Telangana Police Constable Mains Exam 2019 Question Paper with Answers Q101 - Q150

Telangana Police Constable Mains Exam 2019 (101-150)

📄 Telangana Police Constable Mains 2019 – Q101 to Q150

Q101. English: Consider the following statements about price index:
a. GDP (Gross Domestic Product) deflator measures the price level of a basket of consumer goods.
b. The Consumer Price Index (CPI) measures the overall price level of goods and services.
The correct answer is:
Telugu: ధర సూచీ (price index) కి సంబంధించి క్రింద తెలిపిన వ్యాఖ్యలను పరిశీలించండి :
a. స్థూల దేశీయోత్పత్తి (Gross Domestic Product) డిఫ్లేటర్ వినియోగ వస్తు సముదాయాల ధరల స్థాయిని కొలుస్తుంది.
b. వినియోగ వస్తు ధరల సూచీ (Consumer Price Index) మొత్తం వస్తు సేవల ధరల స్థాయిని కొలుస్తుంది.
సరైన సమాధానం :

  • (1) Both a and b are correct / a మరియు b రెండూ సరైనవే
  • (2) Both a and b are not correct / a మరియు b రెండూ సరైనవి కావు
  • (3) a only is correct / a మాత్రమే సరైనది
  • (4) b only is correct / b మాత్రమే సరైనది

Q102. English: Who has the power to prescribe the number of judges in Supreme Court?
Telugu: సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్యను నిర్ణయించు అధికారం ఎవరికి కలదు ?

  • (1) President in consultation with Prime Minister / ప్రధాన మంత్రి సంప్రదింపులతో రాష్ట్రపతికి
  • (2) President in consultation with Chief Justice of India / భారత ప్రధాన న్యాయమూర్తి సంప్రదింపులతో రాష్ట్రపతికి
  • (3) Rajya Sabha by passing a law / రాజ్యసభకు చట్టము ద్వారా
  • (4) Parliament by passing a law / పార్లమెంట్కు చట్టము ద్వారా

Q103. English: The canon of equality taxation as proposed by Adam Smith, satisfies one of the following:
Telugu: దిగువ తెలిపిన వాటిలో ఆడం స్మిత్ ప్రతిపాదించిన సమతా సూత్రం (canon of equality) దేనిని సంతృప్తి పరుస్తుంది.?

  • (1) Lumpsum tax / ఏక మొత్తం పన్ను
  • (2) Regressive taxation / తిరోగామి పన్ను
  • (3) Proportional taxation / అనుపాతపు పన్ను
  • (4) Progressive taxation / పురోగామి పన్ను

Q104. English: Read the following statements:
a. National Food Security Act came into force with effect from July 5, 2013.
b. The Act gives legal entitlement to 50 percent of rural and 50 percent of the urban population.
The correct answer is:
Telugu: క్రింది వ్యాఖ్యలను చదవండి:
a. జాతీయ ఆహార భద్రత చట్టం (National Food Security Act) జూలై, 5, 2013 నుంచి అమలులోకి వచ్చింది.
b. ఆహార భద్రత చట్టం గ్రామీణ ప్రాంతంలో గల 50 శాతం మరియు పట్టణ ప్రాంతంలో గల 50 శాతం జనాభాకు చట్టపరమైన హక్కు (entitlement) ను కల్పిస్తుంది.
సరైన సమాధానం :

  • (1) a only is correct / a మాత్రమే సరైనది
  • (2) b only is correct / b మాత్రమే సరైనది
  • (3) Both a and b are correct / a మరియు b సరైనవి
  • (4) Both a and b are not correct / a మరియు b రెండూ సరైనవి కాదు

Q105. English: In which of the following Five Year Plans, India's growth rate of agriculture exceeded the targeted growth rate ?
Telugu: ఈ క్రింద తెలిపిన పంచవర్ష ప్రణాళికలలో ఏ ప్రణాళికా కాలంలో భారతదేశ వ్యవసాయ రంగ వృద్ధి రేటు దాని నిర్దేశిత (targeted) వృద్ధి రేటు కన్నా ఎక్కువగా నమోదయింది?

  • (1) Eighth Five Year Plan / ఎనిమిదవ పంచవర్ష ప్రణాళిక
  • (2) Ninth Five Year Plan / తొమ్మిదవ పంచవర్ష ప్రణాళిక
  • (3) Tenth Five Year Plan / పదవ పంచవర్ష ప్రణాళిక
  • (4) Eleventh Five Year Plan / పదకొండవ పంచవర్ష ప్రణాళిక

Q106. English: Under full capital account convertibility, if an economy does not perform well:
a. There will be a massive capital outflows from the economy.
b. There will be a massive capital inflow into the economy.
c. Few individual investors lose, the country would gain.
d. Few individual investors would benefit, the country would lose.
Which of the above statements is/are true?
Telugu: సంపూర్ణ మూలధన అకౌంట్ మార్పిడి (Full Capital Account Convertibility) ఉన్నప్పుడు, దేశ ఆర్థిక వ్యవస్థ సరియైన విధంగా పని చేయనిచో :
a. దేశ ఆర్థిక వ్యవస్థ నుంచి భారీ మొత్తంలో మూలధన తరలింపు ఉంటుంది.
b. దేశ ఆర్థిక వ్యవస్థలోకి భారీ మొత్తంలో మూలధనం తరలివస్తుంది.
c. కొంత మంది వ్యక్తిగత పెట్టుబడిదారులు నష్టపోగా, దేశం లబ్దిని పొందుతుంది.
d. కొంత మంది వ్యక్తిగత పెట్టుబడిదారులు లాభపడగా, దేశం నష్టపోతుంది.
పై వ్యాఖ్యలలో ఏది/ఏవి సరైనవి ?

