TSPSC Exams 2022: టీఎస్‌పీఎస్సీ ఉద్యోగాల భర్తీ ఇలా.. పోస్టుల వర్గీకరణ, పరీక్షా విధానం, సిలబస్‌ను ప్రకటించిన ప్రభుత్వం
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) ఆధ్వర్యంలో జరగనున్న గ్రూప్-1, 2, 3, 4 పరీక్షలకు సంబంధించి మరో అడుగు ముందుకు పడింది. ప్రత్యక్ష నియామకాల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విధానంపై సోమవారం(25.04.2022) సాధారణ పరిపాలనశాఖ ఉత్తర్వులు (జీవో నెం.55) జారీ చేసింది. పోస్టుల వర్గీకరణ, పరీక్ష విధానం, సిలబస్ వివరాలు ప్రకటించారు. ఇంటర్వ్యూలు రద్దుకు అధికారికంగా అమోదం లభించింది. తుది ర్యాంకుల ఖరారులో పరిగణనలోకి తీసుకునే మార్కులు, పరీక్షలు/ పేపర్ల వారీ అర్హత సాధించడానికి తప్పనిసరి పొందాల్సిన మార్కుల శాతం తదితర అంశాలపై స్పష్టత ఇచ్చింది. గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో ఆయా కేటగిరీలు, విభాగాల నుంచి ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున మెయిన్స్‌కు ఎంపిక చేయనున్నట్లు వెెల్లడించింది. గ్రూప్-1లో 19 రకాల పోస్టులకు 900 మార్కులతో రాతపరీక్ష నిర్వహించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఉత్తర్వుల్లో వెల్లడించారు. గ్రూప్-2లో 16 రకాల పోస్టులకు 600 మార్కులకు రాతపరీక్ష ఉండనుంది. గ్రూప్-3లో 8 రకాల పోస్టులకు 450 మార్కులతో రాతపరీక్ష నిర్వహించనున్నారు. గ్రూప్-4లో జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్ పోస్టులకు 300 మార్కులకు రాతపరీక్ష నిర్వహించాలని నిర్దేశించింది. గ్రూప్-1 మెయిన్స్‌కు 1:50 నిష్పత్తిలో మల్టీజోన్ల వారీగా అభ్యర్థుల ఎంపిక జరగనుంది. తెలుగు, ఆంగ్లం, ఉర్దూ మాధ్యమాల్లో నియామక పరీక్షలుంటాయి. గ్రూప్స్ విభాగంలో భర్తీకానీ ఇతర ఉద్యోగాలకు ప్రత్యేక పరీక్ష విధానం ఉండనున్నట్లు సర్కారు ప్రకటించింది. గ్రూప్-1లో 503, గ్రూప్-2లో 582, గ్రూప్-3లో 1373, గ్రూప్-4లో 9168 పోస్టులను భర్తీ చేయాలని ఆదేశించింది.
TSPSC GROUP-1 SERVICES
ప్రిలిమినరీ పరీక్ష 150 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో వచ్చిన మార్కుల ఆధారంగా 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను మెయిన్స్‌కు ఎంపిక చేస్తారు. ప్రధాన పరీక్షలో ఆరు పేపర్లు ఉంటాయి. 900 మార్కులు కేటాయించారు. మెయిన్స్‌లో 150 మార్కులకుండే ఇంగ్లిష్ పేపర్‌లో అర్హత సాధిస్తే సరిపోతుంది. తుది ఎంపికలో ప్రిలిమినరీ మార్కులను పరిగణనలోకి తీసుకోరు.
TSPSC GROUP-1 POSTS
- డిప్యూటీ కలెక్టర్,
- డీఎస్పీ (కేటగిరీ-2)
- వాణిజ్య పన్నుల అధికారి
- ప్రాంతీయ రవాణా అధికారి
- జిల్లా పంచాయతీ అధికారి
- జిల్లా రిజిస్ట్రార్
- డివిజనల్ ఫైర్ అధికారి
- డీఎస్పీ (కారాగార విభాగం-పురుషులు)
- సహాయ కార్మికశాఖ కమిషనర్
- సహాయ ఎక్సైజ్ సూపరింటెండెంట్
- మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-2
- సహాయ డైరెక్టర్ / జిల్లా ఎస్సీ సంక్షేమాధికారి
- జిల్లా బీసీ సంక్షేమాధికారి / సహాయ డైరెక్టర్
- జిల్లా గిరిజన సంక్షేమాధికారి
- జిల్లా ఉపాధి కల్పన అధికారి
- పరిపాలన అధికారి, ట్రెజరర్ గ్రేడ్-2 (వైద్య, ఆరోగ్య సేవలు)
- సహాయ ఖజానా అధికారి, సహాయ గణాంక అధికారి, శిక్షణ కళాశాల, పాఠశాలలో సహాయ లెక్చరర్ (ఖజానా, అకౌంట్స్ సర్వీసెస్)
- సహాయ ఆడిట్ అధికారి (రాష్ట్ర ఆడిట్ సర్వీసెస్)
- మండల పరిషత్ అభివృద్ధి అధికారి (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి)
TSPSC GROUP-1 EXAM SYLLABUS & PATTERN
ప్రిలిమినరీ పరీక్ష - జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీస్ 150 ప్రశ్నలు - రెండున్నర గంటలు - 150 మార్కులు.
