Telangana Police Constable Mains Exam 2019 Question Paper (Q151 - Q200)

Telangana Police Constable Mains Exam 2019 (151-200)

📄 Telangana Police Constable Mains 2019 – Q151 to Q200

📄 Telangana Police Constable Mains Exam 2019 Paper held on 28-04-2019 and preliminary held on 30-09-2018.

Q151. English: Choose the odd thing:
Telugu: సరిపోలనిది గుర్తించండి:

  • (1) Arithmetic Mean / అంకమధ్యమం
  • (2) Variance / విస్తృతి
  • (3) Mode / బాహుళకం
  • (4) Median / మధ్యగతం

Q152. English: A committee of 4 girls and 3 boys is to be selected out of 6 girls and 5 boys. The number of ways of forming the committee if two particular boys refuse to be in the same committee is:
Telugu: ఆరుగురు బాలికలు, ఐదుగురు బాలురు నుండి నలుగురు బాలికలు, ముగ్గురు బాలురు గల కమిటీని ఎంచుకోవాలి. వీరిలో నిర్దేశించిన ఇద్దరు బాలురు ఒకే కమిటీలో ఉండటానికి నిరాకరిస్తే, ఆ కమిటీని తయారు చేసే విధానాల సంఖ్య:

  • (1) 150
  • (2) 135
  • (3) 120
  • (4) 105

Q153. English: What is the average of a, b and c?
I. a, b and c are in an arithmetic progression.
II. a, b and c are in a geometric progression.
Telugu: a, b, c ల సరాసరి ఎంత?
I. a, b, c లు ఒక అంకశ్రేఢిలో ఉన్నాయి.
II. a, b, c లు ఒక గుణ శ్రేఢిలో ఉన్నాయి.

  • (1) If the statement I alone answers the question / ప్రవచనం I మాత్రమే సరిపోతే
  • (2) If the statement II alone answers the question / ప్రవచనం II మాత్రమే సరిపోతే
  • (3) If the statements I and II together only answers the question / ప్రవచనాలు I, II లనుపయోగించి మాత్రమే సమాధానమివ్వ గల్గితే
  • (4) If the statements I and II together also can't answer the question / ప్రవచనాలు I, II రెంటినీ ఉపయోగించి కూడా సమాధాన మివ్వ లేనిచో

Q154. English: Is a > b?
I. a² > b²
II. |a| > |b|
Telugu: a > b అవుతుందా?
I. a² > b²
II. |a| > |b|

  • (1) Statement I alone / ప్రవచనం I మాత్రమే సరిపోతే
  • (2) Statement II alone / ప్రవచనం II మాత్రమే సరిపోతే
  • (3) Statements I and II together / ప్రవచనాలు I, II లు కలిసి మాత్రమే సమాధానమిస్తే
  • (4) Statements I and II together can't answer / ప్రవచనాలు I, II రెంటినీ ఉపయోగించి కూడా సమాధానమివ్వ లేకపోతే

Q155. English: Is the quadrilateral ABCD cyclic?
I. AB is parallel to CD
II. ∠ABC + ∠ADC = 180°
Telugu: చతుర్భుజం ABCD చక్రీయమా ?
I. CD కి AB సమాంతరం
II. ∠ABC + ∠ADC = 180°

  • (1) Statement I alone / ప్రవచనం I మాత్రమే సరిపోతే
  • (2) Statement II alone / ప్రవచనం II మాత్రమే సరిపోతే
  • (3) Statements I and II together / ప్రవచనాలు I, II లనుపయోగించి మాత్రమే సమాధానమివ్వ గల్గితే
  • (4) Statements I and II together can't answer / ప్రవచనాలు I, II రెంటినీ ఉపయోగించి కూడా సమాధాన మివ్వ లేనిచో

Q156. English: In a certain coding process, the word TIGER is coded as TIJOW and the word BLIND is coded as GQOND, then the code for the word SWING in the same code is:
Telugu: ఒక సంకేత పద్ధతిలో, TIGER అనే పదాన్ని TIJOW గానూ మరియు BLIND అనే పదాన్ని GQOND గానూ కోడ్ చేస్తే, అదే సంకేత పద్ధతిలో SWING పదానికి సంకేతం:

  • (1) SWOYV
  • (2) JQOYV
  • (3) JQONG
  • (4) SWONV

Q157. English: P, Q, R, S, T are five persons sitting at a round table facing its centre. P sits between T and Q. S sits at immediate left of R. If Q sits between P and S, then the person sitting immediate left to T is:
Telugu: అయిదుగురు వ్యక్తులు P, Q, R, S, T లు ఒక గుండ్రని బల్ల చుట్టూ కేంద్రాభిముఖంగా కూర్చున్నారు. T మరియు Q ల మధ్య P కూర్చున్నారు. R కి తక్షణ ఎడమపక్క S కూర్చున్నారు. P మరియు S ల మధ్య Q ఉంటే అప్పుడు Tకు తక్షణ ఎడమవైపు కూర్చున్న వ్యక్తి:

