Revivalision of Telangana Culture-తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనం

TSStudies
0
తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనం 
తెలంగాణ అమరవీరుల స్థూపం (Telangana Martyr Statue)
  • 1969 తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి స్మృత్యర్థం(In Memory) గన్ పార్క్ వద్ద తెలంగాణ అమరవీరుల స్థూపం నిర్మించారు 
  • ఈ స్తూపాన్ని చెక్కిన శిల్పి- ఎక్కా యాదగిరి 
  • అమరవీరుల స్తూపం అడుగుభాగం నల్ల రాయి తో తయారు చేశారు 
  • నాలుగు వైపులా తొమ్మిది చొప్పున చిన్న రంధ్రాలు ఉన్నాయి. ఇది అమరవీరుల శరీరంలో దూసుకుపోయిన బుల్లెట్స్ 
  • స్థూపాన్ని ఎరుపు రాయి తో నిర్మించారు. ఇది త్యాగానికి, సాహసానికి నిదర్శనం 
  • స్థూపం మధ్య భాగంలో ఒక స్థంభం ఉంటుంది. ఏ వైపు చూసినా దానిపై 9 గీతలు కనిపిస్తాయి. ఇది తొమ్మిది జిల్లాలకు నిదర్శనం 
  • పై భాగంలో అశోకుని ధర్మచక్రం ఉంటుంది. ఇది ధర్మం, శాంతి, సహనానికి గుర్తు.
తెలంగాణ తల్లి విగ్రహం(Telangana Talli Statue) 
  • తెలంగాణ తల్లి విగ్రహం రూపొందించడంలో ముఖ్య పాత్ర పోషించిన వారు బి ఎన్ రాములు, బి.వి.ఆర్ చారి, ప్రొఫెసర్ గంగాధర్ 
  • పసునూరి దయాకర్ తయారుచేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని తెలంగాణ భవన్ లో  2007 నవంబర్ 15న కేసీఆర్ ఆవిష్కరించారు
ఈ విగ్రహం ప్రత్యేకతలు 
  • కిరీటంలో, వడ్డానం లో ప్రసిద్ధి చెందిన కోహినూరు, జాకబ్  వజ్రాలను పోలి ఉంటాయి 
  • పట్టుచీర - పోచంపల్లి, గద్వాల చీరలకు గుర్తుగా 
  • కాలి మెట్టెలు -  ముత్తయిదువుకు చిహ్నంగా
  • వెండి మెట్టలు - కరీంనగర్ ఫిలిగ్రీ ఆభరణాలకు చిహ్నంగా 
  • చేతిలో మొక్కజొన్న - తెలంగాణ మెట్ట ప్రాంతాలకు గుర్తుగా 
  • ఇంకో చేతిలో బతుకమ్మ - తెలంగాణ పండుగకు గుర్తుగా
తెలంగాణ జాగృతి(Telangana Jagruthi)
  • తెలంగాణ ప్రాంతంలోని సంస్కృతి, కళా రూపాల, జానపదులు, సాహిత్యం, తెలంగాణ ప్రాంతం మాండలికం మొదలైనవి పరిరక్షించడానికి తెలంగాణ జాగృతి సాంఘిక-సాంస్కృతిక సంస్థ 2008 జూన్ లో ఏర్పడింది 
  • దీనిని కల్వకుంట్ల కవిత ఏర్పాటు చేసింది. 
  • పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించడానికి తెలంగాణ జాగృతి బతుకమ్మ పండుగ ఉత్సవాలు ప్రతి సంవత్సరం నిర్వహిస్తుంది 
  • తెలంగాణ ప్రాంతంలో అన్ని జిల్లాల్లో బతుకమ్మ ఉత్సవాలను నిర్వహించి, వాటికి విశిష్ట ముగింపుగా హైదరాబాద్ నగరంలోని ట్యాంక్ బండ్ పై  లక్షలాది మంది ప్రజలతో బతుకమ్మ పండుగ జరిపి  సాంస్కృతిక కవాతు నిర్వహిస్తారు.


Post a Comment

0Comments

Post a Comment (0)