📄 Telangana Police Constable Preliminary Exam - 2018 : Q101 to Q150
Q101. English: The Surma Valley which has reserves of mineral oil is located in:
Telugu: మినరల్ ఆయిల్ (ఖనిజ తైలం) నిల్వలున్న సుర్మా లోయ గల రాష్ట్రం:
- (1) Himachal Pradesh
- (2) Maharashtra
- (3) Assam
- (4) Gujarat
Q102. English: 'Marble Water Falls' (Dhuandhar Falls) is connected with which river?
Telugu: 'మార్బల్ జలపాతం' (ధువాందర్ ఫాల్స్) గల నది:
- (1) Banas
- (2) Periyar
- (3) Tapti
- (4) Narmada
Q103. English: Which of the following is NOT a foot loose industry?
Telugu: క్రింది వాటిలో ఏది ఫుట్‌లూజ్ పరిశ్రమ కాదు ?
- (1) Cement Industry
- (2) Cotton Textile Industry
- (3) Sugar Industry
- (4) Iron & Steel Industry
Q104. English: Telangana's decadal population growth rate has been continuously declining since:
Telugu: తెలంగాణ యొక్క దశాబ్ద జనాభా పెరుగుదల రేటు ఏ దశాబ్దం నుండి నిరంతరంగా తగ్గుతూ వస్తుంది?
- (1) 1991-2001
- (2) 2001-2011
- (3) 1971-81
- (4) 1981-91
Q105. English: If the time at Greenwich (0°) is 8.15 am, what is the local time at 45° East longitude?
Telugu: గ్రీన్ విచ్ (0°) వద్ద సమయం ఉదయం 8.15 అయినపుడు, 45° తూర్పు అక్షాంశంపై స్థానిక సమయం ఎంత అవుతుంది?
- (1) 11.15 am
- (2) 11.00 pm
- (3) 11.00 am
- (4) 11.30 am
Q106. English: The Topographical maps of India is published by:
Telugu: భారతదేశ టోపోగ్రాఫికల్ మ్యాప్‌ను ప్రచురించే సంస్థ:
- (1) NATMO
- (2) GSI
- (3) NCERT
- (4) SOI
Q107. English: Kanha National Park belongs to the bio-geographical areas of:
Telugu: కన్హా నేషనల్ పార్క్ ఏ బయోజియోగ్రాఫికల్ ప్రాంతానికి సంబంధించినది ?
- (1) Tropical Rain Forest
- (2) Tropical Thorn Forest
- (3) Tropical Evergreen Forest
- (4) Tropical Dry deciduous forest
Q108. English: The Teak grows abundantly in the areas of:
Telugu: టేకు వృక్షాలు విస్తారంగా పెరిగే ప్రాంతాలు:
- (1) Western ghats
- (2) Assam, Meghalaya
- (3) The western Himalayas
- (4) Central India
Q109. English: Which of the following is contiguous to Tadoba Andheri Tiger reserve?
Telugu: క్రింది వానిలో ఏది తడోబా అందేరి టైగర్ రిజర్వుకు పక్కనే కలుపుకొని ఉన్నది?
- (1) Kawal
- (2) Mannanur
- (3) Amrabad
- (4) Kinnerasani
Q110. English: Total Fertility Rate (TFR) is highest in the states of:
Telugu: మొత్తం సంతానోత్పత్తి రేటు (TFR) అత్యధికంగా ఉన్న రాష్ట్రాలు:
- (1) Maharashtra, Gujarat
- (2) Madhya Pradesh, Rajasthan
- (3) Karnataka, Tamilnadu
- (4) A.P., Telangana
Q111. English: India's top three import items (value) during the financial year 2017:
Telugu: భారతదేశం, 2017 ఆర్థిక సంవత్సరంలో దిగుమతి చేసుకొన్న మూడు ప్రధాన దిగుమతులు (విలువలో):
- (1) Petroleum Products, Electronics, Gems & Jewellery
- (2) Gems & Jewellery, Petroleum Products, Machinery
- (3) Petroleum Products, Gems & Jewellery, Electronics
- (4) Petroleum Products, Chemicals, Electronics
Q112. English: Which of the following location is significant for renewable energy generation in India?
