తెలంగాణా చరిత్ర - సంస్కృతి
శాతవాహన యుగం క్రీ.పూ.225 నుండి క్రీ.శ. 225 వరకు. వివిధ సాక్ష్యాధారాల సహాయంతో శాతవాహనుల పాలన క్రీ.పూ. 271 ప్రారంభమై క్రీ.శ. 174లో అంతమయ్యిందని చరిత్రకారులు అభిప్రాయం.
ఆంధ్ర అనే పదం మొదట ఐతరేయ బ్రాహ్మణంలో కనిపిస్తుంది. మత్స్య, వాయు, విష్ణు, భాగవత పురాణాల్లో ఆంధ్రుల ప్రశంస ఉంది. కొన్ని పురాణాలు ఆంధ్రులను ఆంధ్రభృత్యులని పేర్కొన్నాయి. వారు మొదట మౌర్య సామ్రాజ్యంలో సేవకులుగా (భృత్యులుగా) ఉన్నా, తరువాత స్వతంత్రులై రాజ్యాన్ని స్థాపించారు.
📜 శాతవాహనుల చరిత్రకు ఆధారాలు
- మత్స్య, వాయు, బ్రహ్మాండ, భాగవత పురాణాలు.
- శర్మవర్మ - కాతంత్రవ్యాకరణం
- గుణాడ్యుడు - బృహత్కద
- హలుడు - గాధాసప్తశత మొదలగు రచనలు.
- నాగానిక - నానాఘాట్ శాసనం
- గౌతమీ బాలశ్రీ - నాసిక్ శాసనం
- ఖారవేలుడు – హతిగుంప శాసనం
- రుద్రదమనుడు - జునాఘడ్ / గిర్నార్ శాసనం
గ్రీకు అజ్ఞాత నావికుడు రచించిన పెర్లిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ, ప్లినీ - నాచురల్ హిస్టరీ, హియాన్ద్సాంగ్ - సి - యూ-కి, మెగస్తనీస్ - ఇండికా మొదలగునవి ఉన్నాయి.
⭐ శాతవాహనులు - ముఖ్యాంశాలు
కాలం : క్రీ.పూ. 225 నుండి క్రీ.శ. 225
స్థాపకుడు : సిముఖుడు
మూలపురుషుడు : శాతవాహనుడు
గొప్పవాడు : గౌతమీపుత్ర శాతకర్ణి
చివరివాడు : 3 పులోమావి
రాజధాని : 1. ధాన్యకటకం 2. పైఠాన్ / ప్రతిష్ఠానపురం
రాజభాష / అధికార భాష : ప్రాకృతం
రాజలాంచనం : సూర్యుడు
మతం : జైనం, హైందవం
శిల్పకళ : అమరావతి జాతక కథలు
నగర నిర్మాతలు : 2 పులోమావి / వశిష్టపుత్ర పులోమావి (ధరణికోట / ధాన్యకటకం నిర్మించెను)
విదేశీ యాత్రికుడు : మెగస్తనీస్
- నానాఘాట్ శాసనం నిగమసభలు గూర్చి తెలుపును
- నాసిక్ శాసనం - శ్రమణుల గూర్చి తెలుపును
- మ్యాకదోని శాసనం- గుల్మిక గూర్చి తెలుపును
👑 రాజకీయ చరిత్ర
మత్స్య పురాణం ప్రకారం 30 మంది శాతవాహన రాజులు 450 సం॥ పరిపాలించారు.
శ్రీముఖుడు / సిముకుడు
- ఇతని సమకాలికుడు - అశోకుడు
- బిరుదు : రామ (ఈ బిరుదు అశోకుడు ఇచ్చాడని డి.సి. సర్కార్ అభిప్రాయం)
- తండ్రి : శాతవాహనుడు (ఇతని పేరు మీదనే శాతవాహన వంశం అనే పేరు వచ్చింది)
- మతం : మొదట జైన మతం తర్వాత వైదిక మతానికి మారాడు.
- ఇతని నాణాలు కోటిలింగాల (కరీంనగర్) వద్ద లభ్య మయ్యాయి. ఈ నాణాల్లో ఇతని పేరు "సిరిచిముక శాత” అని ఉంది.