  • (1) P
  • (2) Q
  • (3) R
  • (4) S

Q158. English: 40 boys are seated in 40 chairs arranged in a row. Ravi is seated in the 8th chair from left. Raju is seated in the 19th chair from the right. Ram is seated exactly in the middle chair between Ravi and Raju. Then from left the number of the chair that Ram is sitting, is:
Telugu: ఒక వరసలో అమర్చిన 40 కుర్చీలలో 40 బాలురు కూర్చున్నారు. ఎడమ ప్రక్క నుండి 8 వ కుర్చీపై రవి కూర్చున్నాడు. కుడి ప్రక్క నుండి 19 వ కుర్చీపై రాజు కూర్చున్నాడు. రవి, రాజులు కూర్చున్న కుర్చీలకు ఖచ్చితంగా మధ్య కుర్చీపై రామ్ కూర్చున్నాడు. అప్పుడు ఎడమ ప్రక్కల నుండి రామ్ కూర్చున్న కుర్చీ సంఖ్య:

  • (1) 15
  • (2) 16
  • (3) 17
  • (4) 18

Q159. English: If A is son of husband of daughter of husband of B, then B is A's:
Telugu: B యొక్క భర్త యొక్క కూతురి యొక్క భర్త యొక్క కుమారుడు A అయితే B అను వ్యక్తి A యొక్క:

  • (1) Grandfather / తాత
  • (2) Grandmother / అమ్మమ్మ/నానమ్మ
  • (3) Great grandfather / ముత్తాత
  • (4) Great grandmother / ముత్తమ్మ

Q160. English: In a code language SMILE is written as UKKJG. Then in the same code language FRUIT is coded as:
Telugu: ఒక సంకేత భాషలో SMILE ని UKKJG గా వ్రాశారు. అప్పుడు అదే సంకేత భాషలో FRUIT పదానికి సంకేతం:

  • (1) HKVHW
  • (2) HPWGV
  • (3) GRIUW
  • (4) FLWKV

Q161. English: Read the following statements:
a. Values do not guide us to live ethically.
b. Good values help us in feeling at peace from within.
c. Values and beliefs do not have any bearing on our attitudes.
d. Values guide us to take the right directions and act appropriately.
Which of the above statement(s) is/are correct?
Telugu: ఈ క్రింది వ్యాఖ్యలను చదవండి :
a. నైతికంగా బతకడానికి విలువలు మార్గదర్శకం కానేకావు.
b. మంచి విలువలు అంతర్గతంగా ప్రశాంతంగా ఉండటానికి మనకు సహాయ పడతాయి.
c. విలువలు, నమ్మకాలు మన వైఖరుల మీద ఎటువంటి ప్రభావం చూపవు.
d. మనం సరియైన మార్గాలు, చర్యలు తీసుకోవడంలో విలువలు మార్గదర్శకంగా ఉంటాయి.
పైన ఉన్న ఏ వ్యాఖ్యలు సరియైనవి?

  • (1) a, b and c / a, b మరియు c
  • (2) b and c / b మరియు c
  • (3) c and d / c మరియు d
  • (4) b and d / b మరియు d

Q162. English: Read the following statements:
a. Openness is a desirable virtue in professionals.
b. One can take unfair advantage of the situation in work place.
c. One should develop a sense of belongingness with the organization where he/she works.
d. One should avoid situations that might lead to conflicts.
Which of the above statements are ethically correct?
Telugu: ఈ క్రింది వ్యాఖ్యలను చదువుము :
a. ఉద్యోగులలో విశాల దృక్పథం అనేది కావలసిన గుణం.
b. ఉద్యోగ స్థలంలో పరిస్థితులను స్వప్రయోజనం కోసం మీకు అనుకూలంగా ఏ పద్ధతిలోనైనా మార్చుకోవచ్చు.
c. మనము పనిచేసే సంస్థతో మానసిక అనుబంధాన్ని పెంపొందించుకోవాలి.
d. సంఘర్షణలకు దారితీసే పరిస్థితుల నుండి తప్పించుకోవాలి.
పైన ఉన్న ఏ వ్యాఖ్యలు సరియైనవి ?

  • (1) a and c / a మరియు c
  • (2) a, c and d / a, c మరియు d
  • (3) b and d / b మరియు d
  • (4) a, b and c / a, b మరియు c

Q163. English: Who among the following National Leaders opined that women should be treated equally and should get equal remuneration for equal work?
Telugu: స్త్రీలు సమానులుగా పరిగణంచబడాలని, శ్రమకు తగ్గ సమాన ప్రతిఫలము పొందాలని అభిప్రాయపడ్డ జాతీయ నాయకుడు ఈ క్రింది వారిలో ఎవరు ?