Telugu: క్రింది వాటిలో ఏది ఇండియాలో పునరుత్పాదక శక్తికి ముఖ్యమైన ప్రదేశం ?
- (1) Muppandal
- (2) Nellore
- (3) Velankanni
- (4) Guna
Q113. English: 'Hangul' is a critically endangered species found mainly in the State of:
Telugu: అత్యంత ప్రమాదకరంగా అంతరించిపోయే పరిస్థితులలో ఉన్న 'హంగుల్' అనే జంతువు ప్రధానంగా లభ్యమయ్యే రాష్ట్రం:
- (1) Arunachal Pradesh
- (2) Jammu & Kashmir
- (3) Kerala
- (4) Tamil Nadu
Q114. English: Ramgarh, Hutar and North Karanpura related to coal mines are located in the state of:
Telugu: కోల్ మైన్స్‌కు సంబంధించి రామఘర్, హుతార్ మరియు ఉత్తర కరణ పూర గల రాష్ట్రం:
- (1) Odisha
- (2) Bihar
- (3) Jharkhand
- (4) Chhattisgarh
Q115. English: The number of states at present which fall in the catchment area of Godavari river:
Telugu: ప్రస్తుతం గోదావరి నది యొక్క పరీవాహక ప్రాంతంలో గల రాష్ట్రాల సంఖ్య ఎంత ?
- (1) 8
- (2) 7
- (3) 4
- (4) 5
Q116. English: Arrange the following iron-ores in descending order of their metal content:
a. Magnetite | b. Limonite | c. Haematite | d. Siderite
Telugu: క్రింది పేర్కొన్న ఇనుప ధాతువులను వాటిలో లభించే ఖనిజ పదార్థాన్ని బట్టి అవరోహణ క్రమంలో అమర్చుము:
a. మాగ్నటైట్ | b. లిమోనైట్ | c. హెమటైట్ | d. సిడరైట్
Options: (1) a, b, c, d | (2) d, a, c, b | (3) a, c, b, d | (4) c, a, b, d
Q117. English: Arrange the following areas of India, in the sequence of lower to higher rainfall:
a. Eastern U.P. | b. Ganga Delta | c. Western U.P. | d. Sahyadri
Telugu: క్రింది పేర్కొన్న భారతదేశ ప్రాంతాలలో తక్కువ వర్షపాతం నుండి అధిక వర్షపాతం సంభవించే ప్రాంతాలను వరుస క్రమంలో గుర్తింపుము:
a. తూర్పు ఉత్తర ప్రదేశ్ | b. గంగా డెల్టా | c. పశ్చిమ ఉత్తర ప్రదేశ్ | d. సహ్యాద్రి
Options: (1) Sahyadri, Ganga Delta, Eastern U.P., Western U.P. | (2) Western U.P., Eastern U.P., Ganga Delta, Sahyadri | (3) Ganga Delta, Eastern U.P., Western U.P., Sahyadri | (4) Eastern U.P., Ganga Delta, Sahyadri, Western U.P.
Q118. English: Which of the following statement/s is/are correct?
a. Kamuthi is one of the largest solar power projects located in Tamil Nadu.
b. In India, geothermal power plants are located in Manikaran in Uttarakhand and Puga Valley in Ladakh.
Telugu: క్రింది ప్రకటనలలో సరియైనది ఏది/ఏవి?
a. తమిళనాడు రాష్ట్రంలో వున్న 'కముతి' సౌర విద్యుత్కేంద్రం అతి పెద్ద సౌర ప్రాజెక్ట్లలో ఒకటి.
b. భారతదేశంలో జియోథర్మల్ విద్యుత్ శక్తి ప్లాంటులు ఉత్తరాఖండ్‌లోని మనికరణ్ మరియు లడఖ్‌లోని పూగా లోయ వద్ద స్థాపించబడినవి.
