తెలంగాణా చరిత్ర - సంస్కృతి
- 'ఘటికలు' అనే హిందూ విద్యా సంస్థలు ప్రారంభించిన తొలి రాజవంశం.
- శ్రీశైలమల్లిఖార్జున స్వామి భక్తులు.
- శ్రీ పర్వత పాదక్రాంతులు.
- కీసర గుట్టలోని రామలింగేశ్వరాలయం నిర్మాతలు.
- నరబలిని ప్రోత్సహించిన రాజవంశం.
📌 ముఖ్య వివరాలు - అవలోకనం
స్థాపకుడు : ఇంద్రవర్మ (మహారాజేంద్రవర్మ)
గొప్పవాడు : 2వ మాధవవర్మ
చివరివాడు : మంచన భట్టారకుడు
రాజధాని : కీసర (వి.వి. కృష్ణశాస్త్రి ప్రకారం), ఇంద్రపాలనగరం (పి.వి.పరబ్రహ్మ శాస్త్రి ప్రకారం)
రాజభాష : సంస్కృతం
రాజచిహ్నం : పంజాఎత్తిన సింహం
రాజలాంచనం : శ్రీపర్వత భక్తులు
మతం : వైష్ణవం
ప్రత్యేకత : నరబలిని ప్రోత్సహించుట
శిల్పకళ : ఉండవల్లి గుహలు
👑 రాజకీయ చరిత్ర (పాలకుల వివరాలు)
ఇంద్రవర్మ (మహా రాజేంద్ర వర్మ)
- ఇతను ఇంద్రపురం అనే రాజధాని నిర్మించాడు. ప్రస్తుతం దీనిని ఇంద్రపాల నగరంగా పిలుస్తున్నారు. (ఇంద్రపాల నగరం నల్గొండ జిల్లాలోనిది)
- బిరుదు - ప్రియపుత్రుడు.
1వ మాధవ వర్మ
- వాస్తవంగా విష్ణుకుండినుల అధికార స్థాపకుడు.
- బిరుదు - విక్రమమహేంద్ర (పోలమూరు శాసనం).
- ఉండవల్లి, భైరవకోన, మొగల్ రాజపురం గుహలు చెక్కించాడు.
గోవిందవర్మ
- బిరుదు - విక్రమశ్రమ, ఉత్తమాశ్రయుడు.
- ఇతని పట్టమహిషి మహాదేవి (బౌద్ధమతాభిమాని). మహాదేవి ఇంద్రపాలపురంలో బౌద్దబిక్షువులకు తన పేరు మీద మహావిహారం నిర్మించింది.
- గోవిందవర్మ ఈ మహావిహారానికి దానం చేసిన గ్రామం - పెన్కపుర.
2వ మాధవ వర్మ
- బిరుదులు : త్రికూట మలయాధిపతి, త్రివరనగర యువతి ప్రియుడు (పోలమూరు శాసనం ప్రకారం).
- రాజధానిని ఇంద్రపాలపురం నుండి అమరావతికి మార్చాడు.
- ఉండవల్లిలో ప్రసిద్ధి చెందిన బుద్ధుడి శిల్పాన్ని పగులగొట్టించి శయనిస్తున్న విష్ణుమూర్తి విగ్రహాన్ని చెక్కించాడు. అదే ప్రస్తుతం 'అనంత పద్మనాభస్వామి ఆలయం'.
- రెండవ మాధవవర్మ ఉండవల్లి గుహలపై చెక్కించిన 'పూర్ణకుంభం' ఆంధ్రరాష్ట్ర అధికార చిహ్నంగా తీసుకోబడింది.
- రాజసూయ యాగం, అశ్వమేధ యాగం, నరమేధ యాగం మొదలైనవి జరిపించాడు.
- శాసనాలు : వేల్పూరు శాసనం, ఈపూరు శాసనం - 1, ఖానాపూర్ శాసనం.
- నిర్మించిన ఆలయాలు : అమరేశ్వరాలయం (ఇంద్రపాలనగరం), జడల రామలింగేశ్వరాలయం (చెరువుగట్టు), మల్లికార్జున ఆలయం (ఇంద్రపాలనగరం), కేసరి రామలింగేశ్వర ఆలయం (కీసరగుట్ట).
3వ మాధవవర్మ
- 2వ మాధవవర్మ కుమారుడు దేవవర్మ. అతని కుమారుడు 3వ మాధవ వర్మ.
- ఇతని బిరుదులు - జనాశ్రయ, అవసిత వివిధ దివ్య.
విక్రమేంద్ర వర్మ
- బిరుదు - మహాకవి (ఇంద్రపాల నగరం తామ్ర శాసనం).
- 3వ మాధవ వర్మను ఓడించాడు.
ఇంద్రభట్టారక వర్మ
- కీసరగుట్ట సమీపంలో ఘటికేశ్వర ఘటికాస్థానాన్ని స్థాపించాడు.
- ఘటికలు అనే వైదిక విద్యాలయాలను స్థాపించినట్లు ఉద్దంకుడు రాసిన సోమవేదం తెలుపుతోంది.
విక్రమేంద్ర భట్టారక వర్మ / విక్రయేంద్రవర్మ
- రాజధాని అమరావతి నుండి దెందులూరుకు మార్చాడు.