ప్రధాన పరీక్ష
జనరల్ ఇంగ్లిష్ (అర్హతపరీక్ష) - 3 గంటలు - 150 మార్కులు
పేపర్-1:
జనరల్ ఎస్సే - 3 గంటలు - 150 మార్కులు
- సామాజిక సమస్యలు, అంశాలు
- ఆర్థికాభివృద్ధి, న్యాయం
- భారత రాజకీయాలు, మార్పులు
- భారత చరిత్ర, సాంస్కృతిక వారసత్వం
- సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి 6. విద్య, మానవ వనరుల అభివృద్ధి
పేపర్-2:
చరిత్ర, సంస్కృతి, భౌగోళిక శాస్త్రం - 3 గంటలు - 150 మార్కులు
- 1757-1947 వరకు భారత దేశ చరిత్ర, సంస్కృతి
- తెలంగాణ చరిత్ర, సాంస్కృతిక వారసత్వం
- భారత దేశ, తెలంగాణ భౌగోళిక స్వరూపం
పేపర్-3:
భారతదేశ సమాజం, రాజ్యాంగం, పరిపాలన - 3 గంటలు - 150 మార్కులు
- భారత దేశ సమాజం, ఆకృతి, సమస్యలు, సామాజిక ఉద్యమాలు
- భారత రాజ్యాంగం
- పరిపాలన
పేపర్-4:
ఆర్థికశాస్త్రం, అభివృద్ధి - 3 గంటలు - 150 మార్కులు
- భారత ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి
- తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి
- పర్యావరణ సమస్యలు
పేపర్-5:
సైన్స్ అండ్ టెక్నాలజీ, డేటా ఇంటర్‌ప్రెటేషన్ - 3 గంటలు - 150 మార్కులు
- సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రాముఖ్యత, ప్రభావం
- సైన్స్ విజ్ఞానంలో ఆధునికత వినియోగం
- డేటా ఇంటర్‌ప్రెటేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్
పేపర్-6:
తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం - 3 గంటలు - 150 మార్కులు
- తెలంగాణ ఆలోచన (1948-1970)
- సమీకరణ దశ (1971-1990)
- తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం (1991-2014)
TSPSC GROUP-2 SERVICES
గ్రూప్-2 సర్వీసులకు మొత్తం 600 మార్కులకు పరీక్షలు జరుగుతాయి. మొత్తం నాలుగు పేపర్లు. ఒక్కోపేపర్ నుంచి 150 చొప్పున మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు అడుగుతారు. ప్రతిపేపర్‌కు రెండున్నర గంటల వ్యవధి. ఒక్కోపేపర్ గరిష్ఠ మార్కులు 150.