  • (1) a and b only / a మరియు b మాత్రమే
  • (2) a and c only / a మరియు c మాత్రమే
  • (3) a and d only / a మరియు d మాత్రమే
  • (4) b and d only / b మరియు d మాత్రమే

Q107. English: Compilation of General Agreement on Tariff and Trade (GATT) Uruguay round (Eighth round) negotiations is popularly known as:
Telugu: గాట్ (జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్ అండ్ ట్రేడ్) యొక్క ఉరుగ్వే రౌండ్ (ఎనిమిదవ రౌండ్) చర్చల సంకలనం ఈ విధంగా ప్రాచుర్యంలో గలదు :

  • (1) Sutherland Proposals / సూదర్లాండ్ ప్రపోజల్
  • (2) Dunkel Proposals / డంకెల్ ప్రపోజల్
  • (3) Mike Moore proposal / మైకమూర్ ప్రపోజల్
  • (4) Oliver Long proposal / అలివర్ లాంగ్ ప్రపోజల్

Q108. English: Read the following statements:
a. M. Vishweshwarayya formulated a plan and published it in his book "The Planned Economy of India" in 1934.
b. Jayaprakash Narayan formulated 'Sarvodaya Plan' in 1950.
c. Sriman Narayan Agarwal formulated 'The Gandhian Plan' in 1945.
d. M.N. Roy formulated 'The People's Plan' in 1944.
Which of the statements is/are correct?
Telugu: క్రింది వ్యాఖ్యలను చదవండి :
a. ఎం. విశ్వేశ్వరయ్య ఒక ప్రణాళికను రూపొందించి తన పుస్తకమైన "The Planned Economy of India" 1934 లో ప్రచురించాడు.
b. జయప్రకాశ్ నారాయణ 'సర్వోదయ ప్రణాళిక' ను 1950 లో రూపొందించాడు.
c. శ్రీమన్ నారాయణ అగర్వాల్ 'గాంధియన్ ప్రణాళిక' ను 1945 లో రూపొందించాడు.
d. ఎం.ఎన్.రాయ్ 'ది పీపుల్స్ ప్రణాళిక' ను 1944 లో రూపొందించాడు.
పై వ్యాఖ్యలలో ఏది/ఏవి సరియైనవి ?

  • (1) a and b only / a మరియు b మాత్రమే
  • (2) a and c only / a మరియు c మాత్రమే
  • (3) b and c only / b మరియు c మాత్రమే
  • (4) a and d only / a మరియు d మాత్రమే

Q109. English: What is the prime objective of Special Economic Zones (SEZ) in India?
Telugu: భారతదేశంలో ప్రత్యేక ఆర్థిక మండళ్ళ ప్రధాన విధి ఏమిటి ?

  • (1) To enhance foreign investment and hassle free environment for exports / విదేశీ పెట్టుబడిని పెంపొందించి ఎగుమతుల కొరకు ఏ సమస్యలు లేని వాతావరణాన్ని కల్పించుట
  • (2) To encourage free capital inflows and hassle free environment for imports / విదేశీ మూలధన తరలింపును ప్రోత్సహించి ఏ సమస్యలు లేని దిగుమతి వాతావరణాన్ని కల్పించుట
  • (3) To encourage startups for five years / అంకుర సంస్థలను, ఐదు సంవత్సరాల పాటు ప్రోత్సహించుట
  • (4) To provide employment for rural youth and encourage rural innovations / గ్రామీణ యువతకు ఉద్యోగిత మరియు గ్రామీణ నవకల్పనలను ప్రోత్సహించుట

Q110. English: From which Union Budget onwards, the classification of Plan and Non-Plan expenditures are replaced with Capital and Revenue expenditures?
Telugu: కేంద్ర ప్రభుత్వం ఏ బడ్జెట్ నుంచి ప్రణాళికా, ప్రణాళికేతర వ్యయాల వర్గీకరణ స్థానంలో మూలధన, రెవెన్యూ వ్యయాలుగా మార్పు చేసి ప్రవేశ పెట్టింది?