  • (1) Bal Gangadhara Tilak / బాల గంగాధర తిలక్
  • (2) Lala Lajpat Rai / లాల లజపతి రాయ్
  • (3) Mahatma Gandhi / మహాత్మ గాంధీ
  • (4) Motilal Nehru / మోతీలాల్ నెహ్రూ

Q164. English: In India, women, particularly lower class and lower caste, have been suffering due to many reasons because "women's problems" are not treated as:
Telugu: భారతదేశంలో స్త్రీలు, ముఖ్యంగా వెనుకబడిన కులాలకు మరియు పేద కుటుంబాలకు చెందిన వారు రక రకాల కారణాల వల్ల కష్టాలు పడుతున్నారు. ఎందుకంటే, స్త్రీల సమస్యలను క్రింది వాటిలో ఏ సమస్యగా పరిగణించడము లేదు:

  • (1) "Family problems" / "కుటుంబ సమస్యలుగా"
  • (2) "Political party problems" / "రాజకీయ పార్టీ సమస్యలుగా"
  • (3) "Societal problems" / "సమాజము యొక్క సమస్యలుగా"
  • (4) "Nature problems" / "ప్రకృతి సమస్యలుగా"

Q165. English: Who made this statement, "One is not born, but rather becomes a woman"?
Telugu: "ఏ ఒక్కరూ జన్మతః జన్మించరు; క్రమేణా స్త్రీ గా మారుతుంది (One is not born, but rather becomes a woman) అని ఎవరు వ్యాఖ్యానించారు" ?

  • (1) Simone de Beauvoir / సిమోన్ డి బువార్
  • (2) B.R. Ambedkar / బి.ఆర్. అంబేద్కర్
  • (3) John Keats / జాన్ కీట్స్
  • (4) Flora Nwapa / ఫ్లోరా న్వాపా

Q166. English: Who among the following is reported to have said: "The country and that nation which did not respect women have never become great nor will ever in future"?
Telugu: క్రింది వ్యాఖ్యను ఎవరు చేసినట్లుగా చెప్పబడినది ?
"ఏ దేశము గాని, దాని యొక్క ప్రజలు గాని మహిళలను గౌరవించ లేదో, ఆ దేశము ఎప్పటికీ గొప్ప దేశము కాదు, కాబోదు".

  • (1) Swami Vivekananda / స్వామి వివేకానంద
  • (2) Saint Paul / సెయింట్ పాల్
  • (3) George Bush / జార్జి బుష్
  • (4) Sarvepalli Radhakrishnan / సర్వేపల్లి రాధాకృష్ణన్

Q167. English: Read the following statements:
a. Tribals are very commonly referred to as "Adivasis".
b. M.K. Gandhiji popularized the word "Girijans".
c. Tribes are also known as "Dalits" in India.
d. International Labour Organization (ILO) used the expression "Indigenous people" to refer to upper castes.
Which of the above statement(s) is/are correct?
Telugu: ఈ క్రింది వ్యాఖ్యలను చదవండి:
a. గిరిజనులను సాధారణంగా “ఆదివాసీలు" అని పిలుస్తారు.
b. ఎమ్. కె. గాంధీజీ “గిరిజన్” అనే పదాన్ని వ్యాప్తి (ప్రాచుర్యం) చేసారు.
c. భారతదేశంలో గిరిజనులను దళితులుగా కూడా పేర్కొంటారు.
d. అంతర్జాతీయ శ్రామిక సంస్థ (ఐ.యల్.ఒ) ఉన్నత కులం వాళ్ళను ఉటంకించడానికి మూల వాసులు (దేశీయవాసులు) అనే పదాన్ని వాడారు.
సరియైన వ్యాఖ్య(లు) :

  • (1) b, c and d / b, c మరియు d
  • (2) a, b and d / a, b మరియు d
  • (3) a and b / a మరియు b
  • (4) a and d / a మరియు d

Q168. English: Who is remembered as the person who started Telangana Armed Struggle between 1946 and 1951?
Telugu: 1946 - 1951 మధ్యన తెలంగాణా సాయుధ పోరాటం ప్రారంభించిన వ్యక్తిగా ఎవరిని అందరూ గుర్తు పెట్టుకుంటారు ?

  • (1) Shanthi Soundarajan / శాంతి సౌందరాజన్
  • (2) Chityala Ailamma / చిట్యాల ఐలమ్మ
  • (3) Varala Pochamma / వారాల పోచమ్మ
  • (4) Devaki Yashoda / దేవకీ యశోద

Q169. English: Reservations as per 73rd and 74th Constitutional Amendment have facilitated:
Telugu: భారత రాజ్యాంగ చట్టంలో 73వ, 74 వ సవరణల ద్వారా ఈ క్రిందిది సాధ్యమైనది:

  • (1) Women's appointments in all top positions / అన్ని ఉన్నత స్థానాలలో మహిళల నియామకాలు
  • (2) Women entering Gram Panchayats and Municipalities / గ్రామపంచాయితీలు, పురపాలక సంఘాలలో మహిళల ప్రవేశం
  • (3) Establishing small shops by many women / చాల మంది స్త్రీలు చిన్న దుకాణాలు ప్రారంభించటం
  • (4) Increasing women labour in Agriculture / వ్యవసాయ రంగంలో మహిళా కూలీల సంఖ్యను పెంచటం

Q170. English: Sampurnanand Committee (1961) suggested Reorganization of curriculum at various levels Primary, Secondary, College and University level to promote:
Telugu: సంపూర్ణానంద్ కమీటి (1961) సూచించిన ప్రైమరీ, సెంకడరీ, కాలేజీ మరియు యూనిర్సిటీ స్థాయిలో, పాఠ్యాంశాలు పునర్వ్యవస్థీకరణ చేయటం లోని ఉద్దేశము :