- శ్రీముఖుడు వేయించిన నాణాలు: రణగోభద్ర, రణగోస్వామి
కృష్ణుడు (కణుడు):
- కన్హేరి, నాసిక్ గుహలను తవ్వించాడు.
- ఇతని కాలంలో భాగవత మతం దక్కన్లో ప్రవేశించింది.
- నాసిక్ బౌద్ధ సన్యాసులు సంక్షేమం కొరకు “ధర్మ మహామాత్య” అనే అధికారులను నియమించాడు.
మొదటి శాతకర్ణి :
- శాతవాహన వంశానికి నిజమైన స్థాపకుడు.
- ధన రూపంలో వెండి నాణేలు (కర్షాపణాలు) బ్రాహ్మణులకు దానం చేశాడు.
- ఇతని గురించి నాగానిక వేసిన నానాఘాట్ శాసనం (ప్రాకృత భాష) తెలుపుతుంది.
- 2 అశ్వమేధ యాగాలు, 1 రాజసూయ యాగం చేసిన తొలి శాతవాహన రాజు మొదటి శాతకర్ణి.
- పుష్యమిత్ర శుంగుడిని ఓడించి నాణాలపై ఉజ్జయిని పట్టణ గుర్తును ముద్రించాడు.
- ఖారవేలుడు మొదటి శాతకర్ణిని ఓడించినట్లు తెలిపే శాసనాలు హతిగుంప శాసనం, గుంటుపల్లి శాసనం.
- నానాఘాట్ శాసనంలో యజ్ఞాలు, యాగాలు, వైదిక క్రతువులు జరిపి బ్రాహ్మణులకు గోవులు, గుర్రాలు, ఏనుగులు, గ్రామాలు దానం చేసినట్లు తెలుస్తుంది.
పుర్ణోత్సుంగుడు / వేదశ్రీ శాతకర్ణి
ఇతని కాలంలో కళింగ ఖారవేలుడు భట్టిప్రోలుపై దాడి చేశాడు.
శాతకర్ణి-2
- ఇతను అత్యధికంగా 56 సం॥ పరిపాలించాడు.
- కణ్వవంశ సుశర్మను ఓడించి పాటలిపుత్రాన్ని జయించాడు.
- సాంచిస్థూపానికి దక్షిణ తోరణాన్ని నిర్మించాడు.
- ఖారవేలుడు వేయించిన హతిగుంఫా శాసనంలో ఇతను 'పిథుండ' నగరాన్ని (భట్టిప్రోలు) ధ్వంసం చేసినట్లు చెప్పుకున్నాడు.
- ఇతని శాసనం సాంచిలో (విదిశ) ఉంది.
- బిరుదు - రాజశ్రీ శాతకర్ణి
- ఆస్థాన కళాకారుడు - వశిష్టపుత్ర ఆనంద
కుంతల శాతకర్ణి
- ఇతని కాలంలో సంస్కృతం అధికార భాషగా మారింది.
- ఇతని భార్య 'మలయావతి' కర్తరి అనే కామక్రీడ వలన మరణించింది.
- ఆస్థానకవులు : శర్వవర్మ - కాతంత్ర వ్యాకరణం (సంస్కృతం), గుణాడ్యుడు - బృహత్కథ (పైశాచీప్రాకృత భాష).
- గుణాడ్యుడు బృహత్కథ విష్ణుశర్మ పంచతంత్రం రచించుటకు ఆధారమైనది.
- శర్వవర్మ, గుణాడ్యుడి మధ్య సవాలు వివరించిన గ్రంథం కథాసరిత్సాగరం (సోమదేవ సూరి) రచించాడు.
హలుడు :
- శాతవాహన రాజులలో 17వ వాడు.
- ఇతను ప్రాకృతంలో 'గాధాసప్తశతి' అనే గ్రంథాన్ని సంకలనం చేశాడు.
- గాధాసప్తశతిలో 700 శృంగార కథలు కలవు.
- ఇతని కాలాన్ని ప్రాకృతంలో స్వర్ణయుగం అంటారు.
