📄 Telangana Police Constable Preliminary Exam 2018 - Q151 to Q200
Q151. English: The important geographical divisions in India are:
Telugu: భారతదేశంలో ప్రధాన భౌగోళిక విభజనలు :
- (1) Himalayas and Deserts
- (2) 29 States only
- (3) Himalayas, Ganga-Sindhu River Plain, Coastal Areas, Peninsular Plateau, Deserts and Islands.
- (4) Forests, Rivers, Mountains and Sea coasts
Q152. English: Which of the following is the key factor in social studies ?
Telugu: సాంఘిక శాస్త్రంలో చాలా కీలకమైన అంశం క్రింది వాటిలో ఏది ?
- (1) Forests
- (2) Technical problems
- (3) Development in Medical Sciences
- (4) Population
Q153. English: The formation of separate Telangana state was the result of Telangana people's long fight to get the following:
Telugu: ఈ క్రింది వాటిలో దేనిని పొందుట కొరకు తెలంగాణా ప్రజలు చేసిన సుదీర్ఘ పోరాటాల ఫలితంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రము ఏర్పడినది?
- (1) Water, Resources, Jobs
- (2) Education, Employment, Independence
- (3) Respect, Huge Wealth, Influence
- (4) Reservations, Jobs, Bank loans
Q154. English: The main reason for "Globalization" is:
Telugu: "ప్రపంచీకరణ ప్రక్రియ” కు ప్రధాన కారణము :
- (1) Gap between the rich and the poor
- (2) Political parties
- (3) Message-oriented films
- (4) Fast growing technological knowledge
Q155. English: What is the name of the system, developed by Richard Bandler and John Grinder, that seeks to educate people in self-awareness and effective communication, and to change their patterns of mental and emotional behaviour?
Telugu: 'స్వీయ అవగాహన మరియు సమర్థవంతమైన భావ ప్రసరణ కోసం, మానసిక మరియు భావోద్వేగ ప్రవర్తనా సరళులలో సరియైన అవగాహనను ప్రజలలో కల్పించుట కోసం' రిచర్డ్ బ్యాండ్లర్ మరియు జాన్ గ్రిండర్ పెంపొందించిన సిస్టమ్ యొక్క పేరు ఏమిటి ?
- (1) The power of positive thinking
- (2) Stress-reduction programme
- (3) Perspectives on personality
- (4) Neuro-Linguistic programming
Q156. English: Read the following statements:
a. Adults cannot develop emotional intelligence.
b. Emotional intelligence can be learnt and developed.
c. Adolescents cannot acquire emotional intelligence.
d. Emotional intelligence is broader than IQ.
Which of the above statements are correct?
Telugu: ఈ క్రింది వ్యాఖ్యలను చదవండి :-
a. వయోజనులు భావోద్వేగ ప్రజ్ఞ (ఎమోషనల్ ఇంటిలిజెన్స్) ను పెంపొందించుకోలేరు.
b. భావోద్వేగ ప్రజ్ఞను అభ్యసించవచ్చు, పెంపొందించుకోవచ్చు.
c. భావోద్వేగ ప్రజ్ఞను యుక్త వయస్కులు సాధించలేరు.
d. ఐ.క్యూ కన్నా భావోద్వేగ ప్రజ్ఞ పరిధి పెద్దది.
పైన ఇచ్చిన వ్యాఖ్యలలో ఏవి సరియైనవి ?
Options: (1) a and c | (2) c and d | (3) a and b | (4) b and d
Q157. English: "An average level of Intelligence Quotient (IQ) and high level of Emotional Intelligence is a formula for personal success". Who proposed this?
Telugu: "ఒక వ్యక్తి విజయానికి ప్రజ్ఞా లబ్ధి (IQ) సగటు (సాధారణ) స్థాయిలో, భావోద్వేగ ప్రజ్ఞ హెచ్చు (ఉన్నత) స్థాయిలో ఉండాలనే సూత్రాన్ని" (ఫార్ములా) ఎవరు ప్రతిపాదించారు?
