Panchatantra Stories-మిత్రబేధం 4

TSStudies

దంతిలుడికథ

దమనకంసంజీవకానికి దంతిలుడి కథ ఇలా చెప్పింది:
వర్టమాననగరంలో దంతిలుడు అనే ఒక గొప్పవర్తకుడుండేవాడు. ఆయన నగర పాలకుడిగాఉండి, నగరానికి సంబంధించిన విషయాలన్నిచూసేవాడు.
ఆయన రాజుగారి సాంత ఖర్చు వెచ్చాలు కూడాచూసేవాడు. మెడమీది కత్తి లాంటి రాచరికపువ్యయాలను పకడ్పందీగా నిర్వహిస్తూఆయన అటు రాజుగారినీ, ఇటు ప్రజలనూకూడా సంతోషపెట్టి, అందరి గౌరవమన్ననలనూపొందుతూ వచ్చాడు.
రాజుకుహితుడైన వాణ్ణి ప్రజలు ద్విషిస్తా రనీ, రాజ క్షేమానికీ, ప్రజా క్షేమానికి వైరుధ్యం ఉండటంచేత ఉభయులనూ తృప్పపర చటం చాలా అరుదనీ చెబుతారు. కాని దంతిలుడుఅలాటి అరుదైన మనిషి
ఒకప్పుడుదంతిలుడు తన కుమార్తె వివాహంజరిపాడు. దానికి ఆయన పౌరులనూ, రాజోద్యోగులనూ ఆహ్వానించి, విందు భోజనాలుపెట్టి, విలువైన బట్టలు పెట్టి పంపేశాడు.
వివాహంపూర్తి అయ్యాక ఆయన వధూ వరులనుఆశీర్వదించటానికి రాజునూఆయన భార్యలనూ ఆహ్వానించాడు. వారు ఆహ్వానంఅందుకున్నారు.
ముందుగాదివాణం నుంచి అనేక మంది ఉద్యోగులూ, నౌకర్లూ దంతిలుడి ఇంటికి వచ్చారు. వారిలో రాజుగారి ఇంట కసువు ఊద్చేవాడుగోరభుడు అనేవాడు కూడా ఉన్నాడు.
గోరభుడుఆస్థాన గౌరవమర్యాదలు పాటించకరాజ పురోహితుడి కొరకు ఏర్పాటు చేసినఆసనంలో వెళ్లి కూర్చుని లేవ నిరాకరించాడు. అర్హతకు అనువుకాని సత్కారాన్ని కోరటంపద్ధతి కాదని నచ్చచెప్పినావినక పోవడంతోదంతిలుడు వాణ్ణి బయటకు 'గెంటించాడు. తరవాత రాజు తన రాణులతో సహా వచ్చి, దంతిలుడు చేసిన సత్కారాలు పొందాడు.
Panchatantra Stories in telugu,Panchatantra Stories for kids in telugu,Panchatantra Stories by vishnu sharma,telugu Panchatantra Stories,Panchatantra  kathalu in telugu,Panchatantra kathalu in telugu,balamitra stories in telugu,chandamama stories in telugu,bethala kathalu in telugu,bala baratam in telugu,moral stories for kids in telugu,moral stories in telugu,akber and birbal stories in telugu,neeti kathalu,mitrabedam story in telugu,
దంతిలుడిఇంట తనకు జరిగిన ఘోరమైన అవమానానికి ఉడికి పోతూ గోరభుడు  రాత్రి నిద్రపోలేదు. వాడు ఇలా ఆలోచించాడు. అవమానానికి ప్రతిక్రియ ఏమిటి?
దంతిలుడిపైరాజుకు ఆగ్రహం తెప్బంచిఅవమానంపాలు చేయ్యగలనా? లేక నేను ఏమీ చెయ్యలేక అవమానంతో కృశించి పోవలసినదేనా? గుండెల్లో నిత్యమూ రగిలే బాధనుచూస్తూ నిస్సహాయంగా బతికే బతుకువ్యర్థం!
పగ తీర్చుకోలేకుండా ఆగ్రహం చెందేవాడుసిగ్గుమాలిన వాడు. పెనం మిదవేసిన ఆవగింజఎంత ఎగిరిపడినా పెనాన్ని విరగ గొట్టలేదు. నేను కసువు ఊద్బేవాబ్దీ, ఆయన కోటీశ్వరుడూ, నగర పాలకుడూ; అయినా నన్నుఅవమానించి ఆయన తప్పించుకు పోలెడనిచూపిసాను. అని శపధం చేశాడు.
