భారత రాజ్యాంగం – షెడ్యూళ్ళు (Schedules)
I ⇒ భారతదేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, వాటి పేర్లు మరియు భూభాగములు (రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణప్పుడు ఈ షెడ్యూల్‌లో మార్పుల్ని చేర్చుతారు).
II ⇒ దేశంలోని ఉన్నత పదవుల్లో అనగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, స్పీకర్, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ మొదలైనవారి జీతభత్యాలు (జీతభత్యాలను భారత పార్లమెంటు నిర్ణయిస్తుంది).
III ⇒ ఉన్నత పదవుల్లోని వారి ప్రమాణ స్వీకారాలు (పార్లమెంటు, శాసనసభ సభ్యులుగా పోటీచేయువారి ప్రమాణాలను గురించి కూడా పేర్కొంటుంది).
IV ⇒ రాజ్యసభలో వివిధ రాష్ట్రాలకు గల ప్రాతినిధ్యం మరియు కేంద్రపాలిత ప్రాంతాల ప్రాతినిధ్యం (నూతన రాష్ట్రాల ఏర్పాటుకు షెడ్యూల్‌ను సవరించాలి).
V ⇒ షెడ్యూల్డు జాతులు, షెడ్యూల్డు తెగల ప్రజల పాలన కోసం, ప్రాంతాల పరిపాలన కోసం చేపట్టాల్సిన ప్రత్యేక చర్యలు.
VI ⇒ అస్సాం, త్రిపుర, మేఘాలయ, మిజోరాం రాష్ట్రాలలో షెడ్యూల్డు జాతులు, షెడ్యూల్డు తెగల అభివృద్ధికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసే "Tribal development Councils". (ప.బె. లోని డార్జిలింగ్ జిల్లా గుర్ఖాల కోసం ఏర్పాటుచేయబడ్డ ప్రత్యేక అభివృద్ధి మండలిని ఈ షెడ్యూల్‌లో చేర్చున్నారు.)
VII ⇒ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాల పంపిణీ జాబితా:
| జాబితా | 1950 | 2010 |
|---|---|---|
| 1. కేంద్ర జాబితా | 97 | 99 |
| 2. రాష్ట్ర జాబితా | 66 | 61 |
| 3. ఉమ్మడి జాబితా | 47 | 52 |
VIII ⇒ రాజ్యాంగంచే గుర్తించబడిన భాషలు:
-
రాజ్యాంగం అమలునాటికి (1950) గుర్తించిన భాషలు '14'
- అవి: అస్సామీ, బెంగాలీ, ఒరియా, తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, మరాఠీ, గుజరాతీ, పంజాబీ (గురుముఖి), కాశ్మీరీ, ఉర్దూ, హిందీ, సంస్కృతం.
- 1967 – 21వ సవరణ – సింధీ భాష (15వది)
- దేశంలో ఏరాష్ట్రంలో కూడా అధికార గుర్తింపు లేనప్పటికీ రాజ్యాంగంచే గుర్తింపబడిన భాష "సింధీ".
- సింధీ భాషను పంజాబ్, హర్యానా, ఢిల్లీ, కాశ్మీర్‌లో మాట్లాడతారు.
- 1992 – 71వ సవరణ – కొంకణి (గోవా), మణిపురి (మణిపూర్), నేపాలీ (ప.బె, డార్జిలింగ్ జిల్లా)
- 2003 – 92వ సవరణ – డోగ్రీ (J&K), సంతాలీ (జార్ఖండ్), మైథిలీ (బీహార్), బోడో (అస్సాం) మొదలైనవి ఈ షెడ్యూల్‌లో చేర్చారు.
(ప్రస్తుతం రాజ్యాంగం గుర్తించిన భాషల సంఖ్య '22')
IX ⇒ 1951లో మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా ఈ షెడ్యూల్‌ను చేర్చారు. భూసంస్కరణల చట్టాలను న్యాయసమీక్ష పరిధినుండి మినహాయిస్తూ ఈ షెడ్యూల్ చేర్చారు.
- దేశంలోని అన్ని రాష్ట్రాలకు సంబంధించిన భూసంస్కరణల చట్టాన్ని దీనిలో చేర్చటం వల్ల ప్రస్తుత అంశాల సంఖ్య '284'.
- 76వ రాజ్యాంగ సవరణ ద్వారా తమిళనాడులో రిజర్వేషన్ల శాతాన్ని 69% కు పెంచిన అంశాన్ని కూడా దీంట్లో చేర్చారు.
- 2007 లో సుప్రీంకోర్టు తమిళనాడు రిజర్వేషన్లను దీంట్లో చేర్చటాన్ని ప్రస్తావిస్తూ 1973 తర్వాత ఈ షెడ్యూల్‌లో చేర్చిన అంశాలను న్యాయసమీక్షకు గురిచేస్తామని చెప్పుటం గమనార్హం.
X ⇒ పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం
- 1985లో రాజీవ్‌గాంధీ కాలంలో 52వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ షెడ్యూల్‌ను రాజ్యాంగంలో చేర్చారు.
- దేశంలోని రాజకీయ పార్టీలు రాజ్యాంగబద్ధమైనవి కావు అనగా అవి కేవలం చట్టబద్ధంగా ఎన్నికల కమిషన్ గుర్తింపు ద్వారా మాత్రమే ఏర్పడినవి.
