Indian Independence Movement-7

TSStudies
విప్లవాత్మక తీవ్రవాదులు (1897-1931):
లక్ష్యం:
వివ్లవాత్మక తీవ్రవాదుల యొక్క ఏకైక లక్ష్యం ఆంగ్లేయులను భారతదేశం నుంచి తరిమివేయుట.
పద్దతులు:
విదేశాల సహాయంతో ఆంగ్లేయులను తరిమివేయుటకు ప్రయత్నించుట
తప్పు చేసిన ఆంగ్లేయులను దండించుట/ శిక్షించుట
రష్యా యొక్క నిహిలిస్ట్‌ (సైనికదళం), ఐర్లాండ్‌ యొక్క సిన్‌ఫెన్‌ (సైనికదళం) సైనికుల్లా బ్రిటీష్‌ వారికి వ్యతిరేకంగా పోరాటం చేయుట.
రహస్య సంస్థలను ఏర్పాటు చేయుట
పత్రికలు స్థాపించుట (భవానీ మందిర్‌, వర్తమాన రణనీతి, కోల్‌ యుగాంతర్‌ మొ|| )
పుస్తకాలు
కాళీమాత ఎదుట ప్రతిజ్ఞ చేయుట
విప్లవాత్మక తీవ్రవాదాన్ని భారతదేశంలో 2 దశలుగా వర్గీకరించవచ్చు. అవి
1) 1897-1919
2) 1919-1931

మొదటి దశ (1897-1919) :
1897:
చాపేకర్‌ సోదరులు(బాలకృష్ణ, దామోదర్‌) ప్లేగ్‌ కమిషన్‌ చైర్మన్‌ రాండ్‌, అతని అంగరక్షకుడు లెప్టినెంట్‌ ఐరెస్ట్‌ను హత్య చేశారు. (చాపేకర్‌ సోదరులు 1893లో హిందూ ధర్మ సంరక్షిణి సభను ఏర్పాటు చేశారు)
1907:
కొంతమంది విప్లవాత్మక తీవ్రవాదులు బెంగాల్‌ గవర్నర్‌ను హత్య చేయుటకు ప్రయత్నించారు. కానీ విపలమైనారు (ట్రైయిన్‌లో బాంబ్‌ పేల్చుట ద్వారా)
1908:
ప్రపుల్లాచాకీ, కుడీరామ్‌ బోస్‌ (15 సం॥ల వయస్సు) ముజాఫరాపూర్‌
జడ్జి కింగ్స్‌ ఫోర్ట్‌ను హత్య చేయుటకు ప్రయత్నించారు. కానీ ఇద్దరు మహిళలు మరణించారు. దీంతో ప్రపుల్లాచాకీ తనకు తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుడీరామ్‌బోస్‌ను ఉరి తీశారు.
1909:
అభినవ్‌ భారత్‌ సొసైటీకి చెందిన అనంతలక్ష్మణ్‌ కార్కారే నాసిక్‌ జడ్జి అయిన జాక్సన్‌ (స్టీఫెన్‌సన్‌)ను ఔరంగాబాద్‌ వద్ద హత్య చేశాడు. దీనిని నాసిక్‌ కుట్ర అంటారు ( ఈ కేసులో ప్రధాన నిందితుడు -వి.డి.సావర్కర్‌)
జాక్సన్‌ తిలక్‌కు 6 సం॥ల జైలుశిక్ష విధించినవాడు.
1911:
దక్షిణ భారతదేశంలో ఏకైక తీవ్రవాద సంస్థ అయిన భారతమాత అసోసియేషన్‌ను నీలకంఠ బ్రహ్మచారి, వంఛీ అయ్యర్‌లు స్థాపించారు. వంచీ అయ్యర్‌ తిరునల్వేలి (తమిళనాడు) న్యాయమూర్తి ఆష్‌ను హత్య చేశాడు. వంచీ అయ్యర్‌ తరఫున టంగుటూరి ప్రకాశం వాదించాడు.
1912:
రాజ్‌బిహారీ ఘోష్‌ సచిన్‌ సన్యాల్‌లు గవర్నర్‌ జనరల్‌ 2వ హార్టింజ్‌ను ఢిల్లీలోని చాందినీ చౌక్‌ వద్ద హత్య చేయుటకు ప్రయత్నించారు. కానీ విఫలమైనారు. రాజ్‌ బిహారీ ఘోష్‌ జపాన్‌కు పారిపోయాడు. తర్వాత కాలంలో సచిన్‌ సన్యాల్‌ హిందుస్థాన్‌ రిపబ్లికన్‌ అసోసియేషన్‌ను ఏర్పాటు చేశాడు. (ఈ హత్యా ప్రయత్నం రాజధానిని కలకత్తా నుండి ఢిల్లీకి మార్చిన సందర్భంగా జరిగే ఉత్సవాలలో జరిగింది)
20వ శతాబ్ధ ఆరంభంలో విప్లవాత్మక తీవ్రవాదాన్ని అనేక వార్తాపత్రికలు బహిరంగంగా ప్రోత్సహించాయి.
*************************************************************
పత్రిక పేరు                స్థాపకుడు
*************************************************************
1 కోల్‌               -పరంజీత్‌  (మహారాష్ట్రలో)
2 సంధ్య            -బ్రహ్మబందోప్‌ ఉపాధ్యాయ (బెంగాల్‌లో)
3 యుగాంతర్‌    -భూపేంద్రదత్త (బెంగాల్‌)
4 అమృత్‌బజార్‌ -సుశీల్‌కుమార్‌ ఘోష్‌ (బెంగాల్‌)
5 భవానీ మందిర్‌ -భరీంద్రకుమార్‌ ఘోష్‌(బెంగాల్)‌
6 వర్తమాన రననీతి -భరీంద్రకుమార్‌ ఘోష్‌(బెంగాల్‌)
7 సర్క్యులర్‌-ఇ-ఆజాదీ -రామనాథ పూరీ
8 జగత్‌మిత్ర, జగత్‌ప్రేమ -ఎస్‌. ఎస్‌. గంగూలీ
9 డాన్‌ సొసైటీ -సతీష్‌ ముఖర్జీ
10 జమిందార్‌ -జాఫర్‌ అలీఖాన్‌
*************************************************************