📄 Telangana Police Constable Mains 2019 – Q51 to Q100
Q51. English: Kidney transplantation is the best solution for acute renal failure. The first kidney transplantation was done in India at which of the following hospitals?
Telugu: మూత్రపిండాలు పూర్తిగా చెడిపోయినపుడు, వాటిని మార్పిడి చేయడం సరియైన చికిత్స. ఇండియాలో మొదటిసారిగా మూత్రపిండాల మార్పిడి క్రిందగల ఏ వైద్యశాలలో జరిగింది ?
- (1) AIIMS, New Delhi / ఎయిమ్స్, న్యూఢిల్లీ
- (2) CMC, Vellore / వెల్లూర్ (సి.ఎం.సి.)
- (3) NIMS, Hyderabad / హైదరాబాద్ (నిమ్స్)
- (4) Jaslok Hospital, Mumbai / జస్లోక్ హాస్పిటల్, ముంబై
Q52. English: Match the following:
a. Shrillness of Sound – iv. Pitch
b. Audible limit – iii. 20 Hz - 20000 Hz
c. Amplitude – i. Intensity
d. Unit of sound energy – ii. Decibel
Telugu: క్రింది వాటిని జతపరచండి :
a. ధ్వని కీచుదనము – iv. పిచ్
b. శ్రవ్య అవధి – iii. 20 Hz - 20000 Hz
c. కంపన పరిమితి – i. తీవ్రత
d. ధ్వని శక్తి ప్రమాణము – ii. డెసిబెల్
Options: (1) a-iii, b-iv, c-ii, d-i | (2) a-iv, b-iii, c-i, d-ii | (3) a-i, b-ii, c-iii, d-iv | (4) a-ii, b-i, c-iv, d-iii
Q53. English: Assertion (A): When a carpet is beaten with a stick, dust comes out.
Reason (R): Inertia is a property of matter that resists changes in its state of motion or rest.
Telugu: ప్రతిపాదన (A) : ఒక కంబళీని కర్రతో కొట్టినపుడు దుమ్ము బయటకు వస్తుంది.
కారణం (R) : గమన స్థితిలో గాని, నిశ్చల స్థితిలో గాని ఉన్న వస్తువు తన స్థితిలో మార్పును వ్యతిరేకించే ధర్మాన్ని జడత్వము అంటారు.
Options: (1) Both (A) and (R) are correct and (R) is the correct explanation of (A). | (2) Both (A) and (R) are correct but (R) is not the correct explanation of (A). | (3) (A) is correct but (R) is not correct. | (4) (A) is not correct but (R) is correct.
Q54. English: The energy possessed by a body by virtue of motion is:
Telugu: వస్తువు చలనము వల్ల కలిగే శక్తిని ఏమని అంటారు?
- (1) Potential energy / స్థితిజ శక్తి
- (2) Kinetic energy / గతి శక్తి
- (3) Attractive energy / ఆకర్షణ శక్తి
- (4) Gravitational energy / గురుత్వాకర్షణ శక్తి
Q55. English: The mirror used by a dentist is:
Telugu: దంత వైద్యుడు ఉపయోగించే దర్పణము :
- (1) Plane mirror / సమతల దర్పణము
- (2) Convex mirror / కుంభాకార దర్పణము
- (3) Concave mirror / పుటాకార దర్పణము
- (4) Cylindrical mirror / స్థూపాకార దర్పణము
Q56. English: Biodegradable polymer among the following is:
Telugu: కింది వాటిలో జీవక్షయీకృత పాలిమర్ ఏది ?
- (1) Nylon 6 / నైలాన్ 6
- (2) Terylene / టెరీలీన్
- (3) Nylon 6, 6 / నైలాన్ 6, 6
- (4) PHBV / పి.హెచ్.బి.వి
Q57. English: Mirage is the best example for which of the following phenomenon ?
Telugu: ఈ క్రింది ప్రక్రియలలో ఏది ఎండమావికి ఒక మంచి ఉదాహరణ?