- కుతూహలుడు ఇతని కాలంలో 'లీలావతి పరిణయం' అనే గ్రంథాన్ని ప్రాకృత భాషలో రచించాడు. ఈ గ్రంథం ప్రకారం హలుడు శ్రీలంక రాకుమారిని ద్రాక్షారామంలో వివాహం చేసుకున్నాడు.
- బిరుదు : కవి వత్సలుడు
- ఆంధ్రుల చరిత్రలో తొలి కవిరాజు.
గౌతమీపుత్ర శాతకర్ణి
- తల్లి పేరును జతపర్చుకునే సంప్రదాయం ఇతని కాలం నుండి ప్రారంభమైంది.
- శాతవాహనులలో అతిగొప్పవాడు.
- ఇతని విజయాలు గురించి తెలిపే శాసనం నాసిక్ శాసనం.
- ఇతని కాలం నుండే శాలివాహన శకం క్రీ.శ. (78) ప్రారంభ మైంది.
- క్షహరాటవంశంలో గొప్పవాడైన నహపానుడిని ఓడించి, అతని నాణేలను పునఃముద్రించినట్లు జోగల్ తంబిలో ఆధారాలు దొరికాయి.
- శక, యవన, పహ్లవులను అణిచివేశాడు. దీనికిగాను క్షహరాట వంశ నిరవశేషకార అనే బిరుదు పొందాడు.
- బౌద్ధ బిక్షువులకు 100 నివర్తనల భూమిని దానం చేశారు.
- ఇతని నాణెములు కొండాపూర్, పెదబంకూరులో లభించాయి.
త్రిసముద్రతోయ పీతవాహన, దక్షిణ సముద్రాధీశ్వర, శకయవన పహ్లవ నిఘాదన, ద్విజకుల వర్ధన, ఏక బ్రాహ్మణ, ఆగమ నిలయ, క్షత్రియ దర్పమాన మర్థన, వర్ణ సాంకర్య నిరోధక, ఏక శూరుడు, బెణాకటక స్వామి.
వాసిష్టీపుత్ర రెండవ పులోమావి
శివశ్రీ శాతకర్ణి
బిరుదు : క్షత్రప. ఇతను రుద్రదమనికను వివాహం చేసుకున్నట్లు తెలిపే శాసనం జునాఘడ్ / గిర్నార్ శాసనం.
యజ్ఞశ్రీ శాతకర్ణి
- ఇతని కాలంలో మత్స్య పురాణం సంకలనం చేయబడింది.
- ఇతని ఆస్థానంలో ఆచార్య నాగార్జునుడు ఉండేవాడు.
- శ్రీపర్వతం / నాగార్జున కొండపై ఆచార్య నాగార్జునుడికి పారవత విహారం నిర్మించాడు.
- 2 తెరచాపల నౌక బొమ్మ గల నాణెలు ముద్రించాడు.
- బిరుదు : త్రిసముద్రాదీశ్వరుడు
- శాసనం : చినంగజాం శాసనం
- గ్రంథం : సుహృల్లేఖ (యజ్ఞ శ్రీ శాతకర్ణిపై ఆచార్య నాగార్జునుడు రచించాడు)
విజశ్రీ శాతకర్ణి :
శ్రీపర్వతం / నాగార్జున కొండ దగ్గర విజయపురి పట్టణం నిర్మించాడు.
3వ పులోమావి
శాసనం : మ్యాకదోని శాసనం (ఈ శాసనం శాతవాహన రాజ్య పతనం తెలుపును). వశిష్ట పుత్ర శ్రీ శాంతమూలుడు తిరుగుబాటు చేయడం వల్ల రాజ్యాన్ని వదిలి బళ్ళారి పారిపోయి పరిపాలించెను.
🏛️ పరిపాలన వ్యవస్థ
- పరిపాలనలో మౌర్యులను అనుసరించారు.
- పరిపాలన గురించి తెలిపే శాసనం నాసిక్ శాసనం.
- శాతవాహనులు రాజ్యాన్ని ఆహార, విషయం, గ్రామంగా విభజించారు.
