Ancient India The Prehistoric Period-ప్రాచీన భారతదేశ చరిత్ర
చరిత్ర పూర్వయుగం
మనకు లభిస్తున్న ఆధారాల ప్రకారం చరిత్రను 3 విధాలుగా విభజించారు
1. చరిత్ర పూర్వయుగం (Prehistoric Period)
చరిత్ర రచనకు ఎటువంటి లిఖిత పూర్వకమైన ఆధారాలు లభించనటువంటి కాలాన్ని చరిత్ర పూర్వయుగం అంటారు
2. పురా/సంధియుగ చరిత్ర (Proto Historic Period)
చరిత్ర రచనకు సంబంధించి లిఖిత పూర్వకమైన ఆధారాలు లభించినప్పటికీ దాని లిపిని అర్థం చేసుకోలేని కాలాన్ని పురా చరిత్ర/ప్రాటో హిస్టరీ అంటారు.
ఉదా॥ సింధు నాగరికత
3. చారిత్రక యుగం (Historic Period)
చరిత్ర రచనకు సంబంధించి లిఖిత ఆధారాలు లభిస్తున్న కాలాన్ని చారిత్రక యుగం అంటారు.
చరిత్ర పూర్వయుగం.
మానవుడు ఉపయోగించిన పనిముట్ల ఆధారంగా చరిత్ర పూర్వ యుగాన్ని ఈ క్రింది విధంగా విభజించారు
1 పాతరాతియుగం/ప్రాచీనశిలాయుగం (క్రీపూ. 1,50,000-8,500)
2 మధ్య రాతియుగం/మధ్య శిలాయుగం (క్రీపూ. 8500-4000)
3 కొత్త రాతియుగం/తామ్రశిలాయుగం/నవీన శిలాయుగం (క్రీ.పూ. 4000-1000)
4 లోహయుగం/బృహత్ శిలాయుగం (క్రీ.పూ. 1000-600)
గమనిక: పై సంవత్సరాలు సుమారుగా పేర్కోనబడినవి.
చరిత్ర పూర్వయుగం గురించి పరిశోధనలు ప్రారంభించిన మొట్టమొదటి వ్యక్తి - రాబర్ట్ బ్రూస్‌పుట్.
బ్రూస్‌పుట్ భారతదేశ పురాచిత్ర పథనిర్దేశకుడుగా కీర్తి పొందాడు.
1. పాత రాతియుగం (క్రీ. పూ.1,50,000-8,500)
ఈ యుగంలో పనిముట్లను క్వార్ట్‌జైట్(స్ఫటిక శిల), శింగల్, హెమైట్, సిలికాన్, గులకరాయి, లైమ్‌స్టోన్లతో తయారు చేశారు.
సొహాన్ వ్యాలీలో ఈ యుగం నాటి ప్రదేశాలు లభ్యమయ్యాయి.
ఈ యుగంనాటి ఇతర ప్రదేశాలు
1 లంగ్‌రాజ్-గుజరాత్
2 బాగోద్ -రాజస్టాన్
3 పోచ్‌పద్రా బేసిన్, సోజాద్ -రాజస్టాన్
4 ఆదంగఢ్ -మధ్య ప్రదేశ్
5 భీమ్‌బెట్కా -మధ్యప్రదేశ్
పాత రాతియుగాన్ని శాస్త్రవేత్తలు తిరిగి 3 దశలుగా విభజించారు
ఎ. తొలి పాత రాతియుగం (క్రీ.వూ. 1,50,000 - 50,000)
బి. మధ్య పాతరాతియుగం (క్రీ.పూ. 50,000-10,000)
సి. చివరి(సూక్ష్మ)పాతరాతియుగం(క్రీ. పూ. 10,000-8,500)
ఎ. తొలి పాతరాతియుగం (క్రీపూ.1.50,000-50,000)
తొలి పాతరాతి యుగం అషూలియన్ సాంకేతిక సాంప్రదాయానికి చెందినది
భారతదేశంలో లభించిన శిలా పరికరాలను శాస్త్రజ్ఞులు సోయానియన్/ సోహానియన్, అషూలియన్ అని రెండు రకాలుగా విభజించారు.
సోయానియన్ పరికరాలు :
నదులు, వాగులు మొదలైన నీటి ప్రవాహాలలో కొట్టుకొనివచ్చి గుండ్రంగా తయారైన రాతిని ఉపయోగించి తయారు చేయబడిన పరికరాలు.
ఈ తరగతిలో చేయబడిన పరికరాలు చోపర్లు. ఇవి ఎక్కువగా శివాలిక్ పర్వత ప్రాంతాల్లో లభించాయి.