Options: (1) Both 'a' & 'b' | (2) Neither 'a' nor 'b' | (3) 'a' only | (4) 'b' only
Q119. English: The number of Urban agglomerations in India with a population of one million or more as of 2011 census are:
Telugu: భారతదేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం పది లక్షల జనాభా కంటే ఎక్కువ గల పట్టణ సముదాయాల సంఖ్య:
- (1) 53
- (2) 61
- (3) 35
- (4) 51
Q120. English: Which one of the following Nuclear power station has the highest capacity in India at present?
Telugu: క్రింది పేర్కొన్న భారతదేశంలోని అణువిద్యుత్ కేంద్రాలలో ప్రస్తుతం అత్యధిక అణువిద్యుత్తు సామర్థ్యం గల కేంద్రం ఏది?
- (1) Kaiga
- (2) Kakrapara
- (3) Tarapur
- (4) Kudankulam
Q121. English: Match the following:
a. Pradhan Mantri Kaushal Vikas Yojana (PMKVY) – ii. To encourage skill development for youth by providing monetary rewards.
b. Prime Minister's Rozgar Yojana (PMRY) – iv. To provide self employment to more than a million educated unemployed youth.
c. Deen Dayal Upadhyaya - Grameen Kaushalya Yojana (DDGKY) – iii. To convert India's demographic surplus into a demographic dividend.
d. Aajeevika – i. Providing requisite skills to poor for managing their institutions.
Telugu: జత పరచుము:
a. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన (PMKVY) – ii. నగదు బహుమతులు కల్పించుట ద్వారా యువతలో నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించుట.
b. ప్రధానమంత్రి రోజ్ గార్ యోజన (PMRY) – iv. ఒక మిలియన్ అక్షరాస్యులైన నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పన.
c. దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ్ కౌశల్య యోజన (DDGKY) – iii. భారతదేశ జనాభా మిగులును, జనాభా డివిడెండ్‌గా మార్చుట.
d. ఆజీవిక – i. పేదవారికి వారి సంస్థల నిర్వహణకు అవసరమైన నైపుణ్యాలను కల్పించుట.
Options: (1) a-ii, b-iv, c-iii, d-i | (2) a-iii, b-ii, c-iv, d-i | (3) a-ii, b-i, c-iii, d-iv | (4) a-iv, b-ii, c-i, d-iii
Q122. English: Which of the following statements is/are correct?
a. India's foreign exchange reserves declined from $7 billion dollars in 1979-80 to just $600 million dollars in January 1991.
b. In 1979-80, India's foreign debt was $18 billion dollars and by March, 1991 it had risen to $90 billion dollars.
Telugu: క్రింది వ్యాఖ్యలలో ఏది/ఏవి సరైనది ?
a. భారత ప్రభుత్వపు విదేశీ మారక నిధులు 1979-80 లో 7 బిలియన్ డాలర్ల నుంచి జనవరి, 1991 నాటికి 600 మిలియన్ డాలర్లకు పడిపోయాయి.
b. 1979-80 లో భారతదేశ విదేశీ రుణం 18 బిలియన్ డాలర్లు ఉండగా 1991 నాటికి 90 బిలియన్ డాలర్లుకు చేరింది.
Options: (1) b only is correct | (2) Both a and b are not correct | (3) Both a and b are correct | (4) a only is correct
Q123. English: With which of the following programmes, it is intended to increase the production of rice, wheat and pulses by 10, 8 and 2 million tonnes respectively by the end of Eleventh Plan?