  • (1) 2014-15 Union Budget / 2014-15 కేంద్ర బడ్జెట్
  • (2) 2015-16 Union Budget / 2015-16 కేంద్ర బడ్జెట్
  • (3) 2016-17 Union Budget / 2016-17 కేంద్ర బడ్జెట్
  • (4) 2017-18 Union Budget / 2017-18 కేంద్ర బడ్జెట్

Q111. English: Fiscal Responsibility and Budget Management (FRBM) Review Committee, appointed by the Government of India in 2016, submitted its report in Jan-2017. Which of the following suggestions of this Committee is/are correct?
a. To bring down the debt - GDP ratio to 40 percent by 2023.
b. The central government should target a fiscal deficit to 2.5 percent of GDP by 2023.
c. The centre should replace the existing FRBM Act, 2003 with a new law.
The correct answer is:
Telugu: భారతప్రభుత్వంచే 2016 లో నియమింపబడిన FRBM (Fiscal Responsibility and Budget Management) పరిశీలన కమిటీ తన నివేదికను జనవరి, 2017 లో సమర్పించినది. దిగువ పేర్కొన్న సూచనలలో ఏది/ఏవి ఈ కమిటీ సూచనల పరంగా సరైనవి ?
a. రుణ - GDP నిష్పత్తిని 2023 నాటికి 40 శాతానికి తగ్గించుట.
b. 2023 నాటికి కేంద్ర ప్రభుత్వం తన కోశ లోటు లక్ష్యాన్ని GDP లో 2.5 శాతంగా నిర్దేశించు కోవాలి.
c. కేంద్ర ప్రభుత్వం, ప్రస్తుతం అమలులో ఉన్న FRBM Act, 2003 ను ఒక కొత్త చట్టంలో ప్రతి స్థాపన చేయాలి.
సరైన సమాధానం:

  • (1) a only is correct / a మాత్రమే సరైనది
  • (2) a and b only are correct / a మరియు b మాత్రమే సరైనవి
  • (3) b and c only are correct / b మరియు c మాత్రమే సరైనవి
  • (4) a and c only are correct / a మరియు c మాత్రమే సరైనవి

Q112. English: Which of the following river/s is/are not a tributary of the river Krishna?
(a) Panchganga
(b) Malaprabha
(c) Purna
(d) Pravara
The correct answer is:
Telugu: క్రింది వాటిలో ఏది/ఏవి కృష్ణానది యొక్క ఉపనది/ఉపనదులు కావు ?
(a) పంచగంగ
(b) మలప్రభ
(c) పూర్ణ
(d) ప్రవర
సరియైన జవాబు :

  • (1) (a) only / (a) మాత్రమే
  • (2) (c) only / (c) మాత్రమే
  • (3) (c) and (d) only / (c) మరియు (d) మాత్రమే
  • (4) (c) and (a) only / (c) మరియు (a) మాత్రమే

Q113. English: Which one of the following is an Indian Satellite sensor ?
Telugu: క్రింది వాటిలో భారతీయ ఉపగ్రహ సెన్సార్ ఏది ?

  • (1) LISS-II
  • (2) MSS
  • (3) LANDSAT
  • (4) Geo Eye

Q114. English: Consider the following ranges in Himalayas and find out the correct sequence from North to South:
(a) Zaskar range
(b) Pirpanjal range
(c) Shivalik range
(d) Ladakh range
The correct answer is:
Telugu: క్రింది పేర్కొన్న హిమాలయ పర్వత శ్రేణులను, ఉత్తరం నుండి దక్షిణం వైపు సరియైన వరుస క్రమంలో గుర్తింపుము.
a. జస్కర్ శ్రేణి
b. పీర్పంజల్ శ్రేణి
c. శివాళిక్ శ్రేణి
d. లడక్ శ్రేణి
సరియైన జవాబు :

  • (1) d-a-b-c
  • (2) a-d-b-c
  • (3) b-d-c-a
  • (4) b-c-a-d

Q115. English: Where is the headquarters of the East Central Railways located?
Telugu: ఈస్ట్ సెంట్రల్ రైల్వేస్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉన్నది?

  • (1) Kolkata / కొల్కట
  • (2) Hajipur / హజిపూర్
  • (3) Allahabad / అలహాబాద్
  • (4) Bilaspur / బిలాస్పూర్

Q116. English: Read the following pairs about the 'International Day of the Girl Child' :
a. The day is to be celebrated on: October 11
b. The organisation which declared the day to be celebrated: UNESCO
The correct answer is:
Telugu: 'ఆడపిల్లల అంతర్జాతీయ దినోత్సవం' కు సంబంధించి కింది జతలను చదవండి :
a. ఈ దినోత్సవాన్ని జరుపుకునే రోజు : అక్టోబర్ 11
b. ఈ దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించిన సంస్థ : యునెస్కో (UNESCO)
సరియైన సమాధానం :

  • (1) Both a and b are correct / a మరియు b రెండూ సరియైనవి
  • (2) Both a and b are not correct / a మరియు b రెండూ సరియైనవి కావు
  • (3) Only a is correct / a మాత్రమే సరియైనది
  • (4) Only b is correct / b మాత్రమే సరియైనది

