Kandoori Choda Dyanasty Notes

Telangana History Kandoori Choda Dyanasty Lecture Notes

కందూరి చోడులు (క్రీ.శ. 1040 – 1290) - Quick Review

వీరు తెలుగు చోడ వంశంలో అంతర్భాగం. తెలంగాణలోని నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ ప్రాంతాలను పాలించారు. కళ్యాణీ చాళుక్యులకు సామంతులుగా ఉంటూ 6వ విక్రమాదిత్యుని నుండి ‘కందూరు నాడు’ పొందడం వల్ల వీరికి కందూరి చోడులు అని పేరు వచ్చింది.

📌 ముఖ్యమైన అంశాలు (Quick Glance)
వంశ స్థాపకుడు ఏఱువ మొదటి భీమదేవ చోడుడు
చివరి రాజు రామనాథ దేవ చోడుడు
రాజధాని / సామంతులు రాజధాని: పానగల్లు | పశ్చిమ చాళుక్యుల సామంతులు
ప్రసిద్ధ రచనలు 1. ఉదయాదిత్యాలంకారం (ఉదయనుడు - సంస్కృతం)
2. గోకర్ణ ఛందస్సు (మొదటి గోకర్ణుడు)
శాసనాలు ఇడంపల్లి, మల్లేపల్లి, పడమటి పల్లి, అనుముల, పేరూర్ శాసనాలు
తవ్వించిన చెరువులు ఉదయ సముద్రం, భీమ సముద్రం, లింగేరవరం, కొప్పోలు, ఆకారం, పెద్ద దేవుల పల్లి చెరువు

🏛️ రాజకీయ చరిత్ర (ముఖ్యమైన పాలకులు)

👑 ఏఱువ మొదటి భీమదేవ చోడుడు:

  • రాజధాని: పానగల్లు.
  • వైదంబులకు, రేనాటి చోడులకు జరిగిన యుద్ధంలో ఓడిపోయి చోడులు ఏఱువ సీమకు వచ్చి రాజ్యాన్ని స్థాపించారు.

👑 ఏఱువ 1వ తొండమ భీముడు:

  • జయించిన ప్రాంతాలు: నేలకొండపల్లి (ఖమ్మం), భువనగిరి, సిరికొండ, రాచకొండ, దేవరకొండ.
  • చోళులకు, పశ్చిమ చాళుక్యులకు జరిగిన యుద్ధంలో 1వ సోమేశ్వరునికి మద్దతుగా పాల్గొన్నాడు.

👑 ఏఱువ 2వ భీమదేవుడు & 2వ తొండయ చోళమహారాజు:

  • 2వ భీమదేవుడు: 6వ విక్రమాదిత్యునికి యుద్ధంలో సహాయపడి కందూరునాడును పొందాడు.
  • 2వ తొండయ: కాకతీయ రాజులు మొదటి ప్రోలరాజు, 2వ బేతరాజులకు సమకాలికుడు. ఇతని భార్య మైలాంబిక వేసిన శాసనం పానగల్లు శాసనం.

👑 2వ ఉదయ చోడుడు:

  • నల్గొండ జిల్లా పానగల్లులో ఉదయ సముద్రం చెరువును తవ్వించాడు (దీనినే నేడు పానగల్లు చెరువు అంటారు).
  • వర్ధమానపురం రాజధానిగా పాలించాడు (నేటి మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూలు సమీపంలోని వడ్డెమాను).
  • కాకతీయ రుద్రదేవుడు (1వ ప్రతాపరుద్రుడు) వర్ధమానపురం, పానగల్లులను ధ్వంసం చేశాడు. ఉదయనుడు రుద్రదేవుడితో సంధి చేసుకొని తన కూతురు పద్మావతిని ఇచ్చి వివాహం జరిపించాడు. దీనికి గుర్తుగా రుద్ర సముద్ర తటాకము తవ్వించాడు.

