బౌద్ద మతం - Buddhism - (జ్ఞానోదయం-1)

TSStudies

జ్ఞానోదయం 

క్రీ.పూ.6వ శతాబ్ధంలో 2 ముఖ్యమైన అభివృద్ధులు చోటుచేసుకున్నాయి. అవి
1) మతపరమైన అభివృద్ధి
2) రాజకీయపరమైన అభివృద్ధి

మతపరమైన అభివృద్ధి:
క్రీ.పూ.6వ శతాబ్ధంలో 62 మతాలు ఆవిర్భవించాయి. వీటిలో బౌద్ధ, జైన మతాలు మినహాయించి మిగిలినవి ప్రారంభంలోనే అంతమైనాయి.
మత ఆవిర్భావానికి కారణాలు :
1) బ్రాహ్మణుల ఆధిపత్యం
2) ఉపనిషత్తుల ప్రభావం
3) ఇనుము కనుగొనుట

ఇనుమును కనుగొన్న తర్వాత సారవంతమైన భూములు
ఏర్పడ్డాయి. ఆ వెంటనే వృత్తి పనులవారు, చేతిపనులవారు ప్రత్యేక సంఘాలు ఏర్పరుచుకున్నారు. ఈ సంఘాల్లో చెక్కపనివారు, కమ్మరి మొదలగువారు పట్టణాల్లో కేంద్రీకృతమై సంపాదించిన ధనవిశేషం చేత సమాజంలో గౌరవాన్ని సంపాదించారు.
బౌద్ధ సాహిత్యంలో “గహపతి”' అనగా భూస్వామ్యవర్గాలు.
4) వడ్డీ వ్యాపారం

బౌద్ద మతం:

