బహమనీ వంశం:
హసన్ గంగూ / అబ్బుల్ ముజాఫర్ అల్లావుద్దీన్ బహమన్‌షా 1347లో గుల్బర్గా రాజధానిగా బహమనీ వంశంను స్థాపించాడు.
బహమనీ రాజ్యంలో 4 ప్రాంతాలు ఉండేవి.
1) గుల్బర్గా
2) దౌలతాబాద్
3) బీరార్
4) బీదర్
మొహమ్మద్‌షా-1 ఎనిమిది మందితో ఒక మంత్రి మండలిని ఏర్పాటు చేశాడు. దీనిలో పీష్వా పదవి ఉండేది.
బహమనీ వంశంలో గొప్పవాడు ఫిరోజ్ షా బహమనీ (ఖగోళశాస్త్రంను ప్రోత్సహించింది) .
ఖగోళ పరిశోధనకై దౌలతాబాద్‌లో పరిశోధనా కేంద్రం ఏర్పరిచాడు.
ఇతని కాలంలో ప్రధాన ఓడరేవు -చౌల్, దాబోల్
ఇతని ఆన్టానంలో సూఫీ సన్యాసి గేసు దరాజ్ ఉండేవాడు.
ఇతను భీమా నది ఒద్దున ఫిరోజాబాద్ అనే పట్టణం నిర్మించాడు.
1వ దేవరాయలను ముద్గళ్ యుద్ధంలో ఓడించి అతని కుమార్తెను వివాహమాడాడు. బంకపూర్‌ను కట్నంగా పొందాడు.
ఫిరోజ్ షా అనంతరం అహ్మద్ షా పాలకుడు అయ్యాడు. ఇతను బహమనీ రాజధానిని గుల్బర్గా నుండి బీదర్‌కు మార్చాడు.
మొహమ్మద్ షా-1 నిర్మించిన షాబజార్ మసీద్, జామా మసీద్ ప్రసిద్ధి చెందినవి. బీదర్‌లోని గవాన్ కళాశాల పర్షియా శైలికి చెందినది.
బహమనీ పాలకుడు హుమయూన్‌ను జాలిమ్ (కఠినమైన వాడు) అంటారు.
హుమయూన్ మహ్మద్ గవాన్‌కు మాలిక్-ఇ-తుజరైర్ (వర్తకుల రారాజు) అని బిరుదు ఇచ్చాడు.
గవాన్ 3వ మహ్మద్ యొక్క ప్రధాన మంత్రి.
ఇతను బహమనీ ప్రధాన మంత్రులలో అతి గొప్పవాడు.
కొన్ని కుటల కారణంగా ఇతను ఉరి తీయబడ్డాడు. (1482)
ఇతని మరణానంతరం బహమనీ రాజ్యం అనేక చిన్న చిన్న రాజ్యాలుగా చీలింది.
బహమనీల చివరి పాలకుడిగా కలీముల్లాను పేర్కొంటారు.
బీరార్:
1484లో ఏర్పడింది
స్థాపకుడు - ఫతే ఉల్లా ఇమాద్ షా
వంశం - ఇమాద్ షాహీ
అక్బర్ దీనిని ఆక్రమించాడు
అహ్మద్‌నగర్:
1489లో ఏర్పడింది
స్థాపకుడు - మాలిక్ అహ్మద్
వంశం - నిజాం షాహీ
చాంద్‌బీబీ ఈ వంశానికి చెందినది.
ఈమె ప్రధాన మంత్రి మాలిక్ అంబర్. మాలిక్ అంబర్ భారతదేశంలో గెరిల్లా యుధ్ధం ప్రవేశపెట్టాడు.
1633లో షాజహాన్ అహ్మద్‌నగర్‌ను మొగల్ సామ్రాజ్యంలో విలీనం చేశాడు.
బీజాపూర్ :
స్థాపకుడు - యూసఫ్ అదిల్ షా
వంశం - అదిల్ షాహీ
గొప్పవాడు - ఇబ్రహీం అదిల్ షా
ఇతని బిరుదులు- అబ్లాబాబా (రైతుల/పేదల స్నేహితుడు), జగత్‌గురు
ఇతను నారస్‌పూర్ పట్టణాన్ని నిర్మించాడు
ఇతను కితాబ్-ఇ-నారజ్ అనే పుస్తకాన్ని రచించాడు.
ప్రపంచం రెండో అతిపెద్ద గుమ్మటం (రోమ్‌లోని సెయింట్‌పాల్ చర్చి ప్రపంచంలోని అతిపెద్ద గుమ్మటం) గల గోల్ గుంభజ్‌ను ఆదిత్‌షాహీ పాలకులలో ఒకడైన మహమ్మద్ ఆదిల్‌షా బీజాపూర్‌లో నిర్మించాడు. ఇది “విస్ఫరింగ్ గాలరీ"కి కూడా ప్రసిద్ధి చెందింది.
1686లో బెరంగజేబు బీజాపూర్‌ను ఆక్రమించాడు.
గోల్కొండ(1512):
స్థాపకుడు - సుల్తాన్ కులీకుతుబ్ షా
వంశం - కుతుబ్ షాహీ
గొప్పవాడు -మొహమ్మద్ కులీకుతుబ్‌షా
మొహమ్మద్ కులీకుతుబ్‌షా 1591లో హైదరాబాద్‌ను, 1594లో చార్మినార్‌ను నిర్మించాడు.
చివరి పాలకుడైన హసన్ తానీషా కాలంలో కంచర్ల (భక్త రామదాసు), అక్కన్న మాదన్నలు ఉండేవారు.
1687లో ఔరంగజేబు హసన్ తానీషాను ఓడించి గోల్కొండను ఆక్రమించాడు.
బీదర్(1526):
స్థాపకుడు - అమీర్ అలీ బదీద్ (దక్కన్ నక్క)
వంశం - బరీద్ షాహీ
ఇది తర్వాత కాలంలో బీజాపూర్‌లో విలీనం అయింది.