ఆంధ్ర మహిళా సభ Role of Andhra Mahilasabha in Nizam's State
ఆంధ్ర మహిళా సభ ప్రారంభంలో ప్రజా సంబంధ వ్యవహారాలలో కూడా మహిళలు పాల్గొనడం మొదలైంది.
1980లో ఆంధ్ర మహాసభ ప్రారంభించినప్పటి నుంచి, వీటితో పాటుగా దుర్గాభాయ్ దేశ్‌ముఖ్ ప్రయత్నాల ఫలితంగా ఆంధ్ర మహిళా సభలు కూడా జరిగాయి.
సామాజిక సంబంధమైన సమస్యలు మరియు ఈ సమస్యలకు సాధ్యమైన పరిష్కార మార్దాలను ఆంధ్రమహిళా సభలు సూచించేవి.
ఆంధ్ర మహిళా సభ ప్రధానంగా మహిళలు సమాజంలో ఎదుర్కొంటున్న సమస్యలు, మహిళా విద్య, మహిళల రాజకీయ వెనుకబాటుతనం మొదలైన సమస్యలను చర్చించి, పరిష్కరించడం కోసం ఏర్పడినది.
ఆంధ్ర మహిళా సభను మొదట్లో ఆంధ్ర మహాసభలలో అంతర్భాగంగా నిర్వహించేవారు. కానీ 10వ ఆంధ్ర మహిళా సభ నుంచి మహిళా నభలను ప్రత్యేకంగా, విడిగా నిర్వహించారు.
అన్నీ ఆంధ్ర మహిళా సభలలోను ప్రధానంగా స్త్రీ విద్య ఆవశ్యకత, మాతృభాషలో విద్యాభోధన, మూఢనమ్మకాలు,
స్త్రీల స్థితిగతుల గురించి తీర్మానాలు చేశారు.
మొదటి ఆంధ్ర మహిళా సభ :
మొదటి ఆంధ్ర మహిళా సభ 1930 సం॥లో జోగిపేటలో ఏర్పాటు చేయబడింది.
ఆంధ్ర మహిళా సభ మొదటి సమావేశంలో 500 మంది మహిళలు సమావేశం అవడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది.
దీనికి అధ్యక్షురాలుగా నడింపల్లి సుందరమ్మ వ్యవహరించారు.
మొదటి ఆంధ్ర మహిళా సభలో ముఖ్యంగా సంస్కృతి మరియు రాజకీయాలలో మహిళల భాగస్వామ్యం, మహిళల స్వేచ్భా మొదలైన అంశాల గూర్చి చర్చించారు
2వ ఆంధ్ర మహిళా సభ:
రెండవ ఆంధ్ర మహిళా సభను మొదటి ఆంధ్ర మహిళా సభ జరిగిన ఒక సంవత్సరం తరువాత అనగా 1931వ సం॥లో దేవరకొండలో నిర్వహించారు
రెండవ ఆంధ్ర మహిళా సభకు టి. వరలక్ష్మమ్మ గారు అధ్యక్షత వహించారు.
మొదటి ఆంధ్ర మహిళా సభలో జరిగిన తీర్మానాలన్నింటిని తిరిగి రెండవ ఆంధ్ర మహిళా సభలోను పునరుద్దాటించారు
అదే విధంగా జిల్లాలలో విద్యా, సాంకేతికవిద్య కౌన్సిల్స్‌కు సంబంధించిన ప్రత్యేక తీర్మానాలు చేశారు.
3వ ఆంధ్ర మహిళా సభ:
మూడవ ఆంధ్ర మహిళా సభను 1934 సం॥లో ఖమ్మంలో నిర్వహించారు
ఈ సభకు “ఎల్లాప్రగడ సీతాకుమారి” అధ్యక్షత వహించారు
మూడవ ఆంధ్ర మహిళా సభకు 3,000 మంది కంటే ఎక్కువ మహిళలు హాజరయ్యారు.
ఈ సభలో మహిళల విద్య, మహిళల జీవన విధానంలో రావల్సిన మార్పు మొదలైన తీర్మానాలు చేశారు
విద్య ద్వారనే విజ్ఞానం సంపాదించగలము కావునా విద్యఅనేది అత్యంత కీలకమైనదని తీర్మానించారు
స్రీలకు విద్య అందించడం ద్వారా మహిళా దేశభక్తులను తయారు చేయవచ్చునని తెలిపారు.
4వ ఆంధ్ర మహిళా సభ :
4వ ఆంధ్ర మహిళా సభ 1935 సం॥లో 'సిరిసిల్లా లో జరిగింది.
