జైన & బౌద్ధ మతాలు - గ్రాండ్ ప్రాక్టీస్ టెస్ట్ (SET 3)
Advanced Standard MCQs
⚡ Quick Revision Summary (Set 3: ప్రశ్నల ముఖ్యాంశాలు)
| Q.No | ప్రధానాంశం (Topic) | పరీక్షా దృక్కోణం / ముఖ్య సమాధానం |
|---|---|---|
| 1-2 | బుద్ధుని భార్య & కుమారుడు | భార్య: యశోధర (బింబా/గోప); కుమారుడు: రాహులుడు ('బంధనం') |
| 3 | బుద్ధుని వంశం & రాజ్యం | శాక్య క్షత్రియ వంశం, కపిలవస్తు (క్రీ.పూ. 567/563) |
| 4 | మహాభినిష్క్రమణ ప్రతీక | గుర్రం (కంథక గుర్రంపై గృహత్యాగం) |
| 5 | నాలుగు దృశ్యాలు | వృద్ధుడు → రోగగ్రస్తుడు → శవము → ప్రశాంత సన్యాసి |
| 6 | సాధన & జ్ఞానోదయ కాలం | గృహత్యాగం: 29వ ఏట, జ్ఞానోదయం: 35వ ఏట (6 ఏళ్ళ సాధన) |
| 7 | సంబోధి (జ్ఞానోదయం) | గయ, నిరంజనా నది ఒడ్డున, బోధి వృక్షం (రావి చెట్టు) కింద |
| 8 | ధర్మచక్ర ప్రవర్తనము | సారనాథ్ (మృగదావనం) లో ఐదుగురు శిష్యులకు ప్రథమ బోధన |
| 9 | త్రిపీఠకములు | వినయ (క్రమశిక్షణ), సుత్త (ఉపదేశాలు), అభిధమ్మ (తత్వశాస్త్రం) |
| 10 | పాశ్చాత్యుల వర్ణన | ఆసియా జ్యోతి (ఎడ్విన్ అర్నాల్డ్); ప్రపంచ జ్యోతి (శ్రీమతి రైస్ డేవిడ్స్) |
| 11 | మహా పరినిర్వాణం | 80వ ఏట కుశీనగరంలో నిర్యాణం; 45 ఏళ్ళ పాటు ధర్మబోధ |
| 12 | రథసారధి చెన్నడు | అనోమా నది వరకు బుద్ధుని వెంట వెళ్ళిన రథసారధి |
| 13-14 | సంగీతులు & మధ్యమ మార్గం | బౌద్ధ మహాసభలను సంగీతులు అంటారు; మధ్యేమార్గమే బౌద్ధం |
| 15 | చతురార్య సత్యాలు | దుఃఖం → దుఃఖ సముదయం → దుఃఖ నిరోధం → అష్టాంగ మార్గం |
| 16-17 | అష్టాంగ మార్గం (త్రిశిక్షలు) | ఎనిమిది సూత్రాలు; ప్రజ్ఞ, శీల, సమాధి గా విభజన |
| 18-19 | ఆనందుడు & ఉపాలి | సుత్త పీఠిక (ఆనందుడు), వినయ పీఠిక (ఉపాలి) - పాలి భాష |
| 20-22 | 1వ బౌద్ధ సంగీతి (క్రీ.పూ. 483) | రాజగృహం (సప్తపర్ణి గుహ); రాజు: అజాతశత్రువు; అధ్యక్షుడు: మహాకాశ్యపుడు |
| 23 | నాలుగు బౌద్ధ సంగీతుల పాలకులు | 1. అజాతశత్రువు, 2. కాలాశోకుడు, 3. అశోకుడు, 4. కనిష్కుడు |
| 24-25 | బౌద్ధ తాత్విక సిద్ధాంతాలు | ప్రతీత్యసముత్పాదం (కార్యకారణవాదం), అనాత్మవాదం, క్షణికవాదం |
No comments:
Post a Comment