- పాలనా విభాగం అధిపతులు : సామ్రాజ్యం - రాజు, ఆహార - కుమారమత్య, అమాత్యులు, విషయం - విషయపతి, గ్రామం - గ్రామిక గోపుడు అనే అధికారులను నియమించారు.
- శాతవాహనుల పరిపాలనా పద్ధతి 'వికేంద్రీకృత' వారసత్వ రాజరికంగా ఉండేది.
- గ్రామాధికారిని గ్రామణి అంటారు.
- ఎక్కువ గ్రామాలను కలిపి "గుల్మి” అనేవారు. దీనికి అధిపతి గుల్మికుడు.
- పట్టణ పరిపాలనకు నిగమ సభ ఉండేది. నిగమ సభ గూర్చి తెలిపే శాసనం - భట్టిప్రోలు శాసనం.
- కులపెద్దలను గహపతులు అని పిలిచేవారు.
- శాతవాహన సామంత రాజ్యాలను జనపదాలు అని పిలిచేవారు.
- రాజ్యపాలనలో సలహాలు ఇచ్చుటకు అమాత్యులు ఉండేవారు. అమాత్యులకు వంశపారంగా హక్కు లేదు. తరచుగా వీరిని బదిలీ చేస్తారు.
| అధికారులు | శాఖలు / విధులు |
|---|---|
| విశ్వ అమాత్య | ప్రధాని |
| రాజ అమాత్య | రాజు ఆదేశాలను అమలు పరిచేవాడు. |
| మహా అమాత్య | ఆర్థిక మంత్రి |
| మహా తలవర | ప్రధాన సైన్యాధిపతి |
| హిరణీకుడు | కోశాధికారి (ధనరూప శిస్తు భద్రపరిచేవాడు) |
| భాండాగారికుడు | కోశాధికారి (వస్తురూప శిస్తును భద్రపరిచేవాడు) |
| ప్రతిహారుడు | కోటరక్షకుడు |
| నిబంధనకారుడు (అక్షపటకులు) | రాజాజ్ఞలను పత్రాలలో రాసి భద్రపరిచేవాడు. |
| పరింద వారాలు | రాజు అంతరంగిక సైనిక దళంలో గూఢచారులు |
| స్కంద వారాలు | పట్టణంలోని తాత్కాలిక సైనిక శిబిరాలు |
| దూత | రాయబారి |
| రజ్జాగాహకుడు | క్షేత్రస్థాయిలో భూమిని సర్వే చేసి శిస్తు నిర్ణయించి వసూలు చేసేవాడు. |
| కటకం | సైన్యాగారం |
| లేఖకుడు | ఉత్తర ప్రత్యుత్తరాలు చేయువాడు. |
| అక్షక పటల శాఖ | రికార్డ్ ఆఫీస్ |
| మహాధార్మిక | విద్యా, మతపర వివాదాలు పరిష్కరించేవాడు. |
| మహా ఆర్యక | న్యాయపర వివాదాలు పరిష్కరించేవాడు. |
🛡️ సైనిక వ్యవస్థ
- సైన్యం 4 రకాలుగా ఉండేది: 1. పదాతి దళం, 2. అశ్విక దళం, 3. గజ దళం, 4. రథ దళం.
- పట్టణాల చుట్టూ ఎత్తైన గోడలు, బురుజులు ఉండేవి.
💰 ఆర్థిక వ్యవస్థ
- శాతవాహనులు కాలంలో ప్రజల ప్రధాన వృత్తి - వ్యవసాయం.
- వ్యవసాయ భూములకు నీరు అందించే శ్రేణి - ఉదక యంత్రికుల శ్రేణి.
- భూమిని ధానం చేసే విధానం భారతదేశంలో మొదట ప్రవేశ పెట్టింది - శాతవాహనులు.
- రాజ్యానికి ప్రధాన ఆదాయ మార్గం భూమిశిస్తు (పంటలలో 1/6 వ వంతు ఉంది).
- భూములను కొలిచే అధికారి - రజ్జుగాహక.
- పంటలో రాజు భాగాన్ని దేయమేయా / రాజభాగం అంటారు.
- రాజు యొక్క స్వంత భూమిని రాజకంఖేట / రాజక్షేత్రం అంటారు.
