Basic Structure of the Constitution - రాజ్యాంగ మౌలిక స్వరూపం

రాజ్యాంగ మౌలిక స్వరూపం (Basic Structure Doctrine)

Kesavananda Bharati Case (1973) • Single Citizenship • Integrated Judiciary

Basic Structure Doctrine – ఆవిర్భావం

1973 కేశవానంద భారతి కేసు: 1973లో కేశవానంద భారతి vs స్టేట్ ఆఫ్ కేరళ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ద్వారా ఈ సిద్ధాంతంను ప్రతిపాదించారు.

పార్లమెంటు అధికార పరిమితి: భారత రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకు ఉన్నప్పటికీ (ఆర్టికల్ 368 ప్రకారం), రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని (Basic Structure) సవరించే అధికారం పార్లమెంటుకు లేదుని సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చింది.

నిర్వచనంపై స్పష్టత: 'రాజ్యాంగ మౌలిక స్వరూపం' అనే భావనకు సుప్రీంకోర్టు స్పష్టమైన నిర్దిష్ట నిర్వచనం ఇవ్వలేదు. కాలానుగుణంగా వచ్చే కేసుల ఆధారంగా దీని పరిధిని విస్తరిస్తూ వస్తోంది.

జస్టిస్ S.M. సిక్రీ అభిప్రాయం: అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ S.M. సిక్రీ ప్రవేశికలోని సార్వభౌమాధికారం, ప్రజాస్వామ్యం, గణతంత్ర వ్యవస్థ, న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం మొదలగునవి మౌలిక స్వరూప పరిధిలోకి వస్తాయని తమ తీర్పులో పేర్కొన్నారు.

కీలక తీర్పులు – విస్తరణ

రాజ్‌నారాయణ్ Vs ఇందిరాగాంధీ (1975), మినర్వా మిల్స్ కేసు (1980), LIC of India కేసు మరియు S.R. బొమ్మై (1994) కేసులలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులననుసరించి రాజ్యాంగ మౌలిక స్వరూపంలో క్రింది అంశాలు భాగమని నిర్ధారించబడింది:

Sovereignty Democracy & Republic Secularism Parliamentary System FR & DPSP Balance Liberty & Equality Welfare State Federalism Judicial Review Independent Judiciary Rule of Law
కేసు పేరు & సంవత్సరం ప్రధాన తీర్పు / మౌలిక స్వరూపంగా గుర్తించిన అంశం
కేశవానంద భారతి 1973 మౌలిక స్వరూప సిద్ధాంతం ఆవిర్భావం; ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం; ప్రాథమిక స్వరూపాన్ని మార్చలేరు.
ఇందిరా నెహ్రూ గాంధీ Vs రాజ్ నారాయణ్ 1975 స్వేచ్ఛాయుత మరియు న్యాయమైన ఎన్నికలు, చట్టబద్ధ పాలన (Rule of Law).
మినర్వా మిల్స్ 1980 ప్రాథమిక హక్కులు & ఆదేశిక సూత్రాల మధ్య సమతుల్యత; న్యాయ సమీక్షాధికారం.
S.R. బొమ్మై 1994 సమాఖ్య వ్యవస్థ (Federalism), లౌకికతత్వం (Secularism), ప్రజాస్వామ్యం.
పట్టిక పూర్తిగా చూడటానికి పక్కకు స్క్రోల్ చేయండి (Swipe Left/Right) 4 key judgments

ఏక పౌరసత్వం (Single Citizenship)

ఏక పౌరసత్వ వ్యవస్థ: భారతదేశం సమాఖ్య లక్షణాలు కలిగినప్పటికీ, సమగ్రత కోసం ఏక పౌరసత్వాన్ని (Single Citizenship) ప్రసాదించింది.

మూలం: భారత రాజ్యాంగ నిర్మాతలు పౌరసత్వ భావనను బ్రిటన్ (UK) రాజ్యాంగం నుండి గ్రహించారు.

ద్వంద్వ పౌరసత్వ నిబంధన (2004): 2004లో 16 దేశాలలో నివసిస్తున్న ప్రవాస భారతీయులకు (PIOs/OCIs) మనదేశంలో పరిమిత ద్వంద్వ పౌరసత్వాన్ని కల్పించారు.

