వేములవాడ చాళుక్యులు - Vemulawada Chalukyas Dynasty

వేములవాడ చాళుక్యులు Vemulavada Chalukyas (c. 750 – 973 CE)

రాష్ట్రకూటుల సామంతులు · తెలంగాణ చరిత్ర · కళ, సాహిత్యం, జైనమత పోషకులు

పరిచయం Introduction

వేములవాడ చాళుక్యులు (క్రీ.శ. 750 – 973) రాష్ట్రకూటుల సామంతులు. వీరి మూలపురుషుడు సత్యాశ్రయ రణ విక్రముడు (శాసనాల ప్రకారం) (క్రీ.శ. 650–675).

పాలనా కాలంక్రీ.శ. 750–973
రాజధానివేములవాడ
అధీనతరాష్ట్రకూటులు
ప్రాంతంసపదాలక్షదేశం

మూలపురుషులు Early Rulers

క్రీ.శ. 650–675

సత్యాశ్రయ రణ విక్రముడు Satyashraya Rana Vikrama

వీరి మూలపురుషుడు (శాసనాల ప్రకారం).

క్రీ.శ. 675–700

పృథ్వీపతి Prithvipati

క్రీ.శ. 700–725

మహారాజు Maharaju

క్రీ.శ. 725–750

పృధు విక్రముడు Prithu Vikrama

గమనించండి: కానీ వీరి పరిపాలన కాలం ఎక్కడ పరిపాలించింది స్పష్టంగా లేదు.

నిజమైన స్థాపకుడు Founder of the Dynasty

క్రీ.శ. 750–775

వినయాదిత్య యుద్ధమల్లుడు Vinayaditya Yuddhamalla

  • ఇతను వేములవాడ చాళుక్యుల నిజమైన స్థాపకుడు.
  • ఇతని రాజధాని బోధన్.
  • గోదావరి నదికి దక్షిణాన గల మంజీరా నది నుండి మహాకాళేశ్వర పర్వంతం వ్యాపించి ఉన్న భూభాగమే 'పోదనపాడు'; దీనినే సపదాలక్షదేశం అంటారు. ఇదే నేటి వేములవాడ చాళుక్య రాజ్యం.
  • ఇతను రాష్ట్రకూట రాజ్యస్థాపకుడైన దంతిదుర్గుడు యొక్క సేనాధిపతి, తరువాత సామంత రాజు అయ్యాడు.

మొదటి అరికేసరి మరియు వారసులు Arikesari I and Successors

క్రీ.శ. 775–800

మొదటి అరికేసరి Arikesari I

  • ఇతడు వినయాదిత్యుడు కుమారుడు.
  • ఇతని సోదరుడు బీరన్న గృహుడు; బీరన్న గృహుడు వేయించిన శాసనం 'కురువ గుట్ట'.
  • ఇతను రాష్ట్రకూట రాజు ధ్రువుని యొక్క సామంతుడు.
  • ఇతను రాజధానిని బోధన్ నుంచి వేములవాడకు మార్చాడు.
సమస్త లోకాశ్రయా త్రిభువనమల్ల రాజత్రినేత్ర సాహసరాయ

మొదటి అరికేసరి వేయించిన శాసనం — 'కొల్లిపర శాసనం'

క్రీ.శ. 800–825

నరసింహుడు Narasimha

అరికేసరి యొక్క కుమారుడు.

క్రీ.శ. 825–850

రెండవ యుద్ధమల్లుడు Yuddhamalla II

నరసింహుడు యొక్క కుమారుడు.

బద్దెగ (సోలాదగండ) Baddega (Soladaganda)

క్రీ.శ. 850–895

బద్దెగ Baddega

  • ఇతను రెండవ యుద్ధమల్లుని యొక్క కుమారుడు.
  • ఇతనికి కల బిరుదు సోలాదగండ, అంటే అపజయమెరుగని యోధుడు అని అర్థం (42 యుద్ధాలు చేసినవాడు).
  • ఇతను వేంగీ రాజు మొదటి చాళుక్య భీముడిని ఆడించినట్లు, బంధించినట్లు 'పర్బనీ శాసనం (క్రీ.శ. 966)' తెలియజేస్తుంది.
  • ఇతను వేములవాడలో తన పేరుమీదుగా 'బద్దిగేశ్వర' ఆలయాన్ని నిర్మించాడు.
క్రీ.శ. 895–915

యుద్ధమల్లుడు Yuddhamalla

బద్దెగ కుమారుడు.

క్రీ.శ. 915–930

రెండవ నరసింహుడు Narasimha II

యుద్ధమల్లుని కుమారుడు.

రెండవ నరసింహుడు Narasimha II

క్రీ.శ. 915–930

రెండవ నరసింహుడు Narasimha II

  • ఇతను రాష్ట్రకూట రాజైన మూడవ ఇంద్రునికి (క్రీ.శ. 915–922) సామంతుడు.
  • ఇతను తన దండ యాత్రను గంగా నది వరకు చేసినాడు.
  • కాళప్రియ వద్ద విజయస్తంభాన్ని నాటాడని వేములవాడ శాసనం తెలియజేస్తుంది. ఇది సంస్కృత శాసనం.

