వేదకాలం - Aryula Nagarikatha

TSStudies

వేదకాలం (ఆర్యుల యుగం)

ఆర్యుల జన్మస్థానాన్ని గురించిన చర్చను 1786లో సర్‌ విలియమ్‌ జోన్స్‌ ప్రారంభించాడు.
ఆర్యుల రాక గూర్చి ఈ క్రింది శాననాలలో పేర్కొనబడింది
1. కస్పైట్‌
2. మిట్టాని
3. బోగాస్మాయ్‌
ఆర్యుల జన్మన్ఫలానికి నంబందించి అనేక సిద్ధాంతాలున్నాయి.
మాక్స్‌ ముల్లర్‌ -మధ్య ఆసియా నుంచి ఆర్యులు వచ్చారని పేర్కొన్నాడు.
ఇతర సిద్ధాంతాలు
డా॥ గైల్‌ - ఆస్ట్రియా, హంగేరి
పి.సి.లెంక, మయార్‌, పెంకాహెర్ట్‌ -జర్మనీ
తిలక్‌ - ఆర్కిటిక్‌ ప్రాంతం
దయానంద సరస్వతి - టిబెట్‌
ఎడ్మండ్‌ లీచ్‌ & ఎ.సి.దాస్‌ -సప్తసింధు ప్రాంతం
ఎల్‌.డి. కాలం -కాశ్మీర్‌
ఆర్య అనగా శ్రేష్టుడు, సువర్ణుడు, గౌరవనీయులు
ఆర్యుల మొట్టమొదటి దండయాత్రికుడు- దివదాసుడు.
ఇతను “సాంబార' అనే నాయకుడిని ఓడించి సవ్తసింధు(మెలూహ) ప్రాంతంలో స్థిరపడ్డాడు.
ఇతని తర్వాత ముఖ్యమైన దండయాత్రికుడు - త్రిసదాస్యు.
ఇతను అనేకమంది స్వదేశీయులను లేదా దాస్యులను హతమార్చాడు. అందువల్లనే ఇతనిని దాస్యుహత్య అంటారు.
తొలి వేదకాలంలో యుద్దాలు ప్రధానంగా గోవులు, గడ్డి భూముల కొరకై జరిగేవి. దీనిని 'గవిస్తి' అంటారు.
తొలి వేదకాలంలో అతిపెద్ద యుద్ధం -దశరాజ గణ  యుద్ధం. ఇది సుమారు క్రీ.పూ.1000 సంవత్సరములో పరూషిణి(రావి నది) నది ఒడ్డున భరత వంశానికి చెందిన సుధాముడు, పురు వంశానికి చెందిన పురుకుత్స మధ్య జరిగింది.
పురుకుత్సకు 10 మంది రాజులు సహాయం చేశారు. కానీ సుధాముడు (ఇతని ప్రధాని వశిష్ట) పురుకుత్సను (ఇతని ప్రధాని విశ్వామిత్ర) ఓడించాడు.
ఈ యుద్ధం తర్వాత భరత, పురు వంశం మధ్య వివాహ సంబంధాలు ఏర్పడ్డాయి. ఫలితంగా కురు తెగ ఆవిర్భవించింది.
తర్వాత కురు తెగ రెండుగా చీలిపోయింది.
1) పాండవులు
2) కౌరవులు
పాండవులు, కౌరవులు మధ్య కురుక్షేత్ర యుద్ధం జరిగింది.
మలి వేదకాలంలో రాజ్యాల విస్తరణ కొరకు యుద్దాలు జరిగేవి. వీటిని మహా సంగ్రామాలు అంటారు. అందువల్లనే క్రీ.పూ. 6వ శతాబ్ధంలో చిన్న చిన్న రాజ్యాలు అంతమై 16 మహా రాజ్యాలు లేదా మహాజనపదాలు ఆవిర్భవించాయి.
ఆర్య నంస్కృతిని తూర్పు భారతదేశానికి వ్యాప్తి చేసినవాడు-వైదేహుడు
ఆర్య నంస్కృతిని దక్షిణ భారతదేశానికి వ్యాప్తి చేసినవాడు-అగస్తుడు
ఆర్యుల యుగాన్ని (1500-600 బి.సి.) రెండు యుగాలుగా వర్గీకరించారు.
1) తొలి వేదకాలం (1500-1000 బి.సి.)
2) మలి వేదకాలం (1000-600 బి.సి.)
వేదకాలాన్ని తొలివేద, మలివేద కాలాలుగా విభజించుటకు 4 ప్రధాన కారణాలు ఉన్నాయి.
1) సామాజిక కారణాలు
2) ఆర్థిక కారణాలు
3) రాజకీయ కారణాలు
4) మత కారణాలు

