Asaf Jahi Dynasty Lecture Notes

Asaf Jahi Dynasty (1724-1948): The Legacy of Hyderabad's Nizams

🏛️ Asaf Jahi Dynasty (1724–1948)

Hyderabad State   •   Deccan •   7 Nizams •   British India

Founder: Nizam-ul-Mulk (Mir Qamruddin Khan)  |  Capital: Hyderabad  |  Greatest Ruler: Mir Osman Ali Khan  |  Last Nizam: Mir Osman Ali Khan (VII)

Overview: The Asaf Jahi dynasty ruled the Deccan for over two centuries, from 1724 until the Police Action of 1948. Founded by Nizam-ul-Mulk after the decline of the Mughal Empire, the dynasty navigated complex politics with the Marathas, French, and British, while shaping the cultural and economic landscape of Hyderabad State.

క్రీ.శ. 1707లో ఔరంగజేబు మరణానంతరం మొగల్ సామ్రాజ్య బలహీనత ఆధారంగా దక్కన్ సుబేదారు అయిన నిజాం-ఉల్-ముల్క్ స్థాపించిన అసఫ్ జాహీ వంశ పరిపాలన భారతదేశ స్వాతంత్య్రనంతరం వరకు కొనసాగి, 1948లో 'పోలిసు చర్య'తో ముగిసింది. ఈ వంశం హైదరాబాద్ రాజ్యాన్ని సుసంపన్నం చేసింది, అద్భుతమైన వారసత్వాన్ని మిగిల్చింది.

  • స్థాపకుడు : నిజాం ఉల్ ముల్క్
  • రాజధాని : హైద్రాబాద్
  • గొప్పవాడు : మీర్ ఉస్మాన్ అలీఖాన్
  • చివరివాడు : మీర్ ఉస్మాన్ అలీఖాన్ (7వ నిజాం)

👑 రాజకీయ చరిత్ర

నిజాం ఉల్ ముల్క్ (1724-1748)

  • ఇతని అసలు పేరు - మీర్ ఖమ్రుద్దీన్ ఖాన్
  • 1724 సం॥లో షకర్ ఖేడా యుద్ధంలో ముబారిజ్ ఖాన్ను నిజాం-ఉల్-ముల్క్ ఓడించి అసఫ్ జాహీ రాజ్యం స్థాపించాడు.
  • బిరుదులు - చిన్ కిలిచ్ ఖాన్ (ఔరంగజేబు ఇచ్చాడు), ఫతేజంగ్, నిజాం ఉల్ ముల్క్ (ఫరూఖ్ సియార్), అసఫ్ జా.
  • 1728 పాల్కేడ్ వద్ద మరాఠా పీష్వా అయిన బాజీరావు 1 చేతిలో ఓడి ముషిగావ్ సంధి చేసుకున్నాడు.
  • ముషిగావ్ సంధి ప్రకారం మరాఠాలకు చౌత్ (1/4), సర్దేశ్ ముఖ్ (1/10) పన్నులను చెల్లించారు.
  • 1738 మహ్మద్ షా ఆదేశంతో మరాఠాలపై దండెత్తి భోపాల్ యుద్ధంలో ఓడిపోయి 'దుర్రాసరాయి సంధి' చేసుకున్నాడు.
  • 1748 సం॥ ఢిల్లీకి వెళుతూ బుర్హాన్పూర్ వద్ద మరణించాడు.

నాజర్జంగ్ (1748-50)

  • బ్రిటీష్ వారి సహాయంతో నాజర్జంగ్ సింహాసనం ఎక్కాడు.
  • నాజర్ జంగ్కి మేనల్లుడు ముజఫర్ జంగ్ వారసత్వ యుద్ధం మొదలైంది.
  • ఫ్రెంచి వారి కుట్ర కారణంగా నాజర్ జంగ్ను కర్నూలు నవాబు హిమ్మత్ ఖాన్ హత్య చేశాడు.
  • బిరుదు - నిజాం ఉద్దేలా

ముజఫర్ జంగ్ (1750-51)

  • ఫ్రెంచి గవర్నర్ డూప్లే దక్కన్ సుబేదార్ ముజఫర్ జంగ్ను ప్రకటించాడు.
  • ఇతను అసఫ్ జాహీ వంశస్థుడు కాదు.
  • ముజఫర్ జంగ్ 1750లో ఫ్రెంచివారికి ఇచ్చిన ప్రాంతాలు - మచిలీపట్నం, యానం, కరైకల్
  • ముజఫర్ జంగ్ డూప్లేకి ఇచ్చిన బిరుదు - జఫర్జంగ్
  • 1751 సం॥లో పాండిచ్చేరి నుండి ఔరంగాబాద్ వెళుతున్నప్పుడు కడప జిల్లా రాయచోటిలో లక్కిరెడ్డిపల్లి వద్ద కడప నవాబు హిమ్మత్ ఖాన్ ముజఫర్ జంగ్ను హతమార్చాడు.