- (1) Reflection / పరావర్తనము
- (2) Refraction / వక్రీభవనము
- (3) Total internal reflection / సంపూర్ణాంతర పరావర్తనము
- (4) Multiple reflection / బహు పరావర్తనము
Q58. English: Which one of the following is used predominantly in making aeroplanes?
Telugu: క్రింది వాటిలో దేనిని ప్రధానంగా విమానాల తయారీలో ఉపయోగిస్తారు ?
- (1) Duralumin / డ్యూరాల్యుమిన్
- (2) German Silver / జర్మన్ సిల్వర్
- (3) Gun metal / గన్ మెటల్
- (4) Invar / ఇన్వార్
Q59. English: The bulbs used in green houses are made of:
Telugu: హరిత గృహాలలో వాడే బల్బులను వేటితో తయారు చేస్తారు ?
- (1) Neon / నియాన్
- (2) Nitrogen / నైట్రోజన్
- (3) Xenon / జినాన్
- (4) Krypton / క్రిప్టాన్
Q60. English: The property of metals by which they can be beaten into thin sheets is called:
Telugu: లోహాలను కొట్టి పలుచటి రేకులుగా మార్చే ధర్మాన్ని ఈ విధంగా అంటారు.
- (1) Malleability / మాలియబలిటీ
- (2) Ductility / డక్టైలిటీ
- (3) Conductivity / వాహకత
- (4) Sonorous Property / సోనోరస్ ధర్మం
Q61. English: The gas used as fire extinguisher is:
Telugu: అగ్నిమాపకంగా వాడే వాయువు కింది వాటిలో ఏది ?
- (1) Carbon dioxide / కార్బన్ డై ఆక్సైడ్
- (2) Carbon monoxide / కార్బన్ మోనాక్సైడ్
- (3) Nitric oxide / నైట్రిక్ ఆక్సైడ్
- (4) Sulphur dioxide / సల్ఫర్ డై ఆక్సైడ్
Q62. English: Due to its very low solubility in blood, which one of the following is mixed with 20% oxygen and supplied to deep sea divers:
Telugu: రక్తంలో అతి తక్కువ ద్రావణీయత కలిగి ఉన్న కారణంగా, కింది వాటిలో దేనిని 20% ఆక్సీజన్తో కలిపి సముద్రపు లోతులకు వెళ్ళే ఈతగాళ్ళకు అందిస్తారు :
- (1) nitrogen / నైట్రోజన్
- (2) helium / హీలియమ్
- (3) hydrogen / హైడ్రోజన్
- (4) argon / ఆర్గాన్
Q63. English: Read the following statements:
a. Membrane bound nucleus is absent in cyanobacteria.
b. Ribosomes are associated with photorespiration.
c. Nerve cells do not have the ability to regenerate.
Which of the above statements is/are correct?
Telugu: క్రింది ప్రవచనములను చదువుము :
a. సయనో బాక్టీరియాలో పొరచే కప్పబడిన కేంద్రకం ఉండదు.
b. రైబోసోమ్లు కాంతి శ్వాసక్రియతో సంబంధం కలిగి ఉంటాయి.
c. నాడీ కణాలకు పునరుత్పత్తి అయ్యే సామర్థ్యం ఉండదు.
పై ప్రవచనాలలో ఏది/ఏవి సరియైనవి ?
Options: (1) a and b | (2) a and c | (3) b and c | (4) c only
Q64. English: Read the following statements:
a. Plants require zinc as micronutrient.
b. Sunhemp is an example of green manure.
c. The process in which one crop is followed by another crop on an agricultural field is called 'mixed cropping'.
Which of the above statements is/are correct?
Telugu: క్రింది ప్రవచనములను చదువుము:
a. మొక్కలకు జింక్ సూక్ష్మ పోషకం.
b. జనుము పచ్చి రొట్ట ఎరువుకు ఒక ఉదాహరణ.
c. ఒక పొలంలో ఒక రకమైన పంట సాగు చేసిన తర్వాత వేరే రకమైన పంటను సాగు చేయడాన్ని 'మిశ్రమ పంట' అంటారు.