1) సామాజిక కారణాలు (సమాజం):
తొలి వేదకాల సమాజంలో సమానత్వం ఉండేది. యజ్ఞాలు, యాగాదులు, కర్మకాండలు, అంటరానితనం మొదలగునవి ఉండేవికావు.
స్రీలకు స్వేచ్చ కల్పించబడినది. బాల్య వివాహాలు ఉండేవి కావు.   మైత్రేయి, గార్గీ, ఉలేపి, వాకానవి, గౌతమి, రిషనార
మొదలగు మహిళలు బుషి హోదాను పొందారు. భూఅధిపతిని ప్రజాపతి అనేవారు
కుటుంబపెద్ద -కులప్‌/కులపతి
అనేక కుటుంబాలకు పెద్ద -జెస్టా
కుల వ్యవస్థ ఏర్పడలేదు. అనగా పుట్టుకతో వర్ణ వ్యవస్థ అనేది లేదు. ఉదాహరణకు బుగ్వేదంలోని 5వ మండలంలో ఈ క్రింది విధంగా పేర్కొనబడింది.
“నా తండ్రి వైద్యుడు, తల్లి పిండి రుబ్బు స్త్రీ, నేను ఒక కవిని”
మలి వేదకాలంలో యజ్ఞాలు, యాగాదులు, కర్మకాండలు, అంటరానితనం మొదలగునవి ప్రవేశపెట్టబడ్డాయి.
స్రీలు తమ స్వేచ్చను కోల్పోయారు.  వర్ణ వ్యవస్థ పుట్టుక ఆధారంగా ప్రవేశపెట్టబడినది. 
బుగ్వేదంలోని 10వ మండలంలో ;పురుషసూక్త'లో వర్ణ వ్యవస్థ గురించి పేర్కొనబడింది. దీని ప్రకారం
- బ్రహ్మ నోటి నుంచి జన్మించాడు.
-బ్రహ్మ భుజాల నుంచి జన్మించాడు
-బ్రహ్మ తొడల నుంచి జన్మించాడు
-బ్రహ్మ పాదాల నుంచి జన్మించాడు
మలి వేదకాలంలో కుల వ్యవస్థ పటిష్టమైనది
గోగ్నా: అతిథికి గోవు మాంసంతో విందు ఇచ్చుట. ఈ విధానమును మలి వేదకాలంలో పాటించేవారు.
అనులోమ: అగ్ర వర్షానికి చెందిన పురుషుడు నిమ్న కులానికి చెందిన మహిళను వివాహం చేసుకోవచ్చు.దీనిని అంగీకరించేవారు.
ప్రతిలోమ: అగ్ర వర్ణానికి చెందిన మహిళ నిమ్న వర్ణానికి చెందిన పురుషుని వివాహమాడుట. దీనిని అంగీకరించేవారు కాదు.
బ్రాహ్మణ పురుషుడు, శూద్ర మహిళకు జన్మించినవారిని నిషాద అంటారు.
బ్రాహ్మణ మహిళ, శూద్ర పురుషునికి జన్మించినవారిని చండాల అంటారు.
నిషాద & చండాలకు జన్మించినవారిని అంత్యవాసాయాన్‌ అంటారు.
చంద్రయాన తపస్సు: కొన్ని తరగతుల మధ్య వివాహాలు అంగీకరించబడవు. ఒకవేళ అలా వివాహం జరిగితే భర్త తన భార్యను మొదటి ఒక నెల వరకు సోదరిగా పరిగణించి తర్వాత భార్యగా స్వీకరించాలి.