Q117. English: The following countries are the major importers of liquified petroleum gas (LPG) during 2018-19 :
a. Japan
b. India
c. China
Choose them in the descending order based on their quantity of imports :
Telugu: ధృవీకృత పెట్రోలియం వాయువు (LPG) ను కింది దేశాలు ప్రధానంగా దిగుమతి చేసుకుంటున్నాయి :
a. జపాన్
b. భారతదేశం
c. చైనా
వాటి దిగుమతుల ఆధారంగా వాటిని అవరోహణా క్రమంలో అమర్చండి :

  • (1) a, b and c / a, b మరియు c
  • (2) c, b and a / c, b మరియు a
  • (3) b, a and c / b, a మరియు c
  • (4) c, a and b / c, a మరియు b

Q118. English: Read the following statements about the 'World Sustainable Development Summit 2019' :
a. The summit was held in February 2019 in New Delhi.
b. The theme of the 2019 summit was 'Institutional Framework for Sustainable Development'.
Choose the correct answer:
Telugu: 'ప్రపంచ సుస్థిర అభివృద్ధి సదస్సు 2019' కు సంబంధించి కింది వ్యాఖ్యలను చదవండి :
a. ఈ సదస్సును ఫిబ్రవరీ 2019 లో న్యూఢిల్లీలో నిర్వహించారు.
b. సుస్థిర అభివృద్ధి కొరకు సంస్థాగత చట్రం (ఫ్రేమ్ వర్క్స్)' అనేది 2019 సదస్సు యొక్క థీమ్.
సరియైన సమాధానాన్ని ఎంపికచేయండి:

  • (1) Only a is correct / a మాత్రమే సరియైనది
  • (2) Only b is correct / b మాత్రమే సరియైనది
  • (3) Both a and b are correct / a మరియు b రెండూ సరియైనవి
  • (4) Both a and b are not correct / a మరియు b రెండూ సరియైనవి కావు

Q119. English: As per the 'World Employment and Social Outlook Trends 2019' report published by the ILO in February 2019, the global unemployment rate in 2018 was:
Telugu: ఫిబ్రవరి 2019 లో ILO చే ప్రచురించబడిన 'వరల్డ్ ఎంప్లాయ్మెంట్ అండ్ సోషల్ ఔట్లుక్ ట్రెండ్స్ 2019' నివేదిక ప్రకారం, 2018 లో ప్రపంచ ఉపాధి రేటు ఎంత?

  • (1) 5.6%
  • (2) 5.0%
  • (3) 4.6%
  • (4) 4.0%

Q120. English: Who among the following was honoured in February 2019 with the 'Freedom of the city of London' award in recognition of contributing to promote bilateral relations?
Telugu: 'ఫ్రీడం ఆఫ్ ది సిటీ ఆఫ్ లండన్' అవార్డును ఫిబ్రవరి 2019 లో ద్వైపాక్షిక సంబంధాలను ప్రోత్సహించడానికి దోహదం చేసినందుకు గాను కింది వారిలో ఎవరికి ప్రదానం చేసారు ?

  • (1) Amarthya Sen / ఆమర్థ్యసేన్
  • (2) John Paul Preston / జాన్-పాల్ ప్రెస్టన్
  • (3) Noel Byrne / నోయిల్ బైర్న్
  • (4) Sanjiv Chadha / సంజీవ్ చద్దా

Q121. English: Read the following pairs:
a. Changing India : Dr. Manmohan Singh
b. I Do What I Do : Dr. Urjit Patel
The correct answer is:
Telugu: కింది జతలను చదవండి:
పుస్తకం (ఇంగ్లీషులో) : రచయిత
a. చేంజింగ్ ఇండియా : డా. మన్మహన్ సింఘ్
b. ఐ డు వాట్ ఐ డు : డా. ఉర్జీత్ పటేల్
సరియైన జవాబు :

  • (1) Both a and b are correct / a మరియు b రెండూ సరియైనవి
  • (2) Both a and b are not correct / a మరియు b రెండూ సరియైనవి కావు
  • (3) Only a is correct / a మాత్రమే సరియైనది
  • (4) Only b is correct / b మాత్రమే సరియైనది

Q122. English: Read the following statements about the Astronomical Society of India:
a. Dr. G.C. Anupama became the first female president of Astronomical Society of India.
b. She was elected to the post for the biennium 2019-21.
Choose the correct answer:
Telugu: భారత ఖగోళ శాస్త్ర సొసైటీకి సంబంధించి కింది వ్యాఖ్యలను చదవండి :
a. భారత ఖగోళ శాస్త్ర సొసైటీకి మొదటి మహిళా అధ్యక్షులు డా. జి.సి. అనుపమ.
b. 2019-21 ద్వైవార్షిక (రెండు సంవత్సరాల) కాలానికి ఆమె అధ్యక్షురాలుగా ఎంపిక కాబడింది.
సరియైన సమాధానాన్ని ఎంపిక చేయండి:

  • (1) Both a and b are correct / a మరియు b రెండూ సరియైనవి
  • (2) Both a and b are not correct / a మరియు b రెండూ సరియైనవి కావు
  • (3) Only a is correct / a మాత్రమే సరియైనది
  • (4) Only b is correct / b మాత్రమే సరియైనది