  • (1) Language skills / భాషా నైపుణ్యము
  • (2) Employment / ఉపాధి
  • (3) Good impression / మంచి అభిప్రాయము
  • (4) National Integration / జాతీయ సమగ్రత

Q171. English: India's National Anthem is an expression of:
Telugu: భారతదేశ జాతీయ గీతం ఈ భావాన్ని వ్యక్తీకరించుతుంది :

  • (1) Unity of India / భారతదేశం యొక్క సమైక్యత
  • (2) the integration of rivers / నదుల అనుసంధానం
  • (3) diversity in the implementation of rules / నిబంధనలను అమలు చేయటంలో వైవిధ్యం
  • (4) Geographical Description / భౌగోళిక వర్ణన

Q172. English: Who argued that Dalits were Mool Bharatis (Original inhabitants of India) and builders of the Harappan civilization?
Telugu: దళితులు మూల భారతీయులు అనీ, హరప్పా నాగరికతను రూపొందించిన వారని గట్టిగా వాదించినది ఎవరు ?

  • (1) B. Shyam Sunder / బి. శ్యామ్ సుందర్
  • (2) A. Yellaiah Goud / ఎ. ఎల్లయ్య గౌడ్
  • (3) C. Jagannatham / సి. జగన్నాధమ్
  • (4) M. Krishnaiah / ఎమ్. క్రిష్ణయ్య

Q173. English: Match the following Environment Movements in India with their objectives:
a. Chipko Movement — ii. Struggle against deforestation in 1973 at Mandal Village, Chemeli District, U.P.
b. Narmada Bachao Andolan — iv. It was led by Baba Amte and Medha Patkar.
c. Baliyapal Movement — iii. It was against taking over of the thickly populated land for testing missiles.
d. Protest against Cogentrix company — i. It is a fight against establishing a Hundred Mega Watt Thermal Power Project in Nadikoor village near Mangalore.
Telugu: భారతేదేశంలో జరిగిన ఈ క్రింది పర్యావరణ ఉద్యమాలను వాటి యొక్క ఉద్దేశాలతో జతపర్చండి.
a. చిప్కో ఉద్యమం — ii. ఉత్తరప్రదేశ్లో చమేలి జిల్లాలోని మండల గ్రామంలో అటవీ నిర్మూలనుకు వ్యతిరేకంగా 1973 లో జరిగిన పోరాటం.
b. నర్మదా బచావో ఆందోళన్ — iv. బాబాఆమ్టే మరియు మేధాపాట్కర్ ఈ ఉద్యమాన్ని నడిపారు.
c. బలియాపాల్ ఉద్యమం — iii. దట్టమైన అడవులను క్షిపణులను పరీక్షంచటానికి ఉపయోగించటంపై వ్యతిరేకంగా చేసిన ఉద్యమం.
d. కాజెన్ ట్రిక్స్ కంపెనీకి వ్యతిరేకంగా నిరసన — i. మంగళూరు దగ్గర నందికూర్ గ్రాంలో వంద మెగావాట్ ధర్మల్ పవర్ ప్రాజెక్ట్ స్థాపనకు వ్యతిరేకంగా జరుపబడిన పోరాటం.

  • (1) a-iv, b-iii, c-ii, d-i
  • (2) a-ii, b-iii, c-iv, d-i
  • (3) a-i, b-iv, c-iii, d-ii
  • (4) a-ii, b-iv, c-iii, d-i

Q174. English: Who is the author of the book, "Emotional Intelligence: Why it Can Matter More Than IQ" ?
Telugu: "ఎమోష్నల్ ఇంటిలిజెన్స్: వై ఇట్ కెన్ మేటర్ మోర్ దేన్ ఐక్యూ” అనే పుస్తక రచయిత ఎవరు ?

  • (1) George Mayer / జార్జ్ మేయర్
  • (2) Guilford / గిల్ఫర్డ్
  • (3) Daniel Goleman / డేనియల్ గోల్మన్
  • (4) Spearman / స్పియర్మెన్

Q175. English: Who among the following quoted this statement: "It is not the strongest of the species that survives, or the most intelligent, but the one most responsive/adaptive to change"?
Telugu: ఈ క్రింది వారిలో ఎవరు ఈ వ్యాఖ్యను చేసారు. “ఎవరైతే మార్పునకు ప్రతిస్పందిస్తారో/అలవాటు పడగలరో వారికి మాత్రమే మనుగడకలదు, అంతేగాని జాతిలో అత్యంత బలమైన వారోగాని లేక తెలివైన వారో కాదు.”?

