Eastern Chalukyas (తూర్పు చాళుక్యులు)

Telangana History Eastern Chalukyas Lecture Notes

తెలంగాణా చరిత్ర - సంస్కృతి

తూర్పు చాళుక్యులు (Eastern Chalukyas)

బాదామి చాళుక్య రాజైన 2వ పులకేశి వేంగి ప్రాంతాన్ని జయించి, తన తమ్ముడైన కుబ్జవిష్ణువర్ధనుడిని సామంత రాజుగా నియమించాడు.

ఇలా కుబ్జ విష్ణువర్ధనుడితో తూర్పు చాళుక్యుల పరిపాలన మొదలై చోళచాళుక్య రాజు విజయాదిత్యుడితో 1075 సం॥ వరకు కొనసాగింది.

📌 ముఖ్య పాలకులు - విశేషాలు

పాలకుడు విశేషాలు / ప్రాముఖ్యత
కుబ్జ విష్ణువర్ధనుడువంశస్థాపకుడు
గుణగ విజయాదిత్యుడుగొప్పవాడు
4వ కుబ్జవిష్ణువర్ధనుడురాష్ట్రకూటులతో వివాహ సంబంధాలు జరిపాడు
చాళుక్య భీముడుద్రాక్షారామ భీమేశ్వర ఆలయాన్ని నిర్మించెను. చెల్లవ్వను పోషించెను.
2వ విజయాదిత్యుడుబెజవాడను విజయవాడగా మార్చెను. 108 శైవాలయాలను 'మృగేశ్వరాలయాల' పేరుతో నిర్మించెను.
అమ్మరాజు-1రాజమండ్రి నగరంను నిర్మించెను
రాజరాజ నరేంద్రుడుతెలుగు భాషను పోషించెను. ఆదికవి నన్నయ్యను, గణిత శాస్త్రవేత్త పావులూరి మల్లన్నను పోషించాడు
కుళోత్తుంగ చోళుడుగంగైకొండ చోళపురంను రాజధానిగా చేసుకొనెను. (తూర్పు చాళుక్య వంశం + చోళవంశం)

👑 రాజకీయ చరిత్ర (రాజుల కాలక్రమం & వివరాలు)

కుబ్జవిష్ణు వర్ధనుడు (624-641)

  • ఇతని భార్య అయ్యణ మహాదేవి విజయవాడలో జైనుల కోసం నడుంబ వసతి గృహాన్ని నిర్మించింది.
  • బిరుదులు : విషమ సిద్ధి, కామదేవ, మకరధ్వజ.

జయసింహుడు-1 (641-673)

  • బిరుదులు : సర్వసిద్ధి, సకల లోకాశ్రయ.
  • శాసనం : విప్పర్ల శాసనం (తొలి తెలుగు వచన శాసనం).

విష్ణు వర్ధనుడు -2 (673–683)

బిరుదు : 1. విషమసిద్ధి 2. ప్రళయాదిత్యుడు.

మంగియువరాజు (683-706)

బిరుదు : విజయాదిత్య, విషమసిద్ధి.

జయసింహుడు-2 (706-718)

బిరుదు : నిరవద్య.

కొక్కిలి మహారాజు (718)

ఎలమంచిలి రాజధానిగా పాలించాడు.

విష్ణువర్ధనుడు-3 (719–755)

పల్లవరాజు నందివర్మ దండనాధుడైన ఉదయ చంద్రుడు నెల్లూరు ప్రాంతంపై దండెత్తాడు.

విజయాదిత్యుడు-1 (755–772)

  • ఇతని కాలంలో దంతిదుర్గుడు బాదామి చాళుక్యులను ఓడించి రాష్ట్రకూట రాజ్యం స్థాపించాడు.
  • బిరుదులు : సమస్త భువనాశ్రయ, త్రిభువనాంకుశ, మహారాజాధిరాజ, పరమేశ్వర భట్టారక.

విష్ణు వర్ధనుడు 4 (772-808)

  • ఇతని గూర్చి పంపకవి రచించిన 'విక్రమార్జున విజయం' తెలియజేస్తుంది.
  • ధృవుడికి, 4వ కుబ్జ విష్ణువర్ధనుడికి జరిగిన యుద్ధంలో 4వ విష్ణువర్ధనుడు ఓడిపోయి తన కూతురు శీలమహాదేవిని ధృవుడికిచ్చి వివాహం చేశాడు.