పై ప్రవచనాలలో ఏది/ఏవి సరియైనవి?
Options: (1) a and b | (2) b and c | (3) a and c | (4) c only
Q65. English: A flower having calyx, corolla, androecium and gynoecium is called 'complete flower'. If any of these whorls is missing, then such flower is regarded as 'incomplete flower'. Identify from the following an incomplete flower:
Telugu: రక్షక పత్రావళి, ఆకర్షణ పత్రావళి, కేశరావళి, అండకోశం కలిగిన పుష్పాన్ని 'సంపూర్ణ పుష్పం' అంటారు. ఏదైనా పైవలయం ఉండకపోతే అటువంటి పుష్పాన్ని 'అసంపూర్ణ పుష్పం' అంటారు. ఈ క్రింది వాటిలో అసంపూర్ణ పుష్పాన్ని గుర్తించండి.
- (1) Hibiscus / మందార
- (2) Datura / ఉమ్మెత్త
- (3) Papaya / బొప్పాయి
- (4) Cotton / ప్రత్తి
Q66. English: Which movement during freedom struggle came to a sudden end with the Chauri Chaura incident?
Telugu: చౌరి చౌర ఉదంతముతో స్వాతంత్ర సమరంలోని ఏ ఉద్యమం వున్నట్టుండి ఆగిపోయింది?
- (1) Home Rule Agitation / స్వదేశీ ఉద్యమం
- (2) Non-Co-operation Movement / సహాయ నిరాకరణోద్యమం
- (3) Salt Satyagraha / ఉప్పు సత్యాగ్రహం
- (4) Quit India Movement / క్విట్ ఇండియా ఉద్యమం
Q67. English: Dharmapala, the head of the famous Nalanda University during the period of the Guptas, hailed from which of the following cities?
Telugu: గుప్తుల పరిపాలనా కాలంలో వెలసిన ప్రఖ్యాత నలంద విశ్వ విద్యాలయానికి అధిపతిగా పనిచేసిన ధర్మపాల ఏనగరానికి చెందిన వాడు ?
- (1) Benaras / బెనారస్
- (2) Mathura / మధుర
- (3) Nasik / నాసిక్
- (4) Kanchipuram / కాంచిపురం
Q68. English: Match the following ancient scientists with their works:
a. Palakapya – ii. Hastyayurveda
b. Patanjali – iii. Yogasutra
c. Vagbhatta – iv. Ashtanga Samgraha
d. Varahamihira – i. Brihatsamhita
Telugu: క్రింద ఇవ్వబడిన ప్రాచీన శాస్త్రవేత్తలను వారి రచనలతో జతపరచుము.
a. పలకాప్య – ii. హత్సాయుర్వేద
b. పతంజలి – iii. యోగ సూత్ర
c. వాగ్ భట్ట – iv. అష్టాంగ సంగ్రహ
d. వరాహమిహిర – i. బ్రిహత్ సంహిత
Options: (1) a-iv, b-ii, c-i, d-iii | (2) a-ii, b-iii, c-i, d-iv | (3) a-ii, b-iii, c-iv, d-i | (4) a-iii, b-iv, c-i, d-ii
Q69. English: In which of the following movements, Annie Besant actively participated?
Telugu: అనిబిసెంటు క్రింది ఏ ఉద్యమంలో మిక్కిలి చురుకుగా పాల్గొనెను ?
