📘 Telangana Police SI Prelims 2022
Official Question Paper & Answers · 7 August 2022 (50 Questions)
తెలంగాణ పోలీస్ ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్ష · అధికారిక ప్రశ్నాపత్రం & సమాధానాలు (50 ప్రశ్నలు)
Q1
A person invested an amount of ₹ X at the rate of 18% simple interest per annum and an amount of ₹ Y at the rate of 12% simple interest per annum. He received an interest of ₹ 4,320/- at the end of the year. Had he interchanged the amounts invested, he would have received an interest of ₹ 4,680/-. Then |X – Y| =
ఒక వ్యక్తి సంవత్సరానికి 18% రేటుతో బారువడ్డీకి X రూపాయల మొత్తాన్ని మరియు సంవత్సరానికి 12% రేటుతో బారువడ్డీకి Y రూపాయల మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టాడు. సంవత్సరాంతములో అతను ₹ 4,320/- రూపాయలను వడ్డీగా పొందాడు. ఆ మొత్తాలను పరస్పరము మార్చి ఉంటే అతను ₹ 4,680/- రూపాయల వడ్డీని పొంది ఉండేవాడు, అయితే |X – Y| =
✔ Correct Answer: (4) ₹ 6,000/-
Q2
The ratio of a principal and the total amount with r% simple interest rate on that principal after 1 year is a : b, then value of r in terms of a, b is:
ఒక అసలుకు మరియు దానిపై ఒక సంవత్సరం తర్వాత r% సామాన్య వడ్డీతో అయ్యే మొత్తానికి గల నిష్పత్తి a : b అయితే r విలువ a, b లలో:
✔ Correct Answer: (1) ((b – a) / a) × 100
Q3
A person invested ₹ 18,000 at the rate of 20% compound interest per annum. Then the interest he gets after completing the duration of two years is:
ఒక వ్యక్తి 18,000 రూపాయలను ఏడాదికి 20% రేటుతో చక్ర వడ్డీకి పెట్టుబడిగా పెట్టాడు. అప్పుడు రెండు సంవత్సరాల కాల వ్యవధి పూర్తి అయిన తర్వాత అతనికి వచ్చే వడ్డీ:
✔ Correct Answer: (1) ₹ 7,920
Q4
A building of initial value Rs. 31,25,000 depreciates in its value every year at the rate of 4% on its value at the beginning of the year. If Rs. x is the value of the building at the end of 3 years and Rs. y is the value of the land which appreciates at the rate of 5% compoundingly and the value of the land initially is Rs. 32,00,000, then y – x =
31,25,000 రూపాయల విలువ కల్గిన ఒక భవనం విలువ యొక్క తరుగుదల ప్రతి సంవత్సరం ఆ సంవత్సర ప్రారంభంలో ఉన్న దాని విలువ పై 4% రేటు చొప్పున ఉంటుంది. 3 సంవత్సరాల తర్వాత ఆ భవనం విలువ x రూపాయలు మరియు ప్రారంభంలో 32,00,000 రూపాయల విలువ కల్గి 5% పెరుగుదల రేటు చక్రీయంగా కల్గిన స్థలం విలువ y రూపాయలైతే, y – x =
✔ Correct Answer: (2) 939600
Q5
If Tn = Tn–1 + Tn–2 ∀ n ≥ 3 and T1 = T2 = 1, then T1 + T2 + ... + T10 =
Tn = Tn–1 + Tn–2 ∀ n ≥ 3 మరియు T1 = T2 = 1 అయితే T1 + T2 + ... + T10 =
✔ Correct Answer: (2) T12 – 1
Q6
A certain amount is distributed among three persons A, B, C. A gets 25% share of total amount X, twice the difference of B and C is equal to the share of A. Then the ratio in which A, B, C get the amount is:
ఒక నిర్దిష్ట మొత్తం A, B, C అనే ముగ్గురు వ్యక్తులకు పంచబడింది. A వాటా మొత్తం వాటాలో 25%, B మరియు C ల వాటాల తేడాకు రెట్టింపు A వాటాకు సమానం, అయితే A, B, C ల వాటాల నిష్పత్తి:
✔ Correct Answer: (1) 16 : 72 : 59
Q7