రాజుగారుపక్కవదలక ముందే ప్రతి రోజూరాజుగారి శయనాగారం చిమ్మటం గోరభుడిపని. ఇది జరిగిన మర్నాటిఉదయం రాజుగారునిద్రలేచి, ఇంకా పక్కమిదనే ఉండగా, గోరభుడు గది చిమ్ముతూ, “దంతిలుడుపెద్ద రాణీగారిని ఆలింగనం చేసుకోవడంఎంత సాహసం!” అని రాజుకు వినబడేలాగొణుక్కున్నాడు.
మాటలు విని రాజుచివాలున లేచి, “ఒరేనువ్వు ఇప్పుడు గొణిగినది నిజమాదంతిలుడుపెద్దరాణీని కొగలించంకున్నాడా? ' అని అడిగాడు.
““దొరా, రాత్రి పొద్దుపోయేదాకా పాచికలాడుతూమేలుకుని ఉండటం చేత, నిద్రమత్తుతోజోగుతూ ఎమన్నానో నాకే తెలీదు అన్నాడుగోరభుడు.
Panchatantra Stories in telugu,Panchatantra Stories for kids in telugu,Panchatantra Stories by vishnu sharma,telugu Panchatantra Stories,Panchatantra  kathalu in telugu,Panchatantra kathalu in telugu,balamitra stories in telugu,chandamama stories in telugu,bethala kathalu in telugu,bala baratam in telugu,moral stories for kids in telugu,moral stories in telugu,akber and birbal stories in telugu,neeti kathalu,mitrabedam story in telugu,
రాజుతనలో “'రాణులుండే గదులలోకి వెళ్లేపర పురుషులు దంతిలుడూ, గోరభుడూమాత్రమే. అందుచేత దంతిలుడు పెద్దరాణినిఆలింగనం చేసుకోవడం ఈ గోరభుడికంట పడి ఉండవచ్చు.
నిన్నసాయంకాలం దంతిలుడు పెద్ద రాణి  పట్ల, మిగిలిన రాణుల పట్ల కన్నహచ్చుశ్రద్ద చూపటమూ, ఆవిడ అతనితో కొంచెంహెచ్చు చనువుగా ఉండటమూ గమనించిఅదంతా లాంఛన మనుకున్నానుకానివీడు అనే మాటలను బట్టిఅందులో విశేషార్దంకనిపిస్తున్నది.
తాగుబోతులనోటా, నిద్రపోయేవారి నోటా రహస్యాలుబయటపడతాయి. అనెకమంది భార్యలుఉండటం చేత నేను పెద్దరాణి పట్ల నిర్లక్ష్యంగాఉంటున్న మాట నిజమే. అందుచేత ఆమె దంతిలుడి ప్రేమకోసం ఆశపడి ఉండవచ్చు. నాకు ఎంత కష్టం వచ్చిందిఅనుకునిదంతిలుణ్ణి రాజభవనంలో అడుగు పెట్టనివ్వవద్దనిద్వారపాలకులకు ఉత్తర్వుచ్చాడు.
ఉదయం దంతిలుడు ఎప్పటిలాగే రాజభవనానికివచ్చి, ద్వారపాలకులు తనను లోనికిపోనివ్వక పోవటం చూసి ఆశ్చర్యపడి నన్నులోపలకు పోవద్దనటానికి మీకెన్ని గుండెలు! అన్నాడు.
అయ్యా, మాపైన కోప్పడకండి. ఇది రాజుగారిఉత్తరువు, అన్నారు వాళ్లు.
““రాజుగారిఉత్తరువా? ఆయన అలాటి ఉత్తరువుఒక్కనాటికీ ఇయ్యడు, ' అన్నాడు దంతిలుడు.
సరేలెండి. రాజుగారికి మీమిద ఎందుకో చాలాకోపం వచ్చి ఉండాలి. ఆయనఉత్తరువుఇచ్చారు. దాన్ని పాలించటం మా ఐథధాయకం, ' అన్నారు ద్వారపాలకులు.
రాజుగారికితనపై కలిగిన అకారణ క్రోధానికిదంతిలుడు నిర్దాంతపోయి తనలో ఇలా అనుకున్నాడు: "డబ్బు రావటంతో గర్వించనివాడూభోగలాలసత వల్ల ఎటో ఒక చిక్కు రానివాడూరాజుగారి ప్రేమకు నిజంగా పాత్రుడైనవాడూ, చావును తప్పించుకున్న వాడూ, గౌరవం పొందిన యాచకుడూ ఉండడని పెద్దలు చెబుతారు...