- (1) Non-Co-operation Movement / సహాయ నిరాకరణోద్యమం
- (2) Salt Satyagraha / ఉప్పు సత్యాగ్రహం
- (3) Home Rule Agitation / హోంరూల్ ఉద్యమం
- (4) Quit India Movement / క్విట్ ఇండియా ఉద్యమం
Q70. English: Match the following dynasties with their capitals:
a. Imad Shahis – iii. Berar
b. Adil Shahis – i. Bijapur
c. Barid Shahis – iv. Bidar
d. Qutub Shahis – ii. Golconda
e. Nizam Shahis – v. Ahmadnagar
Telugu: క్రింది రాజవంశాలు వారి రాజధానులతో జతపరచుము.
a. ఇమాద్ షాహీలు – iii. బిరార్
b. అదిల్ షాహీలు – i. బిజాపూర్
c. బరీద్ షాహీలు – iv. బీదర్
d. కుతుబ్ షాహీలు – ii. గోల్కొండ
e. నిజాం షాహీలు – v. అహమ్మద్ నగర్
Options: (1) a-iii, b-i, c-iv, d-ii, e-v | (2) a-iii, b-i, c-v, d-iv, e-ii | (3) a-iv, b-iii, c-i, d-v, e-ii | (4) a-iii, b-iv, c-ii, d-v, e-i
Q71. English: Name the Chinese traveller who visited India during the period of Chandra Gupta II.
Telugu: రెండవ చంద్ర గుప్తుని పాలనా కాలంలో భారతదేశాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు ఎవరు ?
- (1) Huien Tsang / హుయన్ త్సాంగ్
- (2) Itsing / ఇత్సింగ్
- (3) Fa Hien / ఫాహియన్
- (4) La Ping / లా పింగ్
Q72. English: Who among the following was the founder of the Mohammadan Anglo Oriental College in Aligarh ?
Telugu: అలిగర్లో మహమ్మడన్ ఆంగ్లో ఓరియంటల్ కాలేజి స్థాపించినది ఎవరు?
- (1) Muhammad Ali Jinnah / మహమ్మద్ ఆలీ జిన్నా
- (2) Maulvi Chirag Ali / మౌల్వి చిరాగ్ ఆలి
- (3) Sir Syed Ahmed Khan / సర్ సయ్యద్ అహమ్మద్ ఖాన్
- (4) Mirza Ghulam Ahmed / మిర్జా ఘులామ్ అహమ్మద్
Q73. English: Assertion (A): After the Revolt of 1857 was put down, the British were particularly hard on the Muslims.
Reason (R): The British came to the conclusion that the Great Revolt was led by Muslims and that they were mainly responsible for it.
Telugu: ప్రతిపాదన (A) : 1857 తిరుగుబాటును అణిచి వేసిన తర్వాత బ్రిటీషు వారు ముఖ్యంగా ముస్లింల పట్ల కఠినంగా ప్రవర్తించిరి.
కారణం (R) : తిరుగుబాటులో ముస్లింలు నాయకత్వం వహించారని, వారు మాత్రమే ప్రధాన కారుకులని బ్రిటీషు వారు నిర్ణయానికి వచ్చారు.
Options: (1) Both A and R are true and R is the correct explanation for A. | (2) Both A and R are true, but R is not the correct explanation of A. | (3) A is true, but R is false. | (4) A is false, but R is true.
Q74. English: Name the Governor-General who for the first time introduced Civil Services in India.
Telugu: భారతదేశంలో సివిల్ సర్విస్ను మొట్టమొదట ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ఎవరు ?
- (1) Warren Hastings / వారన్ హేస్టింగ్స్
- (2) Lord Cornwallis / లార్డ్ కారన్ వాలీసు
- (3) Lord Wellesley / లార్డ్ వెల్లస్లీ
- (4) Lord Dalhousie / లార్డ్ డల్హౌసి
Q75. English: Which among the following animals was not represented in the Ashokan Pillar?
Telugu: ఈ క్రింద పేర్కొన్న జంతువులలో ఏది అశోకుని సూపంలో కనిపించదు ?
- (1) Horse / గుర్రం
- (2) Bull / ఎద్దు
- (3) Elephant / ఏనుగు
- (4) Deer / జింక
Q76. English: Which Delhi Sultan was the first to participate in the celebrations of Holi Festival?