2) ఆర్థిక కారణాలు:
తొలి వేదకాలంలో ఆర్యుల ముఖ్య వృత్తి పశుపోషణ. గోవులను మాత్రమే ఆస్తులుగా భావించేవారు. గోవుల అధిపతిని “గోపతి” అనేవారు.
పాణీలు అనే ఆర్యేతర వర్తకులు ఆర్యుల గోవులను దొంగిలించేవారు.
“అయన్‌” అనే లోహార్ధాన్నిచ్చే పదాన్ని ప్రస్తావించడంతో, తొలి ఆర్యులకు రాగి, కంచు లోహాలు తెలుసు అనే విషయాన్ని సూచించడమైంది.
మలి వేదకాలంలో ఆర్యుల ప్రధాన వృత్తి -వ్యవసాయం. ద్వితీయ వృత్తి -వర్తకం.
మలి వేదకాలంలోనే ఇనుము కనుగొనబడినది. ఇనుము సహాయంతో అడవులను నరికి వాటిని వ్యవసాయ భూములుగా మార్చారు.
ఇనుప నాగలిని, కొడవలిని ఉపయోగించారు. దీని కారణంగా వ్యవసాయ దిగుబడి అత్యధికమైనది. ఇది వర్తకానికి దారితీసింది. 
మలి వేదకాలంలోనే నిష్కా సతమాన, కార్షాపణ అనే వెండి నాణెములు ప్రవేశపెట్టబడ్డాయి. ఇది వర్తక అభివృద్ధికి మరికొంత తోడ్పడ్డాయి.
శతవథ బ్రాహ్మణంలో డబ్బులు ఇచ్చినట్లుగా ప్రస్తావించబడింది.
వర్తక అభివృద్ధి కారణంగా అనేక పట్టణాలు వెలిశాయి. అందువల్లనే మలి వేదకాలం అంతంలో అనేక పట్టణాలు ఆవిర్భవించాయి.
ఉదా: రాజగ్భహం, వైశాలి, శ్రావస్తి, కౌశాంబి, కాశీ మొదలగునవి.
మలివేద ప్రజలకు అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రం మరియు హిమాలయాల గూర్చి తెలుసు.

3) రాజకీయ కారణాలు:
తొలి వేదకాలంలో ఆర్య సమాజాన్ని పాలించేవాడిని “రాజన్‌” అనేవారు. రాజన్‌కు సలహా ఇచ్చుటకు 4
మండలులు ఉండేవి. అవి
1) సభ: ముఖ్యమైన కుటుంబాల పెద్దలు దీనిలో సభ్యులుగా ఉండేవారు. ఇది ఆక్రమణలకు సంబంధించి సలహాలు ఇచ్చేది.
2) సమితి: కుటుంబాల పెద్దలు దీనిలో సభ్యులు. ఇది సాధారణ పరిపాలనకు సంబంధించి సలహాలు ఇచ్చేది.
3) గణ: ఇది ఒక యుద్ధ మండలి. ఆయుధాలు, గుర్రాల ఆవశ్యకతకు సంబంధించి సలహాలు ఇచ్చేది.
4) విధాత: ఇది ఒక మహిళా మండలి. మహిళల సమస్యలకు సంబంధించి సలహాలు ఇచ్చేది.
మహిళలు సభ, విధాతలో మాత్రమే పాల్గొనేవారు.
సభ, సమితిలను కవల పిల్లలు అనేవారు. (అధర్వణ వేదంలో పేర్కొనబడినది)
రాజన్‌ తెగ అధికారిగా పరిగణించబడి, దాని రక్షణను చేపట్టడం చేత తెగ సభ్యులు స్వచ్చందంగా ఆయన ఖర్చులకు సహాయాన్ని అందించేవారు. దీన్ని “బలి అనేవారు.
మలి వేదకాలంలో రాజు ఒక నియంతగా మారాడు. తొలి వేదకాలంలోని మండలులు అంతమైనాయి.
సభ, సమితి ఉన్నప్పటికీ అవి వాటి ప్రాముఖ్యతను కోల్పోయాయి. రాజుకు మద్దతుగా కొంతమంది మంత్రులు నియమించబడ్డారు.
1) ముఖ్య ప్రదాన్‌ - ప్రధానమంత్రి
2) మహిషి - పట్టపురాణి
3) యువరాజు - తర్వాత రాజు
4) ప్రాద్వివాక - ప్రధాన న్యాయమూర్తి
5) భాగదూత - పన్ను వసూలు చేసేవాడు
6) సంగ్రిహిత్రి - కోశాధికారి