అషూలియన్ పరికరాలు:
జల ప్రవాహాలలో కాకుండా ఇతరత్రా దొరికే రాతిని ఉపయోగించి తయారుచేసిన పరికరాలు.
ఈ తరగతిలోని పరికరాలు చేతిగొడ్డళ్లు, గంద్రగొడ్డళ్ళు
ప్రాన్స్‌లోని అషూల్ అనే ప్రాంతంలో దొరకడం వల్ల వీటికి అషూలియన్ పరికరాలు అని పేరు పెట్టారు.
ఈ కాలపు పనిముట్లను పెబ్బల్ టూల్స్ (గులకరాళ్లతో తయారైనవి) అంటారు. వీటిని రాబర్ట్ బ్రూస్‌పుట్ కనుగొన్నారు
అషూలియన్ యుగాన్ని తిరిగి రెండు రకాలుగా విభజించారు. అవి
1. తొలి అషూలియన్ యుగం
2. మలి అషూలియన్ యుగం
తొలి అషూలియన్ పనిముట్ల ఆకారాలు ప్రామాణికంగాఉండేవి కావు. వంకర టింకర కోత అంచులతో ముతకగా ఉండేవి.
మలి అషూలియన్ పనిముట్లు పలుచగా, తేలికగా, ప్రామాణికంగా, వైవిధ్యభరితంగా ఉండేవి.
బి. మధ్య పాత రాతియుగం (క్రీపూ. 50,000-10,000)
ఈ యుగంలో పెచ్చుతో చేసిన వనిముట్లను ఉపయోగించేవారు.
ఈ యుగంలో వాడిన పరికరాలను 'ప్లేక్‌టూల్స్' అని అంటారు.
పనిముట్ల రకాలలో చిన్నతరహా చేతి గొడ్డళ్లు, గండ్ర గొడ్డళ్లు, ఛేదకాలు, ఛిద్రకాలు, బరములు, చూచికాలు, గీకుడురాళ్లు కలవు.
మధ్య పాత రాతియుగంలోని స్థావరాలన్నీ నదులు, ఇతర జలాశయాలకు దూరంగా లభించాయి.
సి. చివరి(సూక్ష్మ)పాతరాతియుగం (క్రీ. పూ.10,000-8,500):
ఈ యుగంలో నూక్ష్మ శిలాపరికరాలను ఉపయోగించారు.
ఈ యుగపు మానవ జాతిని 'హోమోసెపియన్స్' అంటారు.
ఈ యుగంలో మానవుడు రాతి పనిముట్లను చేసి, వాటిని కర్రలకు, ఎముకలకు అమర్చి ఉపయోగించాడు.
ఈ యుగపు ముఖ్య పనిముట్లు - బ్లేడు పనిముట్టు, ఎముక పనిముట్లు.
మొత్తంగా పాత రాతియుగంలో మానవుడు జంతువులను, చేపలను వేటాడి జీవనం సాగించాడు.
కుండలను తయారు చేయడం, మృతదేహాలను పూడ్చిపెట్టడం ప్రారంభించాడు.
పాత రాతియుగం వేట, ఆహార సేకరణ అనే ఆర్థిక వ్యవస్థను కలిగి ఉంది.
2. మధ్య రాతియుగం (క్రీపూ.8,500-4000):
పాత రాతియుగానికి మరియు కొత్త రాతియుగానికి మధ్య గల దశను మధ్య రాతియుగం అంటారు.
ఈ యుగపు ఆవాసాలు సూక్ష్మ రాతియుగం నాటి సాంకేతిక సముదాయాన్నే సూచిస్తుంది
ఈ యుగపు పనిముట్లను క్వార్ట్‌జైట్, చెకుముకి రాళ్లు, చెర్ట్, క్రిష్టల్, అగేట్, చాల్స్‌డన్, జాస్పర్ మొదలైన రాళ్లతో తయారుచేశారు.
ఈ యుగపు పనిముట్లు చాలా సూక్ష్మమైనందువల్ల వీటిని కర్రకు, ఎముకకు బిగించి వాడేవారు. ఇటువంటి పరికరాలు నాగార్జునకొండ ప్రాంతాల్లో లభించాయి.
3. కొత్తరాతియుగం/తామ్ర శిలాయుగం (క్రీపూ.4000-1000):
జాన్ లుబో తన 'ప్రి హిస్టోరిక్ టైమ్స్' అనే గ్రంథంలో కొత్తరాతి యుగం నాటి ప్రజల జీవన విధానం గురించి తెలియజేశాడు.
నర్మదానదీలోయ ప్రాంతంలో కూడా బెలాన్ వ్యాలీ (వింధ్య పర్వతాలు)లో ఈ యుగం నాటి స్థావరాలు అధికంగా ఉన్నాయి.
