TS SI Final Exam 2023 Question Paper with Key (Questions from 1 to 50)

TSStudies
0
TSLPRB SI Final Exam Question Paper with Key

TS SI Final Exam Question Paper With Key 2023

TS SI Arithmetic and Reasoning & Mental Ability Exam 2023

TSLPRB Police SI Preliminary Exam Date - 7 August 2022.

TSLPRB Police SI Final Written Exam Date - 8 April 2023. (Arithmetic & Reasoning)

తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్‌ నియామక మండలి (TSLPRB) SI, ASI ఫైన‌ల్ రాత‌ప‌రీక్షలో భాగంగా ఏఫ్రిల్ 8వ తేదీ ఉద‌యం 10:00 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 1:00 గంట‌ వరకు Arithmetic and Test of Reasoning / Mental Ability ప‌రీక్ష‌ను నిర్వ‌హించారు. 

Booklet Code A

1. 10 బేసి సంఖ్యల సగటు 64  మరియు 8 వరుస సరి సంఖ్యల సగటు 49 అయితే బేసి సంఖ్యల అంత్య విలువలు మరియు సరి సంఖ్యల అంత్య విలువల సగటు

1) 56.5    2) 56    3)     54    4) 54.5

2.  ఒక దుకాణదారుడు ఒక వస్తువును 1,200 రూపాయలకు  కొన్నాడు మరియు దానిని 10% లాభంతో అమ్మాడు. అయితే అ సొమ్మును 10% చొప్పున బారువడ్డీతో 4 సంవత్సరాల తర్వాత తిరిగి చెల్లించేటట్లు అమ్మితే దుకాణదారుడు 4 సంవత్సరాల తర్వాత పొందిన మొత్తం (రూపాయలలో) 

1) 1320     2) 1848     3) 1550    4) 1448

3. \frac{{{2^{\sqrt {7 + 4\sqrt 3 } }} + {2^{\sqrt {12 + 6\sqrt 3 } }}}}{{{2^{\sqrt {12 - 6\sqrt 3 } }} - {2^{\sqrt {7 - 4\sqrt 3 } }}}}

1) 3    2)     3({2^{2\sqrt 3 }})    3) {2^3}    4) \sqrt 3

4.ఒకవేళ  \frac{a}{b} = \frac{c}{d} అయితే \frac{{3a + b}}{{c + 3d}} =

1. \left( {\frac{{3c + d}}{{a + 3d}}} \right)\frac{{{b^2}}}{{{d^2}}}    2. \frac{{3a + b}}{{3c + d}}    3. \frac{{a + 3bd}}{{b + 3ac}}    4. \frac{{3c + d}}{{3a + b}}

5. ఒక రోజులో, ఒక పురుషుడు చేసే పని ఒక స్రీ చేసే పనికి 1\frac{1}{2} రెట్లు. ఒక రోజులో ఒకపిల్లవాడు చేసే పని ఒక స్రీ చేసే పనిలో \frac{3}{4} వ వంతు.  ఒక పనిని పూర్తి చేయడానికి 45 మందిని తీసుకున్నారు. వారిలో పురుషులు, స్త్రీలు మరియు పిల్లల నిష్పత్తి 6:5:4. మూడవ రోజు  చివరన 61,200 రూపాయల సొమ్మును వారికీ చెల్లించారు. వారి వేతనాలు వ్యక్తిగతంగా వారు ఎంత పనిచేసారో దానికి అనుపాతంలో ఉంటే, ఒక స్త్రీ యొక్క దిన వేతనం (రూపాయలలో)

1) 500    2) 400    3) 600    4) 450

6. ఒక వ్యక్తి తన వద్దనున్న మూలధనంలో,  \frac{1}{6} వ వంతు సంవత్సరానికి 12% చొప్పున,  \frac{1}{4} వ వంతు సంవత్సరానికి10% చొప్పున మరియు మిగిలిన భాగాన్ని సంవత్సరానికి 8% చొప్పున పెట్టుబడిగా పెట్టాడు. ఈ పెట్టుబడుల ద్వారా వచ్చిన మొత్తం సాంవత్సరీక వడ్డీ 33,000 రూపాయలైతే సంవత్సరానికి 8%  పెట్టుబడిగా పెట్టిన సొమ్ము (రూపాయలలో) 