Panchatantra Stories in telugu,Panchatantra Stories for kids in telugu,Panchatantra Stories by vishnu sharma,telugu Panchatantra Stories,Panchatantra  kathalu in telugu,Panchatantra kathalu in telugu,balamitra stories in telugu,chandamama stories in telugu,bethala kathalu in telugu,bala baratam in telugu,moral stories for kids in telugu,moral stories in telugu,akber and birbal stories in telugu,neeti kathalu,mitrabedam story in telugu,
““కాకిలోశౌెచమూ, జూదరిలో నిజమూత్రాగుబోతులోవేదాంతమూ ఎవరు చూశారునేనురాజుకు గాని, రాజ బంధువులకుగాని కలలోకూడా ఎలాంటి అన్యాయమూ చేసి ఎరగనే, రాజుకు నాపై ఆగ్రహం ఎలకలిగింది?”
దంతిలుడునిస్సహాయుడై నిలబడి ఉండటంచూసి గోరభుడు ద్వారపాలకులతో ““నన్నుఈయనగారు నిన్న తన ఇంట్లోంచి బయటికిగెంటేసినట్టే మీరు ఈయనగారిని ఇప్పుడుబయటికి గెంటండి, అన్నాడు.
ఇది విని దంతిలుడు, గోరభుడే దీని కంతకూకారకుడని గ్రహించి, రాత్రి గోరభుణ్జితన ఇంటికి పిలిచి, వాడికి మేలైన బట్టలుపెట్టి, “నాయనా, నేను నిన్ను పొగరెక్కిఅవమానించలేదు. రాజపురోహితుడి ఆసనంమిద కూర్చుని దిగమంటిే దిగక, చెజేతులాఅమూనం తెచ్చిపెట్టుకున్నావు, అన్నాడు.
గోరభుడుతనకు పెట్టిన బట్టలు చూసి మహదానందంచెంది, అవమానం అప్పుడె పోయిందిలెండి. రాజుగారికి మీమిద మళ్ళి అనుగ్రహం కలిగేటట్టు ఎలాచేస్తానో చూడండి.” అని వెళ్లిపోయాడు.
మర్నాడుఉదయం రాజుగారు పక్కమిద మేలుకునిపడుకుని ఉండగా గోరభుడు గది చిమ్ముతూ, రాజ్యమేలే రాజుగారికి ఇంగిత జ్ఞానంలేదేం? దొడ్డికి వెళ్లి దోసకాయలు తింటాడు! అని గొణిగాడు.
రాజుగారు మాట విని, గోరభుణ్ణిదగ్గరికిపిలిచి, ''ఎందుకురా మూర్చుడా అబద్దాలాడుతున్నావు? మరొకడైతే అక్కడే వాడిని చంపేసిఉందును. ఎంత కండకావరం? నేను దొడ్డికిపోయి దోసకాయలు తినగా నువు చూశావురా?”' అని అడిగాడు.
''తప్పుకాయండిదొరా, రాత్రి చాలా పొద్దుపోయినదాకా పాచికలాడటం చేత నిద్రమత్తునఏమన్నానో నాకే తెలీదు. క్షమించండి, '' అని పాత పాటే పాడాడుగోరభుడు.
Panchatantra Stories in telugu,Panchatantra Stories for kids in telugu,Panchatantra Stories by vishnu sharma,telugu Panchatantra Stories,Panchatantra  kathalu in telugu,Panchatantra kathalu in telugu,balamitra stories in telugu,chandamama stories in telugu,bethala kathalu in telugu,bala baratam in telugu,moral stories for kids in telugu,moral stories in telugu,akber and birbal stories in telugu,neeti kathalu,mitrabedam story in telugu,
ఒక్కసారిగారాజుకు జ్ఞానోదయమైందివాడిమాటకు ఎమి విలువ లేదనితనకు తెలిసిపోయింది. నిజంగానే దంతిలుడికి తానుచాలా అన్యాయం చేశాడు. అతను చాలాపెద్దమనిషి ఎన్నడూ తప్పుడు పనులు చెయ్యనివాడు.
అదీగాకదంతిలుణ్జి ఒక రోజు రానివ్వక పోయేసరికిదివాణం పనులూనగరం పనులూ అస్త్వవ్యసమయిపోయాయి. యధార్ధంతేటతెల్లమవగానే రాజు దంతిలుణ్ణి పిలవనంపి, ఆయనకు మంచి బట్టలూకానుకలూఇచ్చి, ఎప్పటిలాగే పదవిలో ఉండనిచ్చాడు. (ఇంకా ఉంది)