4) మత కారణాలు:
తొలి వేదకాలంలో ఆర్యుల ముఖ్యమైన దేవుళ్లు
ఇంద్రుడు : ఇతనిని పురంధరుడు అని కూడా అంటారు.
ఇతను ఆర్యుల యుద్ధ వీరుడు, వర్ష దేవుడు, స్వర్గానికి అధిపతి, విశ్వానికి తూర్పు భాగానికి అధిపతి.
అగ్ని: ఇతను భగవంతుడు, భక్తులకు మధ్య మధ్యవర్తి. ఇతనిని అతి భయంకరమైన దేవుడుగా పరిగణించేవారు. వరుణుడు : విశ్వనియమావళి, నైతిక విలువలకు దేవుడు. దేవాలయాలు లేవు
దేవుళ్లు స్వర్గలోక(డియోస్‌, సూర్య, సావిత్రి)
వాతావరణలోక(వరుణ, అగ్ని)
భూలోక(సోమ,అగ్ని)
అగ్నిదేవుడు 3 లోకాల్లో దేవుడిగా పరిగణింపబడ్డాడు.
తొలి వేదకాలంలో 33 మంది దేవతలను పూజించారు.
మలి వేదకాలంలో ఆర్యుల ముఖ్యమైన దేవుళ్లు
బ్రహ్మ: సృష్టికర్త
విష్ణు: సృష్టి రక్షణకర్త
శివుడు : సృష్టి నాశనకర్త (లయకర్త)
విశ్వ దిక్కులకు అధిపతి
తూర్పు -ఇంద్ర పశ్చిమ -వరుణ
ఉత్తర -కుబేర 
దక్షిణ -యమ
ఈశాన్య -సోమ 
వాయువ్య -వాయు
నైరుతి -సూర్య 
ఆగ్నేయ -అగ్ని

ఆధారాలు: 
వేదాలు:
వేదాల బిరుదులు-అపరుశ్రేయ, నిత్య (మానవునిచే రచించబడలేదు)
మొత్తం 4 వేదాలు ఉన్నాయి. వేదాలు తపో మార్గాన్ని పేర్కొన్నాయి (మోక్షం సాధించడానికి)
మొదటి 3 వేదాలు ఆర్యులకి చెందినవి. వీటిని “త్రయి” అంటారు.
బుగ్వేదము :
మంత్రాలు పఠించేవారిని హోత్రి అంటారు. 
10 మండలాలు ఉన్నాయి. 
ఇందులో 1028 సూక్తులు/ శ్లోకాలున్నాయి. ఇది అతి పురాతనమైనది. 
దశరాజ గణయుద్ధం గూర్చి పేర్కొంది. 
దీని రచనలో పాల్గొన్నవారు -గ్రిటస్మద, విశ్వామిత్ర, వామనదేవ, అత్రి, భరద్వాజ, వశిష్ట 
దైవగుర్రం (దాధికర) గూర్చి పేర్కొన్నది. 
2-7 మండలాలు మొదటగా రచించబడ్డాయి
3వ మండలంలో గాయత్రీ మంత్రం (సావిత్రిదేవికి సంబంధించినది) పేర్కొనబడింది.
7వ మండలం -దశరాజగణ యుద్ధం
9వ మండలం సోమ గూర్చి పేర్కొంది
10వ మండలంలో విశ్వ జననం, వర్ణ వ్యవస్థ గురించి పేర్కోనబడింది.
ఈ క్రింది పదాలు అనేకసార్లు పేర్కొనబడ్డాయి
గోవు - 176 సార్లు
గణ - 46 సార్లు
జన - 275 సార్లు
ఓమ్‌ - 1028 సార్లు
సభ - 8 సార్లు
సమితి - 9 సార్లు

