ఇతర పాలకులు
🏛️ పోలవస రాజవంశం
క్రీ.శ. 1080–1160
పోలవస రాజవంశం కరీంనగర్ జిల్లా జగిత్యాల సమీపంలోని పోలాస్ గ్రామాన్ని కేంద్రంగా చేసుకుని పరిపాలించింది. వీరు కళ్యాణి చాళుక్యుల సామంతులు.
పోలవస రాజ్యం గోదావరి నదిని ఆనుకొని పోలాస్ నుండి నర్సంపేట వరకు విస్తరించింది.
👑 రాజకీయ చరిత్ర
🔹 మాధవ వర్మ
- వెనుగొంటకుల వంశానికి చెందినవాడు.
- పోలవస రాజవంశ మూలపురుషుడు.
- బిరుదులు: లట్టలూరు పురవరాధీశ్వర, సువర్ణగరుడ ధ్వజం.
🔹 మొదటి జగ్గదేవుడు
- ఇతని గురించి హన్మకొండలోని పద్మాక్షి దేవాలయ శాసనంలో పేర్కొనబడింది.
🔹 మొదటి మేడరాజు
- ఇతని గురించి తెలిపే శాసనం — బాణాజిపేట శాసనం.
- బిరుదు: పురవరాధీశ్వర.
- వీరకమల జినాలయం నిర్మించాడు.
🔹 2వ మేడరాజు
- ఇతనికి సమకాలీన కాకతీయరాజులు — 2వ ప్రోలరాజు, రుద్రదేవుడు / మొదటి ప్రతాపరుద్రుడు.
- ఇతని గురించి తెలిపే శాసనం — హన్మకొండ పద్మాక్షి దేవాలయ శాసనం.
⚔️ హైహమ వంశం
క్రీ.శ. 1190–1294
వర్ధమాన పురం రాజధానిగా తెలంగాణలోని రాయచూరు ప్రాంతాన్ని పాలించిన గోన వంశస్థులు హైహయ వంశంవారు. వర్ధమానపురానికి మరొక పేరు వడ్డమాను.
వీరు కాకతీయ సామంతులు. వీరి ఇంటిపేరు కోణ లేదా గోన. రెడ్డి, నాయని అను పదాలు వీరు తమ పేర్లలో చేర్చుకున్నారు.
👑 ముఖ్యులు
- మూలపురుషుడు: గోనకాట భూపతి.
- శాసనాల ప్రకారం కాకతీయ గణపతి దేవుడి సామంతుడు — గోనబుద్ధా రెడ్డి.
- గోనగన్నారెడ్డి కాకతీయ రుద్రమదేవి సేనానిగా ప్రసిద్ధి. బిరుదు: చోళ జగజ్జాలవీర.
- గోనగన్నారెడ్డి ఏలనాటిని జయించి రుద్రమదేవి పాలెగాడుగా నాగార్జున కొండ దుర్గాన్ని పరిపాలించాడు.
🌿 చెరుకు వంశం
👑 ముఖ్యులు
🔹 కాట సేనాని
- చెరుకు వంశ మూలపురుషుడు.
- కాకతి 2వ బేతరాజు సేనాని.
🔹 బొల్లయరెడ్డి
- కాకతీయులకు, దేవగిరి యాదవ రాజులకు ఇతని కాలంలో యుద్ధం జరిగింది.
- ఈ యుద్ధంలో గణపతి దేవుడు బందీగా చిక్కాడు.
- ఇతడు కాళేశ్వర, కాతేశ్వర, మారేశ్వర, సూర్యదేవర, గణపేశ్వర ఆలయాలు నిర్మించాడు.
🔹 ఇమ్మడి బొల్లయ్య
- చెరుకు వంశంలో సుప్రసిద్ధుడు.
- విరియాల వంశానికి చెందిన రుద్రమ సోదరి రుద్రసానిని వివాహం చేసుకున్నాడు.
📜 శాసనాలు & రాజధాని
- కాకతీయ సామంత రాజ్యాలలో చెరుకువంశం ఒకటి.
- వీరి శాసనాలు మహబూబ్‌నగర్, నల్గొండ, కర్నూలు జిల్లాలలో లభించాయి.
- రాజధాని నల్గొండ జిల్లా దేవరకొండ మండలంలోని చెరుకుపల్లి అయి ఉండవచ్చునని చరిత్రకారుల భావన.
🌀 విరియాల వంశం
కాకతీయుల సామంతులలో గొప్ప సేవ చేసిన వంశం.
- మూలపురుషుడు: పోరంటివెన్న.
- వీరి వంశం — దుర్జయ వంశం.
- విరియాల వంశ చరిత్ర తెలుసుకొనుటకు ఉపయోగపడే శాసనాలు: గూడూరు శాసనం, రాయపర్తి శాసనం, మెరిపిరాల శాసనం.
- పోరంటివెన్న తర్వాత ఎర్రభూపతి, భీముడు, ఎర్ర నరేంద్రుడు, బేతన పాలించారు.
🏯 కొలనుపాక రాజ్యం
- మహామండలేశ్వర జగద్దేవుడు కొలనుపాకను 1104 నుండి 1108 వరకు పాలించాడు.
- కళ్యాణి చాళుక్యరాజు 6వ విక్రమాదిత్యుడు జగద్దేవుడిని మహామండలేశ్వరగా నియమించాడు.
- జగద్దేవుడు కొలనుపాకలో నిర్మించిన ఆలయం — జగద్దేవ నారాయణాలయం. (ఇదే వీరనారాయణాలయంగా మారింది.)
- 6వ విక్రమాదిత్యుడు జగద్దేవుడి పాలనలో ఉన్న సబ్బినాడును కాకతి రెండవ బేతరాజుకి ఇచ్చాడు.
- కందూరి చోడులు, ముదిగొండ చాళుక్యులు, పోలవాస రాజులు, జగద్దేవుడిని ఓడించడంతో కాకతీయులు తెలంగాణలో బలమైన శక్తిగా మారారు.
📖 తెలంగాణ చరిత్ర – పోలవస, హైహయ, చెరుకు, విరియాల, కొలనుపాక రాజ్యాలు
✍️ చరిత్ర గమనికలు · TSPSC / TGPSC / TSLPRB సిద్ధత కోసం
No comments:
Post a Comment