1) 3,60,000    2) 2,10,000    3) 60,000    4) 90,000  

7. ఒక తరగతిలో గల 35 మంది విద్యార్థుల సగటు వయస్సు 20 సంవత్సరాలు. ఒక్కొక్కరు 25 సంవత్సరాల వయన్సు గల అయిదుగురు విద్యార్థులు క్రొత్తగా తరగతిలో చేరారు మరియు అయిదుగురు వేరే విద్యార్థులు తరగతిని వీడి వెళ్లిపోయారు. ఇప్పుడు తరగతి సగటు వయస్సు 21. తరగతిని వీడి వెళ్ళిన అయిదుగురు విద్యార్థులలో నిర్దేశించబడిన ముగ్గురు విద్యార్థుల సగటు వయస్సు 15 సంవత్సరాలు అయితే, వీడి వెళ్ళిన విద్యార్థుల్లో మిగిలిన ఇద్దరు విద్యార్థుల వయసుల మొత్తం 

1) 90    2) 45    3) 50    4) 44

8. 900 రూపాయలు ప్రకటిత ధరగా గల వస్తువును 33\frac{1}{3}\% రాయితీతో A కొన్నాడు. 33\frac{1}{3}\% లాభం పొందడానికి ఆ వస్తువును A ఎంత ధరకు అమ్మవలసి వస్తుందో ఆ ధర రూపాయలలో 

1) 1200    2) 900    3) 800    4) 1,000

9. {4^n} ను 7 మరియు 9 లచే భాగించగా వచ్చే శేషములు వరుసగా 2 మరియు 7 అయితే, ప్రధాన సంఖ్య అవుతూ కనిష్టంగా ఉండే n విలువ

1) 2    2) 5    3) 3    4) 7

10. x - 2 మరియు x + 2 లు 1 నుండి 100 లోపల ఉన్న మూడు ప్రధాన సంఖ్యలు అయినా, 3x=

1) 9    2) 21    3) 27    4) 15

11. ఒక అసలుపై సాలీనా 15% వడ్డీరేటుతో 3 సంవత్సరములకు చక్రవడ్డీ మరియు బారువడ్డీల తేడా 567 రూపాయలు అయిన, 2వ సంవత్సరానికి  జమ అయ్యే మొత్తాల భేదం (రూపాయలలో)

1) 189    2) 120    3) 180    4) 175

12. 2\frac{1}{{10}} మరియు 1\frac{{16}}{{35}} ల యొక్కక.సా.గు. మరియు గ.సా.భా లు వరుసగా x,y అయితే \frac{x}{y} = 

1)  238    2) 1071    3) 1666    4) 735

13. ఒక శ్రేఢిలో మొదటి n పదముల మొత్తం  \frac{{(n + 1)(n + 2)(n + 3) - 6}}{3}  అయితే, ఆ శ్రేఢిలోని 4వ పదం 

1) 20    2) 30    3) 40    4) 50

14. ఒకవేళ  a : b = 3 : 5, c : d = 4 : 7, b : c = 2 : 3 అయితే d : c : b : a =

1) 24 : 40 : 60 : 105    2) 7 : 4 : 3 : 5    3)5 : 3 : 4 : 7    4) 105 : 60 : 40 : 24

15. 10 కేజీల కల్తీ  బియ్యంలో 4% రాళ్ళు మరియ మిగిలిన భాగం బియ్యం ఉన్నాయి. రాళ్ళలో సగం తొలగించారు ఇపుడు దానిలో ఉన్న రాళ్ళ శాతం సుమారుగా 

1) 0.98    2) 1.02    3) 2.04    4) 1.98

16. {\rm{x, 4, 5(x < 4); 6, y, 10(6 < y < 10); 12, 16, z(z > 16)}} లు వరుసగా మూడు లంబకోణ త్రిభుజముల భుజములను సూచిస్తూ   {x^2}{\rm{, }}{{\rm{y}}^2}{\rm{, }}{{\rm{z}}^2}{\rm{  }}  ల కసాగు p_1^\alpha {\rm{ }}p_2^\alpha {\rm{ }}p_3^\alpha {\rm{ }} ఇక్కడ {p_1},{\rm{ }}{p_2},{\rm{ }}{p_3} లు ప్రధాన సంఖ్యలు అయితే ∝, β, γ ల యొక్క గ.సా.భా.