- (1) William Bell
- (2) Thurston
- (3) Peter James
- (4) Daniel Goleman
Q158. English: Read the following statements:
(a) The ability to recognize one's own feelings and those of others.
(b) The inability to understand abstract concepts.
(c) The ability to understand mathematical formulas.
(d) The inability to understand technology.
Which of the above statement(s) is/are related to having 'Emotional Intelligence'?
Telugu: ఈ క్రింది వ్యాఖ్యలను చదవండి :
(a) మన స్వీయ భావనలను, ఇతరుల భావనలను గుర్తించే సామర్థ్యం కలిగి ఉండటం.
(b) అమూర్తీకృత భావనలను అవగాహన చేసుకోలేని అసమర్థత.
(c) గణిత సూత్రాలను అవగాహన చేసుకోగలిగే సామర్థ్యత.
(d) సాంకేతికతను అవగాహన చేసుకోలేని అసమర్థత.
పైన చెప్పబడిన వ్యాఖ్యలలో ఏది/ఏవి 'భావోద్వేగ ప్రజ్ఞ' కల్గి ఉండటానికి సంబంధించినది?
Options: (1) (a) and (d) | (2) (d) only | (3) (a) only | (4) (b) and (c)
Q159. English: Which one of the following skills is important for a satisfactory personal and professional life?
Telugu: సంతృప్తికరమైన వ్యక్తిగత మరియు వృత్తి జీవనానికి క్రింది నైపుణ్యములలో ఏది అవసరము ?
- (1) Professional skills
- (2) Technical skills
- (3) Educational skills
- (4) Social skills
Q160. English: Read the following statements:
a. Personal values define our character.
b. To love and to be loved is a basic need for humans.
c. The value system would never help people to be successful.
d. With spiritual values, we love the entire human race and care for them.
Which of the above statement(s) is / are correct?
Telugu: ఈ క్రింది వ్యాఖ్యలను చదవండి.
a. వ్యక్తిగత విలువలు మన యొక్క వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తాయి.
b. ప్రేమించటం మరియు ప్రేమించబడటము అనేవి మానవుల ప్రాథమిక అవసరము.
c. విలువల వ్యవస్థ అనేది ఎప్పుడూ కూడ మనుష్యులు విజయవంతము అవటానికి ఉపయోగపడదు.
d. ఆధ్యాత్మికత విలువల వలన మనము మొత్తం మానవ జాతిని ప్రేమించి వారి బాగోగుల గురించి పాటుబడతాము.
పైన చెప్పబడిన వ్యాఖ్యలలో ఏది/ఏవి నిజము ?
Options: (1) a, c and d | (2) b and c | (3) a and c | (4) a, b and d
Q161. English: Which of the following comes under professional ethics?
Telugu: ఈ క్రింది వాటిలో ఏది వృత్తి ధర్మము క్రిందకు వస్తుంది?
- (1) Always supporting the employer only.
- (2) Always supporting the co-workers only.
- (3) Giving much importance to personal benefits.
- (4) Having a sense of commitment to the job.
Q162. English: What is the difference between sympathy and empathy?
Telugu: సానుభూతికి మరియు పరానుభూతికి ఉన్న తేడా ఏమి ?
- (1) Sympathy means feelings of pity and sorrow for other's misfortune; Empathy means the ability to understand and share the feelings of another.
- (2) Sympathy is a verb and Empathy is a conjunction.
- (3) Sympathy is positive whereas Empathy is negative.
- (4) Sympathy means the ability to understand and share the feelings of another; Empathy means feelings of pity and sorrow for other's misfortune.
Q163. English: In our traditional family system, sons are preferred over daughters by many people because of one of the following reasons:
Telugu: ఈ క్రింది వాటిలో ఏ కారణము వలన సాంప్రదాయ కుటుంబ వ్యవస్థలో అమ్మాయిలకంటే అబ్బాయిలే కావాలి అని ఎక్కువమంది కోరుకుంటారు ?
- (1) Dowry might have to be given to daughters.
- (2) Daughters pave the way to heaven.