సలాబత్ జంగ్ (1751–61)

  • ముజఫర్ జంగ్ హత్యానంతరం ఫ్రెంచి అధికారి బుస్సీ సలాబత్ జంగ్ను హైదరాబాద్ నవాబుగా ప్రకటించాడు.
  • 1752 సం॥లో ఉత్తర సర్కారులు ఫ్రెంచివారికి బహుమానంగా ఇచ్చాడు.
  • ఫ్రెంచి సైన్యాల పోషణకు నిజాంపట్నం, కొండవీడు, నరసాపురం ప్రాంతాలు ఇచ్చాడు.
  • కర్నాటక యుద్ధంలో ఫ్రెంచివారు బ్రిటీష్వారి చేతిలో ఓడిపోగా 1759లో బ్రిటీష్ వారితో సంప్రదింపులు జరిపి వారికి మచిలీపట్నం, నిజాంపట్నం, కొండవీడు వక్కర్ మన్నార్ ప్రాంతాలు ఇచ్చాడు.
  • 1761 సం॥లో సలాబత్ జంగ్ను బీదర్ కోటలో బంధించి నిజాం అలీఖాన్ తానే పాలకుడు అని ప్రకటించుకున్నాడు.

నిజాం అలీఖాన్ (1761-1803)

  • ఇతనిని రెండవ అసఫ్ జా అంటారు.
  • ఇతని కాలం నుండి అసఫ్ జాహీలు నిజాంలుగా పిలువబడ్డారు.
  • 1770 సం॥ రాజధాని ఔరంగాబాద్ నుండి హైదరాబాద్కు మార్చాడు.
  • ఉత్తర సర్కారుల విషయంలో నిజాం అలీకి, ఆంగ్లేయులకు మధ్య దుబాషి (మధ్యవర్తిగా) - కాండ్రేగుల జోగిపంతులు
  • 1766 సం॥ ఉత్తర సర్కారులు బ్రిటీష్ వారి ఆధీనంలోకి వచ్చాయి.
  • గుంటూరు బసాలత్ జంగ్ ఆధీనంలో ఉంది. 1788 సం॥లో బసాలత్ జంగ్ మరణం తర్వాత బ్రిటీష్ వారి ఆధీనంలోకి వెళ్ళింది.
  • 3వ ఆంగ్లో మైసూరు యుద్ధంలో సహాయం చేసినందుకు బ్రిటీష్వారు కడప, బళ్ళారి ప్రాంతాలను నిజాం అలీఖాన్కి ఇచ్చాడు.
  • 1798 సం॥ లార్డ్ వెల్లస్లీ ప్రవేశ పెట్టిన సైన్య సహకార పద్ధతిలో చేరిన మొదటిరాజు - నిజాం అలీఖాన్
  • సైన్య సహకార పద్ధతిలో నిజాం అలీఖాన్ ఆమోదించి బ్రిటీష్ సైనికుల పోషణకు దత్తం చేశాడు- కడప, బళ్ళారి, అనంతపురం, కర్నూలు
  • బ్రిటీష్వారికి 4 ప్రాంతాలు దత్తం చేయడం వలన దత్తమండలాలు పేరు వచ్చింది.
  • నిజాం అలీఖాన్ 1798లో జేమ్స్ పాట్రిక్ బ్రిటీష్ రెసిడెంట్గా నియమించాడు.
  • నిజాం అలీఖాన్ 1803 సం॥ రెసిడెన్సీ భవనం నిర్మించాడు.
  • నిజాం అలీఖాన్ ఇతర నిర్మాణాలు - మోతీమహల్, గుల్షన్ మహల్, రోషన్ మహల్

సికిందర్ జా (1803 - 1826)

  • 3వ అసఫ్ జా బిరుదుతో రాజ్యానికి వచ్చాడు.
  • ఇతని పేరు మీద ఏర్పడిన నగరం సికింద్రాబాద్
  • ఇతని మంత్రి - మీర్ ఆలం
  • మీర్ ఆలం మరణం తర్వాత చందూలాల్ను పేష్కర్గా (ప్రధానిగా) నియమించాడు.
  • చందూలాల్ కర్నూలులో అహోబిలం దేవాలయం పునరుద్దరించాడు.
  • సికిందర్ పరిపాలనలో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టింది మెట్కాఫ్

నాసిరుద్దౌలా (1829-1857)

  • ఇతను 4వ అసఫ్జాగా రాజ్యానికి వచ్చాడు.
  • ఇతని కాలంలో జరిగిన సంఘటనలు- వహాబి ఉద్యమం, బేరారు దత్తత
  • వహాబీ ఉద్యమం యూరోపియన్లకు వ్యతిరేకంగా 1839 సం॥లో ప్రారంభించింది - సయ్యద్ అహ్మద్ బరేల్వి
  • హైదరాబాద్లో వహాబీ ఉద్యమానికి నాయకత్వం వహించింది ముబారిజ్ ఉద్దౌలా
  • నాయకత్వం వహించినందుకు ముబారిజుదౌలాను అరెస్ట్ చేసి గోల్కొండ కోటలో బంధించాడు.
  • 1843 ప్రధాని చందూలాల్ ప్రధాని పదవికి రాజీనామా చేయగా సిరాజ్ ఉల్ ముల్క్ ప్రధానిగా వచ్చాడు.
  • 1853లో గవర్నర్ జనరల్ డల్హౌసికీ మరియు నసీరుదౌలాకి మధ్య జరిగిన ఒప్పందం - బేరారు ఒప్పందం.
  • బేరారు ఒప్పందం ప్రకారం నాసీరుదౌలా బ్రిటీష్ కంటింజంట్ సైన్యాలకు ఇచ్చిన ప్రాంతాలు - బీరార్, రాయచూర్, ఉస్మానాబాద్
  • ఈ ప్రాంతాలు బ్రిటీష్ వారికి ఇవ్వడం అవమానంగా భావించి సిరాజుల్ ముల్క్ అనారోగ్యం పాలై మరణించాడు.
  • సిరాజుల్ ముల్క్ తర్వాత మీర్ తురాబ్ అలీఖాన్ (1వ సాలార్జంగ్) హైదరాబాద్ ప్రధాని అయ్యాడు.
  • 1857 మే 10న మీరట్లో సిపాయిల తిరుగుబాటు ప్రారంభం అయినపుడు హైదరాబాద్ నవాబ్ నాసిరుద్దౌలా
  • ఇతని కాలంలో తిరుగుబాటు చేసిన స్థానిక జమీందారులు - మునగాల జమీందార్ - జగన్నాధరావు; అమ్మపాలెం జమీందార్ - వెంకట నరసింహారావు