Buddhism for tspsc group 2,Buddhism in telugu,history of Buddhism in telugu,Buddhism history in telugu,Buddhist Councils in telugu,Buddhism History Study Material in telugu,Buddhism History notes in telugu,Basic Knowledge about Buddhism in telugu,ethical principles of buddhism in telugu,Ancient History in telugu,Jainism and Buddhism in telugu,founder of buddhism ,comparision of Jainism and Buddhism,founder of janism,role of buddhism,role of janism,Jain Dharmamm,Jainism notes in telugu,Jainism study material in telugu,history of Jainism,founder of Jainism,teerdankarulu means in Jainism,role of Jainism teerdamkarulu,Jainism vardamana mahaveer,vardamana mahaveer history,history of vardamana mahaveer,indian history in telugu,ancient indian history in telugu,telangana ancient history in telugu,telangana ancient history in telugu,group 2 notes in telugu, group 2 history notes in telugu,group 2 indian history notes in telugu,indian history study material in telugu,tspsc group 2 indian history in telugu,ts studies,tsstudies,ts study circle,
స్థాపకుడు. - సిద్ధార్థుడు / గౌతమబుద్ధుడు
తండ్రి - సిద్దోదనుడు
తల్లి - మాయాదేవి (కోసల రాకుమార్తె)
భార్య - యశోధర
కుమారుడు - రాహులుడు
జన్మస్థలం _ -563బి.సి. (నేపాల్‌లోని కపిలవస్తు)
జ్ఞానోదయం _ - బోధ్‌ గయ (బీహార్‌లోని ఊరువేల 35వ పట)
మరణం - కుశీనగరం
483 బి.సి. ఉత్తరప్రదేశ్‌ (నేపాల్‌ బోర్డర్‌) 
తెగ - శాక్య తెగ
బిరుదు - శాక్యాముని, తటగధ
సిద్ధార్థుడు మాయాదేవి గర్భంలో ఉన్నప్పుడు ఆమెకు కలలో తెల్లని ఏనుగు కనిపించింది.
బుషి ఈకలను వివరిస్తూ గర్భంలో ఉన్న శిశువు విశ్వచక్రవర్తి లేదా సన్యాసి అవుతాడని పేర్కొన్నాడు.
సిద్దోధనుడు సిద్దార్థుడిని నాలుగు గోడల మధ్య అన్ని వసతులతో తన భవంతిలో పెంచాడు.
సిద్దార్థుని పెంపుడు తల్లి గౌతమి
సిద్దార్థుడు ఒకరోజు తన భవంతి నుంచి బయటకు వచ్చి వరుసగా ఈ క్రింది సంఘటనలను చూశాడు.
1) వృద్దుడు
2) రోగి
3) ఒక శవం
4) ఒక సన్యాసి
దీనితో విశ్వంలో శాశ్వత సంతోషం లేదని భావించి దాన్ని కనుగొనుటకు నిర్ణయించాడు.
తన 29వ యేట చెన్నకేతు (గుర్రపుస్వారీధారుడు) కంతక (గుర్రము పేరు) సహాయంతో ఇల్లు వదిలి సత్యాన్వేషణకై బయలుదేరాడు. దీనిని మవాభిని'ష్ర్రమణ అంటారు.
సిద్దార్థుడు రుద్రక, అలారకామ అనే గురువులను కలిసి ధ్యానం చేశాడు.
తర్వాత అయిదుగురు బ్రాహ్మణులతో కలిసి ధ్యానం చేసినప్పటికీ అతనికి ప్రయోజనం దక్కలేదు.
ఆ తర్వాత సిద్దార్థుడు బీహార్‌లోని ఉరువేల చేరుకున్నాడు. ఇక్కడ సుజాత అనే మహిళ సిద్దార్భునికి పండ్లు, ఆహారం ఇచ్చేది.
ఉరువేలలో రావిచెట్టు క్రింద 49 రోజుల పాటు ధ్యానం చేసిన తర్వాత సిద్దార్భునికి జ్ఞానోదయం అయినది(వైశాఖ పూర్ణిమ రోజు). దీనినే 'సంబోధి అంటారు.
సిద్దార్థ డు ధ్యానం చేస్తున్నప్పుడు రావి చెట్టుపై “మారి అనే దెయ్యం ఉండేది. ఇది సిద్దార్థుని ధ్యానం భగ్నం చేయుటకు ప్రయత్నించేది. 
సిద్దార్థునికి జ్ఞానోదయం అయిన తర్వాత ఉరువేలా -బోధ్‌గయగా, రావిచెట్టు - బోధి వృక్షంగా, సిద్దార్థుడు - గౌతమబుద్దుడిగా మారెను.
జ్ఞానోదయం తర్వాత బుద్దుడు మొదటిసారిగా సార్‌నాథ్‌ (ఇసిపఠానా)లో జింకల వనంలో అయిదుగురు బ్రాహ్మణులకు తాను తెలుసు కున్న సత్యాన్ని బోధించాడు. దీనినే “ధర్మచక్ర పరివర్తన అంటారు.
తర్వాత కవిలవన్తు వెళ్లి గౌతమి, రాహులుడు మొదలగువారిని బౌద్ధమతంలో చేర్చించాడు.
బుద్ధుని మొదటి మహిళా శిష్యురాలు -గౌతమి
ఇతని ముఖ్యమైన శిష్యులు - ఆనంద, ఉపాలి
ఇతను అంగుళిమాల అనే బందిపోటు దొంగను బౌద్ధమతంలో చేర్చించాడు.
బుద్దుని యొక్క ధనిక శిష్యుడు అనంతపిండిక. ఇతను బుద్దుని కొరకు అనేక మఠాలు నిర్మించాడు.
బుద్దుడు పురోహితుల ఆధిపత్యాలను, వేదాలను ఖండించాడు.
వర్ణ వ్యవస్థను గుర్తించాడు. కానీ ఏ వర్జం వారు అయినా మోక్షమును పొందవచ్చని పేర్కొన్నాడు.
పునర్జన్మపై విశ్వాసం ఉంచాడు.
ప్రభుత్వ ఉద్యోగులు, సైనికులు, బానిసలు, బుణగ్రస్తులు, కుష్టు, మూర్భ వ్యాధులతో ఉన్నవారు బౌద్ధ మతం స్వీకరించడానికి అనర్హులు అని పేర్కొన్నారు.
దుఃఖభూయిష్టమైన ఈ భౌతిక ప్రపంచం నుండి విముక్తిని సాధించడం కోసం, బౌద్ధ మతం మధ్యే మార్గాన్ని ఆశ్రయించాలని సూచిస్తుంది.
బౌద్ధ సన్యాసుల సంఘంలో స్రీలకు ప్రవేశార్హతను కల్పించారు.
ప్రజా బాషా అయిన 'పాళీ' భాషను బోధనా భాషగా స్వీకరించారు. 
బౌద్ధ, జైన మతాలు రెండూ కూడా సన్యాశ్రమ స్వీకరణ విషయంలో వేశ్యలను వెలి వేయలేదు. ఎంతో ప్రసిద్దురాలైన “అంబపాలి” అనే ఉంపుడుగత్తె బౌద్ధ మతాన్ని స్వీకరించింది.