1) 6    2) 8    3) 2    4) 1

17. ఒక దుకాణదారుడు అతని వద్దనున్న వస్తువులన్నింటి కొన్నవెల పైన 25% ఎక్కువకు ప్రకటిత వెలను నిర్ణయించాడు. ఆ తరువాత ప్రకటిత వెలపై 10% తగ్గింపుతో ఆ వస్తువులను విక్రయించాడు, ఒక వస్తువు యొక్క కొన్నవెల 3,000 రూపాయలైతే అమ్మకం వెల (రూపాయలలో) 

1) 3,450    2) 3,360    3) 3, 900    4) 3,375

18. రామ్ తన పుట్టిన రోజున తమ బంధువుల నుండి బహుమతి రూపంలో 8,500 రూపాయలు పొందాడు. అతనిలో పొదుపు చేసే తత్వాన్ని పెంచడానికి అతని తాత గారు సాలీనా 20% బారు వడ్డీకి అతని సొమ్మును అప్పుగా ఇవ్వమని అడిగాడు. అతని తండ్రి సాలీనా 15% బారు వడ్డీతో అతని సొమ్మును తీసుకోవడానికి సిద్దమయ్యాడు. అతని పెద్దన్న సాలీనా 10% బారువడ్డీతో అతని సొమ్మును ఎంత మొత్తమైన అప్పుగా తీసుకుంటనన్నాడు. అయితే అతని తాత గారు 5,000 రూపాయలు మాత్రమే తీసుకోవడానికి ఆసక్తి కలిగి ఉన్నారు. మరియు అతని తండ్రి కొంత భాగం కాకుండా పూర్తి మాత్రమే తీసుకోవడానికి ఆసక్తి కలిగి ఉన్నాడు. రామ్ అతని బహుమతి మొత్తాన్ని అప్పుగా ఇచ్చేస్తే అతని తరువాత పుట్టిన రోజుకు అతను పొందగలిగే గరిష్ట మొత్తం 

1) 10,000    2) 9,775    3) 9,850    4) 9,950

19. x అనేది \sqrt {814968Xx} ధనపూర్ణంకం అయ్యేటట్టు ఉండే కనిష్ట ధనపూర్ణంకమైతే, x=

1) 231    2) 154    3) 924    4) 462

20. \frac{1}{2}{\rm{,  }}\frac{2}{3}{\rm{, }}\frac{4}{5}{\rm{, }}\frac{7}{8}{\rm{, }}\frac{5}{9}{\rm{ }} ఆనే భిన్నాలను వాటి విలువల యొక్క అవరోహణ క్రమములో ఎడమ నుండి కుడికి అమర్చినప్పుడు, ఎడమవైపు నుండి 4వ పదం మరియు కుడివైపు నుండి 5వ పదాల మొత్తం

1) \frac{{13}}{{10}}    2) \frac{{61}}{{45}}    3) \frac{{37}}{{24}}    4) \frac{{103}}{{72}}

21. ఒక అంక శ్రేఢిలో, 10వ పదం -14, 31వ పదం -119 అయితే 6వ పదం మరియు 8వ పదాల మొత్తం

1) 2    2) -5    3) 31    4) 0

22. \sqrt {142 + 116 \div \sqrt {841}  - \sqrt[3]{{2197}} \times {{(125)}^{1/3}}}  =

1) 25    2) 16    3) 9    4) 4

23. ఒక స్థిర క్రమంలో 5 ధన సంఖ్యలను వ్రాసారు. అప్పుడు మొదటి మూడు సంఖ్యల సగటు 12. మధ్యలోని మూడు సంఖ్యల సగటు 15. చివరి మూడు సంఖ్యల సగటు 18. అయితే మొదటి, మూడవ మరియు ఐదవ సంఖ్యల సగటు