2) సామ వేదము :
మంత్రాలు పఠించేవారిని ఉద్గటర్ అంటారు. ఇది సంగీతం గురించి తెలియజేస్తుంది.
ఇది భారతదేశంలో సంగీతంపై మొదటి పుస్తకం ప్రపంచంలో మొట్టమొదటి సంగీత పుస్తకం -జండా అవెస్తా

3) యజుర్వేదము :
మంత్రాలు పఠించేవారిని అధర్వాయ అంటారు.
ఇది శ్వేత, నల్ల యజుర్వేదముగా(లేదా) కృష్ణ శుక్ల యజుర్వేదాలుగా విభజించబడినది.
ఇది గద్య, పద్య రూపాలలో రచించబడినది.
యజ్ఞయాగాదుల గూర్చి పేర్కొంటుంది

అధర్వణ వేదము :
మంత్రాలు పఠించేవారిని బ్రాహ్మణ అంటారు.
వైద్యం, మంత్ర తంత్రాల గురించి తెలియజేస్తుంది
ఇది ఆర్యేతరులు రచించిన వేదము.
సతీ గూర్చి మొదటిసారిగా పేర్కొంది
సభ, సమితి - Twin Sisters
రాజును విషమట్ట (రైతులను భక్షించేవాడు) అని పేర్కొంది.
నీటిపారుదల, గోత్రం, పట్టాభిషేక ప్రమాణాలు, మగద గూర్చి మొదటిగా పేర్కొంది.
గోత్రం గూర్చి మొదటిసారిగా పేర్కొంది.

ఉపనిషత్తులు:
మొత్తం 108 ఉపనిషత్తులు ఉన్నాయి
గురువు పాదాల వద్ద కూర్చుని జ్ఞానాన్ని పొందడాన్ని ఉవనిషత్తు అంటారు.
ముండక ఉవనిషత్తులో “సత్యమేవ జయతే” అనే పదాలున్నాయి.
ఉపనిషత్తులు జ్ఞాన మార్గాన్ని పేర్కొన్నాయి (మోక్షానికి)
దీని గూర్చి అమృతోబింద్‌ ఉపనిషత్తులో పేర్కొనబడింది.
బృహదరణ్యక ఉపనిషత్‌ - చతుర్వర్హం, కర్మ
ప్రశ్న ఉపనిషత్‌ - ప్రజాపతిచే విశ్వజన్మ
వైంత్రయాన.. - మొదటిసారిగా త్రిమూర్తి భావన

బ్రాహ్మణాలు:
పద్య రూపంలో ఉన్న వేదాలను గద్య రూపంలో విశ్లేషిస్తాయి.
ఉదా॥ ఆత్రేయ,కౌశాటకి బ్రాహ్మణాలు -బుగ్వేదం గురించి
చాందోగ్య బ్రాహ్మణ - సామ వేదమును గురించి
శతపధ బ్రాహ్మణ - యజుర్వేదము గురించి (అన్నింటిలోని ముఖ్యమైనది) శతపథ బ్రాహ్మణంలో పేర్కొనబడినవి
-మృత్యువు
-ఉపనయనం/ జంజం
-వడ్డీ వ్యాపారం 
-భార్య భర్తలో సగం
-తూర్చు, పశ్చిమ సముద్రాలు
-మహావరద
గోపథ బ్రాహ్మణ _ అధర్వణ వేదం గురించి 
తంద్యమహా బ్రాహ్మణ  -వ్రత్యస్తోమ యజ్ఞం గూర్చి పేర్కొంది. (రాజును నాశనం చేయుటకు ప్రజలు చేసే యజ్ఞం)