హక్కుల పరిమితి: ద్వంద్వ పౌరసత్వం గలవారికి కేవలం పౌరహక్కులు, పరిమిత ప్రాథమిక హక్కులు మాత్రమే ఇవ్వబడతాయి. వీరికి రాజకీయ హక్కులు (ఓటు వేసే హక్కు లేదా ఎన్నికల్లో పోటీ చేసే హక్కు) ఉండవు.

విశ్లేషణ: రాజకీయ హక్కులు లేనివారిని పూర్తిస్థాయి పౌరులుగా పరిగణించలేము. అందువలన ఆచరణాత్మకంగా మనది సంపూర్ణ ఏకపౌరసత్వ విధానంగానే పరిగణించబడుతుంది.


ఏకీకృత న్యాయవ్యవస్థ (Integrated Judiciary)

నిర్మాణం: మనదేశం అనుసరించే న్యాయవ్యవస్థ నిర్మాణం "ఏకీకృత / సమీకృత న్యాయవ్యవస్థ" (Integrated & Independent Judiciary).

మూలం & క్రమం: ఈ న్యాయవ్యవస్థ నిర్మాణ స్వరూపాన్ని మనదేశం బ్రిటన్ నుండి (మరియు 1935 భారత ప్రభుత్వ చట్టం నుండి) గ్రహించింది. ఒకే రాజ్యాంగాన్ని అమలుపరిచే క్రమంలో అత్యున్నత న్యాయస్థానం (Supreme Court), హైకోర్టులు మరియు దిగువ న్యాయస్థానాలు ఒకే పిరమిడ్ తరహా క్రమశిక్షణలో ఉంటాయి.

తీర్పుల బైండింగ్ స్వభావం: ఉన్నత న్యాయస్థానాలు జారీచేసే ఆదేశాలను/ఆర్డర్లను దిగువ స్థాయి న్యాయస్థానాలు తప్పనిసరిగా అమలుపరచవలసి ఉంటుంది.

నియామకాలు: న్యాయమూర్తుల నియామక ప్రక్రియలో (కొలీజియం వ్యవస్థ ద్వారా) ఉన్నత న్యాయస్థానాల భాగస్వామ్యం ఉంటుంది.

భారత్ Vs అమెరికా తేడా: అమెరికాలో మాదిరిగా మనదేశంలో కేంద్రానికి మరియు రాష్ట్రాలకు వేర్వేరు రాజ్యాంగాలు లేవు; అలాగే వేర్వేరు న్యాయవ్యవస్థలు ఉండే అవకాశం లేదు. కేంద్ర, రాష్ట్ర చట్టాలు రెండింటినీ ఒకే సమీకృత న్యాయవ్యవస్థ విచారిస్తుంది.

📌 Exam Point of View – Quick Revision Points

ఆర్టికల్ 368: పార్లమెంటుకు రాజ్యాంగ సవరణ అధికారాన్ని ఇస్తుంది, కానీ బేసిక్ స్ట్రక్చర్‌ను మార్చలేదు.
బేసిక్ స్ట్రక్చర్ బెంచ్: కేశవానంద భారతి కేసులో 13 మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం (7:6 మెజారిటీ తీర్పు) ఏర్పడింది.
భాగం II (ఆర్టికల్స్ 5–11): భారత పౌరసత్వం గురించి వివరిస్తుంది.
అమెరికా vs భారత్ (పౌరసత్వం & న్యాయవ్యవస్థ): అమెరికాలో ద్వంద్వ పౌరసత్వం మరియు ద్వంద్వ న్యాయవ్యవస్థ ఉండగా, భారతదేశంలో ఏక పౌరసత్వం మరియు ఏకీకృత న్యాయవ్యవస్థ ఉన్నాయి.
ప్రధాన తీర్పుల సారాంశం: కేశవానంద భారతి (1973) – Basic Structure పరిచయం; మినర్వా మిల్స్ (1980) – FR & DPSP సమతుల్యత; బొమ్మై (1994) – సమాఖ్య మరియు లౌకికత్వం.
Kesavananda Bharati – 13 Judge Bench Article 368 – Amendment power Single Citizenship – UK model Integrated Judiciary – UK + 1935 Act Minerva Mills – FR & DPSP balance S.R. Bommai – Federalism & Secularism
Free Material

📚 Indian Polity Hand Written Notes

UPSC, TSPSC, APPSC & All Competitive Exams ప్రిపరేషన్ కోసం పూర్తి నోట్స్.

Click Here ➔

No comments:

Post a Comment