1) 21    2) 9    3) 15    4) 16

24. \sum\limits_{x = 1}^{100} {\frac{1}{{\sqrt {x - 1}  + \sqrt x }} = }

1) 9    2) 10    3) \sqrt {99}    4) \sqrt {100}  - \sqrt 9

25. A, B, C అనే ముగ్గురు వ్యక్తుల వార్షిక ఆదాయాల మొత్తం 14,20,000 రూపాయలు. వార్తి ఆదాయంలో A, B, C లు వరుసగా 30%, 25%, 20% సామ్మును పొదుపు చేస్తారు. A, B, C ల వార్షిక పొదుపుల నిష్పత్తి 12: 13 : 10 అయితే, A యొక్క వార్షిక ఆదాయం (రూపాయలలో)

1) 4,20,000    2) 5,20,000    3) 5,00,000    4) 4,00,000

26) ఒక వ్యక్తి అతని ఆదాయంలో 75% ఖర్చు చేసేవాడు. తరువాత అతని ఖర్చు 24% మరియు ఆదాయం 15% పెరిగాయి. అయితే ప్రస్తుతం అతని పొదుపులో తరుగుదల శాతం

1) 22\frac{3}{4}\%    2) 12%    3) 20%    4) 19\frac{3}{{23}}\%

27) నాలుగు వరుస సరి సంఖ్యల మొత్తం 21500 వాటిలో కనిష్ట సంఖ్య 68xK అయితే K =

1) 79    2) 69    3) 89    4) 59

28) ఇద్దరు పురుషులు ఏడుగురు బాలురు ఒక పనిని 14రోజులలో చేయగలరు. అదే పనిని ముగ్గురు  పురుషులు, ఎనిమిది మంది బాలురు 11 రోజులలో పూర్తి చేయగలరు.  అదే పనిని ఎనిమిది మంది పురుషులు ఆరుగురు బాలురు పూర్తి చేయగలిగిన రోజుల సంఖ్య y. ఒక పురుషుని రోజు కూలీ, ఒక బాలుని రోజు కూలీకి మూడు రెట్లు అయితే, ఈ y  రోజులకు చెల్లించవలసిన కూలీ మొత్తం

1) 210 రోజులకు ఒక బాలునికి వచ్చే కూలికి సమానం

2) 70 రోజులకు ఒక బాలునికి వచ్చే కూలికి సమానం

3) 39 రోజులకు ఒక పురుషునికి వచ్చే కూలికి సమానం

4) 13రోజులకు ఒక బాలునికి వచ్చే కూలికి సమానం

29) ఒక వస్తువును అమ్మడం ద్యారా వచ్చిన లాభం, దాని అమ్మకపు ధరలో x% మరియు దాని కొన్న వెల దాని అమ్మకపు వెలలో y% అయితే x + y = 

1) 50    2) xy    3) 100    4) \frac{x}{y}

30) n వస్తువుల సగటు ఖరీదు 25 రూపాయలు. వేరే m వస్తువుల  సగటు ఖరీదు 19 రూపాయలు. ఈ (n + m) వస్తువుల సగటు ఖరీదు 23 రూపాయలు అయితే, అపుడు n : m =

1) 1 : 3    2) 5 : 1    3) 2 : 1    4) 1 : 2

31) కొంత సొమ్మును సంవత్సరానికి 7% చొప్పున 7 సంవత్సరాలకు గాను ఒక బ్యాంక్ A లో పెట్టుబడిగా పెట్టారు. 7 సంవత్సరాల తర్వాత బ్యాంక్ A నుండి పొందిన మొత్తం సొమ్మును,  2 సంవత్సరాలకు గాను 8% చొప్పున చక్రవడ్డీని ప్రకటించిన బ్యాంక్‌ B లో పెట్టుబడిగా పెట్టారు. బ్యాంక్‌ B  నుండి పొందిన వడ్డీ 15,496 రూపాయలైతే ప్రారంభంలో పెట్టుబడిగా పెట్టిన సొమ్ము