- (3) It is a government policy.
- (4) Sons are handsome than daughters.
Q164. English: 'Vertical Social Mobility' refers to:
Telugu: 'వర్టికల్ సోషల్ మొబిలిటి' అంటే :
- (1) the movement of an individual or people or groups from one status to another
- (2) an agitation against caste system
- (3) people's migration
- (4) conversion of religions
Q165. English: The Untouchability (Offences) Act, 1955 was renamed as "The Protection of Civil Rights Act" in which year?
Telugu: అస్పృశ్యతా నివారణ చట్టం, 1955 ను "పౌరహక్కుల సంరక్షణ చట్టము" గా పేరు మార్చబడిన సంవత్సరము ఏది ?
- (1) 1966
- (2) 1976
- (3) 1967
- (4) 1956
Q166. English: Who among the following Greek Philosophers considered ethics a practical rather than a theoretical subject ?
Telugu: ఈ క్రింది గ్రీకు వేదాంతులలో ఎవరు నైతిక విలువలను సిద్ధాంతపరమైనది గాకుండా ప్రయోగాత్మకమైన విషయముగా భావించారు?
- (1) Aristotle
- (2) Epicurus
- (3) Pleny
- (4) Socrates
Q167. English: The name of the Act, introduced to check atrocities against SCs and STs:
Telugu: SCలు మరియు STల మీద దౌర్జన్యమునకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టబడిన చట్టము పేరు :
- (1) SC & ST Communities Act, 1962
- (2) Prevention of Atrocities Act, 2000
- (3) Scheduled Castes and Scheduled Tribes (Prevention of Atrocities) Act, 1989.
- (4) Protection of SCs and STs Act, 1950
Q168. English: Read the following statements:
a. Article 15 of Indian Constitution provides equal rights and opportunities to all the citizens without any discrimination.
b. Under Article 19(1)(f) / 19(5), the tribals can own property and enjoy it in any part of the country.
c. Reservation in employment is made for the tribals under Article 16(4), 330, 332 and 335.
d. Article 338 empowers the President of India to appoint a Commissioner to look after the tribal welfare activities.
Which of the above statement(s) are correct?
Telugu: ఈ క్రింది వ్యాఖ్యలను చదవండి :
a. ఏ వివక్షత లేకుండా పౌరులందరికీ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 15 సమాన హక్కులు, అవకాశాలను ఇస్తుంది.
b. ఆదివాసీలు దేశంలోని ఏ భాగంలోనైనా ఆస్తిని కొనవచ్చు, అనుభవించవచ్చు.
c. ఆదివాసీలకు ఉద్యోగంలో రిజర్వేషన్లు ఇవ్వబడ్డాయి.
d. ఆర్టికల్ 338 ప్రకారం, ఆదివాసీల సంక్షేమ కార్యక్రమాలను పర్యవేక్షించడానికి భారత రాష్ట్రపతికి ఒక కమీషనర్‌ను నియమించే అధికారం ఉంది.
పైన ఉన్న వ్యాఖ్యలలో ఏవి సరైనవి ?
Options: (1) b and c only | (2) b, c and d only | (3) a, b and c only | (4) a and d only
Q169. English: Majority of the SCs are not able to make use of the constitutional provisions guaranteed to them because they are still:
Telugu: ఎస్.సీ. లు చాలామంది వారికి రాజ్యాంగం హామీ ఇచ్చిన నిబంధనలు ఉపయోగించుకోవటం లేదు. దీనికి కారణం :
- (1) not part of voters' list
- (2) the believers of fate
- (3) illiterate and ignorant
- (4) live in forests or hill stations
Q170. English: Reservations as per 73rd and 74th Constitutional Amendment have facilitated:
Telugu: భారత రాజ్యాంగ చట్టానికి 73వ, 74వ సవరణల ద్వారా, రిజర్వేషన్ల పరంగా ఈ క్రింది వాటిలో ఏది సాధ్యమయినది ?
- (1) Women entering Gram Panchayats and Municipalities.
- (2) Increase in the number of women in Industrial sector.