బుద్దుని సిద్ధాంతం - ఆర్య సత్యాలు
1) ప్రపంచం దుఃఖమయం
2) దు:ఖానికి కారణం కోరికలు
3) దు:ఖాన్ని జయించాలన్న కోరికలను జయించాలి.
4) కోరికలను జయించాలన్నా అష్టాంగ మార్గాన్ని పాటించాలి.
అష్టాంగ మార్గం:
1 సమ్యక్‌ వాక్కు
2 సమ్యక్‌ క్రియ
3 సమ్యక్‌ జ్ఞానం
4 సమ్యక్‌ దృష్టి
5 సమ్యక్‌ ఆలోచన
6 సమ్యక్‌ ధ్యానం
7 సమ్యక్‌ నిశ్చయం
8 సమ్యక్‌ శ్రమ
బుద్ధుడు సాక్య మరియు కొలియ తెగల మధ్య యుద్దాన్ని నివారించాడు.
గౌతమ బుద్దుడు తన 80వ యేట క్రీ.పూ.483లో కుళీ నగరంలో తన శిష్యుడు “చద” ఇచ్చిన పంది మాంసం తినడంతో విరేచనాలకు గురై మరణించాడు. దీనినే “మహాపరినిర్యాణం” అంటారు.
బుద్దుడు మరణించిన తర్వాత ఇతని బోధనలను మూడు బుట్టలలో సేకరించారు. వీటిని “త్రిపీటకాలు” అంటారు.
1) సుత్త పీఠిక - బుద్దుని బోధనలు
2) వినయ పీఠిక - క్రమశిక్షణ, నియమావళి
3) అభిదమ్మ పీఠిక - బుద్దుని తత్త్వం
సుత్త పీఠిక మరల 5‌ భాగాలుగా విభజించబడుతుంది
1. దిఘ నికయ
2. మజ్జియ నికయ
3. అంగుత్తర నికయ
4. రింగుత్తర నికయ (మొదటిసారిగా 16 మహాజనపదాల గూర్చి పేర్కొంది)
5. ఖందక నికయ

గౌతమ బుద్దుని చిహ్నాలు:
జన్మస్థలం - తామర 
ఇల్లు వదిలిపెట్టి పోవుట - గుర్రం
జ్ఞానోదయం - బోధి వృక్షం శతి
మొట్టమొదటి బోధన _ - చక్రం (8 గీతలున్నాయి)
మరణం - స్థూపం 
స్థూపం - బుద్దుని అవశేషాలపై నిర్మించబడింది
విహారం - సన్యాసుల విశ్రాంతి ప్రదేశాలు
చైత్యం - సన్యాసుల ప్రార్ధనా మందిరం
భారతదేశంలో అతి పురాతన స్ఫూపం -పిప్రవాహ
దక్షిణ భారతదేశంలో అతి పురాతన స్థూపం - భట్టిప్రోలు (గుంటూరు)
భారతదేశంలో అతిపెద్ద స్థూపం - సాంచీ
జాతక కథలు బుద్దుని జీవిత చరిత్రను తెలియజేస్తాయి. బావరు జాతక ప్రకారం అప్పట్లో నెమలులు పశ్చిమాసియాకు ఎగుమతి చేయబడ్డాయి.

బౌద్ద సంగీతులు
Buddhism for tspsc group 2,Buddhism in telugu,history of Buddhism in telugu,Buddhism history in telugu,Buddhist Councils in telugu,Buddhism History Study Material in telugu,Buddhism History notes in telugu,Basic Knowledge about Buddhism in telugu,ethical principles of buddhism in telugu,Ancient History in telugu,Jainism and Buddhism in telugu,founder of buddhism ,comparision of Jainism and Buddhism,founder of janism,role of buddhism,role of janism,