అఫ్జలుద్దౌలా (1857-1869)

  • 1857 తిరుగుబాటు సమయంలో బ్రిటీష్ వారికి మద్దతు పలుకుటకు నిర్ణయించింది - అఫ్జలుద్దౌలా, సాలార్జంగ్
  • ఈ కాలంలో బ్రిటీష్ రెసిడెన్సీపై దాడి చేసింది - తుర్రేబాజ్ ఖాన్.
  • సిపాయిల తిరుగుబాటు అణచినందుకు బ్రిటిష్వారు అఫ్జలుదౌలాకు ఇచ్చిన బిరుదు - స్టార్ ఆఫ్ ఇండియా
  • ప్రధాని సాలార్జంగ్ అఫ్జలుద్దౌలా పేరు మీద నాణాలు ముద్రించాడు.
  • ఇతని కాలంలో ఏర్పడిన శాఖలు - తపాలాశాఖ, కస్టమ్స్ శాఖ, అటవీశాఖ
  • బీరార్ ఒప్పందం ప్రకారం పొందిన ప్రాంతాలలో రాయచూర్, ఉస్మానాబాద్ ప్రాంతాలను తిరిగి హైదరాబాద్కు ఇచ్చారు.
  • 1869 సం॥ హైదరాబాద్ లో మొట్టమొదటి తపాళాబిళ్ళ ప్రవేశపెట్టబడింది.
  • చౌమహల్లా ప్యాలెస్ నిర్మాణం పూర్తి చేసింది - అఫ్జలుదౌలా

మీర్ మహబూబ్ అలీఖాన్ (1869-1911)

  • ఇతని సంరక్షకులు - సాలార్జంగ్, షంషుల్ ఉమ్రా
  • 3 సం॥ వయస్సులో హైదరాబాద్ నవాబుగా ప్రకటించబడ్డాడు.
  • ఇతనికి 18 సం॥ నిండిన తర్వాత గవర్నర్ జనరల్ రిప్పన్ హైదరాబాద్ కి వచ్చి అధికారాలు అప్పగించాడు.
  • హైదరాబాద్ సంస్థానాన్ని సందర్శించిన మొట్టమొదటి వైశ్రాయ్ లార్డ్ రిప్పన్
  • సాలార్జంగ్ మరణం తర్వాత అతని కుమారుడు మీర్ లాయక్ అలీ ‘2వ సాలార్జంగ్' బిరుదుతో ప్రధాని అయ్యాడు.
  • 2వ సాలార్జంగ్ రాజభాషగా పర్షియన్ భాష స్థానంలో ఉర్దూ భాషని ప్రవేశపెట్టాడు.
  • 1868లో ముల్కీ ఉద్యమం ప్రారంభం అయింది.
  • 1881 సం॥ చందారైల్వే సంఘటన ఇతని కాలంలో జరిగింది.
  • 1887 నిజాం కళాశాల ఏర్పాటు చేశారు.
  • మీర్ మహబూబ్ అలీఖాన్ 1893 సం॥ రాజ్యాంగపరమైన సంస్కరణలు ప్రవేశపెట్టిన రాజపత్రం - ఖానూన్-చా-ముబారిక్
  • ఇతని ప్రధాని వికారుద్దీన్ ఫలక్నామా ప్యాలెస్ నిర్మించారు.

మీర్ ఉస్మాన్ అలీఖాన్ (1911-1948)

  • 7వ అసఫ్ జా బిరుదుతో నిజాం పదవిని అలంకరించాడు.
  • 1911 సం॥లో 3వ సాలార్జంగ్ (మీర్ యూసఫ్ అలీఖాన్) ప్రధాని అయ్యాడు.
  • 1918లో ఉస్మానియా యూనివర్శిటీ ఏర్పడింది.
  • 1918 ఆగస్టు 28న ఉస్మానియా యూనివర్శిటీ ఆర్ట్స్ కళాశాల ప్రారంభం అయింది.
  • ఇతని కాలంలో తబ్లిక్ ఉద్యమం ప్రారంభమైంది.
  • తబ్లిక్ ఉద్యమానికి వ్యతిరేకంగా ఆర్యసమాజ్ శుద్ధి ఉద్యమం ప్రారంభించింది.
  • నిజాం ఉస్మాన్ అలీఖాన్ను ఇండియన్ డయ్యర్ అని వర్ణించింది బాలానాథ్
  • ఇతనికాలంలో 3వ సాలార్ జంగ్ 1918 సం॥లో సాలార్జంగ్ మ్యూజియం నిర్మించాడు.
  • ఉస్మాన్ అలీఖాన్ కాలంలో హైదరాబాద్ రాజ్యాన్ని ముస్లిం రాజ్యంగా మార్చే ప్రయత్నం ముమ్మరంగా సాగింది. దీనిలో భాగంగా కొన్ని ప్రాంతాల పేర్లు మార్చారు:
    • ఎలగందుల : కరీంనగర్
    • పాలమూరు : మహబూబ్ నగర్
    • ఇందూరు : నిజామాబాద్
    • మెతుకు : మెదక్
    • భువనగిరి : భోంగీర్
చెరువుపరిశ్రమలునిర్మాణాలు
ఉస్మాన్ సాగర్ (1920)దక్కన్ బటన్ ఫ్యాక్టరీ (1916)అసెంబ్లీ
హిమాయత్ సాగర్ (1927)వి.ఎస్.టి. (1919)జూబ్లీహాల్
నిజాంసాగర్దక్కన్ గ్లాస్ ఫ్యాక్టరీ (1927)సిటీ కళాశాల
అలిసాగర్నిజాం షుగర్ ఫ్యాక్టరీ (1937)హైకోర్ట్
రాయపల్లి చెరువుసిర్పూరు కాగిత పరిశ్రమ (1939)ఉస్మానియా హాస్పిటల్ (1919)
పాలేరు చెరువుగోల్కొండ సిగరెట్ ఫ్యాక్టరీ (1941)మొజంజాహి మార్కెట్
హైదరాబాద్ ఆల్విన్ మెటల్స్ (1942)అసఫ్ జా లైబ్రరీ (సెంట్రల్ లైబ్రరీ)

