Constitution of India - New Challenges Practice Bits in Telugu
1. రాజ్యాంగ రచనలో ఎదురైన సవాలు కానిది
ఎ) ప్రత్యేక మినహాయింపులు, రక్షణలు
బి) విసృత పరిశీలనలు
సి) సమగ్ర క్రోడీకరణ
డి) పైవి ఏవీకాదు
2. రాజ్యాంగంలో ఎక్కువ పర్యాయాలు సవరించబడిన, వివాదాస్పదమైన అంశం
ఎ) ప్రవేశిక
బి) ప్రాథమిక హక్కులు
సి) ఆదేశిక నియమాలు
డి) అత్యవసర అధికారాలు
3. భారత రాజ్యాంగ ఎదుర్కొంటున్న అత్యంత ముఖ్యమైన సవాలు
ఎ) రాజ్యాంగ స్ఫూర్తి - ఆచరణ అంతరాలు
బి) పరిపాలన శూన్యత
సి) అవినీతి
డి) బంధుప్రీతి
4. ప్రపంచీకరణ, ఆర్థిక సరళీకరణ వలన ప్రభావితమైన రాజ్యాంగ మౌలిక అంశం
ఎ) లౌకికతత్వం
బి) స్వామ్యవాదం
సి) గణతంత్రం
డి పై అన్నియు
5. నేరమయ రాజకీయలపై నివేదిక సమర్పించిన కమిటి
ఎ) ఎన్.ఎన్. వోహ్రా
బి) రాజేంద్ర సచార్
సి) క. సంతానం
డి) కె.పి. గిల్
6. అత్యధిక నేరారోపణలు ఏ రాజకీయ పార్టీ అభ్యర్థులపై వున్నాయి.
ఎ) కాంగ్రెస్ (ఐ)
బి) భారతీయ జనతాపార్టీ
సి) సమాజ్‌వాది పార్టీ
డి) బహుజన పార్టీ
7. న్యాయ వ్యవస్థపై వస్తున్న ప్రధాన ఆరోపణలు
వ) అతిక్రియాశీలత
బి) మితిమీరిన జాప్యం
సి) కోర్ట్ ధిక్కార అతి వినియోగం
డి) పై అన్నియు
8. రాజ్యాంగ వ్యవస్థలు బలహీన పడటానికి కారణాలు
ఎ) ఆచరణకు - స్పూర్తికి వ్యత్యాసం ఉన్నప్పుడు
బి) ప్రజలకు వ్యవస్థపై విశ్వాసం తగ్గినపుడు
సి) ఉపయుక్తం పై నమ్మకం లేనప్పుడు
డి) పై అన్నియు సరైనవే
9. ఈ క్రింది వాటిలో సరైనది
ఎ) స్వాతంత్ర్యానంతర భారత రాజకీయ వ్యవస్థక విసృత సామాజిక మార్పుకు కృషి చేయాల్సిన అవసరం ఏర్పడింది.
బి) రాజకీయ వ్యవస్థను నియంత్రిక గల సమాజం ఏర్పడలేదు.
సి) ఆచార, సాంప్రదాయాల స్థానంలో ప్రత్యామ్నాయ సంస్కృతిని రూపొందించాల్సి ఉంది.
డి) పై అన్నియు సరైనవే
10. అధికారాన్ని కాపాడుకోవటానికి రాజ్యాంగ వ్యవస్థలను, సూత్రాలను విస్మరించడం ఎప్పుడు ప్రారంభమైంది.
ఎ) 1967 తర్వాత
వ) 1977 తర్వాత
సి) 1957 తర్వాత
డి) 1997 తర్వాత
11. ప్రజాస్వామ్య, చట్టబద్ధ పాలనకు వ్యతిరేక నియంతృత్వ చర్య
ఎ) ఆంతరంగిక అత్యవసర పరిస్థితి విధింపు.
బి) రాజభరణాల రద్దు
సి) ఆస్తి హక్కు తొలగింపు
డి) పై అన్నియు
12. ఈ క్రింది వాటిలో సరైనది
ఎ) అధికారాల కేంద్రీకరణ వ్యవస్థల పతనానికి ప్రతీక
బి) అధికార కేంద్రీకరణ రాజ్యాంగ వ్యవస్థ అమలుకు సవాలే
సి) పై రెండు సరైనవే
డి) పైవి ఏవీ సరికావు
13. 1980 తరువాత రాజకీయ వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లు
ఎ) మతతత్వం
బి) నేరమయ రాజకీయాలు
సి) ప్రాంతీయ తత్వం
డి) పై అన్నియు
14. జాతి సమైఖ్యత అనేది
ఎ) మానసిక ఉద్వేగం
బి) నైతిక ప్రవర్తన
సి) సామాజిక పరివర్తన
డి) పై అన్నియు
సమాధానాలు
1.డి 2.బి 3.ఎ 4.బి 5.ఎ 6.ఎ 7.డి 8.డి 9.డి 10.ఎ 11.ఎ 12.సి 13.డి 14.ఎ