The averages of 3 different data D1, D2, D3 are 30, 40, 50 respectively. If the average of D1 and D2 together is 38 and that of D2 and D3 together is 42, then the average of all three data D1, D2 and D3 together is:
D1, D2, D3 అనే మూడు విభిన్న దత్తాంశాల సగటులు వరుసగా 30, 40, 50. D1, D2 ల సంయుక్త సగటు 38 మరియు D2, D3 ల సంయుక్త సగటు 42 అయితే D1, D2 మరియు D3 ల సంయుక్త సగటు:
✔ Correct Answer: (4) 40
Q8
In a police battalion of 600 police, the average height is 150 cm. Later it is discovered that for x policemen heights are recorded wrongly as 160 cm instead of 190 cm. By taking the correct heights, the average increased to 155 cm. Then x =
600 మంది పోలీసులు ఉన్న ఒక పోలీస్ బెటాలియన్ లోని వారి సగటు ఎత్తు 150 సెం.మీ. తర్వాత కొంత మంది పోలీసుల ఎత్తులు 190 సెం.మీ. బదులుగా 160 సెం.మీ.గా వ్రాయబడినవి అని కనుగొన్నారు. ఆ తప్పును సరిచేసిన తర్వాత వారి సగటు ఎత్తు 155 సెం.మీ.గా మారినది, అప్పుడు x =
✔ Correct Answer: (2) 100
Q9
The marked price of a newly arrived article shows an increase of 15% on its cost price. Later the marked price was decreased by 20% as the article is outdated. If the cost price of the article is ₹ 1,200 then the profit or loss for the shopkeeper with the modified selling price is:
కొత్తగా వచ్చిన ఒక వస్తువు యొక్క ప్రకటిత వెల దాని కొన్నవెల పై 15% ఎక్కువగా నిర్ణయించబడింది. ఆ వస్తువు కాలం చెల్లిపోవడంతో ఆ ప్రకటిత వెల పై 20% తగ్గించారు. ఆ వస్తువు కొన్న వెల ₹ 1200/- అయినచో మార్చిన అమ్మకపు వెలలో ఆ దుకాణదారుడికి వచ్చే లాభం లేదా నష్టం:
✔ Correct Answer: (2) 8% loss (నష్టం)
Q10
A sum of ₹ 5,600 is distributed among 12 people consisting of men, women and children. The ratio of the total amount given to all men, all women and all children is 6 : 4 : 1. But the ratio of the amount received by each man, woman and child is 3 : 2 : 1. Then the amount received by each woman is:
పురుషులు, స్త్రీలు మరియు పిల్లలు గల 12 మంది వ్యక్తులకు ₹ 5,600 రూపాయల మొత్తాన్ని పంచిపెట్టారు. పురుషులందరికి, స్త్రీలందరికి మరియు పిల్లలందరికి ఇచ్చిన సొమ్ము నిష్పత్తి 6 : 4 : 1, కాని ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీ మరియు ప్రతి పిల్లవానికి వ్యక్తిగతంగా లభించిన నిష్పత్తి 3 : 2 : 1, అయితే ప్రతి స్త్రీకి లభించిన సొమ్ము:
✔ Correct Answer: (3) ₹ 400
Q11
A shopkeeper sells his goods at 20% profit on cost price. Due to an error in weighing machine, it weighs 20% more than what is displayed on its screen. Then the profit or loss made is:
ఒక దుకాణదారుడు అతని వస్తువులను కొన్న ధరపై 20% లాభంతో అమ్ముతాడు. తూనిక యంత్రంలో లోపం వలన తెరపై చూపించిన దానికన్నా 20% ఎక్కువ బరువును తూచును. ఇప్పుడు అతనికొచ్చే లాభం లేదా నష్టం:
✔ Correct Answer: (4) No profit / No loss (లాభం లేదు, నష్టం లేదు)
Q12
A shopkeeper sells an article by offering 20% discount on the marked price and faces a loss of 5%. If he does not offer the discount, then the gain / loss he gets is:
ఒక దుకాణదారుడు ఒక ప్రకటిత వెల గల వస్తువుపై 20% రాయితీ ఇవ్వడం ద్వారా అతను 5% నష్టాన్ని పొందాడు. రాయితీ ఇవ్వకుండా అమ్మితే వచ్చే లాభం లేదా నష్టం:
✔ Correct Answer: (3) 18.75% gain
Q13
A can complete a piece of work in 18 days and B can complete the same work in 12 days. Both began the work together but after some days, B leaves the work. If A finishes the remaining work in 3 days, then the number of days B worked is:
A ఒక పనిని 18 రోజులలోను మరియు B అదే పనిని 12 రోజులలోనూ పూర్తి చేయగలరు. ఇద్దరూ కలిసి పని ప్రారంభించి కొన్ని రోజుల తర్వాత B ఆ పనిని విడిచిపెట్టెను. మిగిలిన పనిని A 3 రోజుల్లో పూర్తి చేస్తే, B పనిచేసిన రోజుల సంఖ్య:
✔ Correct Answer: (4) 6
Q14
14 men can do a work in 18 days, 15 women can do the same work in 24 days. If 14 men work for first 3 days and 10 women work alone after that for 3 days, then the ratio of the time taken by 9 men alone and the time taken by 5 women alone to complete the remaining work is:
14 మంది పురుషులు ఒక పనిని 18 రోజులలో చేయగలరు, 15 మంది స్త్రీలు అదే పనిని 24 రోజులలో చేయగలరు. 14 మంది పురుషులు మొదటి 3 రోజులు పనిచేసి, తరుపరి 3 రోజులు 10 మంది స్త్రీలు మాత్రమే పనిచేస్తే, మిగిలిన పనిని పూర్తి చేయడానికి 9 మంది పురుషులు మరియు 5 మంది స్త్రీలకు పట్టు సమయాల నిష్పత్తి:
✔ Correct Answer: (1) 4 : 5
Q15
A alone can do a piece of work in 10 days and B alone can do the same work in 15 days. A and B agreed to complete the work for ₹ 30,000. With the help of C, they completed the work in 5 days. Then the amount to be paid to C is:
ఒక పనిని A ఒక్కడే 10 రోజులలో చేయగలడు మరియు ఆ పనిని B ఒక్కడే 15 రోజులలో చేయగలడు. A, B లు ₹ 30,000 రూపాయలకు ఆ పనిని పూర్తి చేయడానికి అంగీకరించారు. C సహాయంతో వారు ఆ పనిని 5 రోజులలో పూర్తి చేశారు. అయితే C కి చెల్లించే మొత్తం:
✔ Correct Answer: (3) 1/3 of the amount to be paid to A (A కి చెల్లించే మొత్తంలో 1/3 వంతు)
Q16
If 22½% increase of a number is 98, then 22½% decrease of that number is:
ఒక సంఖ్యలో 22½% పెరిగినప్పుడు 98 అయిన ఆ సంఖ్యలో 22½% తగ్గించగా వచ్చు సంఖ్య:
✔ Correct Answer: (3) 62
Q17
A man started 10 minutes late from his home to his office. He travelled at a speed of 1¼ times of his usual speed and reached his office in time. Then the time taken by the man to reach his office at his usual speed is (in minutes):
ఒక వ్యక్తి తన ఇంటి నుండి తన ఆఫీసుకు 10 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరాడు. అతని సాధారణ వేగానికి 1¼ రెట్ల వేగంతో ప్రయాణించి సరియైన సమయానికి తన ఆఫీసుకు చేరుకున్నాడు. అయితే అతని సాధారణ వేగంతో తన ఆఫీసుకు చేరుకోవడానికి అతను తీసుకొనే సమయం (నిమిషాలలో):
✔ Correct Answer: (1) 50
Q18
Two persons P and Q started travelling towards each other from two places A and B respectively at 7 AM. The speeds of P and Q are in the ratio 4 : 5. Somewhere between A and B they met at C and spent some time together. From C at 8:07 AM P and Q started travelling towards B and A respectively. If P reaches B by 9:12 AM, the time they spent at C together is:
ఉదయం 7 గంటలకు P మరియు Q లు వరుసగా A మరియు B స్థానాల నుంచి ఒకరి వైపుకు ఇంకొకరు బయలుదేరారు. P మరియు Q ల వేగాల నిష్పత్తి 4 : 5. A మరియు B ల మధ్య C అనే చోట వారు కలుసుకొని కొంత సమయం గడిపారు. C నుండి ఉదయం 8:07 గంటలకు P మరియు Q లు వరుసగా B మరియు A ల వైపుకు బయలుదేరారు. B ని ఉదయం 9:12 గంటలకు P చేరితే, C వద్ద వాళ్ళు కలిసి గడిపిన సమయం:
✔ Correct Answer: (3) 17 min (17 నిమిషాలు)
Q19
The time between 7 and 8 O'clock when the minute hand is 5 minutes behind the hour hand is:
7 మరియు 8 గంటల మధ్య నిమిషాల ముల్లు గంటల ముల్లు కంటే 5 నిమిషాలు వెనుక ఉండే సమయం:
✔ Correct Answer: (2) 32 8/11 min. past 7 (7 గంటల 32 8/11 నిమిషాలు)
Q20
If m and n are the number of rotations of hour-hand and minute-hand of a clock respectively in 72 hours, then n – m =
ఒక గడియారంలో 72 గంటలలో గంటల ముల్లు, నిమిషాల ముల్లులు వరుసగా m మరియు n సార్లు పూర్తి భ్రమణం చేస్తే n – m =
✔ Correct Answer: (1) 66
Q21
Three persons X, Y and Z are employed to do a piece of work. X and Y together completed 21/25 part of the work. Y and Z together completed 8/25 part of the work. If all the 3 agreed to complete the work for ₹ 3,250, then the amount X receives more than that of Z is:
ఒక పనిని పూర్తి చేయడానికి ముగ్గురు వ్యక్తులు X, Y మరియు Z లు నియమింపబడ్డారు. X మరియు Y లు కలిసి 21/25 భాగం పనిని పూర్తి చేశారు. Y మరియు Z లు కలిసి 8/25 భాగం పనిని పూర్తి చేశారు. ఆ పనిని పూర్తి చేయడానికి ఆ ముగ్గురూ ₹ 3,250 రూపాయలకు ఒప్పందం కుదుర్చుకుంటే Z కంటే X కు ఎక్కువగా వచ్చే మొత్తం:
✔ Correct Answer: (3) ₹ 1,690
Q22
In 2022 August 15th is on Monday. Then the day of the week on which Republic day will be celebrated in the year 2024 is:
2022 ఆగస్టు 15 సోమవారం అయితే, 2024 వ సంవత్సరంలో గణతంత్ర దినోత్సవం జరుపుకునేది వారంలోని ఏ రోజవుతుంది?
✔ Correct Answer: (4) Friday (శుక్రవారం)
Q23
A person P started a business with ₹ 5,00,000. After 3 months, another person Q joined P with ₹ 4,00,000 in the business. At the end of the year, out of the total profit Q received a total of ₹ 50,000 including 20% of the profit for managing the business. Then the amount P received is:
P అనే ఒక వ్యక్తి ₹ 5,00,000 రూపాయలతో ఒక వ్యాపారాన్ని ప్రారంభించాడు. 3 నెలల తరువాత ₹ 4,00,000 రూపాయలతో Q అనే మరొక వ్యక్తి P తో వ్యాపారంలో చేరాడు. సంవత్సరాంతంలో మొత్తం లాభం నుండి వ్యాపారాన్ని నిర్వహించినందుకు గానూ లాభంలో 20% తో కలుపుకొని మొత్తంగా ₹ 50,000 రూపాయలను Q పొందాడు. అయితే P పొందిన సొమ్ము:
✔ Correct Answer: (4) ₹ 50,000
Q24
A, B, and C started a business with investments of ₹ 4,200, ₹ 8,400, ₹ 5,400 respectively. At the end of the year they got a profit of ₹ 6,000 and they reinvested their profits in the business. At the end of next year the ratio in which they get their profits is:
A, B, C లు వరుసగా ₹ 4,200, ₹ 8,400, ₹ 5,400 పెట్టుబడులతో ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు. సంవత్సరాంతంలో వారికి ₹ 6,000 లాభం వచ్చింది. వారి లాభాలను వ్యాపారంలో తిరిగి పెట్టుబడిగా పెట్టారు. తదుపరి సంవత్సరం లో వారు పొందే లాభాల నిష్పత్తి:
✔ Correct Answer: (1) 7 : 14 : 9
Q25