- (3) Increase in the number of Dalit women writers.
- (4) Increase in women's literacy rate.
Q171. English: Who among the following tribes in Telangana celebrates the festival of Theej?
Telugu: తెలంగాణలో ఏ గిరిజన తెగవారు తీజ్ పండుగను జరుపుకొందురు?
- (1) Banjaras
- (2) Koyas
- (3) Gonds
- (4) Kolams
Q172. English: During the period of Burgula Ramakrishna Rao as Chief Minister, a judicial inquiry was instituted by the government to examine the implementation of Mulki rules. Who among the following conducted the enquiry?
Telugu: బూర్గుల రామకృష్ణ రావు ముఖ్యమంత్రిగా నున్న కాలంలో ముల్కీ నిబంధనల అమలు పరచడంలోని నియమాలపై ప్రభుత్వం ఒక న్యాయ విచారణను జరిపించింది. ఈ క్రింది వారిలో ఆ విచారణను జరిపినది ఎవరు ?
- (1) O. Chinnappa Reddy
- (2) Pingali Jaganmohan Reddy
- (3) O. Pulla Reddy
- (4) K.V. Ranga Reddy
Q173. English: Assertion (A): The people of Andhra region started "Jai Andhra Movement" as they thought Mulki rules were against them.
Reason (R): In 1972 the Supreme Court upheld the Mulki rules as constitutional.
Telugu: ప్రతిపాదన (A): ఆంధ్ర ప్రాంతంలోని ప్రజలు ముల్కి నిబంధనలు తమకు వ్యతిరేకకరమైనవని “జై ఆంధ్ర ఉద్యమాన్ని" ప్రారంభించారు.
కారణం (R): 1972 లో సుప్రీం కోర్టు ముల్కి నిబంధనలు రాజ్యాంగపరంగా సక్రమమేనని ప్రకటించింది.
Options: (1) (A) is true but (R) is false. | (2) (A) is false but (R) is true. | (3) Both (A) and (R) are true and (R) is the correct explanation of (A). | (4) Both (A) and (R) are true but (R) is not the correct explanation of (A).
Q174. English: The Parakala massacre that occurred on 2nd September 1947 is often said to be another Jallianwala Bagh incident. What was the aim of the protestors at Parakala ?
Telugu: 1947 సెప్టెంబరు 2 వ తేదీ జరిగిన పరకాల మారణహోమం జలియన్ వాలాబాగ్ ఉదంతంతో పోల్చదగింది. పరకాల ఉద్యమకారుల ధ్యేయమేమి?
- (1) To hoist the National Flag.
- (2) To boycott the foreign cloth.
- (3) To protest against the Nizam.
- (4) To protest against the British dominance.
Q175. English: Who among the following gave the features of the Telangana Thalli Statue ?
Telugu: ఈ క్రింది వారిలో 'తెలంగాణ తల్లి' విగ్రహానికి రూపురేఖలను ఇచ్చిందెవరు?
- (1) B. Venkataramana Chari
- (2) Yekka Yadagiri Rao
- (3) Goreti Venkanna
- (4) K.V. Ramana Chari
Q176. English: Match the following folk songs with those who sang/wrote them:
a. Amma Telangana, Podusthuna Poddu meeda – iii. Gaddar
b. Nageti Sallalla Na Telangana – iv. Pasunuri Ravinder
c. Jai Kottu Telangana – ii. Nandini Sidda Reddy
d. Osmania Campus lo Udayinchina Kiranama – i. Abhinaya Srinivas
Telugu: క్రింది జానపద పాటలను వాటిని రచించిన/పాడిన కవులు/గాయకులను జతపరచుము:
a. అమ్మ తెలంగాణ పొడుస్తున్న పొద్దు మీద – iii. గద్దర్
b. నాగేటి సాళ్లల్ల నా తెలంగాణ – iv. పసునూరి రవీందర్
c. జై కొట్టు తెలంగాణ – ii. నందిని సిద్దా రెడ్డి
d. ఉస్మానియా క్యాంపస్‌లో ఉదయించిన కిరణమా – i. అభినయ శ్రీనివాస్
Options: (1) a-iii, b-ii, c-iv, d-i | (2) a-iii, b-iv, c-i, d-ii | (3) a-iii, b-iv, c-ii, d-i | (4) a-iv, b-ii, c-iii, d-i
Q177. English: During the Telangana peasants armed struggle, the communists, in order to motivate the people and to improve the political understanding, started recruiting willing youth. What was the name of this youth force ?
