పంచతంత్ర కథలు-మిత్రబేధం 6
కరటకందవముకానికి ఆషాఢభూతి పలాయనం విషయం చెప్పి, ఇంకాఇలా చెప్పసాగింది: అషాఢభూతి మీద పూర్తి నమ్మకంతో తన కాలకృత్యాలు నిర్వర్శించటానిక్ అవతలికివెళ్లిన దేవశర్మ తన నమీపంళలొనే ఒక దృశ్యంచూశాడు.
పొట్టెళ్ల మంద ఒకటి మేత మెస్తున్నది. అందులోరెండు పొట్టెళ్లు పోట్లాడసాగాయి. అవి రెండూ పరిగెత్తుకుంటూ వచ్చి, తలలు ఢీ కొట్టుకుని, మళ్తీ వెనక్కు వెళ్ళిపరిగెత్తుకుంటూవచ్చి బలంగా తలలు డీకొట్టుకుంటున్నాయి. వాటి తలలు పగిలి రక్తం నేల మీద కారుతున్నది. నేల మీద కారినరకాన్ని నాకాలన్నఆత్రంతో ఒక నక్క వచ్చింది. పొట్టేళ్లుఆ సమయంలో ఎడంగా వెళ్లాయి.
దేవశర్మఆ నక్కను చూసి, “ఈ నక్కకు బుద్దిలేదు. ఈ సారి పొట్టేళ్లుతలలు డీ కొట్టినపప్పుడు ఇది నిశ్చయంగా వాటిమధ్య నలిగిచస్తుంది, అనుకున్నాడు.
ఆయన అనుకున్నట్లే పొటేళ్లు మళ్లీ పరిగెత్తుకుంటూవచ్చి తలలు మోటించాయి. రక్తంతాగటంలో మైమరిచి ఉన్న నక్క ఆ పొటెళ్ళతలల మధ్య నలిగి చచ్చింది.
చచ్చిననక్క గురించి చింతిస్తూ దేవశర్మ తన శిష్యుడు ఉండిన చోటికి వచ్చాడు. అషాఢభూతికనిపించలేదు.
దేవశర్మగబగబాస్నానం చేసి వచ్చి చూసే సరికిఆయన బట్టల మూట ఉన్నదికాని, బంగారంమూట మాత్రం కనబడకుండా పోయింది.
అయ్యో, “నా బంగారం పోయింది,” అనుకుంటూదేవశర్మ మూర్చపోయాడు.
కొద్దిసేపటికి స్పృహ వచ్చిన దేవశర్మ “ఒరె, ఆషాఢభూతీ! నన్ను మోసగించి ఎక్కడికిపోయావురా? జవాబు చెప్పరా! అని వైనవైనాలుగా ఎడుస్తూ, వాళ్డు కలుసుకుందామనేఆశతో, వాడి అడుగు జాడలను బట్టిబయలుదేరాడు.
సాయంకాలంఅయేసరికి అతడు ఒక గ్రామంచేరాడు. కల్లు అంగడికి పోతున్న సాలెదంపతులు తనకు కనిపించారు.
అతడుసాలెవాడితో “నాయనా అసుర సంధ్యవేళనేను నీకు అతిథిగా వచ్చాను. నాకుఇక్కడ ఎవరూ తెలియదు. అందుచేత నన్నుఅతిథిగా స్వకరించి, ఆతిథ్యం ఇయ్యి, అన్నాడు.
ఈ మాటలు విని సాలెవాడుతన భార్యతో,
“ఏమే, ఈయనను మన ఇంటికి తీసుకు పోయి, కాళ్ళు కడిగి, భోజనంపెట్టి పక్కవెసి ఆయనకుఏం కావాలో చూస్తూ ఇంటి దగ్గర ఉండు. నేను వెళ్లి ఇంత మాంసమూ, కల్లూ తెస్తాను.” అన్నాడు.
సాలెవాడిభార్య మరొకరితో సంబంధంలో ఉంది. తన ప్రియుడైన దేవదత్తుడిని కలుసుకోవటానికిమంచి అవకాశం దొరికినందుకుపరమానందభరితురాలై, ఆమె దేవశర్మనువెంటబెట్టుకుని ఇంటికి వడివడిగా బయలుదేరింది. ఇంటికి చేరగానే ఆమె దేవశర్మకుఒక కుక్కి మంచం చూపి, కూర్చుండబెట్టితనకు కలిగిన రీతిలో సపరిచర్యలు చేసింది.
