Sources of Indian Constitution and Critical Views - భారత రాజ్యాంగానికి గల ప్రధాన మూలాధారాలు

Sources of Indian Constitution and Critical Views | Indian Polity Notes in Telugu

భారత రాజ్యాంగానికి గల ప్రధాన మూలాధారాలు & విమర్శలు (Sources of Indian Constitution)

భారత రాజ్యాంగ శిల్పులు ప్రపంచంలోని పలు దేశాల రాజ్యాంగాలను లోతుగా పరిశీలించి, మన దేశ పరిస్థితులకు, వైవిధ్యానికి అనుగుణంగా ఉత్తమమైన అంశాలను స్వీకరించారు. భారత రాజ్యాంగ రచనకు మూలాధారమైన ప్రధాన దేశాలు మరియు చట్టాల వివరాలు కింద ఇవ్వబడ్డాయి.

1. భారత రాజ్యాంగ మూలాధారాల పట్టిక

↔ పట్టికను పక్కకు స్క్రోల్ చేయండి (Scroll horizontally to view table)
క్ర.సం దేశం / చట్టం పేరు గ్రహించబడిన అంశాలు
1. భారత ప్రభుత్వ చట్టం, 1935 సమాఖ్య వ్యవస్థ, కేంద్ర-రాష్ట్ర సంబంధాలు, అత్యవసర అధికారాలు, UPSC (యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్), ఉద్యోగస్వామ్యం (Bureaucracy).
2. బ్రిటన్ (UK)
  1. ఏక పౌరసత్వం
  2. సమన్యాయపాలన (Rule of Law)
  3. ఏకీకృత న్యాయవ్యవస్థ
  4. పార్లమెంటు నిర్మాణం
  5. కేబినెట్ ప్రభుత్వం
  6. స్పీకర్ పదవి & విధులు
  7. శాసన ప్రక్రియ
  8. ఎన్నికల యంత్రాంగం
  9. దేశాధిపతి నామమాత్రపు అధిపతిగా వ్యవహరించుట
  10. ఉద్యోగుల ఎంపిక పద్ధతులు
3. అమెరికా (USA)
  1. ప్రాథమిక హక్కులు
  2. రాజ్యాంగ ఆధిక్యత
  3. న్యాయ సమీక్షాధికారం (Judicial Review)
  4. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయవ్యవస్థ
  5. రాజ్యాంగ ప్రవేశిక (Preamble) & ధ్యేయం
  6. దేశాధిపతి పేరుమీద దేశపరిపాలన నిర్వహించడం
  7. ఉపరాష్ట్రపతి పదవి, ఎగువ సభ (రాజ్యసభ)కు అధ్యక్షునిగా వ్యవహరించడం
  8. రాష్ట్రపతి, సుప్రీంకోర్టు మరియు హైకోర్టు న్యాయమూర్తులను పదవి నుండి తొలగించే పద్ధతి (మహాభియోగ తీర్మానం)
4. ఐర్లాండ్
  • ఆదేశిక సూత్రాలు (Directive Principles of State Policy)
  • రాష్ట్రపతి ఎన్నిక పద్ధతి
  • రాజ్యసభకు రాష్ట్రపతి 12 మంది విశిష్ట సభ్యులను నియమించడం
5. కెనడా
  • సమాఖ్య నిర్మాణం, అవశిష్టాధికారాలు కేంద్రానికి చెందుట, బలమైన కేంద్రప్రభుత్వం
  • కేంద్రం ద్వారా రాష్ట్రాల గవర్నర్ల నియామకం
6. ఆస్ట్రేలియా
  • ఉమ్మడి జాబితా (Concurrent List)
  • వాణిజ్య, వ్యాపార స్వేచ్ఛ చట్టాలు
  • ప్రవేశికలోని భాష (Preamble Language)
  • పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశం (Joint Sitting)
  • ప్రజాప్రయోజనాల వ్యాజ్యాలు (PIL)
7. జపాన్
  1. చట్టంచే నిర్ధారించబడిన పద్ధతి (Procedure Established by Law)
  2. అత్యవసర పరిస్థితి కాలంలో జీవించే హక్కును రద్దు చేయకుండుట
8. జర్మనీ (వైమర్ రాజ్యాంగం) అత్యవసర పరిస్థితి కాలంలో అనుసరించే పద్ధతులు, ప్రాథమిక హక్కులను సస్పెండ్ చేయుట.
9. దక్షిణాఫ్రికా రాజ్యాంగ సవరణ పద్ధతి (Article 368) మరియు రాజ్యసభ సభ్యుల ఎన్నిక విధానం.
10. రష్యా (పూర్వ USSR)
  • సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం (ప్రవేశికలో)
  • ప్రాథమిక విధులు (Fundamental Duties)
11. ఫ్రాన్సు
  1. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం (Liberty, Equality, Fraternity)
  2. గణతంత్ర వ్యవస్థ (Republic System)
12. నార్వే ఎగువసభ సభ్యులను, దిగువసభ సభ్యులు ఎన్నుకొనే పద్ధతి.