A rectangular plot of dimensions 210 meters × 120 meters is divided into 4 equal parts by two roads each of width 12 meters running in the middle of it, one parallel to the length and the other parallel to the breadth. Then the area of each part is (in Sq. meters):
210 మీ × 120 మీ కొలతలుగా గల ఒక దీర్ఘ చతురస్రాకారపు స్థలం యొక్క పొడవుకు, వెడల్పుకు సమాంతరంగా ఉంటూ స్థలానికి మధ్యగా వెళుతున్న 12 మీ. ల వెడల్పు గల రెండు రోడ్డు ఆ స్థలాన్ని 4 సమాన భాగాలుగా విభజిస్తున్నాయి అయితే ఒక్కొక్క భాగం యొక్క వైశాల్యం (చ.మీటర్లలో):
✔ Correct Answer: (4) 5,346
Q26
For a square, the lengths of its side and diagonal are equal to the diameters of two unequal circles. The ratio of the areas of the smaller circle and larger circle is:
ఒక చతురస్రం యొక్క భుజము మరియు వికర్ణముల పొడవులు రెండు అసమాన వృత్తాల వ్యాసాలకు సమానమైతే, చిన్న వృత్తం మరియు పెద్ద వృత్తాల వైశాల్యాల నిష్పత్తి:
✔ Correct Answer: (3) 1 : 2
Q27
After 2022, the next immediate calendar year which will be same as 2022 is:
2022 సంవత్సరంలాగా యథాతథంగా ఉండే క్యాలెండర్ సంవత్సరం, 2022 తరువాత వెంటనే వచ్చే సంవత్సరం:
✔ Correct Answer: (2) 2033
Q28
A solid cone is melted and with that entire material a sphere is made having volume of 38,808 cm³. If the radius of the cone and sphere are equal, then height of the cone (in centimeters) is:
ఒక శంకువును కరిగించి ఆ మొత్తం పదార్థంతో ఘనపరిమాణం 38,808 cm³ ఉన్న ఒక గోళాన్ని తయారు చేశారు. శంకువు వ్యాసార్థం, గోళం వ్యాసార్థాలు సమానం అయితే, శంకువు ఎత్తు (సెం.మీటర్లలో):
✔ Correct Answer: (3) 84
Q29
Pipe A can fill a tank in 30 minutes and Pipe B can fill it in 45 minutes. But third Pipe C can empty a full tank in 15 minutes. A and B are kept open for 15 minutes in the beginning and then C is also opened. Since then the time required (in minutes) to empty the tank is:
ఒక ట్యాంకును A అనే పైపు 30 నిమిషాలలోనూ, B అనే పైపు 45 నిమిషాలలోనూ నింపగలవు. కానీ మూడవ పైపు C నిండు ట్యాంకును 15 నిమిషాలలో ఖాళీ చేయగలదు. మొదట 15 నిమిషాల వరకు A, B లను తెరచి ఉంచారు. తరువాత C ని కూడా తెరిచారు. అప్పటి నుండి ట్యాంకు ఖాళీ కావడానికి కావలసిన సమయం (నిమిషాలలో):
✔ Correct Answer: (2) 45
Q30
Two inlet pipes A and B working together for 4 hours fill 72 units of water in a tank having capacity 160 units. If A alone can fill the tank in 20 hours, the time taken by B alone to fill the tank is:
160 యూనిట్లు సామర్థ్యం గల తొట్టిని A మరియు B గొట్టాలు కలిసి 4 గంటలలో 72 యూనిట్ల నీటితో నింపుతాయి. A ఒక్కటే తొట్టిని 20 గంటలలో నింపితే, B ఒక్కటే తొట్టిని నింపే సమయము:
✔ Correct Answer: (4) 16 hours (గంటలు)
Q31
Two trains run on parallel tracks at 126 kmph and 108 kmph. When they are running in opposite directions they cross each other completely in 5 seconds and when they are running in the same direction a passenger sitting in the faster train sees that the other train passes completely in 30 seconds. Then the length of the faster train is (in meters):
