జాతీయాదాయం - నిర్వచనాలు - నిర్ణయించే అంశాలు - భాగాలు
- అధునిక అర్థశాస్త్రంలో /స్ఫూల అర్థశాస్త్రంలో జాతీయాదాయం అనే భావనకు అధిక ప్రాధాన్యం ఉంది.
- ఒకదేశ అర్థికాభివృద్ధి-జీవన ప్రమాణస్థాయి జాతీయాదాయంపై ఆధారపడి ఉంటాయి.
- ఒక సంస్థ/ పరిశ్రమ పనిచేసే తీరును తెలుసుకోవడానికి ఆదాయ వ్యయాలను రాయడం ఎంత అవసరమో అదేవిధంగా ఒక దేశ అర్థికవ్యవస్థకు జాతీయాదాయం అంతే అవసరం. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల పనితీరు/మొత్తం అర్థికవ్యవస్థ పనితీరుతెలుసుకోవడానికి జాతీయాదాయం కొలమానంగా పనిచేస్తుంది.
- మానవజాతి అర్థిక సంక్షేమాన్ని కొలిచే ముఖ్య సాధనం జాతీయాదాయం.
జాతీయాదాయం నిర్వచనాలు (Definition of National Income)
సాధారణ నిర్వచనం
- ఒక సంవత్సర కాలంలో ఒకదేశంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తుసేవల విలువల మొత్తాన్ని జాతీయాదాయం అంటారు.
- సంప్రదాయ నిర్వననాలు
- ఒక దేశంలోని శ్రమ, మూలధనం, సహజ వనరుల సహాయంతో ప్రతి సంవత్సరం ఉత్పత్తి చేసిన భౌతిక, అభౌతిక వస్తు సేవలతో కూడిన నికర వస్తుసేవల మొత్తమే జాతీయాదాయం - ఆల్ఫ్రైడ్ మార్షల్
- వినియోగదారులు, భౌతిక, మానవ వనరుల నుంచి పొందే వస్తుసేవల సముదాయమే జాతీయాదాయం' - ఫిషర్
- విదేశాల నుంచి వచ్చే ఆదాయంతో సహా, ద్రవ్యరూపంలో లెక్కించడానికి వీలైన దేశంలోని ఆదాయ మొత్తమే జాతీయాదాయం'- అచార్య పీగూ
అధునిక నిర్వచనాలు (Modern Definitions)
- దేశంలోని వ్యక్తులు, వ్యాపార సంస్థలు, సామాజిక, రాజకీయ సంస్థలు అర్థిక వ్యాపారాలకు ప్రతిఫలంగా పొందే నికర ఆదాయ సముదాయమే జాతీయాదాయం- కుజునెట్
- ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో ప్రవహించే వస్తుసేవల ద్రవ్య విలువనే జాతీయాదాయం - ఆచార్య శామ్యూల్ సన్.
- ఒక సంవత్సర కాలంలో వేతనాలు, బాటకం, వడ్డీ లాభాల రూపంలో “ఒకదేశ జాతీయులు సృష్టించే ఉత్పత్తి కారకాల ఆదాయమే జాతీయాదాయం' - కేంద్ర గణాంక సంస్థ (CSO).
- “ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన వస్తు సేవల 'విలువల మొత్తమే జాతీయా దాయం' - ఐక్యరాజ్యసమితి(UNO).
- ఒక నిర్ణీత కాలంలో ఒకే వస్తువును రెండుసార్లు లెక్క కట్టకుండా జాగ్రత్తపడుతూ తయారైన అన్ని వస్తుసేవల విలువలను అంచనా వేస్తే అది జాతీయాదాయం” - (NIEC) భారత జాతీయాదాయ అంచనాల కమిటీ
- జాతీయ ఉత్పత్తి = అంతిమ వస్తుసేవల విలువ = బాటకం + వేతనం + వడ్డీ + లాభం - జె.ఎం. కీన్స్
జాతీయాదాయం నిర్ణయించే అంశాలు
- ఒక దేశ జాతీయాదాయ పరిమాణం ఎల్లప్పుడు ఒకే విధంగా ఉండదు. ఎందుకంటే జాతీయాదాయ పరిమాణం అనేక అంశాలతో ప్రభావితమై ఉంటుంది.
- జాతీయాదాయ అంశాల కారణంగానే వివిధ దేశాలలో జాతీయాదాయ స్థాయిలో వ్యత్యాసాలు కనిపిస్తాయి.
- అభివృద్ధి చెందిన దేశాల్లో జాతీయాదాయం హెచ్చుగా ఉంటుంది.
