తెలంగాణా చరిత్ర - సంస్కృతి
శాతవాహనుల సామ్రాజ్యం విచ్చినమైన తర్వాత అనేక చిన్న రాజ్యాలు ఏర్పడ్డాయి. శాతవాహనులకు సామంతులైన ఇక్ష్వాకులు విజయపురి రాజధానిగా 100 సం॥ పరిపాలించారు.
ఇక్ష్వాకు అనగా చెరకు అని అర్థం. ఇక్ష్వాకులు శ్రీరాముని వంశానికి చెందినవారు అని ప్రకటించుకున్నారు. ఇక్ష్వాకుల జన్మ స్థలం గురించి చరిత్రకారులు భిన్నభిప్రాయాలు వ్యక్తపరిచారు.
📍 జన్మస్థలం - చరిత్రకారుల అభిప్రాయాలు
| జన్మస్థలం | చరిత్రకారులు |
|---|---|
| ఉత్తర భారతదేశం | రాప్సన్, బూలర్ |
| కన్నడ ప్రాంతం | వోగెల్ |
| తమిళనాడు | గోపాలచారి |
| కృష్ణాతీరం (తెలంగాణ, ఆంధ్ర) | కాల్డ్వెల్ |
⭐ ఇక్ష్వాకులు - ముఖ్యాంశాలు
* ఇక్ష్వాకుల కాలంలో బౌద్ధమతం ఉన్నత స్థాయికి చేరింది.
స్థాపకుడు : వశిష్టిపుత్ర శ్రీశాంతమూలడు
గొప్పవాడు : వీరపురుష దత్తుడు
చివరివాడు : రుద్ర పురుష దత్తుడు
రాజ్య చిహ్నం : సింహం
రాజభాష : ప్రాకృతం
రాజలాంఛనం : హారతీ పుత్రులు / శ్రీపర్వతీయులు
రాజధాని : విజయపురి
మతం : వైష్ణవం, బౌద్ధమతం
శాసనాలు : నాగార్జున కొండ శాసనం, అమరావతి శాసనం
శిల్పకళ : మాంధాత శిల్పం (జగ్గయ్య పేట)
👑 రాజకీయ చరిత్ర
- ఇక్ష్వాకులు శ్రీపర్వతీయులుగా, ఆంధ్రభృత్యులుగా, అయోధ్య నేలిన సూర్యవంశీయులుగా, శ్రీరాముని వంశస్థులుగా ప్రసిద్ధి.
- విజయపురి (నాగార్జున కొండ) రాజధానిగా 100 సం॥ పాలించారు (కృష్ణానది పరివాహ ప్రాంతం).
వాశిష్టపుత్ర శ్రీశాంతమూలుడు (క్రీ.శ.225-245)
- ఇక్ష్వాక వంశ మూలపురుషుడు, రాజ్యస్థాపకుడు.
- శాతవాహన చివరి పాలకుడు 3 పులోమావిని ఓడించి రాజ్యం స్థాపించాడు.
- మతం : వైదిక మతం
- ఆరాధ్యదైవం : కార్తికేయుడు
- క్రతువులు : అశ్వమేధ, అగ్నిస్తోమ, అగ్నిహోత్ర, వాజపేయ క్రతువులు.
- శాసనాలు : రెంటాల, దాచేపల్లి, కేశాను పల్లిశాసనాలు.
- బిరుదులు : శతసహస్ర హాలక, మహాదానాధిపతి, దక్షిణపధ సామ్రాట్.
- ఇతను వ్యవసాయాభివృద్ధికి బంగారు నాణేలు, గోవులు, నాగళ్ళను దానం చేశాడు.
- ఇతని కుమార్తె అడవి శాంతసిరి నాగార్జు కొండలోని, బౌద్ధ ఆరామ విరామంను నిర్మించెను.
వీరపురుష దత్తుడు (క్రీ.శ. 245-265)
- ఇతని కాలంను బౌద్ధమత స్వర్ణయుగంగా పేర్కొంటారు.
- బిరుదు : దక్షిణాది అశోకుడు
- ఇతని శాసనాలు : అల్లూరి శాసనం, నాగార్జున కొండ శాసనం, అమరావతి శాసనం, ఉప్పుగుండూరు శాసనం, జగ్గయ్యపేట శాసనం.
- శైవ మతాన్ని ద్వేషిస్తున్నట్లు, శివలింగాన్ని కాలితో తొక్కు తున్నట్లు శిల్పాలు నాగార్జునకొండలు ఉన్నాయి.
- బౌద్ధమతంను ఆదరించాడు. ఇక్ష్వాక రాజులలో బౌద్ధమతం స్వీకరించిన ఏకైకరాజు - వీరపురుష దత్తుడు.
- మేనత్త కుమార్తెలను వివాహమాడే సంప్రదాయం ఇతని కాలంలో ప్రారంభమైంది.
- ఇతని కాలంలో శ్రీపర్వత విశ్వవిద్యాలయం స్థాపించబడింది (భారత దేశంలో మొదటి బౌద్ధ - విశ్వవిద్యాలయం).
- ఇతని అధికారి ఎలిసిరి పేరు మీద ఏలేశ్వరం ఆలయం నిర్మించాడు.
- ఉపాసిక బోధిసిరి అమరావతిలో రాజబాండాగారికుడు బోధిశర్మ మేనకోడలు. ఇతని కాలంలో ఉపాసిక బోధిసిరి బౌద్ధమత వ్యాప్తికి కృషి చేసింది.