1) 57,500    2) 60,000     3) 62,500     4) 52,500

32) గత సంవత్సరం A, B, C ల ఆదాయాల నిష్పత్తి 6 : 5 : 4. A యొక్క గత సంవత్సర ఆదాయం మరియు ఈ సంవత్సర ఆదాయాల నిష్పత్తి 3 : 4. ఈ నిష్పత్తి B కి 3 : 5 మరియు ఈ నిష్పత్తి C కి 4 : 5. ఈ సంవత్సరం వారి ఆదాయాల మొత్తం 12,80,000 రూపాయలైతే C యొక్క గత సంవత్సరం ఆదాయంపై ఈ సంవత్సర ఆదాయంలో గల పెరుగుదల (రూపాయలలో)

1) 2,00,000    2) 1,20,000     3) 60,000     4) 1, 00,000

33) ఒకే రోజు ఉదయం 8 గంటలకు A నుండి B వైపునకు P మరియు B  నుండి A వైపునకు Q ప్రయాణిస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు వారిద్దరూ ఒకరినొకరు వారి దారిలో కలిశారు. ఈ సమయం నుండి A ను Q చేరడానికంటే  3\frac{1}{2}  గంటల ముందే B ను P చేరాడు. అయితే A ను Q చేరేటప్పటికి అయిన సమయం

1) రాత్రి 10     2) రాత్రి 9     3) రాత్రి 8     4) రాత్రి 7

34) \frac{{3\left( {\frac{2}{5}of\frac{5}{7}} \right) + \left( {5 \div \frac{2}{9} \times \frac{6}{5} + 1} \right){7^{ - 1}}}}{{\sqrt {289} }} =

1) \frac{3}{{17}}    2) \frac{2}{7}    3) \frac{{13}}{{17}}    4) \frac{{12}}{7}

35) ఒక వ్యక్తుల సమూహంలోని ప్రతి వ్యక్తి యొక్క సామర్ధ్యమూ ఒక్కటే. ఒక పనిని ఈ క్రింది విధంగా చేయించారు. మొదటి రోజు ఒకే ఒకరితో, రెండవ రోజు కేవలం ఇద్దరితో, మూడవ రోజు కేవలం ముగ్గురితో మరియు. తరువాత వచ్చే రోజులకు ఈ విధానాన్నే అనుసరించారు. ఈ విధానాన్ని అనుసరించి K వ రోజు K మంది కలిసి పని చేశారు. ఈ నియమాన్ని అనుసరించి ఆ పనిని 15 రోజులలో పూర్తి చేశారు. అప్పుడు 15 మంది కలిసి ప్రతిరోజూ పని చేస్తే ఆ పని పూర్తి కావడానికి పట్టే రోజుల సంఖ్య

1) 10    2) 9    3) 6    4) 8

36) ఒక వ్యక్తి రెండు సంవత్సరాలకు ఒక బ్యాంక్‌ నుండి సంవత్సరానికి 10% చొప్పున చక్రవడ్డీకి  x రూపాయలను అప్పుగా తీసుకున్నాడు. మొదటి సంవత్సరాంతంలో 80,000 రూపాయలు మరియు రెండవ సంవత్సరాంతంలో 33,000 రూపాయలను చెల్లించడం ద్వారా వడ్డీతో పాటుగా మొత్తం సొమ్మును తీర్చి వేశాడు. అయితే x =

1) 80,000     2) 90,000     3) 1,21,000     4) 1,00,000

37) క్రింది వానిలో 881280 ని నిశ్చేషంగా భాగించేది ఏది ?

1) 7    2) 13    3) 19    4) 17

38) రోజుకు 18 గంటలు పని చేస్తూ 10 మంది వ్యక్తులు 16 రోజులలో ఒక పనిని పూర్తి చేయగలిగితే , ఆ పనిని 18 రోజులలో  రోజుకు 8 గంటలు చొప్పున పని చేస్తూ పూర్తి చేయడానికి కావలసిన వ్యక్తుల సంఖ్య

1) 15     2) 18     3) 16     4) 20

39) 5 మంది పరిశీలకులు x సమాధాన పత్రాలను రోజుకు 8 గంటల చొప్పున పని చేసి 7 రోజులలో మూల్యాంకనం చేయగలరు. 3x సమాధాన పత్రాలను 6 మంది పరిశీలకులు 14 రోజులలో మూల్యాంకనం చేయగలిగితే, రోజుకు వారు ఎన్ని గంటలు పని చేయవలసి ఉంటుంది ?