- శాతవాహనుల కాలంలో అభివృద్ధి చెందిన పరిశ్రమ - చేతి వృత్తుల పరిశ్రమ.
- చేతివృత్తులపై విధించేపన్ను - కురుకర.
- వృత్తి సంఘాలను శ్రేణులు అని పిలిచేవారు. శాతవాహన కాలంలో 18 రకాల శ్రేణులు ఉండేవి.
శాతవాహనుల శాసనాల్లో పలు రకాల చేతి వృత్తుల పేర్లు:
కొలికులు : సాలె / నేత పనివారు
తిలపిష్టకులు : తెలికవారు / నూనె తీసేవారు
కాసకారులు : కంచు పనివారు
కులారులు : కుమ్మరులు
తెసకారులు : మెరుగు పెట్టేవారు
కమ్మర : ఇనుము పనివారు
హాలికుడు : వ్యవసాయదారుడు / పొలం దున్నేవాడు
చంకుకారులు : చర్మకారులు
గధికులు : సుగంధ ద్రవ్యాలు తయారు చేసేవారు
వైద్యులు : వైద్యులు
కంసాలులు : సువర్ణకారులు
వధగులు : వడ్రంగులు
సేల వధకులు : శిల్పులు
పసకరులు : మేదరివారు
🚢 వ్యాపారం - వాణిజ్యం
- శాతవాహనుల కాలం నాటి విదేశీ వ్యాపారం, వ్యాపార కేంద్రాలు, రేవులు గురించి తెలిపే గ్రంథం పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్సీ.
- వ్యాపారస్తులను వణిజులు అని పిలిచేవారు.
- దేశీయ వాణిజ్యం ఎక్కువగా ఎడ్ల బండ్ల ద్వారా జరిగేది.
- వ్యాపారం వస్తుమార్పిడి (బార్టర్ సిస్టం) పద్ధతిలో జరిగింది.
- వర్తక సంఘాలు ముద్రించే నాణాలు విద్దాంక నాణేలు.
- వడ్డీ వ్యాపారం ఎక్కువగా జరిగేది. 12% వడ్డీని వ్యాపారస్తులు వసూలు చేసేవారు. ఈ విషయం ఋషబదత్తుని నాసిక్ శాసనం తెలుపుతుంది.
- శాతవాహనుల కాలంలో రోమ్ దేశంతో ఎక్కువ వ్యాపారం చేసేవారు. రోమ్ దేశ బంగారం ఇండియాకి తరలిపోతుంది అని ప్లీని తన నాచురల్ హిస్టరీలో పేర్కొన్నాడు.
- తెలంగాణలో రోమన్ నాణెములు లభ్యమైన ప్రాంతాలు: సూర్యాపేట, ఏలేశ్వరం.
- విదేశీ వ్యాపారం పశ్చిమ కోస్తా ఓడరేవుల నుండి అధికంగా జరుగుతుంది.
| తూర్పుతీరం ఓడరేవులు | పశ్చిమ తీరం ఓడరేవులు |
|---|---|
| కోడూరు | భరుకచ్చ (బ్రోచ్) |
| మైసోలియా | సోపార |
| ఘంటసాల | చౌల్ |
| కోరంగి | మండగోర, కళ్యాణి |
* భరుకచ్చ కంటే ముందు శాతవాహనుల ప్రధాన రేవు పట్టణం కళ్యాణ్.
- మచిలీపట్నం రేవు నుండి చైనాకు మస్లీన్ వస్త్రాలు ఎగుమతి జరిగేవి.
- మండగోరా రేవు నుండి టేకు, నల్లమద్ది కలప ఎగుమతి జరిగేది.
👥 సాంఘిక & మత వ్యవస్థ
- శాతవాహనుల కాలంలో చాతుర్వర్ణ వ్యవస్థ ఉండేది.
- క్రింది వర్ణ ప్రజలకు ఉన్నత వర్ణ హోదా కల్పించిన వ్రతం - హిరణ్య గర్భవ్రతం.