Telugu: పదకొండవ ప్రణాళిక అంతానికి వరి, గోధుమ మరియు పప్పు ధాన్యాల ఉత్పత్తిలో వరుసగా 10, 8 మరియు 2 మిలియన్ టన్నుల పెరుగుదల సాధనకు ఉద్దేశింపబడిన పథకం ఏది?
- (1) National Food Security Mission
- (2) National Mission for Sustainable Agriculture
- (3) Bharat Nirman Programme
- (4) Pradhan Mantri Kisan Sinchayi Yojana
Q124. English: Which of the following services cannot be availed using Aadhaar Enabled Payment System (AEPS) through the micro-ATMs with Business Correspondents?
Telugu: బిజినెస్ కరస్పాండెంట్స్ వద్ద ఉన్న మైక్రో - ATM ల ద్వారా ఆధార్‌తో యుక్తమైన చెల్లింపు విధానం (AEPS) ను ఉపయోగించి దిగువ తెలిపిన సేవలలో దేనిని వినియోగించుటకు వీలు కాదు?
- (1) Demand Draft
- (2) Funds Transfer
- (3) Cash Withdrawal
- (4) Cash Deposit
Q125. English: Read the following statements:
a. The National Sample Survey Office (NSSO) is responsible for conduct of large scale sample surveys.
b. The Twenty Point Programme (TPP) initiated in 1975 was restructured in the year 1982, 1986 and 2006.
c. The NSSO functions with autonomy under overall guidance and supervision of National Statistical Commission (NSC).
Telugu: క్రింది వ్యాఖ్యలను చదవండి:
a. పెద్దతరహా శాంపిల్ సర్వేలను నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీసు (NSSO) నిర్వహిస్తుంది.
b. 1975 లో ప్రతిపాదించిన 20 అంశాల పథకం, 1982, 1986 మరియు 2006 లో సవరించబడినది.
c. కేంద్ర గణాంకాల కమీషన్ (National Statistical Commission) యొక్క పూర్తిస్థాయి మార్గదర్శకం మరియు పర్యవేక్షణలో నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీసు స్వయంప్రతిపత్తితో విధులను నిర్వహించును.
Options: (1) a and c only are correct | (2) a, b and c are correct | (3) a and b only are correct | (4) b and c only are correct
Q126. English: Capital issues consist of two parts - shares and debentures. Read the following statements in this context:
a. All shareholders do not have any ownership of the company.
b. All shares are merely loans which carry fixed interest rate and are non-convertible.
c. All debenture holders do not have any share in the ownership of the company.
d. All debentures are merely loans which carry fixed interest rate.
Which of the above statements is/are NOT correct?
Telugu: మూలధన జారీలో రెండు భాగాలు అనగా వాటాలు, డిబెంచర్లు ఉంటాయి. వీటికి సంబంధించి క్రింది వ్యాఖ్యలను చదువుము:
a. వాటాదారులందరూ కంపెనీలో ఎలాంటి యాజమాన్యాన్ని కలిగి ఉండరు.
b. వాటాలన్నియూ కేవలం మార్పిడి చేయుటకు వీలు కాని రుణాల రూపంలో ఉండి స్థిర వడ్డీని ఆర్జిస్తాయి.
c. డిబెంచర్లను కలిగిన వారందరు కంపెనీల యాజమాన్యంలో ఎలాంటి వాటాను కలిగి ఉండరు.
d. డిబెంచర్లన్నియు కేవలం రుణాల రూపంలో ఉండి స్థిరమైన వడ్డీని ఆర్జిస్తాయి.
పై వాటిలో ఏది/ఏవి సరియైనది కాదు?
Options: (1) a and c only | (2) a and b only | (3) c and d only | (4) b, c and d only
Q127. English: Match the following:
a. The new Indian Bankruptcy Code (IBC) – ii. To help corporates to clean up their balance sheets and reduce their debts.
b. A large recapitalization package – iii. To strengthen the balance sheets of Public Sector Banks.
c. Demonetisation and GST – iv. A noteworthy increase in the number of tax filers.
d. Indradhanush – i. Improving the performance of Public Sector Banks.
