Telangana Jainism and Buddhism Notes జైన, బౌద్ధ మతాలు

Telangana Jainism and Buddhism Notes

తెలంగాణ చరిత్ర - సంస్కృతి

తెలంగాణ ప్రాంతం - జైన, బౌద్ధ మతాలు

🪷 జైనమతం

  • బౌద్ధమతం కన్నా జైనమతం ముందే తెలంగాణాకు చేరుకుంది.
  • మొదటి తీర్థంకరుడు రిషభనాథుడు కుమారుడు బాహుబలి.
  • అశ్మక పోతన / బోధన్ రాజు బాహుబలి.
  • బాహుబలి ప్రతిరూపం - గోమఠేశ్వర విగ్రహం.
  • బోధన్ విగ్రహానికి ప్రతిరూపం కర్ణాటక శ్రావణబెళగోళలో బాహుబలి విగ్రహం (ఈ విగ్రహం ఇంద్రగిరి శిఖరంపై ఉంది).
  • బాహుబలి విగ్రహం ఎదుట చంద్రగిరి పర్వతంపైన సల్లేఖనవ్రతం ఆచరించి మరణించింది చంద్రగుప్త మౌర్యుడు.
  • విశ్వబ్రాహ్మణులు మొదట జైనులు.
  • జైన భక్తిని బట్టి గోమఠీయులు అనే పేరు కోమటులుగా మారింది.
  • జైన సాహిత్యానికి సంబంధించి పంపకవి, జినవల్లభుడు, సోమదేవసూరి మొదలగువారు రచించిన కన్నడ, సంస్కృత గ్రంథాలు ఆధారం.
  • గణపతి దేవుడి కాలంలో తిక్కన సోమయాజి వలన జైనం అంతరించింది.
  • జైనులను పాల్కురికి సోమనాధుడు నిందించాడు.
  • ప్రస్తుతం పూజలతో అలరారుతున్న జైనమందిరాలు - కొలనుపాక, హైదరాబాద్ సుల్తాన్‌బజార్.

🏛️ తెలంగాణాలో జైన ప్రదేశాలు - జిల్లాలు

జైన ప్రదేశం జిల్లా
బోధన్, జానకంపేటనిజామాబాద్
పటాన్‌చెరువు, జోగిపేటమెదక్
జైనథ్అదిలాబాద్
హన్మకొండ, కోటవరంగల్
భద్రగిరిఖమ్మం
పూడూర్, అలంపూర్మహబూబ్ నగర్
నాగార్జునసాగర్, కొలనుపాకనల్గొండ
వేములవాడ, శనిగరం, మంధని, నగునూరు, ధర్మపురి, మన్నెం పల్లి, కప్పారావుపేటకరీంనగర్

☸️ బౌద్ధమతం

  • కోస్తాంధ్ర కన్నా ముందే బౌద్ధమతం తెలంగాణా ప్రాంతంలో ఉంది.
  • బుద్ధుని శిష్యుడు మహాకాత్యాయనుడు అశ్మకరాజుకు బౌద్ధధర్మ దీక్ష ఇచ్చినట్లు విమానవత్తు చెప్పింది.
  • అశ్మక రాజధాని - పోతన / బోధన్.
  • బుద్ధుని శిష్యుడు - కొండన (తెలుగు వ్యక్తి).
  • సెరివణిజ జాతకం తెలివాహిని నది దాటితే వచ్చే ఆంధ్రనగరాన్ని పేర్కొంది. మహానదికి ఉపనది తెలివాహిని నది.
  • కోటిలింగాల, ధూళికట్ట స్థూపాలు 400 సంవత్సరాల నాటివని వి.వి. కృష్ణమూర్తి బ్రాహ్మీలిపి ఆధారంగా కనుగొన్నాడు.
  • నాణాలు - కొండాపూర్ (మెదక్), కోటిలింగాల (కరీంనగర్) దగ్గర లభ్యమయ్యాయి.
  • బౌద్ధ లోహ ప్రతిమ లభించిన ప్రదేశం - నేలకొండపల్లి (ఖమ్మం).
  • బౌద్ధ విశేషాలు వెలుగులోకి వచ్చిన ప్రదేశం - ఫణిగిరి (నల్గొండ).
  • బౌద్ధ స్తూపాలు చారిత్రక అవశేషాలు: వరంగల్ జిల్లా నర్సంపేట దగ్గర గ్రామం - బుద్ధారం. బుద్ధారం తెలంగాణాలో బౌద్ధమత వ్యాప్తిని సూచిస్తుంది.
  • ప్రస్తుతం (ఆనంద బుద్ధ విహార్) హైదరాబాద్ మహేంద్రగిరిపై ప్రసిద్ధి చెందిన బౌద్ధ విహారం, ధమ్మ ప్రచార కేంద్రం కలదు.
  • రాజధాని నుండి వెలువడుతున్న బౌద్ధపత్రికలు - మిసిమి (తెలుగు), సుహృల్లేఖ (ఇంగ్లీష్).

📍 జిల్లాల వారిగా బౌద్ధస్థూపాలు

జిల్లా బౌద్ధస్థూపాలు / ప్రాంతాలు
నిజామాబాద్బోధన్
మెదక్కొండాపురం
కరీంనగర్కోటిలింగాల, ధూళికట్ట, పాశిగాం, మీర్జంపేట
నల్గొండనాగార్జున కొండ, తిరుమలగిరి, ఫణిగిరి, గాజుల బండ, ఏలేశ్వరం
ఖమ్మంనేలకొండ స్థూపం, అశ్వరావుపేట, కాపవరం

📚 బౌద్ధసాహిత్యం

  • తిరుపతి వెంకట కవులు 'బుద్ధ చరిత్రం' పద్యకావ్యం నుండి తెలుగులో బౌద్ధ సాహిత్యం వచ్చింది.
  • డా. సి. నారాయణరెడ్డి - నాగార్జునసాగర్
  • డా. దాశరథి కృష్ణమాచార్య - మహాబోధి జాతకకథల పద్య కావ్యం
  • మలయశ్రీ రచించిన బౌద్ధ గ్రంథాలు:
    • ధర్మ (పద్యకావ్యం)
    • శాంతిపథం (నాటకం)
    • ధర్మపదం
    • అశ్వఘోష - వజ్రసూచి
    • మిసిమి (మాసపత్రిక)

No comments:

Post a Comment