  • (1) Ronald Coase / రోనాల్డ్ కోస్
  • (2) M.A. Levy / ఎం. ఎ. లెవీ
  • (3) Charles Darwin / చార్లెస్ డార్విన్
  • (4) John Miller / జాన్ మిల్లర్

Q176. English: American Sociologist P.A. Sorokin distinguishes between two types of social mobility. They are:
Telugu: పి.ఎ. సోరోకిన్ అనే అమెరికన్ సామాజిక వేత్త రెండు రకాల సాంఘిక చలనాలను గుర్తించారు. అవి ఏవి అనగా :

  • (1) Equal Social Mobility and Cultural Social Mobility / సమాన సాంఘిక చలనం, సాంస్కృతిక సాంఘిక చలనం
  • (2) Developed Social Mobility and Underdeveloped Social Mobility / వికసించిన సాంఘిక చలనం, వికసించని సాంఘిక చలనం
  • (3) Vertical Social Mobility and Horizontal Social Mobility / నిలువుగా ఉండే సాంఘిక చలనం, క్షితిజ సమాంతరంగా ఉండే సాంఘిక చలనం
  • (4) Parallel Social Mobility and Rectangular Social Mobility / సమాంతర సాంఘిక చలనం, దీర్ఘచతురస్ర చలనం

Q177. English: What are the six universal emotions ?
Telugu: ఆరు సర్వ సాధారణమైన భావోద్వేగాలు ఏవి ?

  • (1) painting, dancing, singing, drawing, writing and teaching / పెయింటింగ్, నాట్యం చేయడం, పాడటం, చిత్రలేఖన, రాయడం, భోదన
  • (2) anger, happiness, surprise, sadness, disgust and fear / కోపం, సంతోషం, ఆశ్చర్యం, విచారం, చీదర, భయం
  • (3) hunger, love, hate, contentment, powerless and powerful / ఆకలి, ప్రేమ, అసహ్యం సంతృప్తి, శక్తి లేమి, శక్తివంతమైన
  • (4) greediness, jealousy, astonishment, enthusiasm, disinterest and courage / అత్యాశ, అసూయ, ఆశ్చర్యము, ఉత్సాహం, అనాసక్తి, ధైర్యము

Q178. English: Read the following statements:
(a) I get severely offended when people criticize my actions.
(b) I have inferiority complex and no belief in myself.
(c) I am very sensitive in nature.
(d) I can continue to do what I believe in even under severe criticism.
Which of the above statements is/are related to having 'Emotional Intelligence'?
Telugu: ఈ క్రింది వ్యాఖ్యలను చదవండి :
(a) ఇతరులు నా చర్యలను విమర్శించినప్పుడు నేను చాలా తీవ్రంగా బాధపడతాను.
(b) నాకు ఆత్మన్యూనతా భావన ఉండటం వలన, నా మీద నాకు నమ్మకం లేదు.
(c) స్వతహాగా నేను చాలా సున్నితంగా ఉంటాను.
(d) అత్యంత విమర్శాపరమైన పరిస్థితుల్లో కూడా నేను నమ్మినదే చేసుకుంటూ వెళతాను.
పైన చెప్పిన వ్యాఖ్యలలో ఏది/ఏవి 'భావోద్వేగ ప్రజ్ఞ' కల్గి ఉండటానికి సంబంధించింది/సంబంధించినవి ?

  • (1) (a) only / (a) మాత్రమే
  • (2) (a) and (b) / (a) మరియు (b)
  • (3) (c) and (d) / (c) మరియు (d)
  • (4) (d) only / (d) మాత్రమే

Q179. English: "Ignorance of what is the correct thing to do in a given situation" is generally referred to as:
Telugu: సందర్భాన్ని బట్టి పనిని సరైన రీతిలో ఎలా చేయడమో తెలియకపోవటం ఈ క్రింది వానిలో ఏది ?

  • (1) Humility / వినయము
  • (2) Uncompromising nature / రాజీపడని తత్వము
  • (3) Stubbornness / మొండితనము
  • (4) Moral Dilemma / నైతిక సందిగ్ధత

Q180. English: Match the words in List - A with their definitions given in List - B.
a. Competition — ii. It disintegrates the work force.
b. Accountability — iv. A finished product which is objectively verifiable.
c. Adaptability — v. Changing myself to suit new environments and needs.
d. Co-operation — i. It works on the basis of collective wisdom.
Telugu: జాబితా - A లోని పదాలను జాబితా - B లో ఇవ్వబడిన నిర్వచనములతో జతపర్చండి.
a. పోటీ — ii. శ్రామిక వర్గాన్ని విచ్ఛిన్నం చేస్తుంది.
b. జావాబుదారీతనం — iv. నిష్పక్షపాతంగా పరిశీలించబడే పూర్తి చేయబడిన ఉత్పత్తి.
c. స్వీకృతి — v. క్రొత్త వాతావరణానికి మరియు అవసరాలకు అనుకూలంగా తనను తాను మార్చుకోవటం.
d. సహకారం — i. సామూహిక జ్ఞానం ఆధారంగా పనిచేసేది.

  • (1) a-ii, b-v, c-iii, d-i
  • (2) a-iii, b-iv, c-v, d-ii
  • (3) a-i, b-ii, c-iii, d-v
  • (4) a-ii, b-iv, c-v, d-i

Q181. English: Which among the following land tenure was introduced by Salar Jung - I?
Telugu: ఈ క్రింది వాటిలో సాలార్ జంగ్-1 ప్రవేశపెట్టిన భూమి కౌలు పద్దతి ఏది ?