Telugu: తెలంగాణ రైతు సాయుధ పోరాటంలో గ్రామీణ ప్రజలలో రాజకీయ అవగాహనకు, విప్లవం వైపు ఆకర్షించడానికి కమ్యూనిస్టులు యువకులను సంఘటిత పరచారు. ఈ యువ శక్తి సంస్థకు ఏమని పేరు?
- (1) Guerilla Armed Squads
- (2) Free Will Contingents
- (3) Destruction Contingents
- (4) Self Protection Squads
Q178. English: Match the following places in Telangana with the traditional products in those places:
a. Siddipet – iii. Gollabhama Sarees
b. Korutla – iv. Paper Making
c. Chandampeta – ii. Pearls Boring
d. Metpalli – i. Khaddar
Telugu: తెలంగాణలోని క్రింది ప్రాంతాలను అచ్చటి సాంప్రదాయక ఉత్పత్తులతో జతపరచుము:
a. సిద్దిపేట – iii. గొల్లభామ చీరలు
b. కోరుట్ల – iv. కాగితం తయారీ
c. చందం పేట – ii. ముత్యాలకు రంధ్రాలు వేయుట
d. మెట్ పల్లి – i. ఖద్దర్
Options: (1) a-iii, b-iv, c-ii, d-i | (2) a-iii, b-i, c-ii, d-iv | (3) a-ii, b-iv, c-i, d-iii | (4) a-iv, b-ii, c-iii, d-i
Q179. English: Which of the following was the main aim of the Sansad Yatra Agitation?
Telugu: సన్సద్ యాత్ర ప్రధాన ఉద్దేశ మేది?
- (1) To do Satyagraha protest when the Parliament session was taking place.
- (2) To march to the house of the Chief Minister in Hyderabad.
- (3) To march to Jantar Mantar in Delhi.
- (4) To attack Assembly Hall in public gardens.
Q180. English: Who among the following was the Chairperson of the Congress Core Committee which resolved to divide Andhra Pradesh?
Telugu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించడానికి తీర్మానించిన కాంగ్రెస్ కోర్ కమిటీకి, ఈ క్రింది వారిలో అధ్యక్షులు ఎవరు ?
- (1) Sonia Gandhi
- (2) P. Chidambaram
- (3) Pranab Mukherjee
- (4) Manmohan Singh
Q181. English: Assertion (A): The Mulki regulations were openly violated after the accession of Hyderabad State into Indian Union in 1948.
Reason (R): Many employees belonging to civil and police administration were brought to Hyderabad State from other states in the name of improving the law and order situation.
Telugu: ప్రతిపాదన (A): 1948 లో హైదరాబాదు భారతదేశంలో విలీనమైన పిదప ముల్కీ నిబంధనలను బహిరంగంగా ఉల్లంఘించడం జరిగింది.
కారణం (R): సివిల్, పోలీసు శాఖలకు చెందిన అనేక ఉద్యోగులను ప్రక్క రాష్ట్రాల నుండి ఇచ్చటి శాంతి భద్రతలు పెంపొందించు పేరుతో తీసుకొని రాబడిరి.
Options: (1) (A) is true but (R) is false. | (2) (A) is false but (R) is true. | (3) Both (A) and (R) are true and (R) is the correct explanation of (A). | (4) Both (A) and (R) are true but (R) is not the correct explanation of (A).
