ఆదిహిందూ ఉద్యమం-Role of Aadi Hindu Udyamam in Nizam's State
తెలంగాణలో జరిగిన దళిత ఉద్యమాలను ఆదిహిందూ ఉద్యమాలు అంటారు
ఆదిహిందూ ఉద్యమం చేపట్టిన వారు - భాగ్యరెడ్డివర్మ. ఇతని అసలు పేరు మాదిరి భాగయ్య
భారతదేశంలో తామే మూలవాసులమని, ఆ మూలవాసులే రేడులు అంటే రెడ్లు అని తన పేరుకు రెడ్డి అనే పదాన్ని
చేర్చుకున్నాడు
ఇతను తెలంగాణ మరియు ఆంధ్రా ప్రాంతాలను కలుపుకొని దళిత ఉద్యమాన్ని చేపట్టాడు
1906లో జగన్మిత మండలిని హైదరాబాద్‌లో స్థాపించడంతో తెలంగాణ మరియు ఆంధ్ర ప్రాంతంలో దళిత ఉద్యమాలు
ప్రారంభమయ్యాయి. జగన్మిత మండలి ద్వారా నాటకాలు, బుర్రకథలు, భజనలు నిర్వహించి ప్రజలను చైతన్యవంతులను చేయుటకు ప్రయత్నించాడు.
1906లోనే భాగ్యరెడ్డివర్మ నాయకత్వంలో ఒక వాలంటీర్ దళం హైదరాబాద్‌లో పనిచేయడం ప్రారంభించింది. దీని
ముఖ్య ఉద్దేశం - అస్పృశ్యతా నివారణ
జగన్మిత మండలి కార్యక్రమాల్లో భాగంగా 1910లో ఇస్లావియా బజార్‌లో, లింగంపల్లి లో ప్రాథమిక పాఠశాలలను స్థాపించాడు.
మొత్తంగా జంట నగరాల్లో 26 ఆది హిందూ పాఠశాలలు స్థాపించాడు
1911లో మన్య సంఘంను స్థాపించి క్రింది అంశాలను వ్యాప్తి చేశాడు. ఇదే తర్వాత కాలంలో ఆదిహిందూ సోషల్ సర్వీస్‌లీగ్‌గా ప్రసిద్ధి చెందింది
1. విద్యావ్యాప్తి
2. బాల్య వివాహాల రద్దు
3. జోగినీ వ్యవస్థ రద్ద
4 మత్తుపానీయాల నిషేధం
5. శుభకార్యాలలో మాంసాహారాన్ని భుజించకూడదు
మన్య సంఘం కార్యవర్గం:
అధ్యక్షుడు: వల్తాటి శేషయ్య
ఉపాధ్యక్షుడు: హెచ్.ఎస్. వెంకట్రావ్
కార్యదర్శి: జె .యస్.ముత్తయ్య
కార్యనిర్వాహక కార్యదర్శి: భాగ్యరెడ్డివర్మ
*భాగ్యరెడ్డివర్మ దేవదాసీ వ్యవస్థను నిషేధించడానికి దేవదాసీ నిర్మూలన _సంఘం స్థాపించాడు
1912లో భాగ్యరెడ్డివర్మ స్వస్తిక్‌దళ్ అనే స్వచ్చంద సంస్థను ఏర్పాటు చేశాడు.
దీని అధ్యక్షులు - బందెల చిత్తరంజన్
1918లో బాలాజీ కృష్ణారావు (ఇతని గురువు) భాగ్యరెడ్డికి వర్మ అనే బిరుదునిచ్చి ఆర్య సమాజ్ దీక్షను ఇచ్చాడు
1915లో సంఘ సంస్కార నాటక మండలి మరియు బౌద్ధమతం యొక్క ప్రభావంతో జీవరక్షా ప్రచారక మండలిని
ఏర్పాటు చేశాడు.
1917 నవంబర్ 4, 5 తేదీల్లో గూడూరు రామచంద్రరావుబెజవాడలోని మైలవరం రాజయ్య నాటక మందిరంలో మొదటి ప్రాదేశిక పంచమ సదస్సును నిర్వహించాడు.