Q123. English: Read the following pairs:
a. National Girl Child Day: 11th October
b. Theme of the National Girl Child Day 2019: Empowering Girls for a Brighter Tomorrow
Choose the correct answer:
Telugu: కింది జతలను చదవండి:
a. నేషనల్ గర్ల్ చైల్డ్ డే : అక్టోబర్ 11
b. 2019 నేషనల్ గర్ల్ చైల్డ్ డే యొక్క థీమ్: 'ప్రకాశవంతమైన రేపటి కొరకు బాలికలను సాధికారికం చేయడం'
సరియైన సమాధానాన్ని ఎంపిక చేయండి:

  • (1) Only a is correct / a మాత్రమే సరియైనది
  • (2) Only b is correct / b మాత్రమే సరియైనది
  • (3) Both a and b are correct / a మరియు b రెండూ సరియైనవి
  • (4) Both a and b are not correct / a మరియు b రెండూ సరియైనవి కావు

Q124. English: Assertion (A): A disaster relief exercise, 'Exercise Rahat' was demonstrated in Rajasthan in February 2019.
Reason (R): Exercise Rahat was organised to synergise efforts for humanitarian assistance and disaster relief operations.
The correct answer is:
Telugu: ప్రతిపాదన (A) : 'ఎక్సర్సైజ్ రహత్' అను విపత్తు ఉపశమన చర్య ఎక్సర్సైజ్ ఫిబ్రవరి 2019 లో రాజస్థాన్లో ప్రదర్శించబడింది.
కారణం (R) : మానవత్వ సహాయం మరియు విపత్తు ఉపశమన కార్యకలాపాల కోసం ప్రయత్నాలను సమన్వయ పరచడానికి 'ఎక్సర్సైజ్ రహత్' నిర్వహించబడింది.
సరియైన సమాధానం :

  • (1) Both (A) and (R) are true, and (R) is the correct explanation of (A) / (A) మరియు (R) రెండూ సరియైనవి, మరియు (A) కు (R) సరియైన వివరణ అవుతుంది
  • (2) Both (A) and (R) are true, but (R) is not the correct explanation of (A) / (A) మరియు (R) రెండూ సరియైనవి, కాని (A) కు (R) సరియైన వివరణ కాదు
  • (3) (A) is true, but (R) is false / (A) సరియైనది, కాని (R) సరియైనది కాదు
  • (4) (A) is false, but (R) is true / (A) సరియైనది కాదు, కాని (R) సరియైనది

Q125. English: Read the following statements:
a. Abhinandan Varthaman is the Indian Air Force (IAF) Air Commodore.
b. He is the first recipient of the 'Bhagwan Mahavir Ahimsa Puraskar'.
c. The award carries a cash prize of 5 lakh.
Which of the statements is/are not correct?
Telugu: కింది వ్యాఖ్యలను చదవండి:
a. భారతీయ వైమానిక దళ (IAF) ఎయిర్ కమోడోర్గా అభినందన్ వర్థమాన్ పనిచేస్తున్నాడు.
b. 'భగవాన్ మహావీర్ అహింసా పురస్కారపు' మొదటి గ్రహీత అతడు.
c. ఈ అవార్డు గ్రహీతకు రూ. 5 లక్షల నగదు బహుమతిని అందిస్తారు.
ఈ వ్యాఖ్యలలో సరి కానివి ఏవి ?

  • (1) a, b and c / a, b మరియు c
  • (2) a and b only / a మరియు b మాత్రమే
  • (3) b only / b మాత్రమే
  • (4) a and c only / a మరియు c మాత్రమే

Q126. English: The government-funded health insurance scheme, the 'Pradhan Mantri Jan Arogya Yojana' was launched in September 2018 by the Prime Minister of India in:
Telugu: ప్రభుత్వ నిధులచే ఏర్పరచబడిన 'ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన' అను ఆరోగ్య బీమా పథకాన్ని సెప్టెంబర్ 2018 లో భారత ప్రధాన మంత్రి ఎక్కడ ప్రారంభించారు ?

  • (1) Gandhinagar / గాంధీనగర్
  • (2) Varanasi / వారణాసి
  • (3) Ranchi / రాంచీ
  • (4) Pune / పుణే

Q127. English: Match the following central agencies with their Directors General :
a. Border Security Force — i. Rajni Kant Mishra
b. Council of Scientific and Industrial Research (CSIR) — iv. Shekar C. Mande
c. Indo-Tibetan Border Police — ii. S.S. Deswal
Telugu: కింది కేంద్ర సంస్థలను వాటి డైరెక్టర్ జనరల్స్తో జతపరచండి :
a. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ — i. రజనీ కాంత్ మిశ్ర
b. శాస్త్రీయ మరియు పారిశ్రామిక పరిశోధనా మండలి (CSIR) — iv. శేఖర్ C. మండె
c. ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ — ii. S.S. దెస్వాల్