ఈ యుగం చివరి దశలో రోగి, కంచు వస్తువులను వాడినందువల్ల దీన్ని తామ్ర శిలాయుగం అని కూడా అంటారు.
ఈ యుగంలో మానవుడు ఆహార సేకరణ దశనుండి ఉత్పత్తి దశకు చేరాడు.
రాగులు, ఉలవలు, పెసర్లు పండించేవాడు.
ఈ యుగం నాటి ప్రజలు ఉలి, సుత్తి, బొరిగె, నాగటి కర్రు వంటి పనిముట్లను ఉపయోగించారు.
ఈ యుగంలో మానవుడు స్థిర నివాసాన్ని ఏర్పరచుకున్నాడు. జమ్ముతో గుండ్రని ఇండ్లు నిర్మించుకున్నాడు.
శ్రమ విభజన, పురుషాధిపత్యం ప్రారంభమైంది.
మత విశ్వాసాలు ప్రారంభమయ్యాయి.
కుమ్మరి సారెను కనుగొని మట్టి పాత్రలను తయారు చేయడం నేర్చుకున్నాడు. కుండల మీద చిత్రాలు చిత్రించాడు.
గార్డెన్ చైల్డ్ అనే పండితుడు ఈ యుగాన్ని నాగరిక విప్లవం అని అభివర్ణించాడు.
ఆహార సేకరణ నుంచి ఆహార ఉత్పత్తికి జరిగిన ఈ మార్చును వ్యవసాయ విఫ్లవమని పురా మానవ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు
ఈ యుగానికి చెందిన 5 ముఖ్య లక్షణాలు
1 పశు పోషణ, మొక్కల పెంపకం
2 రాతి గొడ్డళ్లు, రాతి బ్లేడుల లాంటి నునుపు చేసిన రాతి పనిముట్లను తయారు చేయడం
3 స్థిర గ్రామీణ జీవితం ఏర్పడింది
4 కుండలు తయారు చేయడం
5 రాగి, కంచు పనిముట్లను వాడడం
కొత్త రాతి యుగాన్ని మరలా 3 దశలుగా విభజించారు
1. మొదటి దశ (క్రీ.పూ. 4000-1800)
2. రెండవ దశ (క్రీ.పూ. 1800-1400)
3. మూడవ దశ (క్రీపూ. 1400-1000)
1. మొదటి దశ (క్రీపూ.4000-1800) :
బ్రిడ్జెట్, రేమండ్ ఆల్‌చిన్‌లు ఈ దశ కాలాన్ని లెక్కించారని చరిత్రకారుల అభిప్రాయం.
ఈ దశలో గ్రానైట్ కొండల మీద, పర్వత ప్రాంతాల చదును మీద, లోయల అడుగు భాగాన మానవుడి ఆవాసాలు ఉండేవి
ఈ దశలో లోహాల వాడకం లేదు
2. రెండవ దశ (క్రీపూ.1800-1400)
ఈ దశలో కొయ్య చక్రాల మీద నిర్మించిన గుండ్రటి తడకల గుడిసెలు ఉండేవి.
నేలను అలికేవారు.
మట్టీ పాత్రలు వచ్చాయి.
సాంస్కృతిక సంబంధాలు, వస్తువుల రవాణా జరిగింది.
రాగి, కంచు వస్తువులు తక్కువగా కనిపించాయి.
3. మూడవ దశ (క్రీపూ.1400-1000)
రాగి, కంచు వస్తువుల వాడకం ఎక్కువగా ఉండేది
ఈ యుగంలో వర్షాధారమైన బహుధాన్య వ్యవసాయ పద్ధతి ఉండేది.
ముఖ్యంగా జొన్నలు, పప్పుధాన్యాలు పండించేవారు
పశు పోషణ ప్రధానంగా ఉండేది
కొన్ని కొత్త రకం మట్టి పాత్రలు వాడుకలోకి వచ్చాయి
ఉదా! ఉట్నూరు (మహబూబ్‌నగర్). ఇచ్చట పేడకుప్పలు తగులబెట్టగా ఏర్పడినటువంటి బూడిద కుప్పలు కనుగొన్నారు. ఇక్కడే 13 రకాల మట్టి పాత్రలు కూడా లభించాయి
4. లోహయుగం/బృహత్ శిలాయుగం (క్రీ. పూ. 1000-600)
మానవుడు తొలుత ఉపయోగించిన లోహం -రాగి
ఈ యుగం నుంచే ఇనుము వాడకం మొదలైంది
ఇనుముతో ఆయుధాలు, వ్యవసాయ పరికరాలు తయారు చేసేవారు
అందువల్లనే ఈ యుగాన్ని 'ఇనుప యుగం' అని అంటారు
దక్షిణ భారతదేశంలోని ఇనుప పరిశ్రమ ఐరోపా కంటే అతి ప్రాచీనమైనదని చరిత్రకారుడు రాబర్ట్ బ్రూస్‌పుట్ పేర్కొన్నాడు.