Telugu: జతపరచుము:
a. భారతీయ నూతన దివాళా కోడ్ (IBC) – ii. కార్పోరేట్ సంస్థలకు వాటి ఆస్తి, అప్పుల పట్టికలో సర్దుబాటు, రుణాలలో తగ్గుదలకు సహకారం.
b. రీ కాపిటలైజేషన్ ప్యాకేజి – iii. ప్రభుత్వరంగ బ్యాంకుల ఆస్తి అప్పుల పట్టికలను బలోపేతం చేయడం.
c. డిమానెటైజేషన్ మరియు వస్తు సేవల పన్ను – iv. పన్ను చెల్లింపుదారుల సంఖ్యలో గణనీయమైన పెరుగుదల.
d. ఇంద్ర ధనుష్ – i. ప్రభుత్వరంగ బ్యాంకుల పనితీరులో పెరుగుదల సాధన.
Options: (1) a-ii, b-iii, c-iv, d-i | (2) a-i, b-ii, c-iii, d-iv | (3) a-ii, b-i, c-iv, d-iii | (4) a-i, b-iv, c-ii, d-iii
Q128. English: Which of the following industries is/are NOT an agro-based industry?
a. Textile Industry, b. Sugar Industry, c. Paper Industry, d. Automobile Industry
Telugu: దిగువ తెలిపిన పరిశ్రమలలో ఏది/ఏవి వ్యవసాయాధారిత పరిశ్రమ కాదు?
Options: (1) d only | (2) c only | (3) Both a and b only | (4) Both c and d only
Q129. English: The Reserve Bank of India set-up a Committee headed by Y.H. Malegam to study and advise on:
Telugu: దిగువ తెలిపిన వాటిలో దేని గురించి అధ్యయనం చేసి సూచనలు ఇవ్వడానికి, భారత రిజర్వ్ బ్యాంకు Y.H. మాలేగాం అధ్యక్షతన ఒక కమిటీని నియమించింది?
- (1) Self Help Groups and Banking Linkages
- (2) Micro Finance Sector
- (3) Pradhan Mantri Jan Dhan Yojana
- (4) Jan Dhan, Aadhaar and Mobile
Q130. English: Which of the following studies stated that, 53.3 per cent of India's population i.e., (64.2 crore people) are suffering from multidimensional poverty?
Telugu: భారతదేశ జనాభాలో 53.3 శాతం (64.2 కోట్ల మంది) బహుళరూప పేదరికం (multidimensional poverty) తో బాధపడుచున్నారని దిగువ వాటిలో ఏ అధ్యయనం తెలియపరిచింది?
- (1) Tendulkar Committee Report-2009
- (2) Rangarajan Committee Report - 2014
- (3) Planning Commission Report - 1998
- (4) Human Development Report - 2016
Q131. English: Which one of the following industries is not exempted from the compulsory licencing?
Telugu: కింద తెలిపిన పరిశ్రమలలో ఏ పరిశ్రమ తప్పనిసరి లైసెన్సింగ్ నుంచి మినహాయించబడలేదు?
- (1) Glass Industry
- (2) Paper Industry
- (3) Paint and Allied Products
- (4) Cigarette Industry
Q132. English: Assertion (A): SAMADHAN scheme is meant for one time settlement of dues of small scale sick industrial units.
Reason (R): Sick units are required to make one time payment including interest not more than double of the loan amount.
Telugu: ప్రతిపాదన (A): పారిశ్రామిక రుగ్మతకు గురైన చిన్న తరహా పారిశ్రామిక యూనిట్ల రుణాలను/బకాయిలను ఏక మొత్తంగా పరిష్కరించుటకు సంబంధించినది SAMADHAN పథకం.