  • (1) a-iii, b-i, c-ii
  • (2) a-ii, b-iv, c-i
  • (3) a-i, b-iv, c-ii
  • (4) a-i, b-iii, c-iv

Q128. English: Read the following statements about High Courts in India:
a. A separate High Court for the state of Andhra Pradesh was constituted by the President of India with effect from January 1, 2019.
b. With the creation of this new High Court, India has 27 High Courts as on March 1, 2019.
Choose the correct answer:
Telugu: భారతదేశపు హైకోర్టు (ఉన్నత న్యాయస్థానం) కు సంబంధించి కింది వ్యాఖ్యలను చదవండి :
a. 2019 జనవరి 1 నుండి అమలు అయ్యెటట్లుగా భారత రాష్ట్రపతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేసాడు.
b. ఈ కొత్త హైకోర్టు ఏర్పాటుతో భారతదేశంలో మార్చి 1, 2019 నాటికి మొత్తం 27 హైకోర్టులు ఉన్నాయి.
సరియైన సమాధానాన్ని ఎంపిక చేయండి :

  • (1) Both a and b are correct / a మరియు b రెండూ సరియైనవి
  • (2) Both a and b are not correct / a మరియు b రెండూ సరియైనవి కావు
  • (3) Only a is correct / a మాత్రమే సరియైనది
  • (4) Only b is correct / b మాత్రమే సరియైనది

Q129. English: Match the following:
a. Ashok Chakra (2019) — iv. Nazir Ahmad Wani
b. Carnot Prize (2018) — iii. Piyush Goyal
c. Padma Bhushan (2019) — v. Sukhdev Singh Dhindsa
d. First-ever Philip Kotler Presidential Award — i. Narendra Modi
Telugu: కింది వాటిని జతపరచండి:
a. అశోక చక్ర (2019) — iv. నజీర్ అహ్మద్ వాణి
b. కార్నాట్ ప్రైజ్ (2018) — iii. పియూష్ గోయల్
c. పద్మ భూషణ్ (2019) — v. సుఖ్ దేవ్ సింఘ్ దిండ్సా
d. మొట్టమొదటి ఫిలిప్ కొట్లర్ ప్రెసిడెన్సియల్ అవార్డ్ — i. నరేంద్ర మోడి

  • (1) a-iv, b-i, c-iii, d-ii
  • (2) a-ii, b-iii, c-iv, d-v
  • (3) a-v, b-ii, c-iv, d-i
  • (4) a-iv, b-iii, c-v, d-i

Q130. English: India's heaviest communication satellite GSAT-11 was launched successfully in December 2018 from:
Telugu: భారతదేశపు భారీ కమ్యూనికేషన్ ఉపగ్రహమైన జిసాట్ -11 (GSAT-11) ను డిసెంబర్ 2018 లో కింది ప్రదేశాలలో ఎక్కడి నుండి విజవంతంగా ప్రారంభించారు ?

  • (1) Sriharikota in AP / శ్రీహరికోట, ఆంధ్రప్రదేశ్ నుండి
  • (2) French Guiana / ఫ్రెంచ్ గయానా నుండి
  • (3) Devanagere in Karnataka / దావణగేరి, కర్ణాటక నుండి
  • (4) Hasan in Karnataka / హసన్, కర్ణాటక నుండి

Q131. English: Aero India 2019 was opened in
Telugu: ఏరో ఇండియా 2019 ఎక్కడ ఆరంభించబడింది ?

  • (1) Hyderabad / హైదరాబాద్ లో
  • (2) Chennai / చెన్నయ్ లో
  • (3) Bengaluru / బెంగళూరులో
  • (4) Goa / గోవాలో

Q132. English: The 'Corruption Perceptions Index 2018' of the Transparency International ranked India at
Telugu: ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ (అంతర్జాతీయ పారదర్శకత) వారి 'కరప్షన్ పర్సెప్షన్స్ ఇండెక్స్ (అవినీతి అవగాహనల సూచిక) 2018' లో భారతదేశపు ర్యాంకు ఎంత?

  • (1) 81 in 180 countries / 180 లో 81
  • (2) 78 in 180 countries / 180 లో 78
  • (3) 79 in 180 countries / 180 లో 79
  • (4) 80 in 178 countries / 178 లో 80

Q133. English: Read the following pairs:
a. 1st LAWASIA Human Rights Conference 2019: New Delhi, India
b. World Governments Summit: Hyderabad, India
Choose the correct answer:
Telugu: కింది జతలను చదవండి:
a. LAWASIA మానవ హక్కుల మొదటి కాన్ఫరెన్స్ : న్యూఢిల్లీ, భారతదేశం
b. ప్రపంచ ప్రభుత్వాల సదస్సు : హైదరాబాద్, భారతదేశం
సరియైన సమాధానాన్ని ఎంపిక చేయండి:

  • (1) Both a and b are correct / a మరియు b రెండూ సరియైనవి
  • (2) Both a and b are not correct / a మరియు b రెండూ సరియైనవి కావు
  • (3) Only a is correct / a మాత్రమే సరియైనది
  • (4) Only b is correct / b మాత్రమే సరియైనది

