కవులు రచయితలు గాయకులు కళాకారుల పాత్ర
- సింగిడి తెలంగాణ రచయితల సంఘం ఆధ్వర్యంలో దిమ్మిస అనే కవితా సంకలనం వెలువరించారు. ఇది మిలియన్ మార్చ్ లో విగ్రహాల విధ్వంసం నేపథ్యంగా వచ్చింది
- సుంకర రమేష్ 2006 నుంచి మొదలుకొని 2010 వరకు వరుసగా ఐదు తెలంగాణ కవితా సంకలనాలను తీసుకువచ్చారు
- జయ శిఖరం పేరిట వేముగంటి మురళీకృష్ణ సంపాదకత్వంలో తెలంగాణ జాతిపిత ఆచార్య జయశంకర్ స్మృతి కవిత సంకలనం వెలువడింది
- ముత్తడి సంకలనాన్ని అంబటి సురేందర్ రాజు, డాక్టర్ సుంకిరెడ్డి నారాయణరెడ్డి తీసుకువచ్చారు
- పొక్కిలి కవితాసంకలనాన్ని 2002లో జూలూరి గౌరీశంకర్ తీసుకువచ్చారు
- 1969-1973 తెలంగాణ ఉద్యమ కవిత్వం సంకలనాన్ని సంగిశెట్టి శ్రీనివాస్, డాక్టర్ సుంకిరెడ్డి నారాయణరెడ్డి తీసుకువచ్చారు
- ముండ్ల గర్ర జూలూరి గౌరీశంకర్ "నది పుట్టు బడి, ఇక్కడి చెట్ల గాలి"ని డాక్టర్ నందిని సిద్ధారెడ్డి, "చెట్టును దాటుకుంటూ" ను జూకంటి జగన్నాథం, పొద్దుపొడుపు, "పొక్కిలి వాళ్ళ పులకింత" ను అన్నవరం దేవేందర్, జఖ్ము ఆవాబ్ ను స్కైబాబు వెలువరించారు.
ఇతరాలు
- లడాయి - డా. పసునూరి రవీందర్
- ఎర్ర మట్టి బండి - తదల అంజయ్య
- పిడికిలి - బిళ్ళ మహేందర్
- ముల్కీ - వేముల ఎల్లయ్య
- యాళ్లయింది - డా. ఉదారి నారాయణ
- నెగడు - చింతల ప్రవీణ్
- జంగ్ - దానక్క ఉదయభాను
- జాగో జాగావో, క్విట్ తెలంగాణ, రజ్మియా, జఖ్ము నవాబ్ - స్కైబాబా
- మనం - 2012 సంవత్సరంలో వేముగంటి మురళీకృష్ణ
- మల్లు బండ - అన్నవరం దేవేందర్
- మశాల్ - దీర్ఘకవిత - వనపట్ల సుబ్బయ్య
- జిగర్ - డా. కె లావణ్య, అనిశెట్టి రజిత
- కావడి కుండలు - డా. కోయి కోటేశ్వరరావు
వ్యాస సంకలనాలు
- సంభాషణ - డా. కె శ్రీనివాస్
- గనుమ - డా. సుంకిరెడ్డి నారాయణ రెడ్డి
- ముద్దెర - డా. ముదిగంటి సుజాతారెడ్డి
- ప్రాణహిత - అల్లం నారాయణ
- ఆవర్తనం - నందిని సిద్ధారెడ్డి
కథలు
- తెలంగాణ చౌక్ - కర్ర ఎల్లారెడ్డి, బి.వి.ఎన్ స్వామి
- మా పంతులు - డా. బి యశోదారెడ్డి
- యుద్ధ నాదం - పెద్దింటి అశోక్ కుమార్
- కొత్త రంగులు అద్దుకున్న కళ - బెజ్జారపు రవీందర్
- నాలుగు కోట్ల పిడికిళ్ళు - వెల్దండి శ్రీధర్
- తెలంగానం - ఓదుల వెంకటేశ్వర్లు
నవలలు
- సలాం హైదరాబాద్ - పురావస్తు లోకేశ్వర్
- ముళ్ళ పొదలు - అంపశయ్య నవీన్
- లోచూపు - బి.ఎస్.రాములు
పాటలు
- అమ్మ తెలంగాణమా, పొడుస్తున్న పొద్దు మీద - గద్దర్
- అయ్యోనివా నువ్వు అవ్వోనివా - గూడ అంజయ్య
- జయ జయహే తెలంగాణ, జై బోలో తెలంగాణ, బొమ్మ చెక్కితే బొమ్మ మాయమైపోతున్నడమ్మ మనిషన్నవాడు -అందెశ్రీ
- నాగేటి సాళ్లల్లో నా తెలంగాణ - నందిని సిద్ధారెడ్డి
- పల్లే కన్నీరు పెడుతుందో, ఇద్దరం విడిపోతే భూమి బద్దలవుతుందా - గోరటి వెంకన్న
- వీరులారా వందనం - దరువు ఎల్లన్న
- రాతి బొమ్మల్లోనా - మిట్టపల్లి సురేందర్
- చినుకు చినుకు కురిసిన నేత చిత్రమూన వాసన, ఆడుదాం డప్పుల్లా దరువు, ఎందుకు రాలిపోతావురా నువ్వు ఎందుకు కాలిపోతావు - మిత్ర
- జై కొట్టు తెలంగాణ - డా.పసునూరి రవీందర్
- ఉస్మానియా క్యాంపస్ లో ఉదయించిన కిరణం - అభినయ శ్రీనివాస్
- పల్లెటూరి పిల్లగాడో - సుద్దాల హనుమంతు
- బండి వెనక బండి కట్టి నైజం సర్కరోడా - బండి యాదగిరి
- నోట్: తెలంగాణ రచయితల వేదిక "విరుగుడు" అనే వ్యాస సంకలనాన్ని 13 ఏప్రిల్ 2013న ట్యాంక్ బండ పై గల పోతన విగ్రహం వద్ద ఆవిష్కరించారు.
తెలంగాణలోని చిత్రకారులు
కాపు రాజయ్య, తోట వైకుంఠం, కే లక్ష్మణ్ గౌడ్, ఏలె లక్ష్మణ్
తెలంగాణలోని సినీ రంగ ప్రముఖులు
పైడి జయరాజ్, శ్యాంబెనగల్, బి.నరసింగరావు, ప్రభాకర్ రెడ్డి, కాంతారావు, శంకర్ (జై బోలో తెలంగాణ), రోశం బాలు, కందికొండ యాదగిరి, శ్రీనాథ్, చంద్రబోస్, రఫీ
జానపద కళాకారులు
మిద్దె రాములు (ఒగ్గు కథ), చిందే ఎల్లమ్మ (చిందు యక్షగానం), దర్శనం మొగులయ్య (12 మెట్లకిన్నెర)
తెలంగాణలోని శిల్పకారులు
ఎక్క యాదగిరి (అమరవీరుల స్తూపం నిర్మాత), బి వి ఆర్ చారి (తెలంగాణ తల్లి విగ్రహ రూపకర్త), రమణ