దేవశర్మకాస్త స్థిమిత పడ్డ తర్వాత ఆమె ప్రాధేయపూర్వకంగాఅతడితో ఇలా చెప్పింది. “స్వామీ! నా స్నేహితురాలు ఒకతె ఇవాళే వాళ్ల గ్రామంనుంచి వచ్చింది. దానితో మాట్టాడి ఇప్పుడేవస్తాను. నేను వచ్చేదాకా ఇల్లుకాస్త చూస్తూఉండండి. అని చెప్పి, మంచి బట్టలూ, నగలూ ధరించి, దేవదత్తుణ్ణీ కలుసుకోవడానికివెళ్లింది.
కానిదారిలో ఆమెకు తన భర్తతప్పతాగి తూలుతూ, అడుగులు తడబడుతూ, జుట్టు రేగి, చేతిలో కల్లుముంత పట్టుకుని వస్తూ కనిపించాడు. అది చూసి గజగజా వణికిపోయిన ఆమె అతి వేగంగాఇంటికి పరిగెత్తుకునివచ్చి, తన మంచి బట్టలూ, అలంకారాలూతీసేసి, పాత బట్టలు ధరించింది. ఏమీ ఎరగనట్టుగా భర్త రాక కోసంఎదురు చూస్తున్నట్టుగాగడప ముందు నిలుచుంది.
అయితేఆమె మంచి బట్టలూ, అలంకారాలూధరించి పరిగిత్తిపోతూ ఉండడం సాలెవాడుచూసి కూడా చూడనట్లు నటించాడు.
తన భార్య తిరుగుళ్లను గురించిఅతడికి తెలుసు. అతిథికి మర్యాద చేయవలసిన భార్యఅలా విధిలో కనబడగానే అతడికి ఆమెపైమరింత అనువమూనం కలిగింది. అతడుఇంటికి వచ్చి భార్యను చూసి, పట్టరానికోపంతో, “ఓసీ, నీచురాలా! కులటా! ఎక్కడికిపోతున్నావు? అన్నాడు.
“నిన్నువదిలినాక నేను ఎక్కడికీ పోలెదే? ఎందుకాతాగుడు వాగుడు? తాగిన వాడి నోటికిశుద్ధి, బుద్ధి ఉండదంటారు. అన్నది అతడిభార్య
తన భార్య పొగరు మాటలువిని, ఆమె చీరమార్చిఉండటం గమనించిన సాలెవాడు, “నీ పోకిళ్ళ గురించి అదివరకే విన్నాలే. ఇవాళ కల్లారాచూశాను. నిన్ను ఏం చేస్తానో చూడు! అంటూఒక దుడ్డుకర్ర తీసుకుని తన భార్య ఒళ్లంతాహూనం చేసి, ఆమెను స్తంభానికి పలుపుతోకట్టెసి, తాగిన మైకంలో పడుకుని నిద్రపోయాడు.
ఈ సాలెవాడి భార్యకు ఆమె స్వభావమే కలిగినస్నేహితురాలు మంగలి మహిళ ఒకతె ఉన్నది. ఆమె వచ్చి, సాలెవాడు నిద్రపోతున్నాడనిరూఢి చేసుకుని, అతని భార్యతో, “దేవదత్తుడునీకోసం కనిపెట్టుకుని ఉన్నాడు. ఎందుకుఆలస్యం చేస్తున్నావు త్వరగా వెళ్లు, అన్నది.
“నేనుఎలా వెళ్లేది? ఎ స్టితిలో ఉన్నానో చూడు. నన్ను చావబాదింది కాకుండా ఇలా పలుపుతోకట్టేశాడు. ఎలా హ్మోది? నామొగుడేమోఇంట్లోనే ఉన్నాడాయె, ' అన్నది సాలెవాడిభార్య విచారంగా.
“నేనునీ కట్లు విప్పుతాను. ఎనుగొచ్చి ఘీంకరించినా, నీ మొగుడు రేపు మొహం మీద ఎండపడే దాకా లేవడు. అంతగా అయితేనీకు బదులు నన్ను కట్టెయి. నీ మొగుడురాత్రివేళ లేచినా మైకంలో నన్ను చేయకుండానువ్వు దేవదత్తుడి వద్దకు వెళ్లి త్వరగారా ' అన్నది స్నేహితురాలు.