- ప్రముఖ మాధ్యమిక వాద బౌద్ధ పండితుడు, స్వతంత్రవాద స్థాపకుడు అయిన భావవివేకుడు విజయపురిలో నివశించినట్లు హుయాన్ త్సాంగ్ రచనల ద్వారా తెలుస్తుంది.
- చులదమ్మగిరి కొండపై బౌద్ధవిహారం, చైత్యం నిర్మించింది.
- పుష్పగిరి శిలామండపం నిర్మంచింది.
- శ్రీపర్వత విహారానికి మరమ్మత్తులు చేసింది - ఆనందుడు.
వశిష్టీపుత్ర ఎహువల శాంతమూలుడు (క్రీ.శ. 265-290)
- బౌద్ధ చైత్యాలకు మండపాలు నిర్మించాడు.
- ఇతని సోదరి కొడబలిసిరి నాగార్జునకొండలో బౌద్ధ విహారం కట్టింది.
- దక్షిణ భారత దేశంలో హిందూ దేవాలయాలు నిర్మించిన మొట్ట మొదటి రాజు.
- ఇతను నిర్మించిన దేవాలయాలు : పుష్పభద్ర నారాయణ స్వామి ఆలయం, కార్తికేయుని ఆలయం, నవగ్రహ ఆలయం, నందికేశ్వర ఆలయం, హరీతి ఆలయం.
- ఇతని సేనాపతి ఎలిసిరి నాగార్జున కొండ వద్ద కుమారస్వామి ఆలయం నిర్మించాడు.
- అభిర రాజు శకసేనుని సేనాని శివసేనుడు నాగార్జున కొండ వద్ద అష్టభుజనారాయణ స్వామి ఆలయం నిర్మించాడు.
- శాసనాలు : నాగార్జున కొండ శాసనం (సంస్కృత శాసనం), గుమ్మడి దుర్రు శాసనం (ప్రాకృత శాసనం / స్థూప శాసనం).
రుద్ర పురుష దత్తుడు (క్రీ.శ. 290-300)
శాసనాలు :
- మంచికల్లు శాసనం (పల్లవ రాజు సింహవర్మచే వదించబడ్డాడు)
- మైదవోలు శాసనం (ఇక్ష్వాకుల అంతం గురించి పేర్కొంది)
🏛️ పరిపాలనా విధానం
- పాలనా సౌలభ్యం కోసం సామ్రాజ్యాన్ని రాష్ట్రాలుగా ఆహారాలుగా, పదాలుగా విభజించారు.
- రాష్ట్ర పాలకులుగా మహా తలవరులు, మహాసేనాపతులు, మహా దండనాయకులను నియమించారు.
- ప్రధాన న్యాయమూర్తిని 'మహాతలవరి' అన్నారు.
💰 ఆర్థిక వ్యవస్థ
- రోమన్ల బంగారు నాణేలు నాగార్జున కొండ, జగ్గయ్య పేటలో కనుగొన్నారు.
- ఈ కాలంలో వర్తకశ్రేణులు - పూసిన శ్రేణి (మిఠాయి వ్యాపారుల సంఘం).
- పర్షిక శ్రేణి - తమలపాకుల వ్యాపార సంఘం.
- చేతి వృత్తుల సంఘ నాయకుడు ఉలిక ప్రముఖ.
- వృత్తి పన్నులు విధించినట్లు 'విషవట్టి శాసనం' తెలుపుతుంది.
👥 సామాజిక వ్యవస్థ
- ఇక్ష్వాకులు తమ తల్లి పేరు తమ పేర్లతో కలిపి ఉపయో గించారు.
- మేనత్త కుమార్తెలు వివాహం చేసుకునే ఆచారం ఉంది.
📜 సాంస్కృతిక వ్యవస్థ
- భారతదేశంలో సంస్కృతాన్ని పునరుద్దరించిన మొదటివారు ఇక్ష్వాకులు.
- శాసనాల్లో మొదటిసారిగా శాసనం వేయబడ్డ సంవత్సరం, మాసం, తేదీలను ప్రస్తావించే సాంప్రదాయం ఇక్ష్వాకుల కాలం నుండి మొదలైనది.
🕉️ మత పరిస్థితులు
రాజులు బ్రాహ్మణ మతం, రాణులు బౌద్ధమతం ఆదరించారు.
- వీరగల్ సంప్రదాయం ఇక్ష్వాకుల కాలంలో మొదలైంది.
- మొదటి శాంతమూలుడు బ్రాహ్మణులకు అగ్రహారాలు దానం చేశాడు.
- బౌద్ధ గ్రంథాలలోని నిఖయలను మంత్రాల రూపంలో చదివే పద్ధతి మొదటగా ప్రారంభమైంది.
- మహాయానంలో 4 ప్రధాన శాఖలు : 1. బహుృశృతీయ శైల, 2. అపర మహా శెల, 3. మహా శాసన, 4. మహావిహార వాసి.
- నాగార్జున కొండకు గల పేరు : దక్షిణ గయ.
🗿 శిల్పం
ఇక్ష్వాకుల కాలం నాటి శిల్పాలలో అతి ముఖ్యమైనది - మందాత శిల్పం (జగ్గయ్యపేట). ఈ శిల్పం రాజు లక్షణాలు వర్ణించారు.
No comments:
Post a Comment