TSPSC GROUP-2 POSTS
- మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-3
- సహాయ వాణిజ్యపన్నుల అధికారి
- డిప్యూటీ తహశీల్దార్లు
- సబ్‌రిజిస్ట్రార్ గ్రేడ్-2 (రిజిస్ట్రేషన్ సర్వీసులు)
- జూనియర్ ఉపాధికల్పన అధికారి
- సహాయ రిజిస్ట్రార్ (సహకార సర్వీసులు)
- సహాయ కార్మిక అధికారి
- ఎక్స్‌టెన్షన్ అధికారి / మండల పంచాయతీ అధికారి (పంచాయతీరాజ్ సర్వీసులు)
- ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్
- ఎగ్జిక్యూటివ్ అధికారి గ్రేడ్-2
- సహాయ అభివృద్ధి అధికారి (చేనేత, టెక్స్‌టైల్ సర్వీసులు)
- కార్యనిర్వహణాధికారి గ్రేడ్-1 (దేవాదాయశాఖ)
- సహాయ సెక్షన్ అధికారి (సచివాలయ సర్వీసులు)
- సహాయ సెక్షన్ అధికారి (శాసన సర్వీసులు)
- సహాయ సెక్షన్ అధికారి (ఆర్థికశాఖ, సచివాలయ సర్వీసులు)
- సహాయ సెక్షన్ అధికారి (న్యాయశాఖ, సచివాలయ సర్వీసులు)
TSPSC GROUP-2 EXAM SYLLABUS
పేపర్-1:
జనరల్ ఎబిలిటీస్, స్టడీస్ - 150 ప్రశ్నలు - రెండున్నర గంటలు - 150 మార్కులు
పేపర్-2:
చరిత్ర, రాజకీయం, సమాజం - 150 ప్రశ్నలు - రెండున్నర గంటలు - 150 మార్కులు
- భారతదేశ, తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర (50 ప్రశ్నలు)
- భారత రాజ్యాంగం, రాజకీయాలు (50 ప్రశ్నలు)
- సామాజిక సమస్యలు, ప్రజా విధానాలు (50 ప్రశ్నలు)
పేపర్-3:
ఆర్థికవ్యవస్థ, అభివృద్ధి - 150 ప్రశ్నలు - రెండున్నర గంటలు - 150 మార్కులు
- భారత ఆర్థిక వ్యవస్థ: సమస్యలు, సవాళ్లు (50 ప్రశ్నలు)
- తెలంగాణ ఆర్థిక, అభివృద్ధి (50 ప్రశ్నలు)
- అభివృద్ధి, మార్పులు - సమస్యలు (50 ప్రశ్నలు)
పేపర్-4:
తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం - 150 ప్రశ్నలు - రెండున్నర గంటలు - 150 మార్కులు
- తెలంగాణ ఆలోచన (1948-1970) (50 ప్రశ్నలు)
- సమీకరణ దశ (1971-1990) (50 ప్రశ్నలు)
- తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం (1991-2014) (50 ప్రశ్నలు)
TSPSC GROUP-3 SERVICES
ఇందులో 8 సర్వీసులు ఉన్నాయి. పరీక్ష 450 మార్కులకు ఉంటుంది. ఇందులో 3 పేపర్లు, ఒక్కో పేపర్‌లో 150 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు అడుగుతారు. కాలపరిమితి రెండున్నర గంటలు ఉంటుంది. ఈ పరీక్షను తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ మాధ్యమాల్లో నిర్వహిస్తారు
TSPSC GROUP-3 POSTS
- సీనియర్ అకౌంటెంట్ (ప్రభుత్వ బీమా సేవలు)
- ఆడిటర్ (పే అండ్ అకౌంట్స్ సర్వీసులు)
- సీనియర్ అకౌంటెంట్ (ఖజానా, అకౌంట్స్ సేవలు)
- సీనియర్ ఆడిటర్ (స్థానిక నిధులు, ఆడిట్ సేవలు)
- సహాయ ఆడిటర్ (పే అకౌంట్స్ సేవలు)
- జూనియర్ అసిస్టెంట్స్ (విభాగాధిపతులు)
- జూనియర్ అకౌంటెంట్స్ (డైరెక్టరేట్, ఖజానా, అకౌంట్స్ సేవలు)
- జూనియర్ అకౌంటెంట్ (ప్రభుత్వ బీమా సేవలు)
TSPSC GROUP-3 EXAM SYLLABUS & PATTERN
పేపర్-1 - జనరల్ స్టడీస్, ఎబిలిటీస్ - 150 ప్రశ్నలు- రెండున్నర గంటలు - 150 మార్కులు
పేపర్-2 - చరిత్ర, రాజకీయాలు, సమాజం - 150 ప్రశ్నలు - రెండున్నర గంటలు - 150 మార్కులు
- తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర, రాష్ట్ర ఏర్పాటు (50 ప్రశ్నలు)
- భారత రాజ్యాంగం, రాజకీయాలు (50 ప్రశ్నలు)
- సామాజిక స్వరూపం, సమస్యలు, ప్రజా విధానాలు (50 ప్రశ్నలు)
పేపర్-3 - ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి - 150 - రెండున్నర గంటలు - 150 మార్కులు
- భారత ఆర్థిక వ్యవస్థ: సమస్యలు, సవాళ్లు (50 ప్రశ్నలు)
- తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, అభివృద్ది (50 ప్రశ్నలు)
- అభివృద్ధి, మార్పులు - సమస్యలు (50 ప్రశ్నలు)
TSPSC GROUP-4 SERVICES
ఇందులో వివిధ ప్రభుత్వ విభాగాల్లో జూనియర్ అసిస్టెంట్, అకౌంటెంట్స్ తదితర పోస్టులు ఉంటాయి. సాధారణ పోస్టులకు జనరల్ స్టడీస్ 150 మార్కులు, సెక్రటేరియల్ ఎబిలిటీస్‌కు 150 మార్కులు కలిపి మొత్తం 300 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఒక్కో పేపర్‌లో 150 ప్రశ్నలు అడుగుతారు.