సాలెవాడిభార్య తన కట్లు విప్పించుకుని, తన స్థానంలో తన స్నేహితురాలిని స్తంభానికి కట్టివేసి, ఆ తర్వాత దేవదత్తుణ్ణికలుసుకోవడానికివెల్సింది.
ఆమె వెళ్లిన కొంతసేపటికి సాలెవాడు శాంతపడిలేచి, '““ఒసే గయ్యాళి గంపా! ఇక ముందుఇల్లు కదలననీ, నాతో పొగరుగా మాట్లాడననిమాట ఇస్తే నీ కట్లువిప్పుతాను. నన్నేమోసగిస్తావా? ఎంత బరితెగింపే నీకు? అన్నాడు.
మంగలామె, తన గొంతు గుర్తిసాడని సాలెవాడికిసమాధానం చెప్పలెదు. దాంతో సాలెవాడికిఒళ్లు మండి, పదునైన కత్తితెచ్బి, మంగలిదాని ముక్కు పరపరా కోసి, “ఎప్పటికీముక్కిడి ముండవుగా ఉండిపో దరిద్రపుదానా,”” అని తిట్టి మల్తీ వెళ్లి నిద్రలోకి జారుకున్నాడు.
మంగలామెకువణుకు పుట్టింది. పుణ్యానికిపోయి పాపమెదురైనట్టుగా సాలెవాడి ఇంట్లోతన ముక్కుకు కోత పడిందే అని ఆమె తీవ్రంగా విచారపడింది. మరో వైపు గాయంసలుపుతోంది. గట్టిగా ఎడుద్దామన్నాపరిస్థితులు అనుకూలంగా లేవు. నోరుపెగిలిందా భండారం బయటపడినట్లై. దాంతోఆమె కదలక మెదలక గుంజకు ఆనుకునినిలుచుండిపోయింది.
బంగారాన్నిపోగొట్టుకున్న బాధకు ఆకలీ, దప్పీతోడై, నిద్రపోలేకుండా ఉన్న దేవశర్మ సాలెవాడిఇంట్లో జరుగుతున్న ఈ నాటకమంతాకళ్లారా చూశాడు.
కొంతసేపు గడిచాక, సాలెమనిషి తిరిగి వచ్చిమంగలి మనిషిని, “ఎలా ఉన్నావు? నేనువెళ్లినాక ఆ దుర్మార్గుడు లేచాడా? అని అడిగింది.
“నేనైతేబాగానే ఉన్నాను గాని, నీ మాయదారిమొగుడు లేచి, నా ముక్కుకోశాడు. వాడులేచి నా చెవులు కూడాకోసే లోపల కట్టు విప్పి నన్ను ఇంటికి పోని తల్లీ!, అన్నది మంగలి మనిషి. సాలె మనిషి మంగలిదాని కట్లువిప్పి, ఆమె స్థానంలో తానుకట్టించుకున్నది. తరువాత ఆమె భర్తను ధిక్కరిస్తూ, “ఓ మూఢుఢా! నావంటి శీలవతిని గాయపరచటమూ, తరవాత వికృతం చెయ్యటమూ నీ తరమా?
ఓ దిక్పాలాకులారా! సూర్యచంద్రులారా! అగ్నిహోత్రుడా! వాయుదేవుడా! వినండి! నెనే పతివ్రతనైతేనా ముక్కును యధాప్రకారం చేయండి...! చూశావా దుర్మార్గుడా? నువ్వు ముక్కుకోసివేసినా నా శీలబలం చేతనా ముక్కుఎప్పటిలాగే అయింది!” అన్నది.
తన భార్య అబద్దం ఆడుతూంటేదాన్ని అగ్నికిఆహుతి చేద్దామని, సాలెవాడు మండే కొరివితోవచ్చి, తన భార్య ముక్కుఎప్పటిలాగేఉండటం చూసి నిర్ధాంతపోయాడు. తొలిసారిగాఅతనికి భయం పట్టుకుంది.
తానునిజంగా ముక్కు కోయలెదేమో అనుకుందామంటేనేల మీద రక్తం మడుగు ఉన్నది. అతను వెంటనే ఆమె కట్లు విప్పి, ఆమెకువెయ్యి క్షమాపణలు చెప్పుకుని, ఆమెనుసంతోష పెట్టడానికి సర్వవిధాలా యత్నించాడు. (ఇంకా ఉంది)