  • (1) Sarbasta / సర్ బాస్డా
  • (2) Shikimdari / షికిందారీ
  • (3) Watandari / వతన్దారి
  • (4) Ijara / ఇజారా

Q182. English: By what name the High Court was called during the Asaf Jahi period?
Telugu: అసఫ్ ఝహిల కాలంలో ఉన్నత న్యాయస్థానాన్ని ఏమని పిలిచేవారు?

  • (1) Majlis-i-Murafa / మజ్లిస్-ఇ-మురఫ
  • (2) Buzung / బుజుంగ్
  • (3) Mahakama-i-Sadar / మహకమ-ఇ-సదర్
  • (4) Diwan-i-Adalat / దివాన్-ఇ-అదాలత్

Q183. English: When the Indian Army entered Hyderabad under Major General J.N. Choudhary in September 1948, who among the following was the General Officer commanding of Southern command?
Telugu: 1948 సెప్టెంబర్లో మేజర్ జనరల్ జె. ఎన్. చౌదరీ నాయకత్వంలో భారత సైన్యం హైదరాబాద్లో ప్రవేశించినప్పుడు, ఈ క్రింద పేర్కొన్న వారిలో దక్షిణ భారత కమాండ్కు జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఎవరు ?

  • (1) Lieutenant General Maharaj Singh / లెఫ్టినెంట్ జనరల్ మహారాజ్ సింగ్
  • (2) Major General Rudra / మేజర్ జనరల్ రుద్ర
  • (3) Lieutenant General Rajendra Singh / లెఫ్టినెంట్ జనరల్ రాజేంద్ర సింగ్
  • (4) Agent General K.M. Munshi / ఎజెంట్ జనరల్ కె.ఎం. మున్షి

Q184. English: The warrior who tried to liberate Telangana from the Mughal rule after the defeat of Golconda by making Khilaspur as the centre of activities was:
Telugu: గోల్కొండ ఓడించబడిన తర్వాత ఖిలాసపూర్ను తన కార్యక్రమాలకు, కేంద్రంగా చేసుకొని తెలంగాణాను మొగలాయిల పాలన నుండి విముక్తి చేయడానికి ప్రయత్నించిన యోధుని పేరేమి?

  • (1) Rustum dil Khan / రుస్తుం దిల్ ఖాన్
  • (2) Sarvai Papanna / సర్వాయి పాపన్న
  • (3) Addanki Rajanna / అద్దంకి రాజన్న
  • (4) Soma Gauda / సోమ గౌడ

Q185. English: Assertion (A): The relationship of the students and the Telangana agitation has been inseparable.
Reason (R): On 28 November 2009, the police officials reached North Telangana Bhavan in Karimnagar to arrest K.C.R.
The correct answer is:
Telugu: ప్రతిపాదన (A) : విద్యార్థులు - తెలంగాణ ఉద్యమం ఎల్లప్పుడూ విడదీయలేనివి.
కారణం (R) : 2009 నవంబరు, 28వ తేదీన పోలీసు అధికార్లు కె.సి. ఆర్. ను అరెస్ట్ చేయడానికై కరీంనగర్ లోని ఉత్తర తెలంగాణ భవనానికి చేరుకొనిరి.
సరియైన సమాధానం:

  • (1) Both A and R are true and R is the correct explanation of A / (A) మరియు (R) రెండూ సరియైనవి, మరియు (R) కు (A) సరియైన వివరణ
  • (2) Both A and R are true, but R is not the correct explanation of A / (A) మరియు (R) రెండూ సరియైనవి, మరియు (R) కు (A) సరియైన వివరణ కాదు
  • (3) A is true, but R is false / (A) సరియైనది, కాని (R) సరియైనది కాదు
  • (4) A is false, but R is true / (A) సరియైనది కాదు, కాని (R) సరియైనది

Q186. English: After Operation Polo, Hyderabad armies surrendered to the Indian Union on 17 September, 1948. Who among the following was the Chief of Nizam's forces at that time?
Telugu: ఆపరేషన్ పోలో తర్వాత హైదరాబాదు సైన్యం 17 సెప్టెంబరు 1948 న భారత సైన్యానికి లొంగిపోయిన సమయంలో నిజాం సైన్యానికి ఈ క్రింద పేర్కొన్న వారిలో నాయకత్వం వహించినదెవరు?

  • (1) General J.N. Choudhuri / జనరల్ జె. ఎన్. చౌదరి
  • (2) Osman Ali Khan / ఉస్మాన్ ఆలి ఖాన్
  • (3) El. Edroos / ఎల్. ఎడ్రాస్
  • (4) Philip M. Taylor / ఫిలిప్. ఎం. టేలర్

Q187. English: Who among the following was not connected with Telangana peasants armed struggle?
Telugu: క్రింది వారిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో సంబంధము లేని వారెవరు ?

  • (1) Arutla Ramacandra Reddy / ఆరుట్ల రామచంద్రా రెడ్డి
  • (2) Chandra Rajeswara Rao / చండ్ర రాజేశ్వర రావు
  • (3) Konda Venkat Ranga Reddy / కొండా వెంకటరంగా రెడ్డి
  • (4) Devulapalli Venkateswara Rao / దేవులపల్లి వేంకటేశ్వరరావు

Q188. English: As there was a great demand from the Legislative Assembly of Telangana region for the implementation of G.O. 610, the government under Chief Minister Chandra Babu Naidu appointed a commission in 2001. What was this commission known as ?
Telugu: శాసనసభలో తెలంగాణకు చెందిన సభ్యుల తీవ్ర కోరికమేరకు జి.ఓ. నెం. 610 అమలు విషయంపై 2001లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక కమీషన్ను నియమించారు. ఆ కమీషన్ పేరేమి?