రెండు రైళ్లు సమాంతర పట్టాలపై గంటకు 126 కి.మీ. మరియు 108 కి.మీ. వేగంతో పరుగెడుతున్నాయి. అవి వ్యతిరేక దిశలలో పరుగెడుతున్నపుడు అవి ఒకదానినొకటి పూర్తిగా దాటడానికి 5 సెకండ్లు పడుతుంది. మరియు ఒకే దిశలో పరుగెడుతున్నప్పుడు, ఎక్కువ వేగంతో వెళుతున్న రైలులో కూర్చున్న ఒక ప్రయాణికుడు రెండవ రైలును తను పూర్తిగా దాటివెళ్ళడానికి 30 సెకండ్లు పట్టిందని గమనించాడు. అయితే ఎక్కువ వేగంతో వెళ్ళే రైలు పొడవు (మీటర్లలో):
✔ Correct Answer: (3) 175
Q32
A train of 450 meters long moving with a speed of 65 km/hr crosses a man travelling in some direction of the train in 27 seconds. Then the speed with which the man moving and his direction is:
450 మీటర్ల పొడవు కల్గిన రైలు గంటకు 65 కి.మీ వేగంతో ప్రయాణిస్తూ 27 సెకనులలో ఒక దిశలో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తిని దాటుతుంది. ఆ వ్యక్తి ప్రయాణించే వేగం మరియు ప్రయాణించే దిశ:
✔ Correct Answer: (4) 5 kmph; Opposite direction (గంటకు 5 కి.మీ; వ్యతిరేక దిశ)
Q33
Two cubes, each of volume 4,096 c.c., are joined to form a cuboid. Then the difference between the surface area of the cuboid and the total surface area of the two cubes is (in sq.cm):
ఒక్కొక్కటి 4,096 ఘ. సెం. మీ. ఘనపరిమాణం కలిగిన రెండు ఘనాలను కలిపి ఒక దీర్ఘ ఘనాన్ని ఏర్పరిచారు. అప్పుడు దీర్ఘఘనం యొక్క ఉపరితల వైశాల్యం మరియు రెండు ఘనాల ఉపరితల వైశాల్యాల మొత్తానికి గల భేదం (చ. సెం. మీ. లలో):
✔ Correct Answer: (1) 512
Q34
In a mixture of acid and water, if 1 liter of water is added, then the new mixture contains 20% acid. When 1 liter of acid is added to the new mixture, the acid in the resulting mixture is 33⅓%. The percentage of acid in the original mixture is:
ఆమ్లము (acid) మరియు నీరుల మిశ్రమంలో 1 లీటరు నీటిని కలిపితే ఈ కొత్త మిశ్రమంలో 20% ఆమ్లము ఉంది. ఈ కొత్త మిశ్రమానికి 1 లీటరు ఆమ్లము కలిపితే ఫలిత మిశ్రమములో 33⅓% ఆమ్లము ఉంటుంది. ప్రారంభములోని మిశ్రమంలో గల ఆమ్ల శాతం:
✔ Correct Answer: (3) 25%
Q35
The speed of a motor boat in still water is 50 kmph. If the motor boat travels 60 km against the stream in 1 hr 30 minutes, then the time taken by the boat to cover 100 km along the stream is (in minutes):
నిశ్చలమైన నీటిపై ఒక మోటార్ పడవ యొక్క వేగం గంటకు 50 కి. మీ. 1 గంట 30 నిమిషాలలో ప్రవాహానికి ఎదురుగా ఆ మోటార్ పడవ 60 కి. మీ. ప్రయాణిస్తే, ప్రవాహం వెంబడి ఆ పడవ 100 కి. మీ. ప్రయాణించడానికి పట్టే సమయం (నిమిషాలలో):
✔ Correct Answer: (4) 100
Q36
A Motor Boat travelled to a point B from A and returned to A. The speed of the stream is 3 km/hr. If distance between A and B is 2 km and total time taken to the round trip is 30 minutes, then speed of the motor boat in still water is:
A నుండి B కి ఒక మోటారు పడవ ప్రయాణించి తిరిగి A కు చేరుకుంది. ప్రవాహ వేగం గంటకు 3 కి. మీ. A, B ల మధ్య దూరం 2 కి. మీ. మరియు పూర్తి ప్రయాణానికి పట్టిన సమయం 30 నిమిషాలు అయితే, నిశ్చల నీటిపై పడవ వేగం:
✔ Correct Answer: (3) 9 km/hr
Q37
In a race of 1200 meters, A can beat B by 120 meters and in a race of 800 meters B can beat C by 40 meter. In a race of 400 meters by how many meters can A beat C?