⚙️ సాలార్జంగ్ సంస్కరణలు - తెలంగాణ ఆధునికీకరణ

సాలార్జంగ్ అసలు పేరు మీర్ తురాబ్ అలీఖాన్. నాసిరుద్దౌలాతో పాటు, అఫ్జలుద్దౌలా, మీర్ మహబూబ్ అలీఖాన్ వద్ద ప్రధానిగా పని చేశాడు. ఇతని వ్యక్తిగత కార్యదర్శి - సయ్యద్ హుస్సేన్ బిల్ గ్రామి. ఇతని సంస్కరణలలో పరిపాలన, న్యాయ, విద్యా, ఆర్థిక సంస్కరణలు ముఖ్యమైనవి.

📌 పరిపాలన సంస్కరణలు

  • ఇతను రాజ్యాన్ని 5 సుభాలు, 17 జిల్లాలుగా విభజించాడు
  • సుభాలను జిల్లాలుగా, జిల్లాలను తాలూకాలుగా, తాలూకాలను గ్రామాలుగా విభజించాడు
  • సుభాకు అధికారి - సుబేదార్; జిల్లాకు - కలెక్టర్; తాలూకా - తహసిల్దార్
  • 1865 సం||లో తాలూకాదార్ల పని పర్యవేక్షణకు ఏర్పాటు చేసిన శాఖ : మజ్లిస్-ఇ-మల్-గుజారి
  • రెవెన్యూ, న్యాయ, పోలీసు మంత్రిత్వశాఖలను ఏర్పాటు చేశాడు.

💰 ఆర్థిక సంస్కరణలు

  • బ్రిటీష్ వారి వద్ద తీసుకున్న 50 లక్షల రూపాయల అప్పును రద్దు చేయించుకోగలిగాడు.
  • నాణెముల ముద్రణ కేంద్రం హైదరాబాద్ లో స్థాపించాడు.
  • ప్రాంతీయ ముద్రణాలయాలు - గద్వాల, నారాయణపేట
  • హలిసిక్కా అనే రూపాయిని ప్రవేశపెట్టాడు
  • 1864 రెవెన్యూ బోర్డుని ఏర్పాటు చేశాడు. 1865 సం||లో జిల్లా బంది విధానం అమలులోకి వచ్చింది.
  • 1867 సం||లో రెవెన్యూ బోర్డును రద్దు చేసి దాని స్థానంలో ఏర్పాటు చేసిన బోర్డు - సదర్ మహకమ-ఇ-మల్ గుజారి
  • ఇనాం భూములు రద్దు చేశాడు; రైత్వారి విధానం ప్రవేశపెట్టాడు.
  • 1875 'రెవెన్యూ సెటిల్మెంట్ డిపార్ట్మెంట్' ఏర్పాటు చేశాడు.

⚖️ న్యాయ సంస్కరణలు

  • 1862 సం||లో న్యాయ సెక్రటేరియట్ ఏర్పాటు చేశాడు.
  • సుప్రీంకోర్టు : మజ్లిస్-ఇ-మురఫా; హైకోర్టు : మహెకామా-ఇ-సదర్
  • ముస్లిం చట్టాలు : దారుల్-కాజి-కోర్ట్; క్రిమినల్ కోర్టు : ఫౌజ్ దారి అదాలత్
  • సివిల్ కోర్టులు : బుజుర్గ్ దివాని అదాలత్, కుర్ద్ దివాని అదాలత్

👮 పోలీస్ సంస్కరణలు

  • మహ్కమ-ఇ-కొత్వాల్ అనే పోలీస్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేశాడు.
  • ప్రతి జిల్లాకు ఒక ఎస్.పి.ని అనగా మహ్తమిమ్ను నియమించారు.
  • 1867 సం॥లో పోలీస్ మరియు రెవెన్యూ శాఖలు వేరు చేయబడ్డాయి.

🚂 రవాణా సంస్కరణలు

  • 1868 సం||లో హైదరాబాద్ నుండి షోలాపూర్ వరకు గ్రాండ్ ట్రంక్ రోడ్డు నిర్మించారు.
  • 1877 సం||లో బ్రిటీష్ వారు బకింగ్ హామ్ కాలువను కొమ్మనూర్ (కృష్ణా) - మద్రాస్ వరకు తవ్వారు.