ఉపవేదాలు:
ఇవి వేదాలపై వ్యాఖ్యలు చేస్తాయి. అవి
1) ఆయుర్వేద వైద్యం (అధర్వణవేదం)
2) ధనుర్వేద _ యుద్ధ కళలు (బుగ్వేదం)
3) గాంధర్వవేద - సంగీతము (సామవేదం)
4) శిల్పవేద _ కళలు (యజుర్వేదం) 

వేదాంగాలు:
వేదాలను అర్ధం చేసుకోవడానికి వీటిని తప్పనిసరిగా చదవాలి.
కల్ప - విధులు, బాధ్యతలు, యజ్ఞాలు నిర్వహించే తీరు
శిక్ష - సరైన ఉచ్భారణ 
చంధస్సు - శబ్ధం 
నిరుక్త - కష్టమైన పదాల అర్థం
వ్యాకరణ _ వ్యాకరణం
జ్యోతిష్య _ నక్షత్రశాస్త్రం

సదర్శనాలు: 
మోక్షం సాధించడానికి ఉన్న 6 పద్ధతులు
************************************
School    స్థాపకుడు          వ్యాఖ్యానం చేసినవాడు 
************************************
1) న్యాయ - అక్షపద గౌతమి. -వాత్సాయన
 2) వైశేషిక - ఉలుగకన్నద _ -ప్రశిష్టపద
 3)సాంఖ్య  - కపిల -ఈశ్వర్‌
4) యోగ - పతంజలి -వ్యాసుడు
5) మీమాంస - జైమిని -సంబాకమి (పూర్వ మీమాంస) 
6) వేదాంత  - బాదరాయణ/ -శంకరాచార్యుడు (ఉత్తర మీమాంస) వ్యాసుడు

ఆశ్రమాలు:
ఆశ్రమాలు నాలుగు
1) బ్రహ్మచర్య: 0-25 సం- నేర్చుకునే దశ
2) గృహస్థ్య : 25-50 సం-వివాహం బాధ్యతలు
3) వానప్రస్థ:  50-75సం. - తీర్థ యాత్రలు, పుణ్యక్షేత్రాలు తిరగడం
4) సన్యాస: 75-100 సం. సన్యాసం
జబాలా ఉపనిషత్తులో మొట్టమొదటిసారిగా ఆశ్రమాల గురించి పేర్కొనబడినది.

వివాహాలు:
1) బ్రహ్మ - ఒక తరగతిలోని ప్రజల మధ్య వివాహాలు
2) దైవ - పూజ చేసిన పురోహితునికి రుసుముగా యజమాని తన కూతురునిచ్చి వివాహంచేయుట.
3) ప్రజాపాత్య-కట్నం లేకుండా వివాహం చేసుకొనుట. 
4) అర్స - కట్నంగా గోవును ఇచ్చుట
5) అసుర - కన్యాశుల్మం
6) గాంధర్వ - ప్రేమ వివాహం
7) రాక్షస - ఎత్తుకుపోయి పెండ్లి చేసుకొనుట
8) పైశాచిక - నిద్రలో ఉన్నపుడు పెండ్లి చేసుకోవడం