1) 9    2) 7    3) 10    4) 8

40) ఒకవేళ {3^{x + 1}} - {3^x} = 162 అయితే  {x^2} - 2x - 8 =

1) 0    2) 8    3) 3    4) 15

41) ఒక వ్యక్తి వద్ద మదుపు చేయడానికి ₹ 25,000 ఉన్నాయి. ఒక బ్యాంకులో రెండు స్కీములు ఉన్నాయి. స్కీమ్‌ A లో సంవత్సరానికి వడ్డీ రేటు 12% స్కీమ్‌ B లో సంవత్సరానికి వడ్డీ రేటు 16%.  స్కీమ్‌ A  లో సాలీనా చక్రవడ్డీనీ, స్కీమ్‌ B లో బారువడ్జీని చెల్లిస్తారు. స్కీమ్‌ A లో 2 సంవత్సరాలకు అతని సొమ్మును పెట్టుబడి పెడితే వచ్చే మొత్తానికి సమానంగా ఉండే మొత్తం రావాలంటే, స్కీమ్‌ B లో అతని సొమ్మును ఎంత కాలం (సంవత్సరాలలో) పెట్టుబడి పెట్టాలి ?

1) 1.50     2) 2.15     3) 1.73     4) 2.05

42) ఒక పనిని స్వతంత్రంగా A మరియు B లు వరుసగా 10 మరియు 15 రోజులలో చేయగలరు. వారు కలిసి మూడు రోజులు పని చేసిన తర్వాత B కు బదులుగా C ని తీసుకున్నారు. ఆ పనిని A  మరియు C లు తదుపరి 4 రోజులలో పూర్తి చేశారు. A, B, C దినకూలీల మొత్తం 460 రూపాయలు. వారు ఎంత పని చేశారో దానికి అనుపాతంలో వారి దినకూలీ చెల్లిస్తే, పని పూర్తి చేయడంలో పొందే మొత్తం కూలి (రూపాయలలో)

1) 420     2) 1,120     3) 1,680     4) 960

43) 2\frac{1}{2},{\rm{  4}}\frac{1}{4},{\rm{  5}}\frac{1}{8} ల క. సా. గు \frac{a}{b}.  a, b ల మరియు గ. సా. భా. 1 అయిన ab = 

1) 3485    2) 6970    3) 9670    4) 7690

44) 1,29,000 రూపాయలను మూడు భాగాలుగా చేసి బారు వడ్డీకి ఈ క్రింది విధముగా అప్పుగా ఇచ్చారు. మొదటి భాగాన్ని సంవత్సరానికి 10% చొప్పున 6 సంవత్సరాలకు, రెండవ భాగాన్ని సంవత్సరానికి 12% చొప్పున 4 సంవత్సరాలకు మరియు మూడవ భాగాన్ని సంవత్సరానికి 15% చొప్పున 3 సంవత్సరాలకు అప్పుగా ఇచ్చారు. ఒక్కొక్క భాగంపై వచ్చిన వడ్డీ మొత్తం సమానంగా ఉంటే, మొదటి భాగం మరియు మూడవ భాగాల మొత్తం (రూపాయలలో)

1) 84,000    2) 81,000     3) 93,000     4) 89,000

45) ఆదాయపు పన్ను శాఖ సాలీనా మొతం ఆదాయంలో మొదటి 2 లక్షలకు 7% చొప్పున, 2 లక్షలకు మించిన సాలీనా ఆదాయంపై (R + 12)% చొప్పున పన్ను వసూలు చేస్తుంది. ఒక వ్యక్తి  చెల్లించిన మొత్తం పన్ను సాలీనా ఆదాయంలో (R + 5) శాతం. అతనికి  2 లక్షలకు మించిన సాలీనా ఆదాయంపై పన్ను 20,000 రూపాయలు అయితే, అతను చెల్లించిన మొత్తం (రూపాయలలో)