- శాతవాహనులు బ్రాహ్మణులు. ఆంధ్రలో బ్రాహ్మాణులకు పన్నులేని గ్రామాలను దానం చేసిన రాజులు శాతవాహనులు.
- పితృస్వామ్య ఉమ్మడి కుటుంబం ఉండేది. సమాజంలో స్త్రీలకు ఉన్నత స్థానం కల్పించారు.
- గౌతమి బాలశ్రీ భద్రాయాన కొండపై బౌద్ధ విహారాలకై విరాళం ఇచ్చింది.
కన్హుడి కాలంలో భాగవత మతం దక్షిణ భారత దేశంలోకి ప్రవేశించింది. గాధాసప్తశతి శివుడి ప్రార్థనతో ప్రారంభమవుతుంది. భారత్లో అత్యంత ప్రాచీన శివలింగం-గుడిమల్లం (చిత్తూరు)లో ఉంది. మొదటి శాతకర్ణి గోవులను బ్రాహ్మణులకు దానం చేసినట్లు తెలిపే శాసనం - నానాఘాట్ శాసనం.
శాతవాహన స్థాపకుడు సిముఖుడు మొదటి జైనమతాభిమాని. ఈ విషయం కరీంనగర్ జిల్లా మునులగుట్ట వద్ద లభించిన నాణాల ద్వారా తెలుస్తుంది. ప్రస్తుతం తెలంగాణలో కన్పించే ఏకైక జైనస్థావరం - కొలనుపాక (నల్గొండ).
శాతవాహనులు బౌద్ధమతం ఆదరించారు. తెలంగాణలో బౌద్ధ కేంద్రాలు: ధూళికట్ట, తిరుమలగిరి, ఫణిగిరి, రామిరెడ్డి పల్లి.
📚 విద్య, భాషా సాహిత్య సేవ
- ఆచార్య నాగార్జునుడు బౌద్ధమతంలో మహాయానం, మాధ్యమిక వాదం, శూన్యవాదం ప్రవేశపెట్టాడు.
- సుహృల్లేఖ గ్రంధం ఆచార్య నాగార్జునుడు యజ్ఞశ్రీ శాతకర్ణికి అంకితమిచ్చాడు.
- ఆచార్య నాగార్జునుడు మహాచైత్యకుల ప్రధాన శాఖలు గురించి తన గ్రంథంలో ప్రచారం చేశారు: 1. పూర్వ శైల చైత్యకులు, 2. అపరశైల చైత్యకులు, 3. ఉత్తరశైల చైత్యకులు, 4. రాజగిరిక చైత్యకులు, 5. సిద్దార్థక చైత్యకులు.
- ఆచార్య నాగార్జునుడి బిరుదులు: రెండో బుద్ధుడు, ఇండియన్ ఐన్స్టీన్.
- ఆచార్య నాగార్జునుడి సుహృల్లేఖ ప్రతి విద్యార్థిచే వల్లె వేయబడుతుంది అని చైనా యాత్రికుడు ఇత్సింగ్ తెలియజేశాడు.
- ధాన్య కటక విశ్వవిద్యాలయం ఆధారంగా టిబెట్లోని లాసా విశ్వవిద్యాలయం ఏర్పడింది.
- తొలి తెలుగు పదాలు: అత్త, అద్దం, పొట్ట. వీటిని హలుడు గాధా సప్తశతి గ్రంథంలో ప్రస్తావించాడు.
- ప్రాకృతం రాజభాషగా ఉంది. గాధాసప్తశతి, లీలావతి, బృహత్కథలో తెలుగు పదాలు ఉన్నాయి.
- శాసనాలు ప్రాకృత భాషలో ఉన్నాయి. ఋషభ దత్తుని నాసిక్ శాసనం ఒకటి మాత్రమే సంస్కృతంలో ఉంది. ప్రాకృతం స్థానంలో సంస్కృత భాష వచ్చింది.
- అమరావతి శాసనంలో తెలుగుపదం - నాగబు.
🎨 లలిత కళలు & వాస్తు శిల్పం
- మహాయాన శాఖ వల్ల బుద్ధుడు దేవుడిగా బౌద్ధ శిల్పాలలో ఆరాధించటం ప్రారంభమయింది. బౌద్ధ శిల్పాలలో దేవతలు - యక్షిణి, నాగదేవత.
