SBI Recruitment of Junior Associates 2026 (9214 Vacancies)

SBI Recruitment of Junior Associates 2026

SBI జూనియర్ అసోసియేట్ (క్లర్క్) నోటిఫికేషన్ 2026 వివరాలు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) క్లరికల్ క్యాడర్‌లో జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్ & సేల్స్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (Advt No: CRPD/CR/2026-27/17) విడుదల చేసింది.

బ్యాంకింగ్ రంగంలో స్థిరపడాలనుకునే నిరుద్యోగులకు ఇది మంచి అవకాశం. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు (Important Dates)

  • ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం & ముగింపు: 11.08.2026 నుండి 31.08.2026 వరకు
  • ప్రిలిమినరీ పరీక్ష (Tentative): సెప్టెంబర్ 2026
  • మెయిన్ పరీక్ష (Tentative): నవంబర్ 2026

ఖాళీల వివరాలు (Vacancies)

అభ్యర్థులు ఏదైనా ఒక రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతానికి మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

విభాగం ఖాళీల సంఖ్య
మొత్తం రెగ్యులర్ ఖాళీలు 7,680
బ్యాక్‌లాగ్ ఖాళీలు 1,444
తెలంగాణ (హైదరాబాద్ సర్కిల్) 260

అర్హత ప్రమాణాలు (Eligibility Criteria)

1. విద్యార్హత (31.12.2026 నాటికి):

  • గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదేని డిగ్రీ (Graduation) ఉత్తీర్ణులై ఉండాలి.
  • ఫైనల్ ఇయర్ లేదా సెమిస్టర్ చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, 31.12.2026 నాటికి డిగ్రీ ఉత్తీర్ణత సాధించినట్లు ఆధారాలు సమర్పించాల్సి ఉంటుంది.

2. వయోపరిమితి (01.04.2026 నాటికి):

  • కనీస వయస్సు: 20 సంవత్సరాలు
  • గరిష్ట వయస్సు: 28 సంవత్సరాలు
  • వయోపరిమితి సడలింపులు: OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు, SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, PwBD అభ్యర్థులకు 10 నుండి 15 సంవత్సరాల వరకు సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం (Selection Process)

ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో నిర్వహించబడుతుంది:

  1. దశ 1: ప్రిలిమినరీ పరీక్ష (100 మార్కులు | 1 గంట):
    • ఇంగ్లీష్ లాంగ్వేజ్: 30 ప్రశ్నలు (20 నిమిషాలు)
    • న్యూమరికల్ ఎబిలిటీ: 35 ప్రశ్నలు (20 నిమిషాలు)
    • రీజనింగ్ ఎబిలిటీ: 35 ప్రశ్నలు (20 నిమిషాలు)
    • (ప్రతి తప్పు సమాధానానికి 1/4th నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.)
  2. దశ 2: మెయిన్ పరీక్ష (200 మార్కులు | 2 గంటల 40 నిమిషాలు):
    • జనరల్/ఫైనాన్షియల్ అవేర్‌నెస్: 50 ప్రశ్నలు (50 మార్కులు)
    • జనరల్ ఇంగ్లీష్: 40 ప్రశ్నలు (40 మార్కులు)
    • క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్: 50 ప్రశ్నలు (50 మార్కులు)
    • రీజనింగ్ ఎబిలిటీ & కంప్యూటర్ ఆప్టిట్యూడ్: 50 ప్రశ్నలు (60 మార్కులు)
  3. దశ 3: స్థానిక భాషా పరీక్ష (Local Language Test):

    10వ లేదా 12వ తరగతిలో ఎంచుకున్న స్థానిక భాష ఒక సబ్జెక్టుగా చదివినట్లు మార్కుల జాబితా ఉంటే ఈ పరీక్ష అవసరం లేదు. లేని పక్షంలో ప్రొవిజనల్ సెలక్షన్ తర్వాత స్థానిక భాషా పరీక్ష నిర్వహించబడుతుంది.

జీతం వివరాలు (Pay Scale & Emoluments)

  • ప్రారంభ మూల వేతనం (Basic Pay): ₹26,730/- (గ్రాడ్యుయేట్లకు లభించే రెండు అదనపు ఇన్‌క్రిమెంట్లతో కలిపి).
  • మొత్తం జీతం: అలవెన్సులతో కలిపి మెట్రో నగరాల్లో సుమారుగా నెలకూ ₹46,000/- వరకు లభిస్తుంది.

దరఖాస్తు రుసుము (Application Fee)

  • SC / ST / PwBD / Ex-Servicemen: రూ. 0/- (ఉచితం)
  • General / OBC / EWS: రూ. 750/-

దరఖాస్తు చేసుకునే విధానం (How to Apply)

  1. SBI అధికారిక వెబ్‌సైట్ https://sbi.bank.in/web/careers ను సందర్శించండి.
  2. "Recruitment of Junior Associates 2026" ఆన్‌లైన్ అప్లికేషన్ లింక్‌పై క్లిక్ చేయండి.
  3. మీ ఫోటో, సంతకం, ఎడమచేతి బొటనవేలి ముద్ర మరియు డిక్లరేషన్ అప్‌లోడ్ చేయండి.
  4. ఫీజు చెల్లించి, ఫారమ్‌ను సబ్మిట్ చేసి ప్రింటవుట్ తీసుకోండి.

No comments:

Post a Comment