పంచతంత్ర కథలు మిత్రభేదం-5
దమనకం చెప్పిన దంతిలుడి కథ విని సంజీవకం నువ్వు చెప్పిన కథ సరిగానే ఉన్నది. అందుచేత నువ్వన్నట్లె కానీ, అన్నది.
తరవాతదమనకం సంజీవకాన్ని పింగళకం వద్దకు తీసుకుపోయి, "మహారాజా ఇదుగోసంజీవకం, ఆ పైన దేవరవారి చిత్తం, అన్నది.
సంజీవకంపింగళకానికి ప్రణామం చేసి, ఎంతోనమతగా దాని ఎదట కూర్చున్నది.
పింగళకంవాడీ, భయంకరమూ అయిన గోళ్ళుగల బలమైన తన కుడిపంజా చాచి, -'స్వాగతం, ని ఆరోగ్యం ఎలా ఉన్నది? ఈ అరణ్యానికిఎందుకు వచ్చావు? అని అడిగింది.
తానువర్హమానుడి బిడారు వెంట వచ్చి ఒంటరిగాదిగబడిపోవటవమూ, తరవాత జరిగినదియావతూూ సంజీవకం సింహానికి చెప్పింది.
“మిత్రమా, నీకు ఎలాంటి భయమూవద్దు. నువు నీ ఇచ్చానుసారం ఈ అరణ్యంలో జీవించు. కానీ మరీ దూరం పోకుండాఎల్లప్రుడూనా కనుచూపు మేరలో ఉండు.
ఎందుకంటేనిన్నునేను కనిపెట్టి ఉండలేనప్పుడు నీకు అపకారం చేసే క్రూరమృగాలు, పాపభీతి లేనివి, ఈ అరణ్యంలో చాలాఉన్నాయి, నా రక్షణలో ఉంటెనీకు ఈ అరణ్యంలో, ఏ ప్రమాదమూ సంభవించదుఅన్నది పింగళకం.
సింహంఅభయం ఇవ్వడంతో స్థిమిత పడినసంజీవకం 'చిత్తం అని చెప్పి, యమునానదికి వెళ్లి, కడుపునిండా నీరు తాగి, వెనకటిలాగా యధేచ్చగా, నిర్భయంగా' అరణ్యంలో సంచరించసాగింది.
రోజులు గడిచే కొద్దీ పింగళకానికి, సంజీవకానికీ మధ్య స్నేహ బంధం దృఢం కాజొచ్చింది. పింగళకం ప్రతిది సంజీవకంతో సంప్రదించేది. సంజీవకం చాలా తెలివైనది.
అది కరటకం, దమనకం మొదలైన వాటి రహస్య చర్యలు కనిపెట్టి, వాటిని గురించి పింగళకానికి హెచ్చరించింది. ఆ కారణంగా పింగళకం వాటిని దూరంగా ఉంచి, సంజీవకం చెప్పే సలహాలు మాత్రమె స్వీకరిస్తూ వచ్చింది.
దుర్చుద్దితోసింహరాజు పంచన చేరి పబ్బంగడుపుకోవాలని కరటక దమనకాలు పన్నినపథకం దింతో ఎదురు తెరిగింది. తవు పథకం బెడిసికొట్టడంతో వాటిలో అంతర్మధనంమొదలైంది.
“'అన్నా, కరటకం! మనం నిరాశ్రయులమయిపోయాం. పింగళకానికి సంజీవకంతో కబుర్లుచెప్పడంలో ఎంత ఆనందంగా ఉందంటె, అతగాడు వేటకు కూడా పోవటంలేదు. అందుచేత మనకు బొత్తిగా తిండిలేకుండాపోయింది. ఏం చెయ్యాలి? అన్నదిదమనకం.
గడ్జితినేఈ ప్రాణిని తగుదునమ్మా అంటూరాజుకు పరిచయం చెయ్యటం నీదేబుద్ది తక్కువ, తనకు మాలిన ధర్మం చేస్తేఇలాగే ఉంటుంది అన్నది కరటకం.
