ళి చదవండి, అలా చేయడంవల్ల మీకు కాన్సెప్ట్ మీద గ్రిప్ వస్తుంది. మీరు మార్కెట్లో లభించే అన్ని పుస్తకాలు చదవకండి Important పుస్తకాలు మాత్రమే చదవండి.
నేను నా అనుభవంతో మీకు ఈ మెటీరియల్ అందచేస్తున్నాను. ఇది తప్పకుండ మీకు ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను.
మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ / సలహాలు ఇవ్వదలిస్తే nnresgi@gmail.com కు మెయిల్ చేయగలరు.
కష్ఠపడి మంచిగ చదివి మీ తల్లి తండ్రుల కలలు నిజం చేయగలరని మీ శ్రేయోభిలాషి.