- భారత రాజ్యాంగం మొత్తంలో 'రాజకీయ పార్టీ' అనే పదాన్ని ఈ షెడ్యూల్‌లో మాత్రమే చూడవచ్చు.
- ఒక పార్టీ గుర్తుపై గెలుపొందిన ప్రజాప్రతినిధులు పార్టీలు మారటాన్ని నిరోధిస్తూ ఈ చట్టాన్ని ప్రవేశపెట్టారు.
- ఒక పార్టీ తరపున గెలుపొందిన ప్రజాప్రతినిధులు పార్టీలు మారినపుడు తమ ప్రాతినిధ్యాన్ని కోల్పోతారు.
పార్టీ ఫిరాయింపు వర్తించే సందర్భాలు:
- MLA or MP పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసినపుడు;
- ఇతర పార్టీలలో చేరినపుడు;
- పార్టీ ఆజ్ఞను ధిక్కరించి (విప్) నప్పుడు సభ్యత్వం రద్దగును;
- నియామక సభ్యులు 6 నెలల తర్వాత ఏదైనా పార్టీలో చేరినచో తమ ప్రాతినిధ్యం కోల్పోతారు.
- స్వతంత్ర అభ్యర్థులు ఇతర పార్టీల్లో చేరినపుడు;
- ఒక పార్టీ నుండి బహిష్కరించబడిన వ్యక్తులు ఇతర పార్టీల్లో చేరినపుడు ప్రాతినిధ్యం కోల్పోతారు.
పార్టీ ఫిరాయింపు వర్తించని సందర్భాలు:
- ప్రజాప్రతినిధులను రాజకీయ పార్టీలు బహిష్కరించినపుడు
- ఒక పార్టీకి చెందిన 2/3 వంతుమంది ప్రజాప్రతినిధులు ఇతర పార్టీలలో విలీనం అయినపుడు;
- ఒక రాజకీయ పార్టీలో చీలిక సంభవించినపుడు 1/3 వంతుమంది కాని అంతకంటే ఎక్కువగానీ ఇతర పార్టీల్లో విలీనం అయినపుడు; మరియు సంస్థలో మిగిలిన సభ్యుల సంఖ్య ఎంత ఉన్నప్పటికీ వారికి ఈ చట్టం వర్తించదు.
- నియామక సభ్యులు 6 నెలల్లోగా ఏదైనా పార్టీలో చేరినపుడు.
- 1991 లో 2003 లో 91వ రాజ్యాంగ సవరణ ద్వారా గతంలో 1/3 వంతుమంది సభ్యులు చీలిపోయినపుడు ఈ చట్టం వర్తించకుండేది. దానిని సవరిస్తూ 2/3 వంతు సభ్యులు ఇతర పార్టీల్లో విలీనమైనపుడు మాత్రమే ఈ చట్టం వర్తించకుండా సవరణ చేశారు.
XI ⇒ 1992లో పి.వి. నరసింహారావు కాలంలో 73వ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని చేర్చారు.
- పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించారు.
- 29 పాలనా అంశాలపై పంచాయతీరాజ్ సంస్థలకు ఆయా అధికారాలను బదిలీ చేయటం.
XII ⇒ 1992లో పి.వి. నరసింహారావు కాలంలో 74వ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని రాజ్యాంగంలో చేర్చారు.
- పట్టణ, నగరపాలక సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించారు.
- ఈ సంస్థలకు 18 అంశాలపై అధికారాల బదిలీ.
భారత సమాఖ్య వ్యవస్థపై ప్రభావం చూపే అంశాలపై మాత్రమే న్యాయవ్యవస్థ న్యాయసమీక్ష చేస్తుంది.
భారత రాష్ట్రపతి ప్రతి 10 సం.లకొకసారి V, VI షెడ్యూళ్ళపై అమలు తీరుపై ఒక ప్రత్యేక కమిషన్‌ను ఏర్పరచవచ్చును.
📌 ముఖ్యమైన అంశాలు (Key Points for Quick Revision)
- షెడ్యూల్ 7: కేంద్ర జాబితా (99), రాష్ట్ర జాబితా (61), ఉమ్మడి జాబితా (52) అంశాలు కలిగి ఉంటాయి.
- షెడ్యూల్ 8: 1950లో ప్రారంభంలో 14 భాషలు ఉండగా, ప్రస్తుత గుర్తింపు పొందిన భాషల సంఖ్య 22.
- షెడ్యూల్ 9: 1వ సవరణ (1951) ద్వారా చేర్చబడింది; ఇందులో ప్రస్తుతం 284 అంశాలు ఉన్నాయి (భూసంస్కరణల చట్టాలు).
- షెడ్యూల్ 10: 52వ సవరణ (1985) & 91వ సవరణ (2003) ద్వారా అమల్లోకి వచ్చిన పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం.
- షెడ్యూల్ 11 & 12: 73వ మరియు 74వ రాజ్యాంగ సవరణల (1992) ద్వారా వరుసగా పంచాయతీరాజ్ (29 అంశాలు), నగరపాలక సంస్థలకు (18 అంశాలు) రాజ్యాంగ హోదా కల్పించబడింది.
📚 Indian Polity Hand Written Notes
UPSC, TSPSC, APPSC & All Competitive Exams ప్రిపరేషన్ కోసం పూర్తి నోట్స్.
No comments:
Post a Comment