📚 విద్యా సంస్కరణలు

  • 1870 - సిటీ హైస్కూల్ మరియు ఇంజనీరింగ్ కాలేజ్
  • 1872 - చాదర్ ఘాట్ హైస్కూల్
  • 1873 - మదర్సా-ఇ-ఆలియా (ప్రభువుల పిల్లల కోసం)
  • 1878 - మదర్సా-ఇ-ఐజా (రాజ కుటుంబికుల పిల్లల కొరకు)
  • 1881 - గ్లోరియా-గర్ల్స్ హైస్కూల్

🌟 ఇతర సంస్కరణలు

  • సాలార్జంగ్ హైదరాబాద్ లో సతీసహగమనమును నిషేధించాడు.
  • హైదరాబాద్ నుండి ముంబాయికి టెలిగ్రాఫ్ లైన్ వేయించాడు.
  • 1856లో హైదరాబాద్ లో మొట్ట మొదటిసారిగా పారిశ్రామిక వస్తు ప్రదర్శనను ఏర్పాటు చేశాడు.
  • 1883 సం|| కలరా వ్యాధి సోకి 1వ సాలార్ జంగ్ మరణించాడు.

🌾 నిజాం కాలం నాటి భూస్వామ్య పద్ధతులు

నిజాం కాలంలో భూస్వామ్య విధానాలు - దివానీ (ఖల్సా) భూములు, జాగీర్దారీ భూములు, సర్ఫేఖాస్ భూములు, కౌలు భూములు.

దివానీ (ఖల్సా) భూములు

  • ప్రభుత్వ ప్రత్యక్ష పాలన కింద ఉన్న భూములు, హైదరాబాద్ సేద్యపు భూమిలో ఈ భూములు 60% ఉన్నాయి.
  • 1875 దివానీ (ఖల్సా) పద్దతి క్రమబద్ధమైన సర్వే సెటిల్మెంట్ విధానం 1317 ఫసలీ చట్టం ద్వారా సాలార్జంగ్ ప్రవేశపెట్టెను.
  • దివానీ (ఖల్సా) ప్రాంతాలలో 1875కు ముందు ఉన్న దళారీలు:
    • సర్బస్తా - వేలంపాట ద్వారా శిస్తు వసూలు చేయువారు
    • పాన్మక్తా - స్థిర కౌలు చెల్లించేవారు
    • ఇజారా - నిర్మానుష్యమైన ప్రాంతాలలో నివసిస్తూ తక్కువ కౌలు చెల్లించేవారు.

జాగీర్దారీ భూములు

  • నిజాం నవాబుకు సేవ చేసినందుకు ఇచ్చే భూములు. ఈ జాగీర్లపై పన్ను వసూలు చేసేది - జాగీర్దారు.
  • హైదరాబాద్ రాజ్యంలో ప్రధానంగా 6 రకాల జాగీర్లు:
    • పాయిగా జాగీరు - ముస్లిం ప్రభువులకు, నిజాం వారసులకు
    • తనఖా జాగీరు - జీతాలకు బదులుగా
    • జాత్ జాగీరు - విస్తృతమైన ప్రాంతాలకు సేవ చేసిన వారికి షరతు లేకుండా
    • అల్తంగా జాగీరు - శిస్తు లేకుండా వంశపారంపర్యంగా
    • మదద్మాష్ జాగీరు - జీవిత పోషణకై
    • మస్రూతి - మత లేదా సైనిక / పౌర సంబంధ సేవ చేసే షరతులపై
  • 1948 నాటికి 30% భూములు జాగీర్దారీ విధానం కింద ఉన్నాయి.
  • హైదరాబాద్ జాగీర్ల రద్దు రెగ్యులేషన్ చట్టం 1949 ఆగష్టు 15న చేశారు.

సర్ఫేఖాస్ భూములు & కౌలు భూములు

  • నిజాం సొంత ఖర్చుల కోసం కేటాయించే భూమిని సర్ఫేఖాస్ అంటారు. ప్రభుత్వానికి రైతులే నేరుగా శిస్తు చెల్లిస్తారు.
  • నిజాం రాజ్యంలో 3 రకాల కౌలు పద్ధతులు: నగదు రూపంలో, బతాయి (పంటలో భాగం), గల్లామక్తా (స్థిర కౌలు).
  • పై మూడు రూపాలలో కౌలు పరిమాణం 2/3 వంతు లేదా అంతకంటే ఎక్కువగా ఉండేది.
  • 1944 సం॥కు ముందు 2 రకాల కౌలుదారులు: (1) షక్మీ కౌలుదారులు (శాశ్వత/రక్షిత) (2) ఆసామి షక్మీదారులు (తాత్కాలిక, హక్కులు లేని).
  • 1939 సం|| కౌలుదారుల స్థితిగతులను పరిశీలించుటకు నియమించిన కమిటీ - ఎం.ఎస్. భరూఛా కమిటీ. దాని సూచన మేరకు ఆసామి షక్మీ చట్టం (1944) వచ్చింది.
  • 1949లో కౌలు సంస్కరణల కమిటీ, 1950 జూన్ 10న తెలంగాణ కౌలు - వ్యవసాయ భూముల చట్టం.
  • హైదరాబాద్ ప్రివెన్షన్ ఆఫ్ ఎవిక్షన్ ఆర్డినెన్స్ (1953) ప్రకారం కౌలు పరిమాణం: మాగాణి - పంటలో 1/3, మెట్ట - 1/4.