భాగ్యరెడ్డివర్మ ఈ సదస్సుకు అధ్యక్షత వహించాడు
పంచములు లేదా దళితులు భారతదేశం యొక్క మూల వారసులని ఇక నుండి వారిని ఆది ఆంధ్రులు లేదా ఆది హిందువులుగా పిలవాలని భాగ్యరెడ్డివర్మ ఈ సదస్సులో పేర్కొన్నాడు
భాగ్యరెడ్డివర్మ సూచన మేరకు పంచమ సదస్సు ఆది ఆంధ్రుల సదస్సుగా మారింది
*అప్పటి నుండి కోస్తా ఆంధ్రాలో దళిత ఉద్యమాలు ఆది ఆంధ్రా ఉద్యమాలుగా, తెలంగాణలో జరిగిన ఉద్యమాలు ఆది
హిందూ ఉద్యమాలుగా పిలవబద్దాయి.
1917లో భాగ్యరెడ్డివర్మ అధ్యక్షతన అఖిల భారత ఆదిహిందూ సభ సమావేశం హైదరాబాద్‌లోని ప్రేమ్ థియేటర్‌లో జరిగింది
ఈ సమావేశంలోనే అంటరానివారిని ఆది హిందువులు అని గౌరవంగా పిలవాలని నిజాం ప్రభుత్వం చేత చట్టం చేయించాడు.
1912లో అహింసా సమాజంను స్థాపించాడు
1918 డిసెంబర్ 31న జె.ఎస్.ముత్తయ్య సంపాదకుడిగా 'ది పంచమ' అనే ఆంగ్ల మాసపత్రిక ప్రారంభమైంది
1919లో భాగ్యరెడ్డివర్మ మచిలీపట్నంలో 2వ ఆది ఆంధ్ర సదస్సును నిర్వహించి దళిత విద్యావ్యాప్తి కొరకు తక్షణ చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చాడు
1922 మార్చి 29-31 తేదీల్లో అఖిల భారత ఆదిహిందూ సోషల్ కాన్ఫరెన్స్ సభ దళిత భీమ్మడిగా పేరొందిన ఎం.యల్.ఆదయ్య ఆధ్వర్యంలో జరిగింది.
ఆదిపాందూ సోషల్‌లీగ్ నికింద్రాబాద్ శాఖకు ఎం.యల్. ఆదయ్య ఎన్నికయ్యారు
ఎం.యల్. ఆదయ్య అధ్యక్షతన ఆదిహిందూ మహాసభ ఏర్పడింది
*హైదరాబాద్ అంబేద్కర్ గా బి.యస్. వెంకట్రావును పేర్కొంటారు
1922లో బి.యస్. వెంకట్రావు ఆది ద్రావిడ సంఘం స్థాపించాడు
1922లో భాగ్యరెడ్డివర్మ ఆదిహిందూ సాంఘిక సేవాసమితి అనే ట్రస్టును ఏర్పాటు చేశాడు
1925లో హైదరాబాద్‌లో కలరా, ప్లేగు వ్యాధులు సంభవించినపుడు భాగ్యరెడ్డివర్మ స్వచ్ళంద ఆరోగ్య సేవాదళం ఏర్పాటు చేసి ఈ వ్యాధుల నిర్మూలనలో కీలక పాత్ర పోషించాడు.
అప్పుడే భాగ్యారెడ్డివర్మ హైదరాబాద్ ప్రజల మన్నన పొందాడు.
1925లో రాజా ప్రతాప్ గిర్‌జీ హైదరాబాద్‌లో హిందూ ధర్మ పరిషత్ అనే మత సదస్సు నిర్వహించాడు
ఈ సదస్సులో భాగ్యరెడ్డివర్మ యొక్క ప్రసంగం అగ్రవర్ణాల వారి హృదయాలను కదల్చివేసింది
1925లో ఆది హిందువులు రూపొందించిన శిల్పాలను, ఇతర కళా ఖండాలను హైదరాబాద్‌లోని రెసిడెన్సీ బజార్‌లో ప్రదర్శించాడు
దీని ద్వారా ఆదిహిందువుల నైపుణ్యతను ప్రపంచం మొత్తానికీ తెలియజేయాలనుకొన్నాడు
1925లో సుబేదార్ సాయన్న అధ్యక్షతన భాగ్యరెడ్డివర్మ ఆదిహిందూ బస్తీలలో సభలు నిర్వహించి వారిని చైతన్య పరిచాడు.