👑 రామనాథ దేవ చోడుడు (చివరి రాజు):

  • ఇతని శాసనం: ఆగామోత్కూరు శాసనం (నల్గొండ). ఈ శాసనంలో రాణి రుద్రమదేవి ప్రస్తావన ఉంది.

⚖️ పరిపాలన & సైనిక వ్యవస్థ

  • రాజ్యాన్ని నాడులు, విషయాలు, సీమలుగా విభజించారు. గ్రామ పరిపాలనకు గ్రామ పంచాయితీ ఉండేది.
  • గ్రామ భూముల లెక్కలను గ్రామ కరణం చూసేవాడు. పన్నులు వసూలు చేసేవారు సుంకాధికారులు.
  • భూములు 3 రకాలు: 1. వ్యవసాయ యోగ్యమైనవి, 2. అడవులు, 3. బీడు/బంజరు భూములు.
  • భూసారాన్ని బట్టి పంటలో 1/6, 1/8, 1/12 భాగం పన్నుగా వసూలు చేసేవారు. రాజాదాయంలో భూమిపన్ను ప్రధానమైంది.
  • వేద విప్రులు, బ్రాహ్మణులు, అగ్రహారీకులు, దేవాలయాలకు పన్ను మినహాయింపు ఉండేది.
  • సైనిక వ్యవస్థ: సైన్యానికి రాజ భాండాగారం నుండి వేతనాలు ఇచ్చేవారు. యుద్ధ సమయంలో స్త్రీలు, బాలురు, గోవులు, బ్రాహ్మణులు, వృద్ధులను చంపరాదనే నియమం ఉండేది.
  • గుండన మంత్రి సామర్థ్యానికి మెచ్చి బల్లాల గ్రామం దానం ఇచ్చినట్లు తెలిపే శాసనం బల్లాల శాసనం.

🛕 మత విధానం & దేవాలయాలు

  • కందూరి చోడులు వైదిక మతాన్ని అవలంబించారు. జైన ఆలయాల నిర్మాణానికి కూడా దానాలు చేశారు.
  • తెలంగాణలో కాలాముఖ శైవం విస్తరించింది. బసవేశ్వరుని ప్రభావం మరియు పండితత్రయం (శ్రీపతి, మంచన, మల్లికార్జున పండితులు) వల్ల జైనం క్షీణించి శైవం పుంజుకుంది.
  • ప్రసిద్ధ శైవాలయాలు: పానగల్లు: ఛాయా సోమేశ్వరాలయం, పచ్చల సోమేశ్వరాలయం (నల్గొండ).
    ఇతర ఆలయాలు: పేరూర్ స్వయంభూ సోమేశ్వరాలయం (మహబూబ్ నగర్), భువనగిరి సోమేశ్వరాలయం, మామిళ్ళపల్లి నృసింహాలయం.
  • జైన కేంద్రం: కొలనుపాక తెలంగాణలో ప్రధాన జైన కేంద్రం. జైన శాసనాలు కన్నడలో కలవు.

💰 ఆర్థిక వ్యవస్థ, సాహిత్యం & శాసనాలు

💎 ఆర్థిక రంగం

  • వెండి నాణెం: రూక
  • ఓడరేవులు: వాడపల్లి, పేరూరు
  • వజ్రాల కేంద్రాలు: పరిటాల, వెల్లటూరు
  • మూసీ నదికి 'నమిలె' వద్ద ఆనకట్ట నిర్మాణం.
  • జావా, సుమిత్రా, కాంబోడియాలకు ఎగుమతులు.

📖 సాహిత్యం & శాసనాలు

  • పాల్కురికి సోమనాథుడు: పండితారాధ్య చరిత్ర, బసవ పురాణం, వృషాధిప శతకం.
  • అనుముల శాసనం: ఇది తెలంగాణలో తొలి పద్య శాసనం.
  • పేరూర్ శాసనం

No comments:

Post a Comment