1) 32,000     2) 24,000     3) 25,000     4) 26,000

46) 9 మంది పురుషులు ఒక పనిని 10 రోజులలో పూర్తి చేయగలరు 12 మంది స్త్రీలు అదే పనిని 18 రోజులలో పూర్తి చేయగలరు. 15 మంది పిల్లలు అదే పనిని 24 రోజులలో పూర్తి చేయగలరు. 6 మంది స్త్రీలు మరియు 9 మంది పిల్లలు ఆ పనిని ప్రారంభించారు. 12 రోజులు పని చేసిన తరువాత వారు పనిని వదిలి వేశారు. అయితే మిగిలిన పనిని పూర్తి చేయడానికి 6 గురు పురుషులు మరియు 9 మంది పిల్లలకు కావలసిన రోజుల సంఖ్య

1) 16 రోజులు     2) 18 రోజులు     3) 12 రోజులు     4) 4 రోజులు 

47) A ఒక పనిని 10 రోజులలో పూర్తి చేయగలడు. B అదే పనిని 15 రోజులలోనూ మరియు C అదే పనిని 20 రోజులలోనూ పూర్తి చేయగలరు. వారు ఆ పనిని నాల్లవ వ్యక్తి D తో కలిసి 4 రోజులలో పూర్తి చేశారు మరియు ఆ మొత్తం పనికి గానూ 30,000 రూపాయలు వారికి చెల్లించబడింది. అయితే D యొక్క వాటా (రూపాయలలో)

1) 4,000     2) 16,000     3) 7,500     4) 1,000

48) ఒక వస్తువు యొక్క ప్రకటిత వెల దాని కొన్న వెల కంటే 15% ఎక్కువగా ఉంది. దానిని ఒక వినియోగదారునికి 20% తగ్గింపుతో విక్రయించాడు. అయితే తగ్గింపు ధరపై 5% జీఎస్టీ విధించారు. ఆ వినియోగదారుడు ఆ వస్తువును అతని పొరుగింటివానికి 20% లాభంతో 5796 రూపాయలకు ఇచ్చాడు. అయితే జీఎస్టీ లేకుండా వినియోగదారునికి ఆ వస్తువును అమ్మిన ధర (రూపాయలలో)

1) 5,000    2) 4,930    3) 4,600    4) 4,830

49) A, B, C అనే మూడు పాఠ్యాంశాలన్నింటిలో కలిపి ఒక విద్యార్థి 72% మార్కులు పొందాడు. ప్రతి పాఠ్యాంశంలోనూ గరిష్ట మార్కులు 75. A లో 63 మార్కులు పొందాడు. B లో 64% మార్కులు పొందాడు. అయితే C  లో అతను పొందిన మార్కులు

1) 68%    2) 51%    3) 66%    4) 62%

50) ఒక వృత్తాకార బాటపై ఇద్దరు వ్యక్తులు X మరియు Y వ్యాసాత్మకంగా ఎదురెదురుగా ఉన్నారు. X ధన దిశలో \upsilon  వేగంతోనూ, Y బుణ దిశలో 2\upsilon వేగంతోనూ ఒకేసారి పరుగు మొదలు పెట్టారు. వారు ఒకరినొకరు మొదటిసారి 2 నిమిషాల తర్వాత దాటారు. వారు పరుగు పెట్టడం మొదలు పెట్టినప్పటినుండి రెండవ సారి వారు ఒకరినొకరు దాటడానికి పట్టే సమయం నిమిషాలలో

1) 4    2) 2    3) 3    4) 6


TS SI Final Exam 2023 Question Paper with Key (Questions from 51 to 100)

TS SI Final Exam 2023 Question Paper with Key (Questions from 101 to 150)

TS SI Final Exam 2023 Question Paper with Key (Questions from 151 to 200)

TS SI Final Exam 2023 Official Answer Key (https://www.tslprb.in/)

TS Police Exams Previous Question Papers with Answer Key

Post a Comment

0Comments

Post a Comment (0)