భారత రాజ్యాంగ చరిత్ర (Constitutional History of India)
ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన నుండి స్వాతంత్య్రం మరియు రాజ్యాంగ రచన వరకు చారిత్రక పరిణామాల సమగ్ర విశ్లేషణ
🏛️ భారతదేశంలో బ్రిటిష్ పాలన - ప్రారంభ దశ
- 1600: భారతదేశంలో వ్యాపార వ్యవహారాలను నిర్వహించుటకు బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ స్థాపించబడినది.
- ఎలిజబెత్ రాణి ఆమోదంతో చార్టర్ చట్టం ద్వారా కంపెనీ నెలకొల్పబడినది. (చార్టర్ అనగా 'ఒప్పందం').
- 1612: సూరత్‌లో పూర్తి స్థాయిలో మొదటి వర్తక వాణిజ్య కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
- 1639: మద్రాసు, మచిలీపట్నంలో వాణిజ్య కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు, మద్రాసులో 'సెయింట్ జార్జ్ కోట' నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.
- 1667: మనదేశంలో నాణేలను ముద్రించే అధికారాలను బ్రిటిష్ వారు సంపాదించారు.
- 1687: మద్రాస్ స్థానిక పరిపాలన కోసం మొదటి మున్సిపల్ సంస్థను ఏర్పాటు చేశారు.
- 1726: బొంబాయి, మద్రాస్, కలకత్తాలలో ప్రెసిడెన్సీలు మరియు మేయర్ కోర్టులను స్థాపించారు.
- 1757 (ప్లాసీ యుద్ధం): బ్రిటిష్ వారు భారతదేశ అంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నారు. ఇది బ్రిటిష్ సామ్రాజ్యానికి పునాది వేసింది.
👉 భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య నిర్మాత, ప్లాసీ యుద్ధ విజేత: రాబర్ట్ క్లైవ్. - 1764 (బక్సర్ యుద్ధం): 1765లో బ్రిటిష్ వారు బెంగాల్, బీహార్, ఒరిస్సాలలో దివానీ హక్కులను (శిస్తు వసూలు అధికారాలు) పొందారు.
- 1772: వారన్ హేస్టింగ్స్ మొదటిసారిగా కలెక్టర్ వ్యవస్థను ప్రవేశపెట్టాడు.
📅 భారత రాజ్యాంగ చరిత్ర వర్గీకరణ (B.C. రావత్ ప్రకారం)
B.C. రావత్ భారత రాజ్యాంగ చరిత్రను 6 దశలుగా విభజించారు:
| దశ (Stage) | కాలం (Period) | ప్రాముఖ్యత |
|---|---|---|
| మొదటి దశ | 1600 – 1773 | ఈస్ట్ ఇండియా కంపెనీ విస్తరణ |
| రెండవ దశ | 1773 – 1858 | చార్టర్ చట్టాల కాలం |
| మూడవ దశ | 1858 – 1909 | కౌన్సిల్ చట్టాల ప్రారంభం |
| నాల్గవ దశ | 1909 – 1935 | పరిమిత ప్రాతినిధ్యం & సంస్కరణలు |
| ఐదవ దశ | 1935 – 1947 | స్వయం ప్రతిపత్తి & విభజన దిశగా |
| ఆరవ దశ | 1947 – 1950 | రాజ్యాంగ నిర్మాణం & అమల్లోకి రాక |
📜 ముఖ్యమైన చట్టాలు & సంస్కరణలు
1. రెగ్యులేటింగ్ చట్టం, 1773
- ఈస్టిండియా కంపెనీ పాలనా వ్యవహారాలను క్రమబద్ధీకరించడానికి ప్రవేశపెట్టారు.
- 'లార్డ్ బుర్గోయిన్' కమిటీ నివేదిక ఆధారంగా, నాటి ప్రధాని 'లార్డ్ నార్త్' రూపకల్పన చేశారు.
- బెంగాల్ గవర్నర్‌ను 'గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్' గా మార్చారు. (మొదటి వ్యక్తి: వారెన్ హేస్టింగ్స్).
- 1774: కలకత్తాలోని పోర్ట్ విలియం కోటలో సుప్రీంకోర్టు ఏర్పాటు. (మొదటి ప్రధాన న్యాయమూర్తి: సర్ ఎలిజా ఇంఫే).
- ఈ చట్టాన్ని మొదటి భారత రాజ్యాంగ చట్టంగా పేర్కొంటారు.
2. పిట్ ఇండియా చట్టం, 1784
- ప్రధాని 'విలియం పిట్ జూనియర్' పేరుమీద రూపొందించారు.
- ద్వంద్వ పాలనా విధానం ప్రవేశపెట్టబడింది:
• Board of Control (6గురు సభ్యులు): పరిపాలనా వ్యవహారాలు.
• Court of Directors: వ్యాపార వాణిజ్య విషయాలు.
3. ముఖ్యమైన చార్టర్ చట్టాలు (1793 - 1853)
- 1813 చార్టర్ చట్టం: కంపెనీ గుత్తాధిపత్యం రద్దు (తేయాకు, చైనాతో వ్యాపారం మినహా). విద్యావ్యాప్తికి ₹1 లక్ష కేటాయింపు.
- 1833 చార్టర్ చట్టం: బెంగాల్ గవర్నర్ జనరల్‌ను 'భారత గవర్నర్ జనరల్' గా మార్చారు (మొదటి వ్యక్తి: విలియం బెంటింగ్). 1st Law Commission ఏర్పాటు (చైర్మన్: లార్డ్ మెకాలే).
