మతం
- వీరికాలంలో వైదిక, బౌద్ధ మతాలు వ్యాప్తి చెందాయి
- శాతవాహన రాజులూ వైదిక మతాన్ని పాటించగా రాణులు మాత్రం బౌద్ధ మతాన్ని ఆచరించేవారు.
- గాధాసప్తశతి పుస్తకం శివుని ప్రార్థనతో ప్రారంభమయి గౌరిస్తోత్రంతో ముగుస్తుంది. దీనిని హాలుడు రచించాడు.
- అతి ప్రాచీన శివలింగం చిత్తూరు జిల్లా గుడిమల్లు లో కలదు.
- ఆంధ్రదేశంలో మొట్టమొదటి జైనాచార్యుడు 'కొండా కుందనాచార్యుడు' ఇతడు 'సమయసారం' అనే గ్రంథాన్ని రచించాడు
- శాతవాహన ఆస్థానంలోని 52 మంది సేనాధిపతులు తమ పేర్ల మీదుగా 52 జైన దేవాలయాలు నిర్మించారని 'జీవ ప్రభావసూరి' యొక్క కల్ప ప్రదీప ప్రకారం తెలుస్తుంది.
- ఆంధ్రదేశంలో మొట్టమొదటి బౌద్ధాచార్యుడు 'మహాదేవ భిక్షువు'. ఇతను బుద్ధుని చిహ్నాలను పూజించే చైత్యేకవాదం అనే సంప్రదాయాన్ని ప్రవేశపెట్టాడు.
- అమరావతి స్థూపం 2వ పులమావి కాలంలో నిర్మించబడింది.
- 1797 లో కల్నన్ క్యాలిన్ మెకంజీ అమరావతి స్థూపాన్ని కనుకొన్నారు.
- మహా సాంఘిక శాఖకు జన్మభూమి 'ధాన్యకటకం'.
- ఆచార్య నాగార్జునుడు 'వెదలి' అనే గ్రామంలో జన్మించాడు. ఇతను యజ్ఞశ్రీ శతకర్ణికి సమకాలికుడు.
- శాతవాహనుల అధికార బాష -- ప్రాకృతం
- భారతదేశంలో భూదానాలు చేసిన తొలి రాజులు వీరే.
- భాగవత మతాన్ని ఉత్తరభారతదేశంలో వాసుదేవుడు స్థాపించాడు
బిరుదులు
- మొదటి శాతకర్ణి -- దక్షిణాపథపతి
- యజ్ఞశ్రీ శాతకర్ణి -- త్రిసముద్రాధిపతి
- 2వ పూలమావి -- దక్షిణాపదేశ్వరుడు
- గౌతమీపుత్ర శాతకర్ణి -- రామకేశవ
కవులు - గ్రంథాలు
- ఆర్యదేవుడు -- చిత్తశుద్ధి
- నాగార్జునుడు -- దసభూమిక సూత్ర
- ఆర్య మంజుశ్రీ -- కల్పసూత్రం
అజంతా 10వ గుహలోనే 'శ్వేత గజ జాతక' చిత్రం శాతవాహన యుగానిదే
ఆచార్య నాగార్జునిడి గ్రంథాలు
- శున్యసప్తపతి
- రతిశాస్త్రం
- మణిమంగళం
- స్పుహలేఖ