Q182. English: Arrange the following agitations in the sequence of their occurrence:
a. Million March | b. Sansad Yatra | c. Palle Palle Pattala Paiki | d. Sadak Bandh
Telugu: ఈ క్రింది పోరాటాలను అవి జరిగిన క్రమంలో అమర్చండి:
a. మిలియన్ మార్చి | b. సంసద్ యాత్ర | c. పల్లె పల్లె పట్టాల పైకి | d. సడక్ బంద్
Options: (1) c, a, d, b | (2) b, c, d, a | (3) a, d, c, b | (4) d, c, b, a
Q183. English: S. Jaipal Reddy as a student leader in 1968 led an agitation of Osmania University Students against the Chief Minister on the issue of the Vice Chancellor's (V.C.) appointment. Who at that time was the V.C. of Osmania University ?
Telugu: 1968 సంవత్సరంలో విద్యార్థి నాయకుడిగా ఎస్. జైపాల్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులతో అప్పటి ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా, వైస్ ఛాన్సలర్ నియామకానికి సంబంధించిన విషయంపై ఉద్యమాన్ని నడిపాడు. అప్పటి ఉస్మానియా విశ్వవిద్యాలయం వి.సి. ఎవరు ?
- (1) D.S. Reddy
- (2) P.M. Reddy
- (3) Ravada Satyanarayana
- (4) Pinnamaneni Narasimha Rao
Q184. English: The Government of India formed the States Reorganisation Commission (SRC) in December 1953. Who among the following was not connected with the commission ?
Telugu: 1953 డిసెంబరులో భారత ప్రభుత్వం రాష్ట్రాల పునర్విభజన కమీషన్‌ను (ఎస్.ఆర్.సి.) నియమించింది. క్రింది వారిలో, కమీషన్‌తో సంబంధము లేని వారెవరు?
- (1) Justice Bhargava
- (2) Saiyid Fazal Ali
- (3) H.N. Kunzru
- (4) K.M. Panikkar
Q185. English: In 1971 election, the Telangana Praja Samithi (T.P.S.) contested and won 11 out of 14 seats for Parliament. Under whose leadership T.P.S. was formed ?
Telugu: 1971 ఎన్నికలలో తెలంగాణ ప్రజాసమితి (టి.పి.ఎస్.) 14 స్థానాలకు 11 స్థానాలు గెలుచుకునింది. టి.పి.ఎస్ ఎవరి ఆధ్వర్యంలో ఏర్పాటయింది?
- (1) K.V. Ranga Reddy
- (2) Madan Mohan
- (3) P.V. Narasimha Rao
- (4) Marri Chenna Reddy
Q186. English: In 1950 Hyderabad State Cabinet appointed a committee to make suggestions for reorganization of administrative and economic system in the state. Name the Chairman of that committee:
Telugu: 1950 లో హైదరాబాదు రాష్ట్ర క్యాబినెట్ పరిపాలన, ఆర్థిక రంగాలలో పునర్వ్యవస్థీకరణకై సలహాలను యిచ్చుటకు ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీకి అధ్యక్షుడెవరు?
- (1) Digambar Rao Bindu
- (2) J.P.L. Gwinn
- (3) V.P. Menon
- (4) A.D. Gorwala
Q187. English: Who among the following introduced the Andhra Pradesh Re-organisation Bill-2013 in the Parliament?
Telugu: ఈ క్రింది వారిలో పార్లమెంటులో “ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు- 2013" ను ప్రవేశ పెట్టినదెవరు?
- (1) Sushil Kumar Shinde
- (2) A.K. Anthony
- (3) Manmohan Singh
- (4) P. Chidambaram
Q188. English: Which of the following statements was not true regarding the Andhra Pradesh Re-organisation Act-2014?
Telugu: క్రింది ప్రవచనములలో ఏది ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం - 2014, నకు సంబంధించి సరైనది కాదు ?
- (1) Amaravathi as capital for Andhra Pradesh.
- (2) A.P. and Telangana to have powers to change boundaries of districts.
- (3) To have a common Governor for both the States.
- (4) Andhra Pradesh to have districts mentioned in Section - 3.
Q189. English: Who among the following led the Mulki Agitation in 1952-53 with the slogan "Idly Sambar Go Back"?