Q134. English: Read the following statements:
a. The Chairman of the Defence Research and Development Organisation (DRDO) is Dr. G. Satheesh Reddy.
b. Dr. G. Sathesh Reddy is the secretary of India's Department of Defence R & D.
c. One of the winners of the '2019 Missile Systems Award' is Dr. G. Satheesh Reddy.
The correct statements are:
Telugu: కింది వ్యాఖ్యలను చదవండి:
a. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) కు Dr. G. సతీష్ రెడ్డి చైర్మన్.
b. భారతదేశపు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (R & D) డిపార్టుమెంట్కు డా|| జి.సతీష్ రెడ్డి సెక్రటరీ.
c. '2019 మిస్సైల్ సిస్టమ్స్ అవార్డు' (క్షిపణి వ్యవస్థల అవార్డు) విజేతల్లో Dr. G. సతీష్ రెడ్డి ఒకరు.
సరియైన వ్యాఖ్యలు :

  • (1) a and b only / a మరియు b మాత్రమే
  • (2) b and c only / b మరియు c మాత్రమే
  • (3) a and c only / a మరియు c మాత్రమే
  • (4) a, b and c / a, b మరియు c

Q135. English: Read the following statements about the Australian Open Tennis Men's singles final match held in 2019:
a. Novak Djokovic defeated Rafael Nadal in straight sets in the final singles title.
b. Novak Djokovic won the men's singles title for a record ninth time.
Choose the correct answer:
Telugu: 2019 లో జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల టెన్నిస్ సింగిల్స్ ఫైనల్ మ్యాచ్కు సంబంధించి కింది వ్యాఖ్యలను చదవండి:
a. సింగిల్స్ ఫైనల్ మ్యాచ్లో రఫాల్ నడాల్ను వరుస సెట్లలో నోవాక్ జోకోవిక్ ఓడించాడు.
b. ఆస్ట్రేలియన్ పురుషుల సింగిల్స్ టైటిల్ను గెలుపొందిన నోవాక్ జోకోవిక్ రికార్డ్ స్థాయిలో మొత్తం తొమ్మిది సార్లు ఈ టైటిల్ను సాధించాడు.
సరియైన సమాధానాన్ని ఎంపిక చేయండి:

  • (1) Only a is correct / a మాత్రమే సరియైనది
  • (2) Only b is correct / b మాత్రమే సరియైనది
  • (3) Both a and b are correct / a మరియు b రెండూ సరియైనవి
  • (4) Both a and b are not correct / a మరియు b రెండూ సరియైనవి కావు

Q136. English: The number of triangles in the given figure is:
Telugu: ఈ క్రింద ఇచ్చిన పటంలోని త్రిభుజాల సంఖ్య :

  • (1) 9
  • (2) 11
  • (3) 13
  • (4) 15

Q137. English: Observe the following sequence and find the missing term among the given options:
0, 5, 6, 15, 24, ___
Telugu: క్రింది అనుక్రమాన్ని పరిశీలించి, ఇచ్చిన బహుళైచ్చికము నుంచి లోపించిన పదాన్ని కనుగొనండి.
0, 5, 6, 15, 24, ___

  • (1) 29
  • (2) 30
  • (3) 39
  • (4) 41

Q138. English: Observe the following sequence and find the missing term among the given options:
8, 12, 24, ___, 60
Telugu: క్రింది అనుక్రమాన్ని పరిశీలించి, ఇచ్చిన బహుళైచ్చికము నుంచి లోపించిన పదాన్ని కనుగొనండి.
8, 12, 24, ____, 60

  • (1) 23
  • (2) 29
  • (3) 31
  • (4) 36

Q139. English: Select the cube among options (1), (2), (3), (4) that cannot be made by folding the given unfolded cube:
Telugu: దిగువ నిచ్చిన మడత పెట్టని ఘనాన్ని మడత పెట్టడం ద్వారా ఇచ్చిన ఐచ్చికాలు (1), (2), (3), (4) లలో రానిది :

  • (1) Option 1 / ఐచ్ఛికం 1
  • (2) Option 2 / ఐచ్ఛికం 2
  • (3) Option 3 / ఐచ్ఛికం 3
  • (4) Option 4 / ఐచ్ఛికం 4

Q140. English: Match the following sequences with their missing terms:
a. 2, 6, 12, 20, 30, 42, ... — iv. 124
b. 1, 9, 25, 49, 81, ... — iii. 121
c. 14, 20, 28, 38, ... — ii. 50
d. 3840, 384, 48, 8, ... — i. 2
Telugu: జాబితా - I (శ్రేఢి) ను జాబితా - II (లోపించిన పదము) తో జతపరచండి:
a. 2, 6, 12, 20, 30, 42, ... — iv. 124
b. 1, 9, 25, 49, 81, ... — iii. 121
c. 14, 20, 28, 38, ... — ii. 50
d. 3840, 384, 48, 8, ... — i. 2

