ఇక్ష్వాకులు 2(Ikshvaka Dynsty)

TSStudies
ఇక్ష్వాకులకు సంబంధించి కొన్ని ముఖ్యమైన సమాచారం 
  • ఫర్నికశ్రేణి  అనే ప్రత్యేకమైన వ్యాపారాలు, తమలపాకుల వ్యాపారం గురుంచి 'విశపట్టి శాసనం' లో కలవు 
  • దక్షిణభారత దేశంలో తోలి సంస్కృత శాసనం -- ఎలిసిరి శాసనం 
  • వీరపురుషదత్తుడు నాగార్జునకొండలో పుష్ప భద్ర, నవగ్రహ ఆలయాలు నిర్మించాడు 
  • వీరు అమరావతిలో నందికేశ్వరాలయంను నిర్మించారు 
  • హరిత దేవాలయం చిన్న పిల్లల ఆరాధ్య దైవం  
  • సప్తమాత్రిక దేవాలయం (నాగార్జునకొండలో) -- సంతానం లేని వారు ఇక్కడ పూజలు చేస్తారు 
  • వీరు శిల్పకళకు లేత ఆకు పచ్చ రాయిని ఉపయోగించారు 
  • వీరికాలంలో నివసించిన బౌద్ధ మత ఆచార్యుడు -- భావవివేకుడు 
  • బుద్ధిని కిరీటం లేని రాజుగా, దేవుడిగా చెక్కిన అద్భుత శిల్పం 'జగ్గయ్యపేట' లో కలదు 
  • దక్షిణాపథ్ సామ్రాట్ బిరుదు శ్రీ శాంతమూలుడు కి కలదు 
  • నాగార్జునకొండ శాసనంలో ఇక్ష్వాకులు బుద్దిని వంశీయులమని, లుంబిని ప్రాంతానికి చెందినవారిమని పేర్కొన్నారు 
  • దక్షిణ భారతదేశంలో అతి పెద్ద బౌద్ధ స్థూపం -- నేలకొండపల్లి 
  • ఉపాశిక బోధిశ్రీ 7 విహారాలను 'పాపిల' ప్రాంతంలో నిర్మించారు 
  • దక్షిణ భారతదేశంలో తొలి దేవాలయం -- అష్టభుజ స్వామి  దేవాలయం(ఎహువల శాంతమూలుడు కాలంలో శకసేనుడు నిర్మించాడు) , ఇది తొలి వైష్ణాలయం కూడా. 
  • ఆనందుడు ఒక గొప్ప సేనాపతి 
  • విజయపురి పట్టణాన్ని 'విజయశ్రీ శాతకర్ణి' నిర్మించాడు 
  • శాంతమూలుడు శక, అజీర, యవన, గర్బరీ జాతులను జయించి రాజ్యాన్ని నిర్మించాడు 
  • రెంటాల, దాచేపల్లి శాసనాలు ప్రాకృత భాషలో కలవు 
  • వీర పురుషదత్తుడు పర్నిక అనే వర్తక శ్రేణులను నియమించి విదేశీ వ్యాపారం కోసం కృషి చేసాడు 
  • పల్లవ రాజు సింహవర్మ వేయించిన శాసనం -- మంచికల్లు శాసనం 
  • ప్రధాన న్యాయాధికారిని 'మహాతలవరి ' అనేవారు 
  • ఈ కాలంలో 'సతీసహగమనం' అమలులో ఉన్నది 
  • ఏలేశ్వరాలయాన్ని నిర్మించింది -- ఎలిసిరి (ఇతను వీరపురుషదత్తుని అధికారి)