భారత రాజ్యాంగం – భాగాలు (Indian Constitution Parts)
రాజ్యాంగంలోని విభాగాలు మరియు వాటికి సంబంధించిన అధికరణల (Articles) వివరాలు
భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం. ప్రారంభంలో రాజ్యాంగంలో 22 భాగాలు, 395 అధికరణలు (Articles), 8 షెడ్యూళ్ళు ఉండేవి. పోటీ పరీక్షలకు (APPSC, TSPSC, UPSC, SSC) సిద్ధమయ్యే అభ్యర్థుల కోసం రాజ్యాంగంలోని ముఖ్యమైన భాగాలు మరియు అధికరణల పట్టికను క్రింద వివరంగా అందించడమైనది.
| భాగం | అధికరణలు (Articles) | అంశం / వివరణ |
|---|---|---|
| 1 | 1 – 4 | భారత భూభాగం, రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు |
| 2 | 5 – 11 | పౌరసత్వము |
| 3 | 12 – 35 | ప్రాథమిక హక్కులు |
| 4 | 36 – 51 | ఆదేశిక సూత్రాలు / నిర్దేశిక నియమాలు |
| 4A | 51-A | ప్రాథమిక విధులు |
| 5 | 52 – 151 | కేంద్ర ప్రభుత్వము |
| 6 | 152 – 237 | రాష్ట్ర ప్రభుత్వాల నిర్మాణం, పనివిధానము |
| 7 | 238 | పార్ట్-బి రాష్ట్రాలకు సంబంధించినది (1956 రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించారు) |
| 8 | 239 – 242 | కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన అంశాలు |
| 9 | 243, 243(A)-243(O) | పంచాయతీ రాజ్ వ్యవస్థ, స్థానిక సంస్థలు |
| 9A | 243(P)-243(ZG) | పట్టణ, నగరపాలక సంస్థలకు సంబంధించిన అంశాలు (మున్సిపాలిటీలు) |
| 10 | 244, 244-A | ఆదివాసీ/షెడ్యూల్డ్ ప్రాంతాల పరిపాలనాంశాలు |
| 11 | 245 – 263 | కేంద్ర, రాష్ట్రాల మధ్యగల శాసన, పరిపాలనా సంబంధాలు |
| 12 | 264 – 300A | ఆస్తి, ఆర్థిక పరమైన అంశాలు, ఒప్పందాలు మరియు దావాలు |
| 13 | 301 – 307 | భారతదేశ పరిధిలో వ్యాపార, వాణిజ్యానికి సంబంధించిన చట్టాలు |
| 14 | 308 – 323 | యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లు (UPSC) మరియు రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్లు (SPSC) |
| 14A | 323A, 323B | కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (CAT) మరియు రాష్ట్రాల పరిపాలనా ట్రిబ్యునళ్లు |
| 15 | 324 – 329A | ఎన్నికల యంత్రాంగం, ఎన్నికల సంఘం వ్యవస్థల ఏర్పాటు |
| 16 | 330 – 342 | ప్రత్యేక వర్గాలకు (SC, ST, OBC, ఆంగ్లో-ఇండియన్లు) ప్రత్యేక అవకాశాలు |
| 17 | 343 – 351 | భాషకు సంబంధించిన అంశాలు (అధికారిక, జాతీయ మరియు ప్రాంతీయ భాషలు) |
| 18 | 352 – 360 | అత్యవసర పరిస్థితులకు (Emergency Provisions) సంబంధించిన అంశాలు |
| 19 | 361 – 367 | నానావిధ అంశాలు (రాష్ట్రపతికి, గవర్నర్లకు కల్పించబడ్డ ప్రత్యేక మినహాయింపులు) |
| 20 | 368 | భారత రాజ్యాంగ సవరణకు సంబంధించిన అంశాలు |
| 21 | 369 – 392 | తాత్కాలిక, పరివర్తనాత్మక మరియు ప్రత్యేక వర్తింపులు |
| 22 | 393 – 395 | సంక్షిప్త నామము, ప్రారంభము, హిందీలో ప్రాధికృత పాఠము మరియు రద్దులు/తొలగింపులు |
💡 గమనిక:
7వ రాజ్యాంగ సవరణ చట్టం (1956) ద్వారా రాజ్యాంగంలోని 7వ భాగం (అధికరణ 238) ను రద్దు చేయడం జరిగింది. ప్రస్తుతం భారత రాజ్యాంగంలో వర్గీకరణ పరంగా 25 భాగాలు ఉన్నాయి, కానీ వరుస సంఖ్య ఆధారంగా 22 భాగాలు ప్రధానమైనవి.
Free Material
Click Here ➔
📚 Indian Polity Hand Written Notes
UPSC, TSPSC, APPSC & All Competitive Exams ప్రిపరేషన్ కోసం పూర్తి నోట్స్.
No comments:
Post a Comment