ప్రాంతీయ రాజ్యాల ఆవిర్భావం-కాకతీయులు
క్రీ.శ. 1000 నుంచి 1350 మధ్యకాలంలో వరంగల్లు (ఓరుగల్లు) కేంద్రంగా కాకతీయులు రాజ్యపాలన చేశారు.
ఇదే కాలంలో మొదటి తెలుగు పద్యకావ్యంగా శ్రీమదాంధ్ర మహాభారతాన్ని కవిత్రయం నన్నయ, తిక్కన, ఎర్రాప్రగడ రాశారు.
కాకతీయ రాజుల చరిత్రకు బయ్యారం, వేయిస్తంభాల గుడి, నాగులపాడు, పాలంపేట, కొండపర్తి శాసనాలతోపాటు, సాహిత్యారాలైన ప్రతాపరుద్ర యశోభూషణం, క్రీడాభిరామం, ప్రతాపచరిత్ర ముఖ్యమైనవి.
కాకతీయ వంశ మూల పురుషుడు దుర్జయ. వీరి వంశంలో ముఖ్యులు రెండో ప్రోలరాజు, రుద్రదేవుడు, గణపతి దేవుడు, రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు.
వీరు మొదట రాష్ట్రకూటులు, చాళుక్యుల సామంతులుగా గ్రామపెద్ద (రట్టడి) నుంచి రాజకీయ ప్రస్థానం చేసి స్వతంత్రులుగా ఎదిగారు.
1158 నుంచి 1195 వరకు జరిగిన రుద్రదేవుని పాలనాకాలంలో మొదట అనుమకొండ రాజధానిగా పాలించాడు. అనంతరం రాజధానిని ఓరుగల్లుకు మార్చాడు. అనుమకొండలో వేయిస్తంభాల దేవాలయాన్ని నిర్మించాడు.
ఓరుగల్లు కోట బయట మట్టి ప్రాకారం, కందకం, లోపల మట్టి ప్రాకారం, ఆ తర్వాత రాతిగోడ (కంచుకోట) నిర్మించారు. కోట మధ్యలో రాజధాని, నగర భవనాలు, నాలుగు వైపులా ద్వారాలు ఉండేవి. కోట మధ్యలో స్వయంభూ శివాలయాన్నినాలుగువైపులా కీర్తి తోరణాలను నిర్మించారు.
రుద్రదేవుడి అనంతరం అతని సోదరుడు మహదేవుని కుమారుడైన గణపతిదేవుడు 1199లో పట్టాభిషిక్తుడైనాడు. ఆయన 1262 వరకు రాజ్యపాలన చేసి విశాల సామ్రాజ్యాన్ని విస్తరించాడు.
రుద్రమదేవి 1262 నుంచి 1289 మధ్య కాలంలో సామంతుల తిరుగుబాట్లను విశ్వాసపాత్రులైన సామంతుల సాయంతో అణిచివేసింది. ఆమెను రుద్రదేవ మహారాజుగా శాసనాల్లో కీర్తించారు. రుద్రమదేవి పాలనా కాలంలో ఇటాలియన్ యాత్రికుడైన మార్కో పోలో మోటుపల్లిని సందర్శించి ప్రశంసించాడు.
రుద్రమ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సైనిక వ్యవస్థను పునరుద్ధరించి నాయంకర వ్యవస్థను ఎర్పాటు చేసింది.
సామంత పాలకుడైన కాయస్థ అంబదేవుడు తిరుగుబాటు చేయగా నల్లగొండ జిల్లాలోని చందుపట్ల యుద్ధంలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
కాకతీయులు వ్యవసాయాభివృద్ధికి అనేక చెరువులను తవ్వించడమేగాక దేవాలయాల నిర్మాణానికి భూములను దానాలు చేశారు. రాజులైన ముప్పమాంబ, మైలమ వంటి వారు భారీగా విరాళాలు అందించారు.
రాజ్యానికి ప్రధాన ఆదాయ వనరులైన విదేశీ వాజీజ్యం, వర్తకుల ఓడరేవు సుంకాలు అధికంగా ఉండటంతో వర్తకులకు రక్షణ కల్పిస్తూ గణపతి దేవుడు మోటుపల్లి అభయ శాసనం వేయించారు.
1190లో తురుష్కులు టర్కీస్థాన్ నుంచి వచ్చి, ఢిల్లీ కేంద్రంగా రాజ్యస్థాపన చేసి, ఉత్తర భారతదేశంలోని అనేక రాజ్యాలపై అధిపత్యం సాధించారు. మహ్మద్‌బీన్ తుగ్లక్ దక్కన్‌పై దండయాత్ర. చేసి, కాకతీయ రాజ్యంపై దండెత్తి ప్రతాపరుద్రున్ని ఓడించడంతో 1328లో కాకతీయ వంశ పాలన ముగిసింది.