“నిజమే, తప్పునాదే, స్వయుంకృతాపరాధంరాజుది కాదు. స్వయుం౦కతాపరాధాలుఎలా చెరుపు చేసేదీ దేవశర్మ కథ చెబుతుందిగద! అన్నది దమనకం.
“ఎలాగెలాగూ?”” అని కరటకం అడిగింది.
దమనకంఇలా చెప్పసాగింది:
దేవశర్మకథ:
ఒక మారుమూల ప్రదేశంలో జనపదాలకు దూరంగా ఒక మఠం ఉండేది. దేవశర్మ అనే యతి ఆ మఠంలోఒంటరిగా ఉంటూ శివలింగాన్నిఅర్చిస్తూ ఉండేవాడు. అనేకమందిభక్తులు ఆ మఠానికి విలువైనవస్త్రాలు దానంచేసేవారు.
సర్వసంగపరిత్యాగం చేసి యతి అయినప్పటికీ, దేవశర్మక్రు బంగారం మీద భ్రాంతి ఉండేది.
ఒకనాడుఆయన వమారువేషం వేసుకుని, విలువైన వస్తాలన్నింటిని మూట గట్టిదూరాన ఉండే నగరానికి తీసుకు పోయి, వాటిని బంగారానికి అమ్మి ఆ బంగారాన్నిఒక గుడ్డ సంచిలో పెట్టి, సంచిని తన చంకకు తగిలించుకుని, వుఠానికి తిరిగివచ్చాడు.
అటు బమ్మట, ఆయన ఎవరినీ నమ్మక, రాత్రింబగళ్లుఆ సంచిని తన చంకలోనే ఉంచుకునేవాడు.
సంపదనుసాధించటం కష్టం. సంరక్షించడం కష్టం, అది పోవడం దుఃఖం, ఖర్చుకావడం దుఃఖం, దాని మూలమే ఖేదం, దాని ఫలితాలువిషాదం, అని ఊరికి చెప్పారా?
ఆషాఢభూతి అనేవాడు దుర్మార్గుడు, పాపభీతిలేనివాడు. ఇతరులది కాజెయ్యడమే వాడి లక్ష్యం. దెవశర్మచంకలో ఉండే బంగారంఒకనాడు వాడి కంట పడింది. దాన్నిఎలా కాజెయ్యడమా అని ఆలోచించాడు.
మఠం గోడలు రాతితో కట్టినవికావటం చేత వాటికి కన్నం వెయ్యటం సాధ్యంకాదు. కిటికీలుచాలా ఎత్తున ఉన్నాయి. అందుచేత ఆషాఢ భూతి దేవశర్మదగ్గిరశిష్యుడిగా చేరి, తియ్యటి కబుర్లతో ఆయనకు విశ్వాసపాత్రుడుకావాలనుకున్నాడు.
ఇలా అనుకుని అషాఢభూతి దేవశర్మ వద్దకు వె ల్లి, “పరమశివుడికి ప్రణామం!” అంటూ ఆయన కాళ్లపై సాష్టాంగ పడ్డాడు.
తరవాత అతను దేవశర్మతో వినయంగా,“మహాత్మా, జీవితసాగరం నిరుపయోగమైనది. సుఖాలు నిర్జల మేఘాలు. బంధుపుత్ర కళత్రాదులు కలలోని భ్రాంతి.
ఈ విషయం పూర్తిగా గ్రహించి మోక్షమార్గం తెలుసుకోవడానికి తమ వద్దకు వచ్చాను, నన్ను కరుణించి మి శిష్యుడిగా స్వీకరించి నాకు ముక్తిమార్గం ప్రసాదించండి అన్నాడు.
దేవశర్మఈ మాటలు విని, "నాయనా ఇంత చిన్న ప్రాయంలో లౌకికలంపటాన్ని వదిలించుకున్న నీవు ధన్యుడవు. యౌవనంలోసాధించిన నిగ్రహమే నిజమైన నిగ్రహం. ఈ నిగ్రహబలమే నిన్ను మనుషులలో ఉన్నతుడిని చేస్తుంది.
