Indian Constituent Assembly Committees and Working Phases (రాజ్యాంగ పరిషత్ కమిటీలు)

Indian Constituent Assembly Committees and Working Phases | Indian Polity Notes in Telugu

భారత రాజ్యాంగ పరిషత్: కమిటీలు, పనివిధానము & ఆమోదం (Constituent Assembly Committees & Working)

రాజ్యాంగ పరిషత్ నుండి ఏర్పడిన ప్రధాన కమిటీలు 13గా పేర్కొన్నప్పటికీ వాస్తవంలో కమిటీల మొత్తం సంఖ్య 22.

  • (a) విధాన నిర్ణాయక కమిటీలు: 10
  • (b) విషయ నిర్ణాయక కమిటీలు: 12
  • రాజ్యాంగ పరిషత్ నుండి ఏర్పడిన అతిపెద్ద కమిటీ — సలహా సంఘం (Advisory Committee). దీనికి చైర్మన్ సర్దార్ వల్లభాయ్ పటేల్ (మొత్తం సభ్యుల సంఖ్య: 54 + 1).

1. ముసాయిదా కమిటీ (Drafting Committee)

రాజ్యాంగ పరిషత్‌లోని అత్యంత ప్రధానమైన కమిటీ ముసాయిదా కమిటీ. దీని చైర్మన్ Dr. B.R. అంబేద్కర్.

↔ పట్టికను పక్కకు స్క్రోల్ చేయండి (Scroll horizontally to view table)
సంఖ్య సభ్యుని పేరు హోదా / ప్రత్యేక వివరాలు
1. డా॥ B.R. అంబేద్కర్ చైర్మన్
2. ఎన్. గోపాలస్వామి అయ్యంగార్ సభ్యుడు
3. అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ సభ్యుడు
4. కె.ఎం. మున్షీ సభ్యుడు
5. మహ్మద్ సయ్యద్ సాదుల్లా సభ్యుడు
6. B.L. మిత్తల్ సభ్యుడు (ఈయన అనారోగ్యానికి గురికావడంతో వీరి స్థానంలో N. మాధవరావు నియామకం)
7. D.P. ఖైతాన్ సభ్యుడు (1948లో మరణించడంతో వీరి స్థానంలో T.T. కృష్ణమాచారి నియామకం)

* ప్రత్యేక గమనిక: ముసాయిదా కమిటీలో న్యాయశాస్త్ర విద్యను అభ్యసించని ఏకైక సభ్యుడు T.T. కృష్ణమాచారి.

2. ఇతర కమిటీలు మరియు వాటి అధ్యక్షులు

↔ పట్టికను పక్కకు స్క్రోల్ చేయండి (Scroll horizontally to view table)
సంఖ్య కమిటీ పేరు అధ్యక్షులు / చైర్మన్
1. సారథ్య సంఘం (Steering Committee) Dr. బాబూ రాజేంద్రప్రసాద్
2. నియమ నిబంధనల కమిటీ Dr. బాబూ రాజేంద్రప్రసాద్
3. జెండా కమిటీ Dr. బాబూ రాజేంద్రప్రసాద్
4. ప్రాథమిక హక్కుల కమిటీ సర్దార్ వల్లభాయ్ పటేల్
5. అల్పసంఖ్యాక వర్గాల కమిటీ సర్దార్ వల్లభాయ్ పటేల్
6. రాష్ట్రాల అధికారాల కమిటీ సర్దార్ వల్లభాయ్ పటేల్
7. రాష్ట్ర రాజ్యాంగ కమిటీ సర్దార్ వల్లభాయ్ పటేల్
8. కేంద్ర రాజ్యాంగ కమిటీ జవహర్‌లాల్ నెహ్రూ
9. యూనియన్ పవర్స్ కమిటీ జవహర్‌లాల్ నెహ్రూ
10. రాష్ట్రాల సంప్రదింపుల కమిటీ జవహర్‌లాల్ నెహ్రూ
11. ప్రాథమిక హక్కుల ఉపకమిటీ J.B. కృపలానీ
12. అల్పసంఖ్యాక వర్గాల ఉపకమిటీ Dr. H.C. ముఖర్జీ
13. హౌజ్ కమిటీ పట్టాభి సీతారామయ్య
14. శాసన సభా వ్యవహారాలు & నియమ నిబంధనల కమిటీ G.V. మౌలాంకర్
15. క్రెడెన్షియల్ కమిటీ (సభ్యుల వివరాల సేకరణ) గోపాలస్వామి అయ్యంగార్
16. ఈశాన్య రాష్ట్రాల హక్కుల కమిటీ గోపీనాథ్ బార్డోలాయ్
17. సుప్రీంకోర్టు సన్నాహక కమిటీ వరదా చార్య (ఈయన రాజ్యాంగ పరిషత్ సభ్యుడు కాదు)

