Constituent Assembly of India (రాజ్యాంగ పరిషత్ నిర్మాణం)

Indian Constituent Assembly Composition and Working Methodology | Indian Polity Notes in Telugu

భారత రాజ్యాంగ పరిషత్: నిర్మాణం మరియు పనివిధానము (Constituent Assembly of India)

భారతదేశం భిన్నత్వానికి నిలయమైనందున రాజ్యాంగ పరిషత్‌లో మనదేశంలోని అన్ని వర్గాలకూ తగిన ప్రాతినిధ్యం కల్పించారు.

రాజ్యాంగ పరిషత్ నిర్మాణం – వర్గాలు & ప్రాతినిధ్యం

↔ పట్టికను పక్కకు స్క్రోల్ చేయండి (Scroll horizontally to view table)
సంఖ్య వర్గం పేర్లు
1. భారత జాతీయ కాంగ్రెస్ నెహ్రూ, పటేల్, రాజేంద్రప్రసాద్, పట్టాభి సీతారామయ్య
2. ముస్లింలు మహ్మద్ సయ్యద్ సాదుల్లా, మౌలానా అబుల్ కలాం ఆజాద్
3. సిక్కులు సర్దార్ బల్దేవ్‌సింగ్, హుకుంసింగ్
4. యూరోపియన్లు ఫ్రాంక్ ఆంటోని
5. పారశీకులు Dr. H.B. మోడీ
6. హిందూమహాసభ Dr. శ్యాం ప్రసాద్ ముఖర్జీ, M.R. జయకర్
7. అఖిలభారత షెడ్యూల్డ్ కులాల సంఘం Dr. B.R. అంబేద్కర్
8. అఖిలభారత మహిళా సంఘం హంసా మెహతా
9. అఖిల భారత జమీందార్ల సంఘం దర్భంగ మహారాజా
10. అఖిల భారత కార్మిక సంఘాలు బాబూ జగ్జీవన్‌రాం
11. అల్పసంఖ్యాక వర్గాలు Dr. H.C. ముఖర్జీ

ముఖ్యమైన విషయాలు & ప్రత్యేకతలు

  • రాజ్యాంగ పరిషత్‌కు జరిగిన ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయినప్పటికీ నియమించబడిన వ్యక్తి — డా॥ శ్యాంప్రసాద్ ముఖర్జీ.
  • దేశ విభజన కారణంగా బెంగాల్ నుండి ఎన్నికైన అంబేద్కర్ తన సభ్యత్వాన్ని కోల్పోగా, వారిని బొంబాయి నుండి ఎంపిక చేయుట జరిగినది.
  • దేశ విభజన కారణంగా రాజ్యాంగ పరిషత్ సభ్యత్వాన్ని కోల్పోయిన ఏకైక కమ్యూనిస్ట్ సభ్యుడు – సోమనాథ్ లహరి.

పనివిధానము (నిర్మాణము & సమావేశాలు)

  • వేవెల్ సూచనలననుసరించి రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశాన్ని 1946 డిసెంబర్ 9న పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో నిర్వహించారు.
  • మొదటి సమావేశానికి తాత్కాలిక అధ్యక్షులు – సచ్చిదానంద సిన్హా.
  • సచ్చిదానంద సిన్హాను అధ్యక్షునిగా ప్రతిపాదించినవారు — J.B. కృపలానీ.
  • ఫ్రాన్స్ దేశ సాంప్రదాయాన్ననుసరించి రాజ్యాంగ పరిషత్‌లో సీనియర్ సభ్యుడైన సచ్చిదానంద సిన్హాను తాత్కాలిక అధ్యక్షునిగా చేశారు.
  • రాజ్యాంగ పరిషత్ తాత్కాలిక ఉపాధ్యక్షులు — ఫ్రాంక్ ఆంటోని.
  • మొదటి సమావేశానికి హాజరైన సభ్యులు – 211 మంది.
  • ముస్లింలీగ్ మరియు స్వదేశీ సంస్థానాల ప్రతినిధులు ఈ మొదటి సమావేశానికి హాజరుకాలేదు.
  • రాజ్యాంగ పరిషత్‌కు సలహాదారుడు — బెనెగల్ నర్సింగరావు (B.N. Rau). వీరు రాజ్యాంగ పరిషత్ సభ్యులు కారు.
  • అంతర్జాతీయ న్యాయస్థానానికి (ICJ) ఎంపికైన మొదటి భారతీయుడు B.N. Rau. భారత రాజ్యాంగ ముసాయిదాను మొదట B.N. Rau రూపొందించారు.
  • రాజ్యాంగ పరిషత్‌కు శాశ్వత అధ్యక్షుడు — డా. బాబూ రాజేంద్రప్రసాద్. (ఈ పేరును సూచించినది — J.B. కృపలాని).
  • రాజ్యాంగ పరిషత్ ఉపాధ్యక్షులు — Dr. H.C. ముఖర్జీ, V.T. కృష్ణమాచారి.
  • రాజ్యాంగ పరిషత్ కార్యదర్శి — H.V.R. అయ్యంగార్.
  • రాజ్యాంగ పరిషత్ ముఖ్య లేఖకుడు (Chief Draftsman) — S.N. ముఖర్జీ.

📌 పోటీ పరీక్షల దృష్ట్యా ముఖ్యమైన అంశాలు (Exam Point of View)

  • తొలి సమావేశం తేదీ: 1946 డిసెంబరు 9 (మొత్తం 211 మంది సభ్యులు హాజరయ్యారు).
  • తాత్కాలిక అధ్యక్షుడు: సచ్చిదానంద సిన్హా (ఫ్రెంచ్ సాంప్రదాయం ప్రకారం J.B. కృపలానీ ఈయన పేరును ప్రతిపాదించారు).
  • శాశ్వత అధ్యక్షుడు: డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్ (1946 డిసెంబరు 11న ఎన్నుకోబడ్డారు).
  • రాజ్యాంగ సలహాదారుడు: B.N. రావు (ఈయన రాజ్యాంగ పరిషత్ సభ్యుడు కాదు; అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయమూర్తిగా పనిచేసిన మొదటి భారతీయుడు).
  • డాక్టర్ B.R. అంబేద్కర్ ఎన్నిక: మొదట తూర్పు బెంగాల్ నుండి ఎన్నికయ్యారు, దేశ విభజన తర్వాత బొంబాయి ప్రెసిడెన్సీ నుండి తిరిగి ఎన్నికయ్యారు.
  • ఉపాధ్యక్షులు: H.C. ముఖర్జీ మరియు V.T. కృష్ణమాచారి.
  • ముఖ్య నియామకాలు: కార్యదర్శి – H.V.R. అయ్యంగార్ | ముఖ్య లేఖకుడు (Chief Draftsman) – S.N. ముఖర్జీ.
  • కమ్యూనిస్టు సభ్యుడు: దేశ విభజన కారణంగా రాజ్యాంగ పరిషత్ సభ్యత్వాన్ని కోల్పోయిన ఏకైక కమ్యూనిస్ట్ సభ్యుడు సోమనాథ్ లహరి.
Free Material

📚 Indian Polity Hand Written Notes

UPSC, TSPSC, APPSC & All Competitive Exams ప్రిపరేషన్ కోసం పూర్తి నోట్స్.

Click Here ➔

No comments:

Post a Comment