- 1853 చార్టర్ చట్టం: చివరి చార్టర్ చట్టం. Legislative & Executive Councils ను వేరుచేసి పార్లమెంటరీ ప్రభుత్వ విధానానికి పునాది వేశారు.
4. విక్టోరియా మహారాణి ప్రకటన & భారత ప్రభుత్వ చట్టం - 1858
- 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత కంపెనీ పాలన రద్దు. భారతదేశం బ్రిటిష్ సార్వభౌమత్వంలోకి వచ్చింది.
- లండన్‌లో 'భారత రాజ్యకార్యదర్శి' (మొదటి వ్యక్తి: చార్లెస్ వుడ్) పదవి ఏర్పాటు.
- గవర్నర్ జనరల్‌ను 'వైస్రాయ్' గా మార్చారు (మొదటి వైస్రాయ్: లార్డ్ కానింగ్).
- ఈ చట్టాన్ని "Good Governance in India" చట్టంగా మరియు భారత ప్రజల "మ్యాగ్నా కార్టా" గా అభివర్ణిస్తారు.
🏛️ పాలనా వ్యవస్థ క్రమానుగత శ్రేణి (1858 తర్వాత)
బ్రిటిష్ రాణి ➔
బ్రిటిష్ కేబినెట్ ➔
భారత రాజ్యకార్యదర్శి ➔
వైస్రాయ్ ➔
రాష్ట్ర గవర్నర్ ➔
కలెక్టర్
5. కౌన్సిల్ చట్టాలు (1861 & 1892)
- 1861 చట్టం: పోర్ట్‌ఫోలియో విధానానికి చట్టబద్ధత, ఆర్డినెన్స్ జారీ అధికారం, బడ్జెట్ ప్రవేశపెట్టే పద్ధతి ప్రారంభం.
- 1892 చట్టం: శాసనసభలో భారతీయుల ప్రాతినిధ్యం '6'కు పెంపు (సురేంద్రనాథ్ బెనర్జీ, గోఖలే, దాదాభాయి నౌరోజీ మొదలైనవారు).
6. మింటో-మార్లే సంస్కరణలు - 1909
- పరిమిత ఓటింగ్ పద్ధతి ప్రారంభం. Imperial Legislative Council సభ్యుల సంఖ్య 60కి పెంపు.
- వైస్రాయ్ Executive Council లో చేరిన మొదటి భారతీయుడు: సత్యేంద్రప్రసాద్ సిన్హా (S.P. సిన్హా).
- ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటు. (మతప్రాతిపదిక నియోజకవర్గాల పితామహుడు: లార్డ్ మింటో).
7. మాంటేగు - చేమ్స్‌ఫర్డ్ సంస్కరణల చట్టం - 1919
- కేంద్ర శాసనసభలో ద్విసభా విధానం: Council of States (ఎగువసభ) & Legislative Council (దిగువసభ).
- రాష్ట్రాలలో ద్వంద్వ ప్రభుత్వం (Diarchy) ప్రవేశపెట్టారు (Reserved & Transferred జాబితాలు).
- 1921 లో Public Accounts Committee (PAC) ఏర్పాటు మరియు సాధారణ బడ్జెట్ నుండి రైల్వే బడ్జెట్ వేరు.
8. భారత ప్రభుత్వ చట్టం, 1935 (రాజ్యాంగానికి ప్రధాన మూలం)
- బ్రిటిష్ పార్లమెంట్ చరిత్రలో ఆమోదింపబడిన అతిపెద్ద చట్టం (321 అధికరణలు, 10 షెడ్యూళ్ళు).
- ప్రస్తుత భారత రాజ్యాంగానికి 70% పైగా మూలం (మాతృక) ఈ చట్టమే.
- అధికారాల విభజన: కేంద్ర జాబితా (59), రాష్ట్ర జాబితా (54), ఉమ్మడి జాబితా (36). అవశిష్టాంశాలు గవర్నర్ జనరల్‌కు ఇవ్వబడ్డాయి.
- రాష్ట్రాలలో ద్వంద్వ పాలన రద్దు చేసి రాష్ట్ర స్వయం ప్రతిపత్తి కల్పించారు. కేంద్రంలో ద్వంద్వ పాలన ప్రవేశపెట్టారు.
- ఫెడరల్ కోర్టు మరియు Reserve Bank of India (RBI) ఏర్పాటుకు బాటలు వేసింది.
🕊️ స్వాతంత్య్ర సాధన - చివరి ఘట్టాలు (1940 - 1947)
ఆగస్టు ప్రతిపాదనలు (1940)
లార్డ్ లిన్‌లిత్‌గో రూపకల్పన. 2వ ప్రపంచ యుద్ధంలో సహకరిస్తే డొమినియన్ స్టేటస్ ఇస్తామని ఆఫర్ (భారతీయులు తిరస్కరించారు).
క్రిప్స్ ప్రతిపాదనలు (1942)
రాజ్యాంగ పరిషత్ ఏర్పాటును తొలిసారి అంగీకరించారు. గాంధీజీ దీనిని "దివాలా తీయబోయే బ్యాంకు Post-dated చెక్కు" గా వర్ణించారు.
కేబినెట్ మిషన్ (1946)
సభ్యులు: పెథిక్ లారెన్స్, స్టాఫర్డ్ క్రిప్స్, A.B. అలెగ్జాండర్. భారత రాజ్యాంగ పరిషత్ మరియు తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుకు ప్రతిపాదన.
మౌంట్ బాటన్ పథకం (1947)
దీనినే 'డిక్కీబర్డ్' పథకం అంటారు. భారతదేశ విభజన (భారత్ & పాకిస్తాన్) మరియు స్వాతంత్య్రానికి మార్గం సుగమం చేసింది.
No comments:
Post a Comment