కారణం (R): పారిశ్రామిక రుగ్మతకు లోనయిన పరిశ్రమలు వాటి రుణాలను అసలుతోబాటు వడ్డీని రెండింతలకు మించకుండా ఒకేసారి చెల్లించాలి.
Options: (1) (A) true, (R) false | (2) (A) false, (R) true | (3) Both true and (R) correct explanation | (4) Both true but (R) not correct explanation
Q133. English: The President of India doesn't have which one of the following veto powers?
Telugu: క్రింది వానిలో భారత రాష్ట్రపతికి లేని వీటో అధికారము ఏది?
- (1) Suspensive veto
- (2) Pocket veto
- (3) Absolute veto
- (4) Qualified veto
Q134. English: During which Lok Sabha's tenure the tradition of giving the post of Deputy Speaker to the nominee of opposition party began?
Telugu: ఉపసభాపతి పదవిని ప్రతిపక్ష పార్టీ అభ్యర్థికి ఇచ్చే సంప్రదాయము, మొదలైనది క్రింద తెల్పిన ఏ లోక్‌సభ కాలంలో ?
- (1) 11th Lok Sabha
- (2) 12th Lok Sabha
- (3) 9th Lok Sabha
- (4) 10th Lok Sabha
Q135. English: Which one of the following statements is true with regard to the office of the Governor?
Telugu: గవర్నర్ పదవికి సంబంధించి క్రింది ప్రకటనలలో సరియైనది :
- (1) It is subordinate to the Union Government.
- (2) Governor's salary is fixed by Union Home Minister.
- (3) The constitution under Article 157 prescribes only two qualifications.
- (4) It is an employment under the Government of India.
Q136. English: Which one of following type of legislation can be made without the prior sanction or recommendation of the President?
Telugu: క్రింది వానిలో ఏ విధమైన చట్ట రచన రాష్ట్రపతి ముందస్తు అనుమతి లేక సిఫారస్సు లేకుండా చేయవచ్చును?
- (1) A bill which varies the definition of Agricultural income.
- (2) A bill which affects the freedom of trade of commerce with other countries.
- (3) Alteration of boundaries of an existing state.
- (4) A bill which is money bill.
Q137. English: Consider the following statements with regard to the State Legislature:
i. An ordinary bill can originate in any of the Houses.
ii. Legislative Council can delay ordinary bill only for a period of three months in the first instance.
iii. Legislative Council in the second instance can hold ordinary bill for fifteen days.
iv. Legislative Council can only delay a money bill for twenty days.
Telugu: రాష్ట్ర శాసన శాఖకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణింపుడు:
i. సాధారణ బిల్లును ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చును.
ii. మొదటిసారి శాసన మండలి సాధారణ బిల్లును మూడు నెలల వరకు ఆలస్యము చేయవచ్చును.
iii. రెండవసారి శాసన మండలి సాధారణ బిల్లును పదిహేను రోజుల వరకు ఆలస్యము చేయవచ్చును.
iv. శాసన మండలి సాధారణ బిల్లును ఇరవై రోజుల వరకు ఆలస్యము చేయవచ్చును.
Options: (1) i, ii, iii, iv | (2) i & ii | (3) i, ii & iii | (4) i, ii, iv
Q138. English: Choose the correct statements from the following:
i. Lord Morley was Secretary of State for India in British Government.
ii. Lord Minto was Governor General of India.
iii. Lord Morley was Governor General of India.
iv. Lord Minto was secretary of state for India in British Government.
Telugu: క్రింది వానిలో సరియైన ప్రకటనలు ఏవి ?
i. లార్డ్ మోర్లే, బ్రిటీష్ ప్రభుత్వంలో భారత రాజ్య సచివుడు.
ii. లార్డ్ మింటో, భారత గవర్నర్ జనరల్‌గా ఉన్నారు.
iii. లార్డ్ మోర్లే, భారత గవర్నర్ జనరల్‌గా ఉన్నారు.
iv. లార్డ్ మింటో, బ్రిటీష్ ప్రభుత్వంలో భారత రాజ్య సచివుడు.