రెండవ అరికేసరి – గొప్ప పాలకుడు Arikesari II – The Great Patron

క్రీ.శ. 930–955

రెండవ అరికేసరి Arikesari II

  • ఇతను వేములవాడ చాళుక్యులలో గొప్పవాడు.
  • ఇతని కాలంలోనే వేంగీ రాజ్యంలో వారసత్వ యుద్ధాలు మొదలైనాయి.
  • పంప కవి ఇతని ఆస్థానకవి. ఇతని యొక్క రచనలు విక్రమార్జుని విజయం, ఆది పురాణం.
  • పంప కవి యొక్క సోదరుడు జీనవల్లభుడు. 'కార్క్యల శాసనం' ప్రకారం పంప కవి క్రీ.శ. 902లో జన్మించాడని, క్రీ.శ. 941లో ఆది పురాణం రచించాడని తెలుస్తుంది.
  • ఆదిపురాణం జైనమత మొదటి తీర్థంకరుడు 'వృషబానాధుడు చరిత్ర / పంచకళ్యాణం' గురించి తెలుపుతుంది.

వాగరాజు మరియు రెండవ బద్దెగుడు Vagaraju and Baddega II

క్రీ.శ. 955–960

వాగరాజు Vagaraju

  • రాష్ట్రకూట రాజు 3వ కృష్ణుని సామంతుడు.
  • ఇతని రాజధాని గంగాధర పట్టణం.
  • ఇతని ఆస్థాన కవి సోమదేవసూరి. ఇతని రచించిన కావ్యం యశస్తిలక చంపూ.
  • ఇతనికి సంతానం లేరు.
క్రీ.శ. 960–965

రెండవ బద్దెగుడు Baddega II

  • ఇతను వాగరాజు సోదరుడు.
  • సోమదేవసూరి కోసం 'శుభధామ జీనాలయము' నిర్మించాడని వేములవాడ శాసనం తెలియజేస్తుంది. దీనికి కల మరొక పేరు బద్దెగ జీనాలయము.

మూడవ అరికేసరి – చివరి పాలకుడు Arikesari III – The Last Ruler

క్రీ.శ. 965–973

మూడవ అరికేసరి Arikesari III

  • వేములవాడ చాళుక్య వంశంలో చివరివాడు.
  • ఇతను ఫర్భిణి శాసనం (క్రీ.శ. 966), కరీంనగర్ తామ్రశాసనం (క్రీ.శ. 966) అనే రెండు తామ్రశాసనాలు వేయించాడు.
  • ఇతని యొక్క రాజధాని వేములవాడ.
  • ఇతని తరువాత తెలంగాణ ప్రాంతం కళ్యాణి చాళుక్యుల చేతుల్లోకి వెళ్ళింది.
తెలంగాణాలో క్రీ.శ. 940 నాటి కర్మాల శాసనంలో మొదటిసారి పద్యాలు లభించాయి.

పాలకుల సారాంశం Summary of Rulers

పూర్తి వివరాల కోసం పట్టికను పక్కకు జరపండి (Scroll horizontally)
పాలకుడు / Ruler కాలం (క్రీ.శ.) ముఖ్య అంశాలు
సత్యాశ్రయ రణ విక్రముడు 650–675 వేములవాడ చాళుక్యుల మూలపురుషుడు (శాసనాల ప్రకారం)
పృథ్వీపతి 675–700 వంశ వారసుడు; పరిపాలన ప్రాంతం స్పష్టంగా లేదు
మహారాజు 700–725 వంశ వారసుడు
పృధు విక్రముడు 725–750 వంశ వారసుడు
వినయాదిత్య యుద్ధమల్లుడు 750–775 నిజమైన స్థాపకుడు; రాజధాని బోధన్; దంతిదుర్గుడి సేనాధిపతి మరియు సామంత రాజు
మొదటి అరికేసరి 775–800 రాజధాని బోధన్ నుంచి వేములవాడకు మార్పు; ధ్రువుని సామంతుడు; కొల్లిపర శాసనం
నరసింహుడు 800–825 మొదటి అరికేసరి కుమారుడు
రెండవ యుద్ధమల్లుడు 825–850 నరసింహుడి కుమారుడు
బద్దెగ 850–895 సోలాదగండ బిరుదు; 42 యుద్ధాలు; బద్దిగేశ్వర ఆలయ నిర్మాణం; పర్బనీ శాసనం (966)
యుద్ధమల్లుడు 895–915 బద్దెగ కుమారుడు
రెండవ నరసింహుడు 915–930 మూడవ ఇంద్రుని సామంతుడు; గంగా నది వరకు దండయాత్ర; కాళప్రియ విజయస్తంభం (సంస్కృత శాసనం)
రెండవ అరికేసరి 930–955 వంశంలో గొప్పవాడు; పంప కవి ఆస్థానకవి; ఆది పురాణం (941); వేంగీ వారసత్వ యుద్ధాలు
వాగరాజు 955–960 3వ కృష్ణుని సామంతుడు; రాజధాని గంగాధర పట్టణం; సోమదేవసూరి; యశస్తిలక చంపూ; సంతానం లేదు
రెండవ బద్దెగుడు 960–965 వాగరాజు సోదరుడు; శుభధామ జీనాలయము (బద్దెగ జీనాలయము) నిర్మాణం
మూడవ అరికేసరి 965–973 వంశ చివరి పాలకుడు; ఫర్భిణి శాసనం, కరీంనగర్ తామ్రశాసనం (966); రాజధాని వేములవాడ
ముగింపు: మూడవ అరికేసరి తరువాత తెలంగాణ ప్రాంతం కళ్యాణి చాళుక్యుల చేతుల్లోకి వెళ్ళింది.
#వేములవాడ చాళుక్యులు #రాష్ట్రకూటులు #తెలంగాణ చరిత్ర #పంప కవి #బద్దెగ #సపదాలక్షదేశం #వేములవాడ

© ఈ వ్యాసం చరిత్ర అభ్యాసార్థం కోసం రూపొందించబడింది.

No comments:

Post a Comment