విజయాదిత్యుడు -2 (808–847)

  • బిరుదులు : నరేంద్ర మృగరాజు, చాళుక్య రామ, విక్రమధావళి.
  • 108 శివాలయాలు నిర్మించాడు.

విష్ణువర్ధనుడు 5 (847-848)

ఇతనికి 'కలి విష్ణువర్ధనుడు' అని పేరు ఉంది.

గుణగ విజయాదిత్యుడు (848-891)

  • ఇతని సేనాని పాండురంగడు బోయకొట్టాలపై దండయాత్రకు పంపి సఫలీకృతుడు అయినట్లు అద్దంకి శాసనం తెలుపుతుంది.
  • ఈ శాసనంలో 'తరువోజ' ఛందస్సు పద్యాలు కలవు.
  • గుణగ విజయాదిత్యుడు రాష్ట్రకూటులను సామంతులుగా చేసుకున్న వైనం సాతలూరు శాసనంలో తెలపబడింది.
  • పాండురంగడు మహేశ్వరాలయం నిర్మించాడు.
  • బిరుదులు : త్రిపుర మర్త్య మహేశ్వర, పరచక్రదామ, గుణకేనల్లాల, వల్లభ.

1వ చాళుక్య భీముడు (892-921)

  • భీమేశ్వరాలయం నిర్మించాడు.
  • ఆస్థానకవి : భట్టవామనుడు (ఇతను కావ్యా లంకారసూత్ర రచించాడు).
  • బిరుదు : కవి వృషభ.
  • గాంధర్వ విద్యా ప్రవీణగా కీర్తించబడిన చెల్లవ్వను పోషించెను.

విజయాదిత్యుడు 5 (922)

ఇతనిని 'కొల్లభిగండ' అని పిలుస్తారు.

మొదటి అమ్మరాజు (922–927)

రాజధానిని వేంగి నుంచి రాజమహేంద్ర వరమునకు మార్చాడు. బిరుదు : రాజమహేంద్ర.

విజయాదిత్యుడు–6

ఇతనికి బేతరాజు విజయాదిత్యుడు, కంఠికవి అని పేర్లున్నాయి.

2వ చాళుక్య భీముడు (934-935)

  • శాసనాలు : మలయంపూడి శాసనం, మంగల్లు శాసనం, కలుచంబర్రు శాసనం. ఈ శాసనాలలో 2వ చాళుక్య భీముడి విజయచరిత్ర ఉంది.
  • బిరుదులు : రాజభీమ, బృహద్భీమ, విష్ణువర్ధన, గండమహేంద్ర.

2వ అమ్మరాజు (945-970)

  • దానార్ణవుడు ముదిగొండ చాళుక్యుల సహాయంతో అమ్మరాజుని ఓడించాడు.
  • ఆస్థాన కవులు : కవిచక్రవర్తి, పోతనభట్టు. బిరుదు : కవిగాయక కల్పతరువు.

దానార్ణవుడు (970-973)

2వ అమ్మరాజు బావమరిది జటచోడభీముడు దానార్ణవుడిని జయించి వేంగిని ఆక్రమించాడు.

జటచోడ భీముడు (973–1001)

జటచోడభీముడు మొదటి శక్తివర్మను ఓడించి కాంచీనగరంను ఆక్రమించాడు. రాజరాజచోళుడు జటచోడ భీముడిని ఓడించాడు.

మొదటి శక్తివర్మ (999-1011)

విమలాదిత్యుడు (1011–1018)

  • రాజరాజ చోళుని కుమార్తె కుందవ్వను, జటచోడభీముని కుమార్తెను వివాహమాడెను.
  • రణస్థపూడి శాసనం ఇతనిని 'పరమబ్రాహ్మణ్య', 'పరమ మహేశ్వర' అని వర్ణించింది.

రాజరాజనరేంద్రుడు (1019–1061)

  • రాజరాజ నరేంద్రునికి, విజయాదిత్యుడికి జరిగిన యుద్ధంలో ఓడిపోయి రాజ్యాన్ని కోల్పోయి చోళరాజేంద్రుని సహాయంతో 1035లో తిరిగి రాజ్యాన్ని పొందాడు.
  • ఆంధ్రమహాభారతాన్ని రచించిన నన్నయ భట్టు రాజరాజ నరేంద్రుని ఆస్థానకవి.
  • పశ్చిమ చాళుక్యుల రాయబారి నారాయణభట్టు నన్నయ్యకు సహకరించి నందంపూడి అగ్రహారం పొందాడు.