3. కీలక తేదీలు & రాజ్యాంగ తయారీ క్రమం

  • 09-12-1946: రాజ్యాంగ పరిషత్ తొలి సమావేశం జరిగింది. పరిషత్‌ను ఉద్దేశించి ప్రసంగించిన మొదటి వ్యక్తి డాక్టర్ సచ్చిదానంద సిన్హా.
  • 11-12-1946: డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్ పరిషత్ శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డారు.
  • 13-12-1946: జవహర్‌లాల్ నెహ్రూ రాజ్యాంగ 'లక్ష్యాలు - ఆశయాల తీర్మానం' (Objectives Resolution) ప్రవేశపెట్టారు.
  • 22-07-1947: రాజ్యాంగ పరిషత్‌లో భారత జాతీయ జెండాను డాక్టర్ హంసా మెహతా ప్రదర్శించి ప్రతిపాదించారు.
  • 26-11-1949: రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగాన్ని ఆమోదించిన తేదీ. వెంటనే అమలులోకి వచ్చిన అంశాలు: పౌరసత్వం, ఎన్నికలు, తాత్కాలిక పార్లమెంటు, స్వదేశీ సంస్థానాధీశుల ప్రత్యేక వసతులు.
  • 24-01-1950: రాజ్యాంగ పరిషత్ చివరి సమావేశం (12వ సమావేశం).
    • (a) "జనగణమన"ను జాతీయ గీతంగా ఆమోదించారు.
    • (b) "వందేమాతరం"ను జాతీయ గేయంగా ఆమోదించారు.
    • (c) డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్‌ను భారత మొదటి రాష్ట్రపతిగా ఎన్నుకున్నారు (ఈయన పేరును పటేల్ మరియు నెహ్రూ సూచించారు).
  • 26-01-1950: రాజ్యాంగం అమలులోకి వచ్చిన తేదీ. (1930 జనవరి 26న లాహోర్ కాంగ్రెస్ 'సంపూర్ణ స్వరాజ్య' స్మృతిగా ఈ తేదీని ఎంచుకున్నారు).

4. గణాంకాలు & ముఖ్యమైన వివరాలు

  • పరిషత్ రాజ్యాంగాన్ని ఆమోదించుటకు జరిపిన సమావేశాల సంఖ్య: 11 (మొత్తం సమావేశాలు: 12).
  • ముసాయిదాను చర్చించి, ఆమోదించడానికి పట్టిన కాలం: 165 రోజులు.
  • రాజ్యాంగ నిర్మాణానికి పట్టిన మొత్తం సమయం: 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు.
  • రాజ్యాంగ తయారీకి అయిన ఖర్చు: ₹64 లక్షలు.
  • ఆమోద తీర్మానంపై సంతకాలు చేసిన సభ్యుల సంఖ్య: 284 మంది.
  • పరిషత్‌ను ఉద్దేశించి చివరిగా ప్రసంగించిన భారతీయ వ్యక్తి డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్ కాగా, చివరిగా మాట్లాడిన బ్రిటిష్ గవర్నర్ జనరల్ మౌంట్‌బాటన్.
  • భారతదేశానికి చివరి మరియు మొదటి భారతీయ గవర్నర్ జనరల్ — C. రాజగోపాలాచారి (రాజాజీ).
  • B.N. రావు సమర్పించిన ముసాయిదాలో 315 అధికరణలు, 13 షెడ్యూళ్ళు ఉండగా, రాజ్యాంగం అమలులోకి వచ్చేనాటికి 395 అధికరణలు, 8 షెడ్యూళ్లు, 22 భాగాలు ఉన్నాయి.
  • ముసాయిదాకు ప్రతిపాదించిన సవరణలు 7,563 కాగా, పరిషత్ చర్చించి ఆమోదించినవి 2,473.

5. రాజ్యాంగ పరిషత్ పనివిధానం — 3 దశలు

  • మొదటి దశ (09-12-1946 నుండి 15-08-1947): కేవలం రాజ్యాంగ విధులను మాత్రమే నిర్వహించింది.
  • రెండవ దశ (15-08-1947 నుండి 26-11-1949): రాజ్యాంగ విధులతో పాటు దేశ పాలనకు కావలసిన శాసనాలను రూపొందించే విధులు కూడా నిర్వహించింది.
  • మూడవ దశ (26-11-1949 నుండి 14-05-1952): కేవలం శాసన విధులను నెరవేరుస్తూ దేశ తాత్కాలిక పార్లమెంటుగా వ్యవహరించింది.