Telugu: హెూలి పండుగ వేడుకలలో పాల్గొన్న మొదటి ఢిల్లీ సుల్తాన్ ఎవరు ?
- (1) Ghiyasuddin Tughlaq / గియాసుద్దీన్ తుగ్లక్
- (2) Mohammad Bin Tughlaq / మొహమ్మద్ బిన్ తుగ్లక్
- (3) Firoz Shah Tughlaq / ఫిరోజ్ షా తుగ్లక్
- (4) Mahmud Tughlaq / మహ్మద్ తుగ్లక్
Q77. English: Who among the following does not belong to the Bhakti movement ?
Telugu: క్రింది వారిలో భక్తి ఉద్యమంలో సంబంధము లేని వారెవరు ?
- (1) Sankaracharya / శంకరాచార్య
- (2) Ramanujacharya / రామానుజాచార్య
- (3) Vallabhacharya / వల్లభాచార్య
- (4) Srikantacharya / శ్రీకంఠాచార్య
Q78. English: The famous Sanskrit scholar Max Muller who translated Vedas into English belonged to which country by birth?
Telugu: వేధాలను ఆంగ్లానికి అనువదించిన ప్రసిద్ధ సంస్కృత పండితుడు మాక్స్ ముల్లర్ జన్మతః ఏ దేశానికి చెందిన వాడు ?
- (1) England / ఇంగ్లాండు
- (2) Germany / జర్మనీ
- (3) France / ఫ్రాన్స్
- (4) United States of America / అమెరికా సంయుక్త రాష్ట్రాలు
Q79. English: Who among the following had started 'Sharada Sadan' a school for widows?
Telugu: ఈ క్రింది వానిలో వితంతువుల బడి 'శారదా సదన్' ను ప్రారంభించినదెవరు?
- (1) Kandukuri Veeresalingam / కందుకూరి వీరేశలింగం
- (2) Pandita Rama Bai / పండిత రమా బాయి
- (3) D.K. Karve / డి.కె. కార్వే
- (4) Savitri Bai Phule / సావిత్రి బాయి ఫూలే
Q80. English: Arrange the following Delhi Sultanate dynasties in their chronological order:
a. Lodi | b. Khilji | c. Slaves | d. Tughlaq
Telugu: క్రింది ఢిల్లీ సుల్తాను వంశాలను వాటి పరిపాలనా కాలక్రమంలో అమర్చుము.
a. లోడి | b. ఖిల్జీ | c. బానిస | d. తుగ్లక్
Options: (1) c, a, b, d | (2) c, b, d, a | (3) a, d, b, c | (4) d, c, a, b
Q81. English: Who among the following leaders raised the slogan 'Inquilab Zindabad'?
Telugu: 'ఇంక్విలాబ్ జిందాబాద్' అనే నినాదాన్ని లేవనెత్తిన నాయకుడు ఎవరు ?
- (1) Chandra Sekhar Azad / చంద్రశేఖర ఆజాద్
- (2) Bhagat Singh / భగత్ సింగ్
- (3) Subhash Chandra Bose / సుభాష్ చంద్రబోస్
- (4) Sukh Dev / సుఖ్ దేవ్
Q82. English: During whose reign, the Persian envoy Abdur Razak visited Vijayanagar empire ?
Telugu: పర్షియా రాయబారి అబ్దుర్ రజాక్ ఎవరి పరిపాలనా కాలములో విజయనగర సామ్రాజ్యమును సందర్శించెను?
- (1) Sri Krishna Deva Raya / శ్రీకృష్ణ దేవరాయలు
- (2) Deva Raya II / రెండవ దేవరాయలు
- (3) Saluva Narasimha / సాళువ నరసింహ
- (4) Sadasiva Rayalu / సదాశివ రాయలు
Q83. English: Who was designated as Sadr-us-Sudur during Mughal administration?