- స్థూపం : అవశేషాలపై నిర్మాణాలను స్థూపాలు అంటారు. ఇది 3 రకాలు:
- దాతుగర్భస్థూపాలు - బుద్ధుని శారీరక అవశేషాలపై నిర్మించిన స్థూపం (అతి ప్రాచీన దాతుగర్భ స్థూపం - భట్టిప్రోలు).
- పారిభోజక స్థూపాలు - బుద్ధుడు లేదా ప్రముఖ బౌద్ధ బిక్షువులు వాడిన వస్తువులపై నిర్మించిన కట్టడాలు.
- ఉద్దేశిక స్థూపాలు - ఎలాంటి గుర్తులు లేకుండానే నిర్మించడం.
- విహారం : బౌద్ధ సన్యాసుల విశ్రాంతి మందిరం. ఆంధ్రలో అతి ప్రాచీన విహారం - సరగరం (విశాఖపట్నం).
- చైత్యం : అనగా ప్రార్థనామందిరం. ఆంధ్రలో అతి ప్రాచీన చైత్యం గుంటుపల్లి (పశ్చిమగోదావరి).
- ఆరామం : స్థూపం, చైత్యం, విహారం, విద్యాలయం ఒకే చోట కలిసి ఉండే ప్రాంతం. అతి దివ్యమైన ఆరామం నందలూరు ఆరామం (కడప).
- చైనా యాత్రికుడు హుయాన్త్సాంగ్ ఆంధ్రలో 40 ఆరామాలు ఉన్నాయి అని తెలిపిన గ్రంథం - సి-యూ-కి. శ్రీ పర్వత ఆరామం యజ్ఞశ్రీ శాతకర్ణి నిర్మించాడు.
అమరావతి స్థూపం
- 1797 కల్నల్ కాలిన్ మెకంజీ కనుగొన్నాడు.
- 2వ పులోమావి / వశిష్ట పుత్రశాతకర్ణి కాలంలో నిర్మించబడింది.
- ఈ స్థూపానికి అన్ని దిక్కులలోనూ వేదికలు ఉండి వాటిపైన 5 ఆయక స్తంభాలు ఉన్నాయి.
- బుద్దుని జీవిత ఘట్టాలకు (పంచకళ్యాణిలు) చెందిన చిహ్నాలు ఆయక స్థంభాలపై ఉన్నాయి. అవి: 1. బుద్దుని జన్మ - తామర | 2. మహాభినిష్క్రమణ - గుర్రం | 3. జ్ఞానోదయం - రావిచెట్టు | 4. ధర్మ చక్రపరివర్తనం - చక్రం | 5. మహాపరి నిర్యాయణం (బుద్దుని మరణం) - స్థూపం
- అమరావతి స్థూపం కుటుంబ సమేతంగా సందర్శించిన చర్మకారుడు దిమిక. దిమిక పూర్ణకుంభం సమర్పించాడు.
- అమరావతి శిల్పాలలో వెల్లడయ్యే కళాకౌశలం భారతీయ కళకి పరాకాష్ట అని పేర్కొన్నది - పెర్గూసన్.
- గాంధార శైలి కుషాణుల కాలంలో అభివృద్ధి చెందింది.
- మధుర శిల్ప శైలి శుంగులు, కుషాణుల కాలంలో అభివృద్ధి చెందింది.
- అమరావతి శైలి శాతవాహనుల కాలంలో అభివృద్ధి చెందింది. (గమనిక : అమరావతి శైలిలో బుద్ధుని జీవిత ఘట్టాలు చెక్కబడ్డాయి)
- అజంతాలోని 9, 10 గుహలలో చిత్రలేఖనం శాతవాహనులకు చెందినది.
- 10 గుహలో శ్వేత గజ జాతక / షడ్డాంత జాతక కథ ఉంది. దీనిలో 15 మంది బృంద నాట్యం చేస్తున్నట్లు, రాజు, రాణి బోధి వృక్షం పూజిస్తున్నట్లు చెక్కబడింది.
No comments:
Post a Comment