పశుపోషణ, పోడు వ్యవసాయంతో పాటు ఇనుము ప్రవేశం వల్ల ఈ యుగంలో స్థిర వ్యవసాయం మొదలైంది.
ఈ యుగంలో ప్రజలు వరిని పండించేవారు. వ్యవసాయానికి అనుబంధంగా వడ్రంగం లాంటి వృత్తులు ఏర్పడ్డాయి
శ్రమ విభజన ఏర్పడడం వల్ల అదనపు ఉత్పత్తి జరిగింది. ఇది వ్యాపారానికి, పట్టణీకరణకు దారితీసింది
ప్రజలు పూర్తిగా స్థిర నివాసాన్ని ఏర్పరచుకున్నారు. ఈ పరిణామాల వల్ల ఈ యుగంలో తొలి చారిత్రక దశకు అంకురార్పణ జరిగింది.
ఈ యుగంలో పెద్ద పెద్ద బండలను ఒకదానిపై ఒకటి ఉంచి పెద్ద పరిమాణంలో సమాధులు నిర్మించారు. ఈ సమాధులను బృహత్తర శిలాయుగపు సమాధులు అని అంటారు.
సమాధులపై బృహత్ శిలలను ఉంచే ఆచారం ఉన్నందువల్ల ఈ యుగాన్ని బృహత్ శిలాయుగం అని కూడా అంటారు.
తెలంగాణలో ఇటువంటి సమాధులను కెయిరన్‌లు, రాక్షసగుళ్లు అని పిలుస్తారు. దీనినే డాల్మెన్ అంటారు.
ఈ సమాధుల్లో మానవుల ఎముకలతో పాటు ఇనుప పనిముట్లు, రాగి పాత్రలు, మట్టి కుండలు ఉంచేవారు.
ఈ సమాధులకు పలు ప్రాంతాల్లో వివిధ పేర్లు కలవు
చిత్తూరు జిల్లా, తమిళనాడు - కురంబర్ కురులు
కడప, కర్నూలు - పాండవ గుళ్లు
అనంతపురం, బళ్లారి - మోరివర్ గుళ్లు
ఈ యుగానికి ప్రధాన సూచికలు సమాధులు
ఇటువంటి సమాధులు 12 రకాలుగా నిర్మించి ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి 4 అవి
1. మెన్‌హిర్
2 చిస్ట్
3. డాల్మన్
4 సెర్మోఫాగస్/మట్టి శవపేటిక
1. మెన్‌హిర్ :
మరణించిన వారి జ్ఞాపకార్థం పెద్ద శిలా స్తంభాన్ని నిలువుతారు. ఇటువంటి సమాధినే మెన్‌పిర్ అని అంటారు
నల్గొండ జిల్లాలోని వలిగొండలో ఇటువంటి సమాధులు బయటపడ్డాయి.
2. చిస్ట్ :
రాతి పెట్టెలో మృతదేహాన్ని ఉంచి ఆ పెట్టెను ఒక గొయ్యిలో పెట్టి, దాన్ని మట్టితో కప్పేస్తారు. దీనిచుట్టూ వృత్తాకారంలో పెద్ద పెద్ద రాతిగుళ్లను పేరుస్తారు. ఇటువంటి సమాధులను చిస్ట్ అని అంటారు
ఆదిలాబాద్ జిల్లాలో తప్ప తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఇటువంటి సమాధులు బయటపడ్డాయి
3. డాల్మన్ :
రాతి శవపేటికను గోతిలో పెట్టకుండా భూమి మీదనేపెట్టి దాని చుట్టూ రాళ్లు పేర్చే పద్ధతిని డాల్మన్ అని అంటారు
మహబూబ్‌నగర్ జిల్లా అమ్రాబాద్ వద్ద గల గ్రాఫైట్‌రాళ్ల గుట్ట మీద 800 చ.మీ. విస్తీర్ణంలో ఈ సమాధులు ఉన్నాయి.
4 సెర్మోఫ్రాగస్/మట్టి శవపేటిక :
మట్టితో చేసిన శవపేటికలో శవాన్ని గాని లేదా దహనం చేసిన తర్వాత అస్థికలను గాని ఉంచి సమాధి చేసేవారు.