జీవితంపైఆశలు లేని నువ్వు నన్ను మోక్షమార్గం అడిగావు. ఓం నమశ్శివాయ అంటూశివుడిపైన ఒక్క పుష్పం ఉంచిన వాడికిమరి జన్మ లేదు, అన్నాడు.
ఆషాఢభూతి దేవశర్మ కాళ్ళు పట్టుకుని, “స్వామి, ఆ మంత్రం ఎలా పునశ్చరణ చేయాలోచెప్పి, నన్ను ధన్యుడిని చెయ్యండి, అన్నాడు.
“చెబుతాను, నాయనా, అయితే నువు రాత్రివేళమఠంలోకి రాగూడదు. యతి (పాపంచికబంధాలకు దూరంగా ఉండాలి. అందుకుగాను రాత్రివేళ ఒంటరిగా ఉండటం అవసరం. ఉపదేశం పొందిన అనంతరం నువుబయట ఉన్న పర్థకుటిరంలో పడుకో గురువాజ్ఞనుఎన్నటికీ మీరకు,” అన్నాడు దేవశర్మ
ఆషాఢభూతి. “స్వామీ, తమ ఆజ్ఞ శిరసావహిసాను,” అన్నాడు.
ఆరాత్రిపడుకోబోయేముందు దేవశర్మ ఆషాఢభూతికిమంత్రోపదేశం చేసి, అతన్ని తన శిష్యుడుగా చేర్చుకున్నాడు.
అతనురోజూ గురువుగారికి కాళ్లూ చేతులూపట్టి, పూజకు వూలూ, పత్రీతెచ్చి పెట్టిసంతోష పరిచేవాడు. అయినప్పటికీ దేవశర్మతనచంకలో ఉండే సంచీని ఆషాఢభూతికిఅందనిచ్చే ధోరణి ఏమీ కనబరచలేదు.
కాలంగడుస్తున్నది. ఈ మనిషి నన్ను పూర్తిగాఎప్పటికీ నమ్మడా? పట్టపగలే ఇతన్నిహత్య చేయాలా? లేక విషం పెట్టనా? లేక గొడ్డును చంపినట్లు కొట్టి చంపనా? అనుకున్నాడుఆషాడభూతి. బంగారం కోసందేనికైనా తెగించడానికి సిద్ధపడిపోయాడుఅషాఢభూతి. ఈ లోగా అవకాశం రానేవచ్చింది.
ఒకనాడుఒక భక్తుడి కొడుకు వచ్చి, దేవశర్మనుమర్నాడు తము ఇంట జరిగే యజ్ఞ్టోపవితధారణకు దయచెయ్యమని ఆహ్వానించాడు. ఆ ఆహ్వానాన్ని మన్నించాడు దేవశర్మ,
మర్నాడుదేవశర్మ ఆషాఢభూతిని వెంటబెట్టుకుని, ఆహ్వానం వచ్చిన గ్రామానికి బయలుదేరాడు. వాళ్లు కొంత దూరం వెళ్లేసరికిఒక నది వచ్చింది.
దేవశర్మనదిని చూడగానే తన బట్టలు విప్పి, చంకలోని సంచి తీసి బట్టలమధ్య చుట్టిపెట్టాడు.
స్నానంచెయ్యబోతూ, కాలకృత్యాలు నిర్వర్నించవలసినఅవసరం వచ్చి, ఆషాఢభూతీ, ఇప్పుడే వస్తాను. అంత దాకా ఈ బట్టలూ, ముఖ్యంగా ఈ సంచీ చూస్తూ ఉండు. అది శివుడి సొత్తు! అన్యులపాలు కానివ్వకు'' అని చెప్పి వెళ్లిపోయాడు.
దేవశర్మకనువురుగైన దాకా ఉండి, బంగారంఉన్న సంచి సంగ్రహించి, కాలి సత్తువకొద్దీ పారిపోయాడు ఆషాఢభూతి. (ఇంకా ఉంది)