- ఉదా: అమెరికా, బ్రిటన్
- అభివృద్ధి చెందుతున్న దేశాల్లో జాతీయాదాయం తక్కువగా ఉంటుంది.
- ఉదా: భారత్, పాకిస్థాన్
- జాతీయాదాయాన్ని ప్రభావితం చేసే ముఖ్యమైన అంశాలు సహజ వనరులు: సారవంతమైన భూమి,
- సహజవనరులు, శీతోష్టస్థితి, ఖనిజ సంపద, ఇంధన వనరులు మొదలైనవి జాతీయాదాయ పరిమాణాన్ని నిర్ణయిస్తాయి. ఇవి అధికంగా ఉంటే ఉత్పత్తి పెరిగి అదాయం పెరుగుతుంది.
- ఉత్పత్తి కారకాల లభ్యత నాణ్యత: ఉత్పత్తి
- ఒక దేశంలో అధిక సామర్ధ్యంగల శ్రామికుల లభ్యత, మూలధన పెరుగుదల రేటు సమర్థవంతమైన వ్యవస్థాపకుల లభ్యతపైన జాతీయాదాయం అధారపడి ఉంటుంది.
- సాంకేతిక పరిజ్ఞానం: ఒక దేశంలో జాతీయాదాయ పరిమాణం సాంకేతిక విజ్ఞాన ప్రగతిపై ఆధారపడి ఉంటుంది.
- రాజకీయ నిర్ణయాలు స్థిరత్వం: ఒక దేశ అర్థికాభివృద్ధికి జాతీయాదాయ వృద్ధిరేటు పెరుగుదలకు రాజకీయ నిర్ణయాలు, స్థిరత్వం దోహదం చేస్తాయి.
- పై అంశాలే కాకుండా ప్రభుత్వ విధానాలు, ఎగుమతి, దిగుమతి విధానాలు, మానవవనరుల అభివృద్ధి, పరిశోధనలపై పెట్టుబడులు మొదలైన అంశాలు కూడా జాతీయాదాయాన్ని నిర్ణయిస్తాయి.
జాతీయాదాయం - భాగాలు (Compound of National Income)
దేశ జాతీయాదాయంలో ముఖ్యంగా 5 భాగాలున్నాయి. అవి
1. వినియోగం (C) (Consumption): మానవుని కోరికలను ప్రత్యక్షంగా తీర్చే వస్తుసేవలపై చేసే ఖర్చును వినియోగం అంటారు. వినియోగ వ్యయం వ్యక్తుల ఆదాయ స్థాయిలపై ఆధారపడుతుంది.
2: పెట్టుడి (I) (Investment): గ వస్తుసేవలను ఉత్పత్తీ చేయడానికి ఉత్పాదక లేదా మూలధన వస్తువులపై చేసే పెట్టుబడి అంటారు. ఇవి మానవుల కోరికలను పరోక్షంగా సంతృప్తి పరుస్తాయి.
ఉదా: యంత్రాలు, యంత్రపరికరాలు
3. ప్రభుత్వ వ్యయం(G) (Government Expenditure): ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం అనేక వస్తు సేవలపై ఖర్చు చేస్తుంది. దీనిని ప్రభుత్వ వ్యయం అంటారు.
ఉదా: అవస్తాపసన సౌకర్యాలు, విద్య, వైద్యం, రక్షణ, సామాజిక సేవలు మొదలైనవి.
4. నికర విదేశీ పెట్టుబడి (X-M) (Net Foreign Income): ప్రతి దేశం అంతర్జాతీయ వ్యాపారంలో పాల్గొని కొన్ని వస్తువులను ఎగుమతి చేసి తమకు కావలసిన మరికొన్ని వస్తువులను దిగుమతి చేసుకుంటుంది. ఈ విదేశీ వ్యాపారం వల్ల కలిగిన మిగులును జాతీయాదాయంలో కలపాలి. లోటును చెల్లించాలి. ఈ తేడాను నికర ఎగుమతులు అంటారు.
అంటే ఎగుమతి విలువ(X) నుంచి దిగుమతి విలువను(M) తీసివేస్తే మిగిలినది “నికర ఎగుమతులు” అవుతుంది.
5. నికర విదేశీ ఆదాయం (1/66 1200006 హం25090260): ఒక దేశ ప్రజలు ఇతర దేశాల్లో సంపాదించి స్వదేశానికి పంపిన ఆదాయం నుంచి విదేశీయులు తమ దేశానికి పంపిన ఆదాయాలను తీసివేయగా వచ్చేది నికర విదేశీ ఆదాయం అంటారు.
Y = C+I+G+(X-M)+ Net Income From Abroad
Economy concepts pls upload
ReplyDelete