🇮🇳 తెలంగాణలో జాతీయోద్యమం

జాతీయోద్యమానికి ప్రధాన ఆధారం - పత్రికలు, చందా రైల్వే సంఘటన. విద్యా సంస్థలు, గ్రంథాలయాలు, సామాజిక సంస్కరణోద్యమాలు జాతీయోద్యమానికి ముఖ్య కారణాలు.

📰 ముఖ్య పత్రికలు

  • తెలంగాణలో తొలి పత్రిక - సేద్య చంద్రిక (1886) — వ్యవసాయ రంగ మార్పులపై వ్యాసాలు
  • 1850 వనపర్తి, 1875 గద్వాల్ సంస్థానంలో ముద్రణ శాలలు
  • రిసాల-ఇ-తిబ్బి (ఉర్దూ) - 1859 (హైదరాబాద్ జర్నలిజానికి పునాది)
  • దక్కన్ టైమ్స్ (ఇంగ్లీష్) - సికింద్రాబాద్ - 1864
  • హైదరాబాద్ టెలిగ్రాఫ్ (1882), హైదరాబాద్ రికార్డ్ (1885), మౌల్లిం-ఎ-షఫీక్ (1892 — ముస్లిం స్త్రీల విద్య, పర్దాపై)
  • సంయుక్త సంఘ వర్తమాన పత్రిక (1909), హితబోధిని (1913), ఆంధ్రమాత (1917), నీలగిరి (1921 — సంపాదకుడు శబ్నవీసు వెంకట నరసింహారావు)
  • తెనుగు (1922 — బద్దిరాజు సీతారామ చంద్రరావు, రాఘవ రంగారావు), గోల్కొండ (1925 — సురవరం ప్రతాపరెడ్డి)
  • దేశబంధు (1926 — బెల్లంకొండ నరసింహాచార్యులు), సుజాత (1927), రయ్యత్ (1927 — మందముల నరసింగారావు)
  • భాగ్యనగర్ (1936 — భాగ్యరెడ్డి వర్మ), మీజాన్ (1941 — అడవి బాపిరాజు, గులాం అహ్మద్)
  • తెలంగాణ (1941 — రాజగోపాల్ మొదలియార్), శోభ (1947 — దేవులపల్లి రామానుజరావు)
  • గ్రామ జ్యోతి (గోడపత్రిక, 1947 — బొబ్బల ఇంద్రసేనారెడ్డి), ఇమ్రోజ్ (1947 — షోయబుల్లాఖాన్)

🚆 చందారైల్వే పథకం (1883)

  • హైదరాబాద్ నుండి వాడి రైలు మార్గం. చందా వరకు పొడిగింపు కోసం ఉద్యమం.
  • చైతన్యం కోసం కృషి: అఘోరనాథ్ చటోపాధ్యాయ, ముల్లా అబ్దుల్ ఖయ్యుమ్, రామ్ చంద్ర పిళ్ళై, దాస్తూర్ హోషాంగ్.
  • ఆంగ్ల పత్రికలు: టైమ్స్ ఆఫ్ ఇండియా, బెంగాల్ గెజిట్.

📖 సాహిత్య ఉద్యమము

  • సాహితి మేఖల (1936): నల్గొండలో అంబటిపూడి వెంకటరత్న శాస్త్రి ప్రారంభించారు.
  • సాధన సమితి (1939): బూర్గుల రంగనాథరావు, భాస్కరభట్ల కృష్ణారావు, వెల్దుర్తి మాణిక్యరావు.
  • విజ్ఞాన వర్ధిని పరిషత్ (1941): సురవరం ప్రతాపరెడ్డి (రామాయణ విశేషములు).
  • ఆంధ్ర సారస్వత పరిషత్ (1943) — రాజకీయేతర సంస్థ, తెలుగు భాష వ్యాప్తి కోసం.
    • స్థాపకులు: మాడపాటి హనుమంతరావు, దేవులపల్లి రామానుజరావు, బూర్గుల రంగనాథరావు
    • మొదటి అధ్యక్షుడు: లోకనంది శంకర నారాయణ రావు; కార్యదర్శి: బిరుదు వెంకటశేషయ్య
    • ప్రచురణలు: సారస్వతం, బాల సారస్వతం, పండిత సారస్వతం, ప్రజా సారస్వతం
    • ప్రస్తుత చైర్మన్: సి. నారాయణరెడ్డి (సినారె)
  • ఇతర సమితులు: నవ్యసాహితి సమితి (రావి నారాయణరెడ్డి), వైతాళిక సమితి (కాళోజి నారాయణరావు).

🎓 విద్య & గ్రంథాలయోద్యమం

తెలంగాణలో సామాజిక సాంస్కృతిక చైతన్యం కోసం విద్య తోడ్పడింది.

  • హిందూ సోషల్ క్లబ్ (1892) — అధ్యక్షుడు రాజా మురళీ మనోహర్, ఉపాధ్యక్షుడు శ్రీకృష్ణ అయ్యంగార్.
  • వివేక వర్ధిని పాఠశాల – 1906 (కేశవరావు కొరాట్కర్, వామనరావు నాయక్, గణపతిరావు హార్డేకర్).
  • పండిట్ తారానాథ్ 'నయితాలీం' ఉద్యమం చేపట్టి ఆధునిక విద్య ప్రోత్సహించాడు.
  • హైదరాబాద్ ఎడ్యుకేషనల్ కాన్ఫరెన్స్ - 1915 (స్థాపకుడు మీర్ అక్బర్ అలీ). ఫలితంగా 1918 ఆగస్టు 28న ఉస్మానియా విశ్వవిద్యాలయం స్థాపించారు.