2. రాజ్యాంగ పరిషత్ - విమర్శలు & నెహ్రూ సమర్థన

  • కాంగ్రెస్ ప్రాతినిధ్యం: భారతదేశ విభజనకు పూర్వం రాజ్యాంగ పరిషత్‌లో కాంగ్రెస్ సభ్యుల సంఖ్య 68% కాగా, విభజన అనంతరం అది 80%కి పెరిగింది.
  • ప్రజా ఆమోదం లేదనే విమర్శ: రాజ్యాంగ పరిషత్ సార్వత్రిక ప్రాతిపదికన ప్రత్యక్ష ఓటింగ్ ద్వారా ఏర్పడలేదని, రూపొందించిన రాజ్యాంగాన్ని ప్రజల ప్రత్యక్ష ఆమోదానికి (Referendum) పెట్టలేదని కొందరు విమర్శించారు.
  • సార్వభౌమాధికార విమర్శ: రాజ్యాంగ పరిషత్ సార్వభౌమాధికార సంస్థ కాదని, రాజ్యాంగానికి బ్రిటిష్ రాజమకుటం ఆమోదం లేక కేవలం రాజేంద్ర ప్రసాద్ ఆమోదముద్ర మాత్రమే లభించిందని విమర్శకులు పేర్కొన్నారు.
  • పండిట్ నెహ్రూ సమర్థన: సార్వభౌములైన భారత ప్రజల ఆకాంక్షల మేరకు ఏర్పడిన రాజ్యాంగ పరిషత్‌చే రాజ్యాంగం రూపొందించబడింది కాబట్టి రాజ్యాంగానికి సార్వభౌమాధికారం లేదనే వాదనను పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ పూర్తిగా తిరస్కరించారు.

3. భారత రాజ్యాంగంపై ప్రముఖుల వ్యాఖ్యలు (Quotes & Opinions)

"భారత రాజ్యాంగం న్యాయవాదుల స్వర్గం (Lawyer's Paradise)." — సర్ ఐవర్ జెన్నింగ్స్
"భారత రాజ్యాంగం ఐంద్రుని విమానమైన 'ఐరావతం' లాంటిది (పరిమాణంలో పెద్దది)." — H.V. కామత్
"భారత రాజ్యాంగం ప్రపంచ రాజ్యాంగాలన్నింటిలో సుదీర్ఘమైనది, దివ్యమైనది." — సర్ ఐవర్ జెన్నింగ్స్
"భారత రాజ్యాంగం ఒక అందమైన అతుకుల బొంత (Beautiful Patchwork)." — గ్రాన్‌విలే ఆస్టిన్
"ప్రపంచ రాజ్యాంగాలన్నింటినీ కొల్లగొట్టి భారత రాజ్యాంగం రూపొందించారు అని పేర్కొనడానికి నేను గర్విస్తున్నాను." — డాక్టర్ B.R. అంబేద్కర్
"భారత రాజ్యాంగం భారత ప్రజల బహుళ అవసరాలను, ప్రయోజనాలను తీర్చేది." — పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ
"భవిష్యత్‌లో ఏనాడైనా భారత రాజ్యాంగం వైఫల్యం చెందితే దానికి రాజ్యాంగాన్ని నిందించకూడదు; రాజ్యాంగాన్ని అమలుపరిచే వారిని (పాలకులను) నిందించాలి." — డాక్టర్ B.R. అంబేద్కర్
"భారతదేశంలో భిన్నత్వాన్ని దృష్టిలో ఉంచుకొని బడుగువర్గాలు, ప్రత్యేకవర్గాల ప్రయోజనాలన్నింటినీ రాజ్యాంగంలో చేర్చుటవలన ఈ రాజ్యాంగం విశాలంగా రూపొందించబడింది." — సర్ ఐవర్ జెన్నింగ్స్

📌 పోటీ పరీక్షల దృష్ట్యా ముఖ్యమైన అంశాలు (Exam Point of View)

  • ప్రధాన మూలం: భారత రాజ్యాంగానికి అతిపెద్ద మూలాధారం 1935 భారత ప్రభుత్వ చట్టం (సమాఖ్య, UPSC, అత్యవసర అధికారాలు).
  • బ్రిటన్ నుండి: ఏక పౌరసత్వం, సమన్యాయపాలన, పార్లమెంటరీ తరహా ప్రభుత్వం, స్పీకర్ వ్యవస్థ.
  • అమెరికా నుండి: ప్రాథమిక హక్కులు, న్యాయ సమీక్ష (Judicial Review), ప్రవేశిక, న్యాయమూర్తుల మహాభియోగ తీర్మానం.
  • ఐర్లాండ్ నుండి: ఆదేశిక సూత్రాలు (DPSP) మరియు రాజ్యసభకు 12 మంది సభ్యుల నామినేషన్.
  • కెనడా & ఆస్ట్రేలియా: బలమైన కేంద్రంతో కూడిన సమాఖ్య (కెనడా); ఉమ్మడి జాబితా & ఉభయ సభల సంయుక్త సమావేశం (ఆస్ట్రేలియా).
  • రాజ్యాంగ సవరణ: రాజ్యాంగ సవరణ పద్ధతిని దక్షిణాఫ్రికా నుండి గ్రహించారు.
  • హక్కుల సస్పెన్షన్: అత్యవసర సమయంలో ప్రాథమిక హక్కులను సస్పెండ్ చేసే విధానం జర్మనీ నుండి స్వీకరించబడింది.
  • ప్రముఖ బిట్స్: రాజ్యాంగాన్ని "న్యాయవాదుల స్వర్గం" అని ఐవర్ జెన్నింగ్స్, "ఐరావతం" అని H.V. కామత్ అభివర్ణించారు.
Free Material

📚 Indian Polity Hand Written Notes

UPSC, TSPSC, APPSC & All Competitive Exams ప్రిపరేషన్ కోసం పూర్తి నోట్స్.

Click Here ➔

No comments:

Post a Comment