Telugu: 1952-53 లో 'ఇడ్లీ సాంబార్ గో బ్యాక్' అనే నినాదంతో జరిగిన ముల్కి ఉద్యమాన్ని, క్రింద పేర్కొన్న వారిలో ఎవరు నడిపించారు ?
- (1) Intellectuals
- (2) Lawyers
- (3) Peasants
- (4) Students
Q190. English: The then Chief Minister N.T. Rama Rao appointed the three member committee with Jayabharata Reddy as the convener to report on which of the following aspects in Telangana ?
Telugu: అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టి. రామారావు, జయభారత్ రెడ్డిని త్రిసభ్య కమిటీకి కన్వీనరుగా నియమించి, తెలంగాణాకు సంబంధించిన ఏ అంశంపై అధ్యయనము చేయమన్నాడు?
- (1) The census of government employees
- (2) Utilisation of temple lands
- (3) Irrigational facilities
- (4) Industrial progress
Q191. English: Who among the following depicted the Telangana way of life through his paintings?
Telugu: ఈ క్రింది వారిలో ఎవరు తెలంగాణ జీవన విధానాన్ని తన చిత్రలేఖనాలలో ప్రతిబింబింప చేశారు?
- (1) B.V.R. Chari
- (2) Midde Ramulu
- (3) Kanta Rao
- (4) K. Lakshman Goud
Q192. English: After Ramachandra Reddy of Pochampalli donated land for Bhoodan Movement, Vinoba Bhave constituted a three member committee for judicious distribution of lands among the poor. Who among the following was a member in that committee ?
Telugu: పోచంపల్లిలో రామచంద్రా రెడ్డి భూదాన్ ఉద్యమానికి భూమి ఉచితంగా ఇచ్చిన తర్వాత, సేకరించిన భూములను క్రమబద్ధంగా బీదలకు పంచడానికై వినోభా భావే ఒక కమిటీని నియమించాడు. ఈ క్రింది వారిలో ఆ కమిటీ సభ్యుడెవరు?
- (1) S. Yaganti
- (2) D. Lakshman Rao
- (3) V. Veerabhadram
- (4) Ummethala Kesava Rao
Q193. English: During whose administration in Hyderabad, Telugu and English languages replaced Urdu which hitherto was the State language?
Telugu: ఎవరి పరిపాలన క్రింద హైదరాబాదులో అంతవరకు అధికార భాషగా కొనసాగిన ఉర్దూ బదులు తెలుగు, ఇంగ్లీషు భాషలు ప్రవేశ పెట్టబడినాయి ?
- (1) K.M. Munshi
- (2) Burgula Ramakrishna Rao
- (3) J.N. Choudhary
- (4) M.K. Vellodi
Q194. English: Who among the following was the Vice-President of Telangana Praja Samiti during 1969 Telangana Movement?
Telugu: 1969 తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ ప్రజా సమితి ఉపాధ్యక్షులు ఎవరు?
- (1) Madan Mohan
- (2) Sumitra Devi
- (3) Konda Laxman Bapuji
- (4) Sada Laxmi
Q195. English: Which among the following was not part of the Gentlemen's Agreement ?
Telugu: క్రింది వాటిలో పెద్ద మనుషుల ఒప్పందంలో భాగం కానిది ఏది ?
- (1) Telangana students had 3:1 share in educational institutions.
- (2) Surplus revenue from Telangana to be spent for its own development.
- (3) Continued Mulki rules in government jobs.
- (4) Sale of landed property was controlled by Telangana Regional Council.
Q196. English: When the Telangana Political Joint Action Committee with all pro-Telangana Parties was formed with Prof. Kodanda Ram as the convener, which of the following parties did not join in it?
Telugu: తెలంగాణకు మద్దతు గల రాజకీయ పార్టీలతో ప్రొ. కోదండరామ్ కన్వీనర్‌గా ఏర్పడిన తెలంగాణ రాజకీయ జాయింట్ యాక్షన్ కమిటీలో చేరని రాజకీయ పార్టీ ఏది ?