📚 గ్రంథాలయోద్యమ పితామహుడు : కొమర్రాజు లక్ష్మణరావు

  • మునగాల రాజా నాయని వెంకట రంగారావు సంస్థానంలో దివాన్.
  • స్థాపించిన గ్రంథాలయాలు: శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్రభాషా నిలయం (1901, హైదరాబాద్), రాజరాజ నరేంద్ర ఆంధ్ర భాష నిలయం (1904, హన్మకొండ), ఆంధ్ర సంవర్థిని గ్రంథాలయం (1905, సికింద్రాబాద్), విజ్ఞాన చంద్రికా మండలి (1906, హైదరాబాద్).
  • విజ్ఞాన సర్వస్వం — విజ్ఞాన శాస్త్రములకు సంబంధించిన గ్రంథం.
  • గ్రంథాలయోద్యమం గురించి తెలిపే పుస్తకం: నారాయణత్రయం (కోదాటి నారాయణరావు).

కొన్ని ముఖ్య గ్రంథాలయాలు

  • 1872 - సికింద్రాబాద్ గ్రంథాలయం (సోమసుందర్ మొదలియార్) — తెలంగాణలో మొదటి గ్రంథాలయం (1884లో మహబూబియా కళాశాలలో విలీనం).
  • 1872 - శంకరానంద గ్రంథాలయం (ముదిగొండ శంకరాచార్యులు).
  • 1892 - అసఫియా స్టేట్ సెంట్రల్ లైబ్రరీ.
  • 1895 - భారత గుణవర్ధక్ సంస్థ లైబ్రరీ (శాలిబండ).
  • 1896 - ఆల్బర్ట్ రీడింగ్ రూం (బొల్లారం).
  • 1905 - బాలభారతీ నిలయ ఆంధ్రభాషా వర్తక సంఘం (శంషాబాద్).
  • 1910 - ఆంధ్రభాషా నిలయం - మడిగొండ (వరంగల్).
  • 1913 - సంస్కృత కళావర్ధిని గ్రంథాలయం - సికింద్రాబాద్.
  • 1918 - రెడ్డి హాస్టల్ గ్రంథాలయం - హైద్రాబాద్.
  • 1923 - వేమన ఆంధ్రభాషా నిలయం, ఆంధ్ర విద్యార్థి సంఘ గ్రంథాలయం - హైదరాబాద్.
  • 1925 - ఆంధ్ర సోదరీ సమాజ గ్రంథాలయం - హైదరాబాద్.
  • 1926 - ఆదిహిందూ లైబ్రరీ - హైదరాబాద్.
  • 1930 - జోగిపేట గ్రంథాలయం - మెదక్.
  • 1941 - రైతు గ్రంథాలయం - చిలుకూరు (స్థాపకుడు రావి నారాయణ రెడ్డి).
  • తెలంగాణలో తొలి సంచార గ్రంథాలయం - ఆర్మూర్ సంచార గ్రంథాలయం.

📌 గ్రంథాలయ మహాసభలు

  • మొదటి సభ - మధిర (1925) — అధ్యక్షుడు పింగళ వెంకట రామారెడ్డి; ఆహ్వాన సంఘ అధ్యక్షుడు మాడపాటి తిరుమలరావు.
  • 2వ సభ - సూర్యాపేట (1929) — అధ్యక్షోపన్యాసం వామన్ నాయక్.

🕊️ సామాజిక సంస్కరణోద్యమాలు

🔱 బ్రహ్మ సమాజం

  • 1829లో రాజారాం మోహన్ రాయ్ కలకత్తాలో స్థాపించాడు.
  • 'ఆది బ్రహ్మ సమాజ్'గా పేరు మార్చింది - దేవేంద్రనాథ్ ఠాగూర్ (1866); 'భారత బ్రహ్మ సమాజ్'గా - కేశవ్ చంద్రసేన్.
  • హైదరాబాద్ లో బ్రహ్మ సమాజ వివాహాలకు చట్టబద్ధత - 1872.
  • 1899-1904 మహబూబ్ కళాశాలలో అధ్యాపకుడు రఘుపతి వెంకటరత్నం నాయుడు వివిధ సంస్కరణోద్యమాల్లో పనిచేశాడు.
  • 1914 బ్రహ్మసమాజ్ మొదటి సమావేశం హైదరాబాద్ లో — అధ్యక్షత నారాయణ గోవింద వెల్లంకర్.

🚩 ఆర్య సమాజం

  • హైదరాబాద్ శాఖ 1892లో స్వామి నిత్యానంద ఏర్పాటు; మొదటి అధ్యక్షుడు కమలాపర్షాద్.
  • బలోపేతం — కేశవరావ్ కొరాట్కర్, దామోదర్ సత్యలేకర్. పండిట్ నరేంద్రజీ రాకతో విస్తరించింది.
  • ఆర్య సమాజం హిందూమతంలో సంస్కరణలు, ముస్లిం వ్యతిరేక, నిజాం వ్యతిరేక దృక్పథంతో రాజకీయ చైతన్యం కలిగించింది.
  • ‘హైదరాబాద్ రాజ్యం' ఒక సువిశాలమైన చెరసాల అని పేర్కొన్న పండిత నరేంద్రజీని రాజద్రోహం నేరంతో జైలుకు పంపారు.