7వ విజయాదిత్యుడు (1062-1073)

విమలాదిత్యుడు మరణించిన తర్వాత రాజరాజ నరేంద్రునికి, విజయాదిత్యుడికి సింహాసనం కోసం యుద్దాలు జరిగాయి. కళ్యాణి చాళుక్య సోమేశ్వరుడి సాయంతో ఇతను రాజయ్యాడు.

కుళోత్తుంగ చోళుడు

  • 1070 సం॥లో సింహాసనం ఆక్రమించాడు.
  • రాజరాజనరేంద్రుడు మరియు రాజేంద్ర చోళుని యొక్క కూతురైన 'అమ్మాంగదేవి'కి జన్మించిన వాడు.
  • 'కుళోత్తుంగ చోళుడు' అనే బిరుదుతో అధికారంలోకి వచ్చి 'చోళ-చాళుక్య' రాజ్యాలను కలిపి పాలించాడు.
  • తన పేరు మీదుగా కుళోత్తుంగ చోళపురం (విశాఖపట్నం)ను నిర్మించాడు.
  • విదేశీ వాణిజ్యానికి ప్రాధాన్యతను ఇచ్చాడు. ముఖ్యంగా 72మంది వర్తకులతో కూడిన వర్తక సంఘాన్ని చైనాకు రాయబారం పంపాడు.
  • తన గొప్ప నౌకాబలంతో కళింగను జయించినట్లు 'కళింగట్టు పరణి' అనే గ్రంథంలో 'జయం గోండార్' తెలియజేశాడు.
  • పాండ్యుల విజృంభణతో చాళుక్య చోళుల ప్రాభవం క్షీణించింది.
  • 'వెలనాటి చోడులు, కాకతీయులు వీరి సామంతులు'.

🏛️ పరిపాలన వ్యవస్థ

  • పరిపాలన సౌలభ్యం కోసం రాజ్యం విషయాలుగాను, నాడు, కొట్టము, గ్రామాలుగా విభజించారు.
  • స్థానిక పరిపాలన కొంత వరకు చోళుల పరిపాలనను పోలి ఉంటుంది.
  • గ్రామాలలో శాంతి భద్రతలు కాపాడే బాధ్యత గ్రామపెద్దలకే ఉంది.
  • 2వ చాళుక్య భీముడి 'మచిలీపట్నం శాసనం' ఆంధ్రలో పంచాయితీ పరిపాలన ఉన్నట్లు తెలుపుతోంది.

👥 సాంఘిక & మత పరిస్థితులు

  • బ్రాహ్మణులు ఉచ్చస్థితిలో ఉన్నారు.
  • క్షత్రియులు యుద్ధం చేయుట ముఖ్య ధర్మంగా పాటించారు.
  • వైశ్యులకు ప్రధాన వృత్తి - వ్యాపారం.
  • సయాం (బర్మా) లో శక్తివర్మ బంగారు నాణేలు లభించాయి.
  • మత పరిస్థితులు : బౌద్ధమతం, జైనమతం, హైందవమతం వ్యాప్తిలో ఉన్నాయి.
  • 2వ అమ్మరాజు నిర్మించిన జైన దేవాలయాలు : సర్వలోకాశ్రయ ఆలయం, కటకాభరణ ఆలయం.

🛕 వాస్తు శిల్పాలు & దేవాలయాలు

  • గుణగ విజయాదిత్యుడు దేవాలయ నిర్మాణంలో గంగా, యమున శిల్పాలు ఉన్నాయి.
  • బెజవాడలో కుమారస్వామి ఆలయం నిర్మించింది - యుద్ధమల్లుడు.
  • దానార్ణవుడు మాండవ్య నారాయణ ఆలయం నిర్మించాడు.
వేంగీ చాళుక్యుల కాలంలో నిర్మించిన ప్రముఖ ఆలయాలు:
  • అమరేశ్వర ఆలయం (అమరావతి)
  • గుణపూడి (భీమవరం) సోమేశ్వర ఆలయం (సోమేశ్వరం)
  • క్షీర రామేశ్వర ఆలయం (క్షీరారామం)
  • రామలింగేశ్వరుని ఆలయం
  • బ్రహ్మేశ్వరుని ఆలయం (చేబ్రోలు)

* అమరేశ్వర, సోమేశ్వర, భీమేశ్వర, చాళుక్య భీమేశ్వరాలయాలు మొదట బౌద్ధ ఆరామాలు, తరువాత శైవ క్షేత్రాలుగా మారాయి.

No comments:

Post a Comment