- (1) C.P.I. (M)
- (2) T.R.S.
- (3) Congress
- (4) T.D.P.
Q197. English: On December 28, 2012 U.P.A. government convened an All Party Meeting in Delhi on Telangana. Match the following parties with their leaders:
a. Congress – iv. Suresh Reddy & Gade Venkata Reddy
b. Y.S.R.C.P. – iii. Mysora Reddy & K.K. Mahendra Reddy
c. C.P.I. – i. K. Narayana & Gunda Mallesh
d. C.P.M. – ii. Raghavulu & Julakanti Ranga Reddy
Telugu: 2012 డిసెంబరు 28 వ తేదీ యు.పి.ఎ ప్రభుత్వం తెలంగాణ విషయంగా ఒక అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. క్రింద తెలిపిన పార్టీలు, వాటి నాయకులతో జతపరచుము:
a. కాంగ్రెసు – iv. సురేష్ రెడ్డి & గాదె వెంకటరెడ్డి
b. వై.ఎస్.ఆర్.సి.పి. – iii. మైసూర్ రెడ్డి & కె.కె. మహీంద్ర రెడ్డి
c. సి.పి.ఐ. – i. కె. నారాయణ & గుండా మల్లేష్
d. సి.పి.ఎం. – ii. రాఘవులు & జూలకంటి రంగారెడ్డి
Options: (1) a-iii, b-iv, c-ii, d-i | (2) a-i, b-iii, c-iv, d-ii | (3) a-ii, b-iv, c-iii, d-i | (4) a-iv, b-iii, c-i, d-ii
Q198. English: Who among the following carved the 'Gun Park Martyrs Stupam' at Hyderabad in memory of those killed during 1969 agitation?
Telugu: 1969 ఉద్యమంలో అమరులైన వారి జ్ఞాపకార్థం హైదరాబాదు లోని 'గన్ పార్క్ స్మారక స్థూపాన్ని' రూపొందించిన శిల్పి ఎవరు ?
- (1) B. Venkataramana Chari
- (2) Ekka Yadagiri Rao
- (3) Pushpa Narayana
- (4) Ambati Surendra Raju
Q199. English: Which one of the following statements is true with regard to the All Party Accord that arrived in January, 1969 at the initiatives of the Chief Minister Brahmananda Reddy on Mulki rules ?
Telugu: ముఖ్యమంత్రి బ్రహ్మానంద రెడ్డి చొరవతో 1969 జనవరిలో కుదిరిన అఖిల పక్ష తీర్మానాలలో ముల్కీ నిబంధనల గురించి ఈక్రింది వాటిలో సరైన ప్రవచనం ఏది ?
- (1) Those who obtained jobs by using fake Mulki certificates were to be transferred.
- (2) G.O. No. 36 was issued to retain all Non-Mulki as Andhra employees.
- (3) Persons employed in Telangana against the Mulki rules were to be regularized.
- (4) Mulki rules were to be applied even to autonomous organisations besides government departments.
Q200. English: Assertion (A): There was great jubilation of the people of Telangana over the Supreme Court Judgement on the status of Hyderabad city.
Reason (R): In October 2009 the Supreme Court ruled that Hyderabad should be treated as 'Free Zone'.
Telugu: ప్రతిపాదన (A): హైదరాబాదు నగర హోదాపై సుప్రీం కోర్టు తీర్పు వెలువడిన వెంటనే తెలంగాణ ప్రజలు గొప్ప ఆనందోత్సాహాలతో పరవశించారు.
కారణం (R): 2009 అక్టోబర్‌లో సుప్రీం కోర్టు హైదరాబాదు "ఫ్రీ జోన్" గా వుంటుందని తీర్పు ఇచ్చింది.
Options: (1) (A) is true but (R) is false. | (2) (A) is false but (R) is true. | (3) Both (A) and (R) are true and (R) is the correct explanation of (A). | (4) Both (A) and (R) are true but (R) is not the correct explanation of (A).
No comments:
Post a Comment