  • (1) Justice Bhargava Commission / జస్టిస్ భార్గవ కమీషన్
  • (2) J.P.L. Gwin Commission / జె.పి.ఎల్. గ్విన్ కమీషన్
  • (3) Girglani Commission / గిర్ గ్లాని కమీషన్
  • (4) K. Achyut Reddy Commission / కె. అచ్యుత రెడ్డి కమీషన్

Q189. English: In April 1969 the government appointed a committee to make suitable recommendations for constitutional amendments to continue Mulki rules. Who was the Chairman of that committee ?
Telugu: 1969 ఏప్రిల్ లో ముల్కి నిబంధన కొనసాగడానికి తగు రాజ్యాంగ సవరణలను సిఫారుసు చేయడానికని ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీ అధ్యక్షదెవరు ?

  • (1) Pingali Jaganmohan Reddy / పింగళి జగన్ మోహన్ రెడ్డి
  • (2) Kumar Lalith / కుమార్ లలిత్
  • (3) G.N. Waghre / జి. ఎన్ వాఘ్ర
  • (4) K.N. Wanchoo / కె.ఎన్. వాంఛు

Q190. English: Who among the following Telangana leaders undertook Satyagraha at Jantar Mantar in Delhi in 2012?
Telugu: 2012 లో ఢిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద సత్యాగ్రహం చేపట్టిన తెలంగాణ నాయకుడు ఎవరు ?

  • (1) K. Chandra Sekhar Rao / కె. చంద్రశేఖర్ రావు
  • (2) Kishan Reddy / కిషన్ రెడ్డి
  • (3) Konda Laxman Bapuji / కొండాలక్ష్మణ్ బాపూజి
  • (4) Kodanda Ram / కోదండ రామ్

Q191. English: Assertion (A): The seeds of the Telangana movement were sown at the time of the formation of Andhra Pradesh in 1956 itself.
Reason (R): The political domination of Andhra ruling class gradually reduced the people of Telangana to passive recipients.
The correct answer is:
Telugu: ప్రతిపాదన (A) : తెలంగాణ ఉద్యమానికి 1956 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆవిర్భావం తోనే బీజాలు వేయబడింది.
కారణం (R) : ఆంధ్ర రాజకీయ నాయకులు ఆధిక్యత క్రమేణ తెలంగాణ ప్రజలను కేవలం ప్రేక్షకుల మాత్రంగా మార్చివేసింది.
సరియైన సమాధానం:

  • (1) Both A and R are true and R is the correct explanation of A / (A) మరియు (R) రెండూ సరియైనవి, మరియు (R) కు (A) సరియైన వివరణ
  • (2) Both A and R are true, but R is not the correct explanation of A / (A) మరియు (R) రెండూ సరియైనవి, కాని (R) కు (A) సరియైన వివరణ కాదు
  • (3) A is true, but R is false / (A) సరియైనది, కాని (R) సరియైనది కాదు
  • (4) A is false, but R is true / (A) సరియైనది కాదు, కాని (R) సరియైనది

Q192. English: Telangana poets, artists, teachers and journalists formed the "Sahithi Mitra Mandali" (SMM) and conducted a huge meeting in March 1997. Where was this meeting held?
Telugu: తెలంగాణకు చెందిన కవులు, కళాకారులు, అధ్యపకులు పత్రికా రచయితలు కలిసి "సాహితి మిత్ర మండలి" (SMM) అనే సంస్థను ఏర్పరచి 1997 మార్చిలో గొప్ప సభ జరిపారు. ఆ సభ ఎక్కడ జరిగింది ?

  • (1) Warangal / వరంగల్
  • (2) Karimnagar / కరీంనగర్
  • (3) Bhuvanagiri / భువనగిరి
  • (4) Khammam / ఖమ్మం

Q193. English: Match the following famous tanks with those who built them during the Kakatiya period:
a. Kesamudram — ii. Prolaraju I
b. Ramappa Cheruvu — iv. Recherla Rudra
c. Ghanapur tank — iii. Ganapathi Deva
d. Bayyaram tank — i. Mailamba
Telugu: కాకతీయుల కాలం నాటి క్రింది ప్రసిద్ధ చెరువులు, వాటిని నిర్మించిన వారి పేర్లతో జతపరచుము.
a. కె సముద్రము — ii. ప్రోలరాజు I
b. రామప్ప చెరువు — iv. రేచర్ల రుద్ర
c. ఘనపూర్ చెరువు — iii. గణపతి దేవ
d. బయ్యారం చెరువు — i. మైలాంబ

  • (1) a-ii, b-iv, c-i, d-iii
  • (2) a-ii, b-i, c-iv, d-iii
  • (3) a-i, b-ii, c-iv, d-iii
  • (4) a-ii, b-iv, c-iii, d-i

Q194. English: Which of the following was not a part of the six point formula that was signed in September 1973?
Telugu: ఈ క్రింది వాటిలో ఏది 6 సూత్రాల పథకాలలో లేదు ?