Telugu: మొగలుల పరిపాలనలో 'సాదర్ ఉస్ సుదుర్' అనే అధికారి ఎవరు ?
- (1) The chief of the army / సైన్యాధ్యక్షుడు
- (2) The chief letter writer / ఉత్తరాలు రాయు అధికారి
- (3) The chief civil judge / ప్రధాన సివిల్ న్యాయాధిపతి
- (4) The seal keeper / రాజముద్ర గలవాడు
Q84. English: Who among the following introduced the Dual government in Bengal?
Telugu: బెంగాలులో ద్వంద్వ పరిపాలనను ప్రవేశ పెట్టిన దెవరు?
- (1) Warren Hastings / వారన్ హేస్టింగ్స్
- (2) Robert Clive / రాబర్ట్ క్లైవ్
- (3) Wellesley / వెల్లస్లీ
- (4) Cornwallis / కార్న్ వాలీసు
Q85. English: Name the Delhi sultan who introduced the system of Sijda (prostration) and Paibos (kissing the feet of the monarch).
Telugu: సిజ్దా (సాష్టాంగ ప్రణామము) పైబాస్ (రాజు పాదాలను ముద్దిడుట) వంటి సంప్రదాయాలను ప్రవేశపెట్టిన ఢిల్లీ సుల్తాను ఎవరు?
- (1) Ala-ud-din Khilji / అల్లా ఉద్దీన్ ఖిల్జీ
- (2) Muhammad-bin-Tughlaq / మహమ్మద్ బీన్ తుగ్లక్
- (3) Ibrahim Lodi / ఇబ్రహీం లోడి
- (4) Ghias-ud-din Balban / ఘియాసుద్దీన్ బాల్బన్
Q86. English: The new alluvium soil of the Gangetic Plain is called as:
Telugu: గంగా మైదానంలో కొత్త ఒండ్రు నేలకు పేరు:
- (1) Tarai / టేరాయి
- (2) Bhabar / భాబర్
- (3) Bhangar / బాంగర్
- (4) Khadar / ఖాదర్
Q87. English: Which one of the following states has the highest concentration of laterite soils?
Telugu: క్రింది పేర్కొన్న రాష్ట్రాలలో లాటరైట్ నేలలు అత్యధికంగా కేంద్రీకృతం చెందిన రాష్ట్రం ఏది ?
- (1) Gujarat / గుజరాత్
- (2) Rajasthan / రాజస్థాన్
- (3) Odisha / ఒడిషా
- (4) Jammu & Kashmir / జమ్ము మరియు కాశ్మీరు
Q88. English: The Human Development Index (HDI) rank of India for the year 2016 and 2017 respectively as per UNDP.
Telugu: భారతదేశం యొక్క మానవాభివృద్ధి సూచీ (HDI) యొక్క శ్రేణి 2016 మరియు 2017 సంవత్సరాల్లో వరుసగా (యు.ఎన్.డి.పి. ద్వారా) :
- (1) 132 and 133
- (2) 129 and 130
- (3) 132 and 130
- (4) 131 and 130
Q89. English: Matatilla Project was built on which of the following rivers?
Telugu: మతతిల్ల ప్రాజెక్టు ఏ నదిపై నిర్మించబడినది ?
- (1) Mahanadi / మహానది
- (2) Kosi / కోసి
- (3) Betwa / బేట్వా
- (4) Damodar / దామోదర్
Q90. English: Identify the correct descending order of density of the population of below given states as per 2011 Census.
Telugu: క్రింది రాష్ట్రాల్లో, 2011 జనాభా లెక్కల ప్రకారం ఆయా రాష్ట్రాల జనాభా సాంద్రతలను అవరోహణ క్రమంలో గుర్తించండి.
- (1) Bihar, Kerala, West Bengal, U.P.
- (2) West Bengal, Bihar, Kerala, U.P.
- (3) Bihar, Kerala, U.P., West Bengal
- (4) Bihar, West Bengal, Kerala, U.P.