1200 మీ. ల పరుగు పందెంలో B ని A 120 మీ. ల తేడాతో ఓడించగలడు మరియు 800 మీ. ల పరుగు పందెంలో C ని 40 మీ. ల తేడాతో B ఓడించగలడు. 400 మీ. ల పరుగు పందెంలో C ని ఎన్ని మీటర్ల తేడాతో A ఓడించగలడు?
✔ Correct Answer: (1) 58
Q38
In three different vessels A, B and C, syrup and water are mixed in the ratios of 2:3, 3:5 and 5:7 respectively. 15 liters of mixture taken from A, 16 liters of mixture taken from B and x liters of mixture taken from C are mixed in a new vessel to have the ratio of syrup and water as 2:3, then x =
మూడు విభిన్న పాత్రలు A, B మరియు C లలో ఒక సిరప్ మరియు నీటిని వరుసగా 2 : 3, 3 : 5 మరియు 5 : 7 నిష్పత్తులలో కలిపినారు. A నుండి 15 లీటర్ల మిశ్రమాన్ని, B నుండి 16 లీటర్ల మిశ్రమాన్ని మరియు C నుండి x లీటర్ల మిశ్రమాన్ని తీసుకుని ఒక కొత్త పాత్రలో సిరప్ మరియు నీటి నిష్పత్తి 2:3 అయ్యేటట్లుగా కలిపినారు అయితే x =
✔ Correct Answer: (1) 24
Q39
The present age of A is twice the age of B. 15 years ago the age of A was thrice the age of B. Then 25 years ago the age of A was:
A యొక్క ప్రస్తుత వయస్సు B యొక్క వయస్సుకు రెండు రెట్లు. 15 సంవత్సరాల క్రితం A యొక్క వయస్సు B యొక్క వయస్సుకు మూడు రెట్లు. అయితే 25 సంవత్సరాల క్రితం A యొక్క వయస్సు:
✔ Correct Answer: (1) 7 times the age of B (B యొక్క వయస్సుకు 7 రెట్లు)
Q40
The ratio of ages of Ram and Rahim after 5 years from now is 11 : 10. The ratio of their ages 4 years ago was 8 : 7. The ratio of their present ages is:
రామ్, రహీమ్ ల వయస్సుల నిష్పత్తి 5 సంవత్సరాల తర్వాత 11 : 10. 4 సంవత్సరాల ముందు వారి వయస్సుల నిష్పత్తి 8 : 7. వారి ప్రస్తుత వయస్సుల నిష్పత్తి:
✔ Correct Answer: (3) 28 : 25
Q41
The cost price of an article B is 25% more than that of an article A. Articles A and B are marked up by 30% and 20% respectively. Article A is sold at a discount of 10% and article B is sold at a discount of 5%. If the selling price of article A is ₹ 51 less than the selling price of article B, then the cost price of article B is:
B అనే ఒక వస్తువు యొక్క కొన్న ధర A అనే వస్తువు యొక్క కొన్న ధర కంటే 25% ఎక్కువ. A, B వస్తువుల ధరలు వరుసగా 30% మరియు 20% ఎక్కువగా ప్రకటితమైనాయి. A అనే వస్తువు 10% తగ్గింపుతోనూ, B అనే వస్తువు 5% తగ్గింపుతోనూ విక్రయించారు. A అనే వస్తువు యొక్క అమ్మకపు ధర B అనే వస్తువు యొక్క అమ్మకపు ధర కంటే ₹ 51 రూపాయలు తక్కువైతే B అనే వస్తువు యొక్క కొన్న ధర:
✔ Correct Answer: (4) ₹ 300
Q42
The cost price of an article is 64% of the marked price. If the article is sold for 12% discount on the marked price, then the profit percent is:
ఒక వస్తువు కొన్న ధర ప్రకటిత ధరలో 64%. ప్రకటిత ధరపై 12% రాయితీ ఇచ్చి ఆ వస్తువును అమ్మితే లాభ శాతం:
✔ Correct Answer: (3) 37.5%
Q43
In one kilometre race, A can give B a start of 100 m and can give C a start of 200 meter. B can give 20 min to cover a race of 200 metres. The time taken by B to run 200 meters:
ఒక కిలోమీటర్ పరుగు పందెంలో A, B ని 100 మీటర్లలోను C ని 200 మీటర్లలోను ఓడించగలడు. 200 మీటర్ల పందెంలో B, C ని 20 నిమిషాల తేడాతో ఓడించగలడు. 200 మీటర్ల దూరం పరుగెత్తడానికి B కి పట్టిన సమయం:
✔ Correct Answer: (3) 90/4 min (22.5 min)
Q44
A 25-digit number is such that its extreme digits are same and all other 23 digits are same but different from extreme digits. If that number is divisible by 11, then end digit can't be:
ఒక 25 అంకెలు గల సంఖ్యలో చివరి కొనల అంకెలు సమానంగా ఉంటాయి. మిగిలిన 23 అంకెలు సమానంగా ఉంటూ చివరి కొనల అంకెలకు భిన్నంగా ఉంటాయి. ఆ సంఖ్య 11 చే భాగింపబడితే, చివరి అంకె కాదగినది అంకె:
✔ Correct Answer: (1) 9
Q45
Let G be the GCD of three numbers 3,780, 3,465 and 3,003 and L be the LCM of 3,465 and 3,003. Then L / (33G) =
3,780, 3,465 మరియు 3,003 అనే మూడు సంఖ్యల గ.సా.భా. G మరియు 3,465 మరియు 3,003 యొక్క క.సా.గు. L అయితే L / (33G) =
✔ Correct Answer: (3) 455
Q46
If the sum of the fractions 12⅓, 10 5/6 is x and the sum of the fractions 7⅔, 1 4/7 is y then x – y =
12⅓, 10 5/6 అనే భిన్నముల మొత్తం x మరియు 7⅔, 1 4/7 అనే భిన్నముల మొత్తం y అయితే x – y =
✔ Correct Answer: (2) 13 13/14
Q47
If the digit in the units place of the square of an integer is x, then the sum of all possible distinct values of x is:
ఒక పూర్ణాంకము యొక్క వర్గంలో ఒకట్ల స్థానంలో అంకె x అయితే, x కు సాధ్యపడే అన్ని విభిన్న విలువల యొక్క మొత్తం:
✔ Correct Answer: (1) 25 (0 + 1 + 4 + 9 + 6 + 5 = 25)
Q48
Evaluate: [∛(–2197) × ∛(–125) ÷ ∛(27/512)] + 2/3 =
సాధించండి: [∛(–2197) × ∛(–125) ÷ ∛(27/512)] + 2/3 =
✔ Correct Answer: (1) 174
Q49
If x is an integer satisfying the equation 9x4/3 + 9x–2/3 = 82 then √(12 + 2√x) =
x అనేది 9x4/3 + 9x–2/3 = 82 అనే సమీకరణాన్ని తృప్తిపరిచే ఒక పూర్ణసంఖ్య అయితే √(12 + 2√x) =
✔ Correct Answer: (2) 3 + √3
Q50
The set of all perfect numbers and twin primes among the numbers 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 is:
1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 సంఖ్యలలోని సంపూర్ణ సంఖ్యలు మరియు యుగ్మ (కవల) ప్రధాన సంఖ్యలన్నింటి సమితి:
✔ Correct Answer: (4) {3, 5, 6, 7}
No comments:
Post a Comment