🔯 దివ్యజ్ఞాన సమాజం

  • 1905లో అబిడ్స్ లో స్థాపించారు. మత, సాంస్కృతిక విషయాలపై చర్చలు.

🛡️ ఆది హిందూ, దళిత ఉద్యమాలు

  • దళితులు రైల్వే, మిలటరీ ఉద్యోగాల వల్ల చైతన్యం పొందారు.
  • ముఖ్య కారకులు: భాగ్యరెడ్డి వర్మ, అరిగె రామస్వామి, ఎం.ఎల్. ఆదయ్య.
  • భాగ్యరెడ్డి వర్మ (అసలు పేరు మాదరి భాగయ్య) — ఆది హిందూ ఉద్యమ ఆద్యుడు. 1913లో ఆర్యసమాజ్ సభ్యుడు బాజీ కృష్ణారావు ఇచ్చిన బిరుదు 'వర్మ'.
  • స్థాపించిన సంస్థలు: జగన్ మిత్ర మండలి (1906), మన్య సంఘం (1911), స్వస్తిక్ దళ్ (1912).
  • మొదటి ప్రాదేశిక పంచమ సదస్సు 1917 — అధ్యక్షుడు భాగ్యరెడ్డి వర్మ, నిర్వహణ గూడూరు రామచంద్రారావు. దీనితో ప్రభావితుడై ఉన్నవ లక్ష్మీనారాయణ 'మాలపల్లి' నవల రచించాడు.
  • మన్య సంఘం 1922లో 'ఆది హిందూ సామాజిక సేవా సమాఖ్య'గా మారింది.

✨ Asaf Jahi Legacy — Beyond the Throne

The Asaf Jahi dynasty left an indelible mark on the Deccan. From the architectural grandeur of Chowmahalla and Falaknuma Palaces to the scholarly pursuit at Osmania University and the Salar Jung Museum, their patronage shaped the cultural fabric of Hyderabad. The Nizams were also known for their administrative acumen, blending traditional Mughal governance with modern reforms. Even today, the pearls, the cuisine, and the Ganga-Jamuni tehzeeb of Hyderabad echo the syncretic spirit of this dynasty.

— This blog post was meticulously compiled from historical records, Telangana movement archives, and scholarly works to present a comprehensive view of the Asaf Jahi rule and its impact on the region's socio-political evolution.

📝 TGPSC, TS Police Exam Quick Revision Points

  • స్థాపకుడు: నిజాం-ఉల్-ముల్క్ (మీర్ ఖమ్రుద్దీన్ ఖాన్) – 1724
  • షకర్ ఖేడా యుద్ధం: 1724 – ముబారిజ్ ఖాన్ను ఓడించాడు
  • ఒప్పందాలు: ముషిగావ్ (1728 – చౌత్ & సర్దేశ్ముఖీ), దుర్రాసరాయి (1738), బేరార్ (1853)
  • రాజధాని మార్పు: ఔరంగాబాద్ నుండి హైదరాబాద్కు (1770) – నిజాం అలీ ఖాన్
  • సహాయక సంధిలో చేరిన మొదటి రాజు: నిజాం అలీ ఖాన్ (1798)
  • సాలార్జంగ్ I సంస్కరణలు: పరిపాలనా విభాగాలు (5 సుభాలు, 17 జిల్లాలు), పోలీస్ & రెవెన్యూ విభజన (1867), సతీసహగమన నిషేధం
  • ఉస్మానియా విశ్వవిద్యాలయం: 1918 ఆగస్టు 28న స్థాపించబడింది
  • పోలీసు చర్య: 1948 – అసఫ్ జాహీ పాలన ముగింపు
  • భూ వ్యవస్థలు: దివానీ (60%), జాగీర్దారీ (30%), సర్ఫేఖాస్, రైత్వారీ
  • రైత్వారీ విధానం ప్రవేశపెట్టినది: సాలార్జంగ్ I
  • మొదటి వార్తాపత్రిక: సేద్య చంద్రిక (1886)
  • గ్రంథాలయోద్యమ పితామహుడు: కొమర్రాజు లక్ష్మణరావు
  • మొదటి గ్రంథాలయం: సికింద్రాబాద్ గ్రంథాలయం (1872)
  • ఆర్య సమాజ్ స్థాపన: హైదరాబాద్ (1892) – స్వామి నిత్యానంద
  • భాగ్యరెడ్డి వర్మ: ఆది హిందూ ఉద్యమ నాయకుడు; అసలు పేరు మాదరి భాగయ్య
  • ముఖ్యమైన నిజాంలు: నిజాం అలీ ఖాన్ (II), సికిందర్ జా (III), నాసిరుద్దౌలా (IV), అఫ్జలుద్దౌలా (V), మీర్ మహబూబ్ అలీ ఖాన్ (VI), మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ (VII)
  • సాలార్జంగ్ I అసలు పేరు: మీర్ తురాబ్ అలీ ఖాన్
  • బేరార్ ఒప్పందం: 1853 – లార్డ్ డల్హౌసీతో
  • చందా రైల్వే పథకం ఆందోళన: 1883
  • ఆంధ్ర సారస్వత పరిషత్: 1943లో స్థాపించబడింది, మొదటి అధ్యక్షుడు లోకనంది శంకర నారాయణ రావు

No comments:

Post a Comment