- శాసనాలు : తుమ్మలగూడెం శాసనం 2, ఇంద్రపాల నగర తామ్రశాసనం, చిక్కుళ్ళ తామ్ర శాసనం.
- బిరుదు - ఉత్తమాశ్రయుడు.
- ఇంద్రపాలపురంలో గోవిందవర్మ భార్య మహాదేవి నిర్మించిన విహారానికి 'ఇరుందెర' అను గ్రామం దానం చేశాడు.
4వ మాధవ వర్మ
- పొలమూరు-2, ఈపూరు 2 శాసనాలు వేయించాడు.
- ఈపూరు శాసనం ప్రకారం బిరుదులు: న్యాయశాస్త్ర విశారదుడు, సూక్ష్మగ్రాహి.
- గుణస్వామి అను కవి 'జనాశ్రయ చందోవిచ్ఛితి' గ్రంథం వ్రాశాడు.
మంచన భట్టారక వర్మ
ఇతనిని పృథ్వీమూల మహారాజు ఓడించినట్లు తాండివాడ శాసనం తెలుపుతుంది.
🏛️ పరిపాలన వ్యవస్థ
- రాజ్యాన్ని విషయాలుగా విభజించారు.
- విషయాధిపతులను అధికార పురుషులు, మహోత్తరులు అంటారు.
- గజ దళాధిపతిని 'హస్తికోశ' అని, పదాతిదళాధిపతిని 'వీరకోశ' అని అంటారు.
- భూమిని కొలిచే విధానం - వివర్తనం.
| ఉద్యోగుల పేర్లు | బాధ్యతలు / విధులు |
|---|---|
| రజ్జుకులు | భూములను పగ్గాలతో కొలిచేవారు. |
| ఫలదారుడు | పండిన పంటలో రాజభాగాన్ని నిర్ణయించే అధికారి. |
| సెట్టి | ప్రభుత్వానికి చెందాల్సిన ధాన్యం కొలిచే అధికారి. |
| అక్షపటలక | ప్రభుత్వ పత్రాలను భద్రపరిచేవాడు. |
| శాసన ఆజ్ఞప్తులు | రాజాజ్ఞలను వ్రాయించేవారు. |
| గుల్మికుడు | సరిహద్దు రాష్ట్రాలపై నియమించిన సైనిక రాజప్రతినిధి. |
3వ మాధవవర్మ పొలమూరు శాసనంలో న్యాయపాలన ప్రస్తావన ఉంది. నేర నిర్ణయానికి దివ్య పరీక్షలు జరిపేవారు. న్యాయపాలనకు రాజు అత్యున్నత న్యాయాధికారి.
- దక్షిణ భారతదేశంలో మొట్టమొదటగా హిందూగుహాలయాలు విష్ణుకుండినులు నిర్మించారు.
- విష్ణుకుండినుల కాలంనాటి గొప్ప బౌద్ధక్షేత్రం - బొజ్జన్నకొండ.
- వైదిక మతాభిమానులు (శ్రీపర్వత స్వామి భక్తులు).
- విష్ణుకుండినులు బౌద్ధమతాన్ని కూడా పోషించారు.
ఇక్ష్వాకుల తర్వాత విష్ణుకుండినులు నాణెములు ముద్రించారు. రాగి, ఇనుముతో కూడిన లోహంతో నాణెములను ముద్రించారు. శంఖువు, సింహం గుర్తు వున్న నాణెములు ముద్రించారు.
📖 విద్య, భాషా సాహిత్య సేవ
- రాజభాష - సంస్కృతం.
- చిక్కుళ్ళ తామ్ర శాసనంలో 'విజయరాజ్య సంవత్సరంబుల్' అనే తెలుగు వాక్యం ఉంది. ఇది తెలుగులో లభించిన తొలి వాక్యం.
- తొలి తెలుగు జంట కవులు అయిన నంది మల్లయ్య, ఘంట సింగన విష్ణుకుండినుల ఆస్థానంలోనివారే. వీరు 'ప్రభోధ చంద్రోదయం' అనే గ్రంథాన్ని రచించారు.
🎨 శిల్పకళ & గుహాలయాలు
ఉండవల్లి గుహాలయాలు (4 అంతస్థులు - గోవిందవర్మ నిర్మించెను)
- మొదటి అంతస్థులో : త్రిమూర్తుల విగ్రహాలు ఉన్నాయి.
- రెండవ అంతస్థులో : అనంతశయన విష్ణువు దేవాలయాలు ఉన్నాయి.
- మూడవ అంతస్థులో : త్రికూట ఆలయం ఉంది.
- నాలుగవ అంతస్థులో : సన్యాసుల విశ్రాంతి మందిరాలు కలవు.
- ఈ గుహలలో పూర్ణకుంభం ఉంది, అనంత పద్మనాభ స్వామి విగ్రహం ఉంది.
- ఉండవల్లి గుహలపై 'ఉత్పత్తి పిడుగు' అనే లేఖనం ఉంది.
8 గుహలున్న సముదాయం. ఇది శివునికి అంకితం చేయబడెను.
ఇందులో ఉన్న విగ్రహాలు: అష్టభుజ నటరాజమూర్తి, త్రివిక్రమావతార విగ్రహం.
No comments:
Post a Comment