Q91. English: Which state in India first introduced the Midday Meal Scheme for Government School children ?
Telugu: భారతదేశములో ఏ రాష్ట్రము ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు మొదటిగా మధ్యాహ్న భోజన పథకమును ప్రారంభించినది?
- (1) Maharashtra / మహారాష్ట్ర
- (2) Tamil Nadu / తమిళనాడు
- (3) Kerala / కేరళ
- (4) Andhra Pradesh / ఆంధ్రప్రదేశ్
Q92. English: Which one of the following is not included in the Right to Equality under the constitution?
Telugu: రాజ్యాంగ ప్రకారం సమానత్వపు హక్కులో భాగము కానిది ఏది ?
- (1) Social equality / సామాజిక సమానత్వము
- (2) Abolition of titles / బిరుదుల రద్దు
- (3) Abolition of untouchability / అస్పృశ్యత రద్దు
- (4) Economic equality / ఆర్థిక సమానత్వము
Q93. English: Which of the following district falls under Central Telangana Agro-climatic zone ?
Telugu: క్రింది వాటిలో సెంట్రల్ తెలంగాణ వ్యవసాయ శీతోష్ణస్థితి మండలంలో ఉన్న జిల్లా ఏది ?
- (1) Khammam / ఖమ్మం
- (2) Kamareddy / కామారెడ్డి
- (3) Vikarabad / వికారాబాద్
- (4) Yadadri - Bhuvanagiri / యాదాద్రి - భువనగిరి
Q94. English: Which one of the following statements is correct?
Telugu: క్రింది ప్రకటనలలో సరియైనది ఏది ?
- (1) Bihar has 40 Lok Sabha constituencies / బీహార్ రాష్ట్రములో నలభై లోక్సభ నియోజక వర్గములు కలవు.
- (2) Goa has one Lok Sabha constituency / గోవా రాష్ట్రములో ఒక లోక్సభ నియోజకవర్గము కలదు.
- (3) Madhya Pradesh has twenty eight Lok Sabha constituencies / మధ్యప్రదేశ్ రాష్ట్రములో ఇరువై ఎనిమిది లోక్సభ నియోజక వర్గములు కలవు.
- (4) Meghalaya has three Lok Sabha constituencies / మేఘాలయ రాష్ట్రములో మూడు లోక్సభ నియోజక వర్గములు కలవు.
Q95. English: Which one of the following is not correct statement with regard to Inter-State Council?
Telugu: అంతర్ రాష్ట్ర మండలికి సంబంధించి సరియైన ప్రకటన కానిది ఏది ?
- (1) It's Chairman is Prime Minister / ప్రధాన మంత్రి దీనికి అధ్యక్షడు
- (2) All Chief Ministers are it's members / అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇందులో సభ్యులు
- (3) It was constituted on the recommendation of Justice J.S. Verma Committee report / జస్టిస్ జె.ఎస్. వర్మ కమిటీ సిఫారసు మేరకు ఇది ఏర్పాటుయింది.
- (4) Administrators of Union Territories not having Legislative Assembly are its members / శాసనసభలు లేని కేంద్రపాలిత ప్రాంతాల పాలకులు సభ్యులు.
