భారత రాజ్యాంగ పరిషత్ (Constituent Assembly) – నేపథ్యం & నిర్మాణం
📌 రాజ్యాంగ పరిషత్ – చారిత్రక నేపథ్యం
- భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి మరియు ఆమోదించడానికి రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేయబడింది.
- 'రాజ్యాంగ పరిషత్' అనే భావనను మన దేశంలో మొదటగా వ్యక్తపరిచిన వ్యక్తి – M.N. రాయ్ (1934).
- 'స్వరాజ్' అనే పదాన్ని మొదటగా ఉపయోగించినది – దాదాభాయి నౌరోజీ.
- భారత స్వాతంత్య్రాన్ని (స్వరాజ్) అనుసరించి పరిపాలన చేయుటకు మనదేశానికి సొంత రాజ్యాంగం అవసరమని 1918 లో భారత జాతీయ కాంగ్రెస్ తీర్మానించినది.
- 1921 లో మహాత్మాగాంధీ 'Young India' పత్రికలో రాస్తూ – "భారత్‌కు స్వాతంత్య్రం అనేది భిక్ష కాదని, ప్రజలు తమను తాము అభివ్యక్తీకరించుకొనుటకు గల స్వేచ్ఛ మాత్రమే" అని స్పష్టం చేశారు.
- 1924 లో పండిట్ మోతీలాల్ నెహ్రూ నేతృత్వంలో జరిగిన Round Table సమావేశంలో, ప్రజలందరికీ ప్రాతినిధ్యం వహించే కమిటీ ద్వారా చట్టరూపకల్పన చేయాలని తీర్మానించారు.
- 1925 లో శ్రీమతి అనిబిసెంట్ బ్రిటిష్ పార్లమెంట్‌లో "Commonwealth of India Bill" ప్రవేశపెడుతూ, ఐర్లాండ్ ప్రజల మాదిరిగానే భారతీయులకు కూడా శాశ్వత హక్కులు కల్పించాలని సూచించారు.
- 1928 లో మోతీలాల్ నెహ్రూ నివేదిక (Nehru Report) సొంత రాజ్యాంగం కోసం భారతీయులు చేసిన మొదటి నిర్మాణాత్మక ప్రయత్నంగా పరిగణించబడుతుంది. ఇందులో పౌర హక్కులు, పరిపాలనా విధానాల గురించి పేర్కొన్నారు.
- 1936 లో జవహర్‌లాల్ నెహ్రూ 'National Herald' పత్రికలో వ్యాసం రాస్తూ, భారత ప్రజల సమస్యలకు స్వయం రాజ్యాంగ రచన మాత్రమే ఏకైక పరిష్కారమని అభిప్రాయపడ్డారు.
- 1938 లో హరిపుర కాంగ్రెస్ సమావేశం నెహ్రూ అభిప్రాయాన్ని తీర్మానంగా ఆమోదించింది.
- 1942 క్రిప్స్ రాయబారం (Cripps Mission) ద్వారా బ్రిటిష్ ప్రభుత్వం మొదటిసారిగా రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు ఆవశ్యకతను అధికారికంగా గుర్తించింది.
🏛️ రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు – సభ్యుల సంఖ్య
- 1946 లో కేబినెట్ మిషన్ (Cabinet Mission) సూచనల మేరకు రాజ్యాంగ పరిషత్ ఏర్పాటైంది.
- 1946 జూన్ - జులై మాసాల్లో రాజ్యాంగ పరిషత్‌కు ఎన్నికలు జరిగాయి.
- రాజ్యాంగ పరిషత్‌లో ప్రతి 10 లక్షల జనాభాకు ఒక సభ్యుని చొప్పున ప్రాతినిధ్యం కల్పించారు.
- ఎన్నికలు నైసర్గిక ప్రాతినిధ్య పద్ధతి (Proportional Representation) ఆధారంగా పరోక్ష పద్ధతిలో జరిగాయి. బ్రిటిష్ పాలిత ప్రాంతాల శాసనసభ సభ్యులు వీటిలో ఓటేశారు.
- ముస్లింలు మరియు సిక్కులకు మత ప్రాతిపదికపై ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయించారు. స్వదేశీ సంస్థానాల సభ్యులను ఆయా సంస్థానాధీశులే నామినేట్ చేశారు.
📊 విభజనకు పూర్వం మొత్తం సభ్యులు: 389 | దేశ విభజన తర్వాత మొత్తం సభ్యులు: 299
| వర్గీకరణ (Category) | విభజనకు ముందు (389) | విభజన తర్వాత (299) |
|---|---|---|
| బ్రిటిష్ పాలిత ప్రాంతాలు | 292 | 229 |
| స్వదేశీ సంస్థానాలు | 93 | 70 |
| చీఫ్ కమిషనరేట్ ప్రాంతాలు | 4 | - |
| కాంగ్రెస్ గెలుచుకున్న స్థానాలు | 208 | - |
| ముస్లిం లీగ్ స్థానాలు | 73 | - |
| మహిళా సభ్యుల సంఖ్య | 15 మంది | |
🎯 Exam Point of View - Key Quick Revision Points
- రాజ్యాంగ పరిషత్ భావన తొలిప్రతిపాదన: M.N. రాయ్ (1934).
- సొంత రాజ్యాంగానికి తొలి నిర్మాణాత్మక యత్నం: నెహ్రూ రిపోర్ట్ (1928 - మోతీలాల్ నెహ్రూ).
- క్రిప్స్ రాయబారం (1942): రాజ్యాంగ పరిషత్ ఏర్పాటును సూత్రప్రాయంగా అంగీకరించిన బ్రిటిష్ యత్నం.
- రాజ్యాంగ పరిషత్ ఏ ప్రాతిపదికన ఏర్పాటైంది?: 1946 కేబినెట్ మిషన్ ప్లాన్ (Cabinet Mission).
- ప్రాతినిధ్య ప్రాతిపదిక: ప్రతి 10 లక్షల మంది జనాభాకు 1 స్థానం.
- మహిళల సంఖ్య: రాజ్యాంగ పరిషత్‌కు నియామకమైన/ఎన్నికైన మహిళా సభ్యుల సంఖ్య 15.
- దేశ విభజన ప్రభావం: సభ్యుల సంఖ్య 389 నుండి 229 (బ్రిటిష్) + 70 (సంస్థానాలు) = 299 కు తగ్గింది.
Free Material
Click Here ➔
📚 Indian Polity Hand Written Notes
UPSC, TSPSC, APPSC & All Competitive Exams ప్రిపరేషన్ కోసం పూర్తి నోట్స్.
No comments:
Post a Comment