  • (1) a-iv, b-iii, c-i, d-ii
  • (2) a-iv, b-iii, c-ii, d-i
  • (3) a-iii, b-iv, c-ii, d-i
  • (4) a-iii, b-iv, c-i, d-ii

Q141. English: Read the following statements:
If the radius of base of a cylinder is 5 cm and its height is 6 cm then its:
a. Total surface area is 110π sq.cm
b. Curved surface area is 25π sq.cm
c. Volume is 150π cu.cm
The correct answer is:
Telugu: క్రింది ప్రవచనాలను చదవండి:
ఒక స్థూపం భూ వ్యాసార్థం 5 సెం.మీ., ఎత్తు 6 సెం.మీ. అయితే దాని
a. సంపూర్ణతల వైశాల్యం 110π చ.సెం.మీ.
b. వక్రతల వైశాల్యం 25π చ.సెం.మీ.
c. ఘనపరిమాణం 150π ఘ.సెం.మీ.
సరియైన సమాధానం :

  • (1) a and b are true / a మరియు b లు సత్యం
  • (2) b and c are true / b మరియు c లు సత్యం
  • (3) a and c are true / a మరియు c లు సత్యం
  • (4) a, b and c are true / a, b మరియు c లు సత్యం

Q142. English: Observe the following sequence and find the missing term among the given options:
5, 6, 6, 8, 16, 19, 57, ___, 244, 249
Telugu: క్రింది అనుక్రమాన్ని పరిశీలించి, ఇచ్చిన బహుళైచ్చికము నుంచి లోపించిన పదాన్ని కనుగొనండి.
5, 6, 6, 8, 16, 19, 57, ____, 244, 249

  • (1) 1544
  • (2) 121
  • (3) 91
  • (4) 61

Q143. English: The length (in meters) of a rectangular canvas of 2 m width required to cover a conical tent of base radius 14 meters and height 48 meters is:
Telugu: 2 మీటర్లు వెడల్పు కలిగిన ఒక దీర్ఘ చతురస్ర కాన్వాస్తో భూ వ్యాసార్థం 14 మీటర్లు మరియు ఎత్తు 48 మీటర్లు కలిగిన ఒక శంఖు ఆకార గూడారాన్ని కప్పడానికి కావలసిన కాన్వాస్ యొక్క పొడవు (మీటర్లలో) :

  • (1) 1100
  • (2) 1060
  • (3) 960
  • (4) 880

Q144. English: The area of a field in the shape of a trapezium is 7200 square meters. If the length of one of the parallel sides is 80 meters and the distance between the parallel sides is 60 meters, then the length (in meters) of the other parallel side is:
Telugu: సమలంబ చతుర్భుజ ఆకారములో ఉన్న ఒక పొలము యొక్క వైశాల్యము 7200 చదరపు మీటర్లు. సమాంతర భుజములలో ఒక భుజము పొడవు 80 మీటర్లు మరియు సమాంతర భుజాల మధ్య దూరము 60 మీటర్లు అయితే, రెండవ సమాంతర భుజము యొక్క పొడవు (మీటర్లలో) :

  • (1) 240
  • (2) 200
  • (3) 160
  • (4) 150

Q145. English: Find the missing term: 49 : 121 :: 169 : ___
Telugu: ఖాళీని పూరించండి: 49 : 121 :: 169 : ___

  • (1) 225
  • (2) 256
  • (3) 289
  • (4) 324

Q146. English: LOSE : NRWJ :: GAIN : ___
Telugu: LOSE : NRWJ :: GAIN : ___

  • (1) IDLP
  • (2) HCLP
  • (3) IDMS
  • (4) HCMS

Q147. English: 9 : 343 :: 12 : ___
Telugu: 9 : 343 :: 12 : ___

  • (1) 512
  • (2) 1331
  • (3) 729
  • (4) 1000

Q148. English: Based on the Venn diagram, the number of elements in the set (A ∩ B') ∪ (A' ∩ C) is, where A' and B' denote the complements of A and B respectively.
Telugu: ఇచ్చిన వెన్ చిత్రం ఆధారంగా, సమితి (A ∩ B') ∪ (A' ∩ C) లో మూలకాల సంఖ్య, ఇచ్చట A' మరియు B' లు వరుసగా A మరియు B ల యొక్క పూరకములను సూచిస్తాయి.

  • (1) 16
  • (2) 20
  • (3) 21
  • (4) 14

Q149. English: The number of elements in the set A ∩ (B ∪ C) is:
Telugu: సమితి A ∩ (B ∪ C) లోని మూలకాల సంఖ్య:

  • (1) 7
  • (2) 8
  • (3) 9
  • (4) 10

Q150. English: Pick the odd thing:
Telugu: సరిపోలనిది గుర్తించండి:

  • (1) Goat / మేక
  • (2) Hen / కోడి
  • (3) Cow / ఆవు
  • (4) Horse / గుర్రం
Telangana Police Constable Mains Exam 2019 (101-150)

No comments:

Post a Comment