* రాజ్యాంగ విధులు నిర్వహించేటప్పుడు రాజేంద్రప్రసాద్ అధ్యక్షత వహించగా, తాత్కాలిక పార్లమెంటుగా శాసన విధులు నిర్వహించేటప్పుడు G.V. మౌలాంకర్ అధ్యక్షత వహించారు (ఉపాధ్యక్షుడు: అనంతశయనం అయ్యంగార్).

6. రాజ్యాంగ పరిషత్‌పై ప్రముఖుల అభిప్రాయాలు (Opinions)

"రాజ్యాంగ రచనకు రాజ్యాంగ పరిషత్ సమన్వయ పద్ధతిని అనుసరించినది." — గ్రాన్ విలే ఆస్టిన్
"రాజ్యాంగ రచనలో సమన్వయ పద్ధతి కంటే సర్దుబాటు పద్ధతికే ప్రాధాన్యత ఎక్కువ ఇచ్చారు." — ఒ.పి. గోయల్
B.R. అంబేద్కర్‌ను "రాజ్యాంగ రూపశిల్పి, అభినవ మనువు" అని వర్ణించినది — M.V. పైలీ
"రాజ్యాంగ పరిషత్‌లో నెహ్రూ, పటేల్, రాజేంద్రప్రసాద్, అంబేద్కర్, మౌలానాలు ఒక నియంత్రణమండలిగా వ్యవహరించారు." — గ్రాన్‌విలే ఆస్టిన్
"రాజ్యాంగ పరిషత్ భారత ప్రజల స్వేచ్ఛా స్వాతంత్య్రాల వ్యక్తీకరణకు ఒక అడ్డంకిగా మారినది." — జయప్రకాష్ నారాయణ్
"రాజ్యాంగ పరిషత్‌పై ప్రజాభిప్రాయ నీడలు లేవు." — కె. సంతానం
"భారత రాజ్యాంగ పరిషత్ దేశంలోని కొన్ని వర్గాల ప్రజలకు మాత్రమే ప్రాతినిధ్యం వహించినది." — విన్‌స్టన్ చర్చిల్
"రాజ్యాంగ పరిషత్ కేవలం హిందువులకు మాత్రమే ప్రాతినిధ్యం వహించినది." — లార్డ్ సైమన్

📌 పోటీ పరీక్షల దృష్ట్యా ముఖ్యమైన అంశాలు (Exam Point of View)

  • ముసాయిదా కమిటీ చైర్మన్: Dr. B.R. అంబేద్కర్ (మొత్తం సభ్యులు 7). మార్పు చెందిన సభ్యులు: B.L. మిత్తల్ స్థానంలో N. మాధవరావు, D.P. ఖైతాన్ స్థానంలో T.T. కృష్ణమాచారి.
  • లా రహిత సభ్యుడు: ముసాయిదా కమిటీలో న్యాయశాస్త్రం చదవని ఏకైక సభ్యుడు T.T. కృష్ణమాచారి.
  • సలహా సంఘం (అతిపెద్ద కమిటీ): సర్దార్ వల్లభాయ్ పటేల్ (55 మంది సభ్యులు).
  • సమయం & వ్యయం: 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు | ఖర్చు: ₹64 లక్షలు | సంతకాలు చేసిన సభ్యులు: 284 మంది.
  • తాత్కాలిక పార్లమెంటు స్పీకర్: పరిషత్ శాసన విధులు నిర్వహించినప్పుడు G.V. మౌలాంకర్ అధ్యక్షత వహించారు.
  • జాతీయ గీతం & గేయం ఆమోదం: 1944 జనవరి 24 (12వ చివరి సమావేశం). ఇదే రోజు రాజేంద్రప్రసాద్ తొలి రాష్ట్రపతిగా ఎన్నుకోబడ్డారు.
  • ప్రముఖుల వ్యాఖ్యలు: B.R. అంబేద్కర్‌ను 'అభినవ మనువు' అని M.V. పైలీ అభివర్ణించగా, పరిషత్‌ను 'హిందువుల సంస్థ'గా లార్డ్ సైమన్ విమర్శించారు.
Free Material

📚 Indian Polity Hand Written Notes

UPSC, TSPSC, APPSC & All Competitive Exams ప్రిపరేషన్ కోసం పూర్తి నోట్స్.

Click Here ➔

No comments:

Post a Comment