Q96. English: Match the period of the following governments with the number of Lok Sabha concerned:
a. National Front – ii. Ninth
b. Janata Party – iii. Sixth
c. United Front – iv. Eleventh
d. Congress Party – i. Tenth
Telugu: క్రింది ప్రభుత్వము కాలమును సంబంధింత లోకసభ సంఖ్యతో జతపరచుము :
a. నేషనల్ ఫ్రంట్ – ii. తొమ్మిదవ
b. జనతా పార్టీ – iii. ఆరవ
c. యునైటెడ్ ఫ్రంట్ – iv. పదకొండవ
d. కాంగ్రెస్ పార్టీ – i. పదవ
Options: (1) a-ii, b-iii, c-iv, d-i | (2) a-iii, b-ii, c-iv, d-i | (3) a-ii, b-iii, c-i, d-iv | (4) a-i, b-iv, c-ii, d-iii
Q97. English: Match the following states with their Chief Minister as on 20th Feb, 2019:
a. Uttarakhand – ii. Trivendra Singh Rawat
b. Himachal Pradesh – iv. Jai Ram Thakur
c. Tripura – i. Biplab Kumar Deb
d. Puducherry – iii. V. Narayana Swamy
Telugu: 20 Feb, 2019 నాటికి రాష్ట్రములతో ముఖ్యమంత్రులను జతపరచుము :
a. ఉత్తరాఖాండ్ – ii. త్రివేంద్రా సింగ్ రావత్
b. హిమాచల్ ప్రదేశ్ – iv. జై రామ్ ఠాకూర్
c. త్రిపుర – i. బిప్లబ్ కుమార్ దేవ్
d. పుదుచ్చేరి – iii. వి. నారాయణ స్వామి
Options: (1) a-iii, b-ii, c-i, d-iv | (2) a-ii, b-i, c-iii, d-iv | (3) a-ii, b-iv, c-i, d-iii | (4) a-ii, b-iv, c-iii, d-i
Q98. English: 'Casting Vote' to the Speaker of Lok Sabha is given in which Article of the Constitution?
Telugu: లోక్సభ స్పీకర్కు 'కాస్టింగ్ వోటు' కల్పించిన రాజ్యాంగ అధికరణము :
- (1) Article 100 / 100 వ అధికరణం
- (2) Article 101 / 101 వ అధికరణం
- (3) Article 102 / 102 వ అధికరణం
- (4) Article 103 / 103 వ అధికరణం
Q99. English: Which of the following statements are true?
i. The Indian Council Act, of 1909 introduced the principle of election for the first time.
ii. The Government of India Act, 1919 gave separate electorates to Sikhs.
iii. The Government of India Act, 1935 gave separate representation to Indian Christians.
iv. The Indian Councils Act, 1892 decreased the functions of Legislative Council
Telugu: ఈ క్రింది ప్రవచనములలో సరియైనవి ఏవి ?
i. భారత మండలి చట్టము 1909 మొదటిసారిగా ఎన్నికల సూత్రమును ప్రవేశపెట్టినది.
ii. భారత ప్రభుత్వ చట్టము 1919 సిక్కులకు ప్రత్యేక నియోజక వర్గాలు కేటాయించినది.
iii. భారత ప్రభుత్వ చట్టము 1935 క్రిష్టయన్లకు ప్రత్యేక ప్రాతినిధ్యము ఇచ్చినది.
iv. భారత మండలాలు చట్టము 1892 శాసన మండలి విధులను తగ్గించినది.
Options: (1) i, ii & iv | (2) ii & iii | (3) i & iv | (4) iii & iv
Q100. English: Which one of the following statements is not correct with regard to sources of revenue to Municipalities?
Telugu: క్రింది వాటిలో మున్సిపాలిటీల నిధుల/వనరులకు సంబంధించి సరియై ప్రవచనము కానిది ఏది?
- (1) Grants-in-aid from contingency fund of India / భారత ఆగంతుక నిధి నుండి గ్రాంట్స్ ఇన్ ఎయిడ్.
- (2) Grants-in-aid from consolidated fund of India / భారత ఏకీకృత నిధుల నుండి గ్రాంట్స్ ఇన్ ఎయిడ్.
- (3) Taxes collected by Municipalities authorized by the State Legislature by law / రాష్ట్ర శాసన సభ చట్టముచే ధృవీకరించిన, మునిసిపాలిటీలు వసూలు చేయు పన్నులు.
- (4) Taxes collected by state but are assigned to Municipality / రాష్ట్రము వసూలు చేసిన పన్నుల నుండి మునిసిపాలిటీలకు కేటాయించబడినవి.
No comments:
Post a Comment