Options: (1) i & ii | (2) iii & iv | (3) i & iv | (4) ii & iv
Q139. English: Which one of the following was not a part of Reserved subjects in the Govt. of India Act of 1919?
Telugu: 1919 భారత ప్రభుత్వ చట్టములో రిజర్వ్‌డ్ అంశములలో లేని విషయము ఏది ?
- (1) Land Revenue
- (2) Administration of Justice
- (3) Local Self Government
- (4) Police
Q140. English: Which Amendment of Indian constitution implicitly says that fundamental rights are amendable under the procedure laid down in Article 368?
Telugu: ఏ రాజ్యాంగ సవరణ అధికరణము 368 లో పొందుపరిచిన విధముగా ప్రాథమిక హక్కులను సవరించవచ్చునని సూచనగా/పరోక్షంగా చెప్పినది ?
- (1) 29th
- (2) 42nd
- (3) 25th
- (4) 24th
Q141. English: Who among the following is authorized to decide the applicability of any Particular Act of Parliament to a Scheduled Area?
Telugu: క్రింది వారిలో ఎవరికి ఒక ప్రత్యేక పార్లమెంట్ చట్టము షెడ్యూల్డ్ ప్రాంతాలకు వర్తిస్తుందా లేదా అని నిర్ణయించు అధికారము కలదు?
- (1) Union Tribal Affairs Minister
- (2) Prime Minister
- (3) President
- (4) Governor
Q142. English: Match the following:
a. Balwant Rai Mehta – iii. Nyaya Panchayats
b. Ashok Mehta – iv. Panchayati Raj Finance Corporation
c. K. Santhanam – i. Zilla Parishad should be advisory body
d. L.M. Singhvi – ii. Zilla Parishad should be executive body
Telugu: జతపరచుము:
a. బల్వంతరాయ్ మెహతా – iii. న్యాయ పంచాయితీలు
b. అశోక్ మెహతా – iv. పంచాయితీ రాజ్ ఫైనాన్స్ కార్పోరేషన్
c. కె. సంతానం – i. జిల్లా పరిషత్తు సలహా సంస్థ
d. ఎల్.ఎమ్ సింఘ్వీ – ii. జిల్లా పరిషత్తు కార్యనిర్వాహక సంస్థ
Options: (1) a-i, b-ii, c-iii, d-iv | (2) a-ii, b-i, c-iv, d-iii | (3) a-iii, b-iv, c-i, d-ii | (4) a-iii, b-ii, c-i, d-iv
Q143. English: Which constitutional amendment conferred constitutional status on the National Commission for Backward classes?
Telugu: క్రింది వాటిలో ఏ రాజ్యాంగ సవరణ ప్రకారం జాతీయ వెనుకబడిన తరగతుల కమీషన్‌కు రాజ్యాంగ హోదా కల్పించారు ?
- (1) 102nd
- (2) 103rd
- (3) 100th
- (4) 101st
Q144. English: Which Article of Indian constitution provides for making any special provision for women and children?
Telugu: రాజ్యాంగములోని ఏ అధికరణము మహిళలకు మరియు బాలలకు ప్రత్యేక వసతులను కల్పించుటకు వెసులుబాటు కల్పిస్తుంది?