TSPSC GROUP-4 GAZETTED POSTS
గ్రూపు-1, గ్రూపు-2లతో సంబంధం లేని గెజిటెడ్ ఉద్యోగాల భర్తీలో రాతపరీక్షల్లో 450 మార్కులుంటాయి. పరీక్ష నిర్వహణలో మొదటి పేపర్‌లో జనరల్ స్టడీస్, ఎబిలిటీఎస్‌లో 150 ప్రశ్నలకు 150 నిమిషాల సమయం ఇస్తారు. 150 మార్కులుంటాయి. పేపర్-2లో సంబంధిత సబ్జెక్ట్‌లో 150 ప్రశ్నలకు 150 నిమిషాల్లో జవాబివ్వాలి. ఒక్కో ప్రశ్నకు 2 మార్కుల చొప్పున మొత్తం 300 మార్కులుంటాయి.
TSPSC GROUP-4 NON-GAZETTED POSTS
- గ్రూపులతో సంబంధం లేని నాన్ గెజిటెడ్ పోస్టులకు మొత్తం రెండు పేపర్లలో కలిపి మూడు వందల మార్కులుంటాయి. మొదటి పేపర్‌లో జనరల్ స్టడీస్, ఎబిలిటీస్ 150 ప్రశ్నలకు 150 నిమిషాల్లో, రెండో పేపర్‌లో సబ్జెక్టుకు 150 ప్రశ్నలకు 150 నిమిషాల్లో సమాధానాలు రాయాలి.
TSPSC GROUP-4 OTHER POSTS
అసిస్టెంటు ఫారెస్ట్ కన్జర్వేటర్ పోస్టుల పరీక్షలో 4 పేపర్లు ఉంటాయి. వీటికి 650 మార్కులు. 450 ప్రశ్నలకు 450 నిమిషాల్లో సమాధానాలివ్వాలి. మొదటి పేపర్‌లో జనరల్ ఇంగ్లిష్, రెండో దానిలో జనరల్ స్టడీస్, ఆప్షనల్ 1, 2 పేపర్లుంటాయి.
- ఫారెస్ట్ రేంజి అధికారి, జిల్లా సైనిక సంక్షేమాధికారి పోస్టులకు 450 మార్కులుంటాయి.
- సూపర్‌వైజర్, మేట్రన్ గ్రేడ్-2, వసతి గృహాధికారి గ్రేడ్-2 పోస్టులకు రెండు పేపర్లలో 300 ప్రశ్నలకు మూడు వందల మార్కులుంటాయి.
- శాసనసభలో సహాయ అనువాదకుని పోస్టుకు 300 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. సీనియర్ రిపోర్టర్ (ఆంగ్లం, తెలుగు, ఉర్దూ) పోస్టులకు 150 మార్కుల చొప్పున షార్ట్‌హాండ్ పరీక్ష ఉంటుంది.
TSPSC GROUP-4 SYLLABUS
- పేపర్-1 జనరల్ స్టడీస్‌లో పదో తరగతి స్థాయిలో చరిత్ర, భూగోళశాస్త్రం, పౌరశాస్త్రం, ఎకనామిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, వర్తమానాంశాలు, బాలల హక్కులు వంటి అంశాలుంటాయి.
TSPSC GROUP-4 ELIGIBILITY MARKS
- ఈ పోస్టులకు ఓసీ, ఈడబ్ల్యూఎస్, క్రీడా, మాజీ సైనికుల కోటా కేటగిరి అభ్యర్థులు 40 శాతం మార్కులు పొందడం తప్పనిసరి. బీసీలకు 35 శాతం, ఎస్సీ,ఎస్టీ, దివ్యాంగులకు 30 శాతం మార్కులు రావాలి. గ్రూపు-1 పోస్టుల్లో మెయిన్స్‌కు మాత్రమే అర్హత మార్కులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రాతపరీక్షలో సాధించిన మార్కులను పరిగణనలోకి తీసుకొని ఎంపిక చేస్తారు.