  • (1) A state level Planning Board to be constituted / ఒక ప్రత్యేక రాష్ట్ర ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేయడం
  • (2) A Central University to be established in Hyderabad / ఒక కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని హైదరాబాదులో స్థాపించడం
  • (3) Two separate High Courts to be established, one for Andhra another for Telangana / రెండు హైకోర్టులు ఒకటి ఆంధ్రాకు, మరొకటి తెలంగాణకు ఏర్పాటు చేయడం
  • (4) Local candidates to be given preference in appointments and promotions / ఉద్యోగ నియమకాలకు, ప్రమోషన్లకు స్థానికులకు ప్రాధాన్యత నివ్వడం

Q195. English: Match the following organisations with the names of the founders:
a. Telangana NGO — iv. Amos K.R.
b. Telangana Study Circle — iii. Gade Innaiah
c. Telangana Ikya Vedika — i. Akula Bhumaiah
d. Telangana Sadhana Samithi — ii. Ale Narendra
Telugu: క్రింది సంస్థలు, వాటిని స్థాపించిన వారితో జతపరచుము.
a. తెలంగాణ ఎన్.జి.ఓ. — iv. కె.ఆర్. అమోస్
b. తెలంగాణ స్టడీ సర్కిల్ — iii. గాదె ఇన్నయ్య
c. తెలంగాణ ఐక్య వేదిక — i. ఆకుల భూమయ్య
d. తెలంగాణ సాధన సమితి — ii. ఆలే నరేంద్ర

  • (1) a-i, b-iii, c-iv, d-ii
  • (2) a-iv, b-iii, c-i, d-ii
  • (3) a-iii, b-iv, c-ii, d-i
  • (4) a-iv, b-i, c-iii, d-ii

Q196. English: Match the following Jataras with their places:
a. Nagoba Jatara — ii. Kesalapur
b. Edupayala Jatara — iv. Nagasanipalle
c. Sammakka, Saralakka Jatara — iii. Medaram
d. Kondagattu Anjanna Jatara — i. Mutyampeta
Telugu: క్రింది తెలంగాణ జాతరలను అవి జరుగు ప్రదేశాలతో జతపరచుము.
a. నాగోబా జాతర — ii. కేస్లాపూరు
b. ఏడుపాయల జాతర — iv. నాగసాని పల్లె
c. సమ్మక్క, సారలక్క జాతర — iii. మేడారం
d. కొండగట్టు అంజన్న జాతర — i. ముత్యం పేట

  • (1) a-iv, b-iii, c-ii, d-i
  • (2) a-ii, b-iv, c-iii, d-i
  • (3) a-iii, b-ii, c-i, d-iv
  • (4) a-iv, b-i, c-ii, d-iii

Q197. English: Who is the presiding deity in the thousand pillar temple at Hanumakonda ?
Telugu: హనుమకొండ లోని వేయి స్తంభాల గుడిలో గల మూల విరాట్టు ఎవరు ?

  • (1) Nameswara / నామేశ్వరుడు
  • (2) Someswara / సోమేశ్వరుడు
  • (3) Rudreswara / రుద్రేశ్వరుడు
  • (4) Bhimeswara / భీమేశ్వరుడు

Q198. English: During the Kakatiya period, lands were of several divisions. What were the 'Acchu Kattu lands' ?
Telugu: కాకతీయుల కాలంలో భూములు అనేక విభాలుగా వుండేవి. 'అచ్చు కట్టు' భూములు అనగా నేమి ?

  • (1) Dry lands / మెట్ట భూములు
  • (2) Irrigated lands / నీటిపారుదల గల భూములు
  • (3) Garden lands / తోట భూములు
  • (4) Pasture lands / మేత భూములు

Q199. English: Which among the following places was famous for diamond polishing during the Qutub Shahi period?
Telugu: కుతుబ్ షాహీల కాలంలో వజ్రాలు సానబెట్టడానికి (వజ్రాల నగిషికి) ఈ క్రింది ప్రదేశాలలో ఏది ప్రసిద్ధి చెందింది?

  • (1) Karwan / కార్వాన్
  • (2) Kurnool / కర్నూల్
  • (3) Guntur / గుంటూరు
  • (4) Masulipatnam / మసులిపట్నం

Q200. English: The inscriptions issued by Naganika speak of the Aswamedha and Rajasuya sacrifices conducted by a Sathavahana king. Who among the following was that king?
Telugu: నాగనిక ఇచ్చిన శాసనాలలో శాతవాహన రాజు అశ్వమేధ, రాజసూయ యజ్ఞాలు చేసినట్లు తెల్పబడివుంది. ఆ శాతవాహన రాజు ఎవరు ?

  • (1) Simukha / సిముఖ
  • (2) Sathakarni I / ఒకటవ శాతకర్ణి
  • (3) Apilaka / అపిలక
  • (4) Hala / హల
Telangana Police Constable Mains Exam 2019 (151-200)

No comments:

Post a Comment