- (1) 15(2)
- (2) 15(1)
- (3) 15(3)
- (4) 15(4)
Q145. English: Which of the following is/are the objective(s) of Ministry of Skill Development and Entrepreneurship (MSDE)?
a. To fulfil the vision of Skill India Programme
b. To maintain supply-side skilled labour force statistics
c. To fill the gap between demand and supply of skilled manpower
Telugu: క్రింది వాటిలో ఏది/ఏవి నైపుణ్య అభివృద్ధి మరియు వ్యవస్థాపకత మంత్రిత్వశాఖ (MSDE) లక్ష్యం/లక్ష్యాలు?
a. Skill India పథకపు దార్శనికత (vision) ను పూర్తి చేయుట.
b. సప్లయ్ వైపునకు సంబంధించి నైపుణ్యంగల శ్రామిక శక్తి గణాంకాలను నిర్వహించుట.
c. నైపుణ్యం గల శ్రామిక శక్తి డిమాండ్-సప్లయ్‌ల మధ్య ఉండే అంతరాన్ని పూరించుట.
Options: (1) b and c only are correct | (2) a and c only are correct | (3) a, b and c are correct | (4) a and b only are correct
Q146. English: In the Constituent Assembly, the 'Objectives Resolution' was passed on:
Telugu: 'ఉద్దేశ్యముల తీర్మానము' రాజ్యాంగ చట్టసభలో ఎప్పుడు ఆమోదింపబడినది?
- (1) 24th January, 1947
- (2) 25th January, 1947
- (3) 26th January, 1947
- (4) 22nd January, 1947
Q147. English: Which of these two following Vice Presidents acted as officiating Presidents of India?
Telugu: క్రింది వారిలో ఏ ఇద్దరు ఉప-రాష్ట్రపతులు తాత్కాలిక రాష్ట్రపతులుగా వ్యవహరించినారు ?
- (1) K.R. Narayanan & Krishna Kant
- (2) B.D. Jatti & R. Venkatraman
- (3) S. Radhakrishnan & V.V. Giri
- (4) V.V. Giri & B.D. Jatti
Q148. English: Which one of the following statement is correct with regard to parliamentary committees?
Telugu: పార్లమెంటరీ కమిటీలకు సంబంధించి క్రింది వానిలో సరియైన ప్రకటన ఏది?
- (1) The members of the Estimates Committees are elected by Lok Sabha.
- (2) Public Accounts Committee consists of 30 members.
- (3) Committee on Empowerment of women is a departmentally related committee.
- (4) Committee on Home affairs is a Joint Parliamentary Committee.
Q149. English: From among the following, which Committee's recommendations were accepted by RBI to switch to consumer prices from wholesale prices in setting its inflation target and making monetary policy?
Telugu: ద్రవ్య విధాన రూపకల్పనలో ద్రవ్యోల్బణ లక్ష్య (inflation target) నిర్దేశానికి టోకు ధరల (wholesale prices) స్థానంలో వినియోగ వస్తు ధరలు ఉపయోగించాలని ఈ క్రింది వాటిలో ఏ కమిటీ చేసిన సిఫారసును RBI అంగీకరించింది?
- (1) Y.V. Reddy Committee
- (2) Raghuram Rajan Committee
- (3) Bimal Jalan Committee
- (4) Urjit Patel Committee
Q150. English: Assertion (A): Workers population ratio in India is low in contrast to that in developed countries.
Reason (R): Rapid growth of population, low female worker population rate and omission of unpaid family workers lead to low worker-population ratio.
Telugu: ప్రతిపాదన (A): అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చినపుడు భారతదేశంలో 'శ్రామికులు-జనాభా నిష్పత్తి' తక్కువ.
కారణం (R): జనాభాలో శీఘ్రతర వృద్ధి, జనాభాలో మహిళా శ్రామికుల రేటు తక్కువగా ఉండడం, వేతన చెల్లింపు లేని గృహరంగ శ్రామికులను లెక్కింపులోకి తీసుకోకపోవడం వంటివి, శ్రామికులు - జనాభా నిష్పత్తిలో తగ్గుదలను సూచించును.
Options: (1) (A) is true, but (R) is false. | (2) (A) is false, but (R) is true. | (3) Both (A) and (R) are true, but (R) is not a correct explanation of (A). | (4) Both (A) and (R) are true, and (R) is the correct explanation of (A).
No comments:
Post a Comment