పురాణాలు:
మొత్తం 18 పురాణాలు ఉన్నాయి. ఇవి గుప్తుల కాలంలో రచించబడ్డాయి.
వత్స వురాణంలో 10 అవతారాల గూర్చి పేర్కొనబడింది.
పురాణాలు మొట్టమొదటిసారిగా 4 యుగాల గురించి పేర్కోన్నాయి.
1) కృతాయుగం (4800 దేవుని సం॥లు):  బాహుబలి -ధర్మం 4 కాళ్లపైన
2) త్రేతాయుగం (3600 దేవుని సం॥లు): రాముడు -ధర్మం 3 కాళ్లపైన
3) ద్వాపరయుగం (2400 దేవుని సం॥లు): శ్రీకృష్ణుడు-ధర్మం 2 కాళ్లపైన
4) కలియుగం (1200 దేవుని సం॥లు): కల్కి -ధర్మం 1 కాలుపైన

ఇతిహాసాలు:
 రామాయణం: రాముడికి సంబంధించిన చరిత్ర వాల్మీకి రచించాడు.
మహాభారతం: శ్రీకృష్ణుడు, పాండవులకు, కౌరవులకు. సంబంధించిన చరిత్ర. వేదవ్యాసుడు రచించాడు.
మహాభారతాన్ని జయసంహిత/శతసంహిత అని కూడా అంటారు.
మహాభారతాన్ని భారతదేశంలో పంచమవేదం అంటారు.
రామాయణం, మహాభారతములు రెండవ చంద్రగుప్తుని కాలంలో లభఖించబడ్డాయి.
తమిళనాడులో పంచమ వేదం - తిరుకురల్‌
క్రీ. పూ. 5వ శతాబ్ధంలో పానిని “అష్టద్యాయి' అనే గ్రంథాన్నిరచించాడు. దీన్ని భగవతి సూత్ర అని కూడా అంటారు.
భరతుడు నాట్యశాస్త్రాన్ని సంస్కృతంలో రచించాడు. ఇది సంస్కృత తొలి గ్రంథాల్లో ఒకటి.

****************
కొన్ని పదాల అర్ధాలు
****************
నిషాద - వేటగాడు 
కైవర్త - మత్స్యకారుడు 
వేణ - బుట్టలు తయారుచేయువాడు 
కర్వార - తోలు పని చేయువాడు 
ఫుకుస - ఊడ్చేవాడు 
వ్రిహి/సాలి - వరి 
గోఘ్న - గోవు మాంసంతో అతిథికి విందు ఇచ్చుట 
విష్టి - బానిసత్వం 
తక్షన్ - కార్పెంటర్ 
ఉగ్ర - రక్షకభటులు 
నపిత - మంగళివాడు 
History of Ancient India,ndian History,Aryula Nagarikatha,Vedhakalam,history of vedas,sindhu civilization in telugu,Indus Valley Civilisation in telugu,Indus Valley Civilisation facts in telugu,Indus Valley Civilisation notes in telugu,Indus River Valley civilizations in telugu,Indus Valley Civilization culture in telugu, Mohenjo Daro culture in telugu,Harappan Culture in telugu,A Brief Introduction to the Ancient Indus Civilization,Cipher War in telugu,Lost City of Mohenjo Daro in telugu,Cities of the Indus Valley Civilization in telugu,What happened to the Indus civilisation in telugu,The Indus Valley civilisation in telugu,Early Civilization in the Indus Valley in teluguSarasvati Sindhu civilization in telugu,prehistoric period of india,History of Ancient India,Pracheena Bharata Desa Charitra,Prehistoric Age of india in telugu,prehistoric period of india in telugu,Prehistoric human colonization of India in telugu,Prehistory of india in telugu,preacheena bharatadesa charitra pdf,Prehistoric human colonization of India,Ancient india in telugu,Ancient India The Prehistoric Period,The Prehistoric Age in India in telugu,Introduction to Ancient History in telugu,An Introduction to Prehistory in telugu,A Brief History of India in telugu,The Prehistoric Ages in Order in telugu,The Indian Paleolithic in telugu,ts studies,ts study circle,tsstudies,Introduction to Prehistoric Period in India in telugu,Stone Tools Discovered In India in telugu,Aspects of prehistoric astronomy in India in telugu,Culture And Heritage Ancient History in telugu,4 prehistoric migrations in telugu,