ఈ సభకు “మాడపాటి మాణిక్యమ్మ' అధ్యక్షత వహించారు
నిరక్ష్యరాస్యులైన మహిళల కోసం రాత్రి బడులు నిర్వహించడం, వం బాలికల తెలుగు మీడియం ఉన్నత పాఠశాలను స్థాపించడం, బాల్య వివాహాలు, బాల్య వివాహాల మూలంగా ఏ విధంగా మహిళల ఆయుర్ధాయం తగ్గిపోతున్నది మొదలైన అంశాల మీద తీర్మానం చేశారు
5వ ఆంధ్రమహిళాసభ:
5వ ఆంధ్ర మహిళా సభను 1936 సం॥లో “షాద్‌నగర్‌లో నిర్వహించారు
ఈ సభకు “బూర్గుల అనంత లక్ష్మమ్మ” అధ్యక్షత వహించారు
మహిళల పాఠశాలల నిర్వహణకు గ్రాంటులు ఇవ్వాలని, స్తీ విద్యా ప్రాముఖ్యాన్ని, ప్రభుత్వం మహిళా విద్యకు సహకరించడంలేదని, ప్రాథమిక దశ వరకు మాత్రమే మాతృభాషలో పాఠశాలలు ఉన్నాయని, ఉన్నత పాఠశాలలను
స్తాపించాలని తీర్మాన చేసారు.
6వ ఆంధ్ర మహిళా సభ :
6వ ఆంద్ర మహిళా సభను నిజామాబాద్‌లో 1937లో నిర్వహించారు
ఈ సభకు నందగిరి ఇందిరాదేవి అధ్యక్షత వహించారు
స్త్రీల వెనుకబాటుతనం, కాలం చెల్లిన సామాజిక, మూఢనమ్మకాలపైన, విదేశీవస్తు బహిష్కరణ గురించి, పర్దా వ్యవస్థ,
గ్రామాల్లో పారిశుద్ధ్యం, వైద్యసదుపాయాలు, మొదలగువాటి గురించి తీర్మానం చేశారు.
7వ ఆంధ్ర మహిళా సభ :
7వ ఆంధ్ర మహిళా సభ 1940 సం॥లో “'మల్మాపురం'లో నిర్వహించారు
ఈ సభకు 'యోగ్య శీలాదేవి' అధ్యక్షత వహించారు
సహాయంలేని మహిళలకు పునరావసర సౌకర్యాలు కల్పించడం, మహిళల ఆ పరిస్థితులు, సమాజంలోని స్తీ పురుష అసమానతలు మొదలగువాటి గురించి తీర్మానం చేశారు
8వ ఆంధ్ర మహిళా సభ :
8వ ఆంధ్ర మహిళా సభ 'చిలకూరులో” 1941లో జరిగింది
ఈ మహాసభకు “రంగమ్మ ఓబుల్‌రెడ్డి అధ్యక్షురాలు
స్త్రీలకు స్వేచ్చ, ఆర్థిక స్వేచ్చ మొదలైనవి అందించాలని ఈ సభ తీర్మానించింది.
9వ ఆంధ్ర మహిళా సభ:
9వ ఆంధ్ర మహిళా సభను 1942లో 'ధర్మారం'లో నిర్వహించారు
9వ ఆంధ్ర మహిళా సభలో ప్రధానంగా బాల్యవివాహాలు, వితంతు పునర్వివాహాలు, వరకట్నం, విడాకులు మైదలైన వాటి గురించి తీర్మానం చేశారు.
10వ ఆంధ్ర మహిళాసభ:.
10వ ఆంధ్ర మహిళా సభను 1948లో హైదరాబాద్‌లో నిర్వహించారు
ఈ సభకు “ఎల్లాప్రగడ సీతాకుమారి' అధ్యక్షత వహించారు.
10వ ఆంధ్ర మహిళా సభ నుంచి, మహిళా సభలను ప్రత్యేకంగా, విడిగా నిర్వహించడం జరిగింది.
అంతకు ముందు ఆంధ్ర మహాసభలతో పాటు ఆంధ్ర మహిళాసభలను కూడా నిర్వహించడం రివాజు
ఈ సమావేశాల్లో వేశ్యావ్యవస్థను రూపుమాపాలని తీర్మానం చేశారు
10వ ఆంధ్ర మపీళా సభ తరువాత ఆంధ్ర మహిళా సభలో చీలిక ఏర్పడింది. కావున ఈ సమావేశాలకు అధ్యక్షురాలు నియమించబడలేదు
11న ఆంధ్ర మహిళా సభ :
11వ ఆంధ్ర మహిళా సభను 1944 సం॥లో “భువనగిరిలో నిర్వహించారు
నిమ్మగడ్డ సత్యవతి అధ్యక్షత వహించింది
ఈ మహాసభలో రాష్ట్రంలోని ప్రధాన దురాచారమైన 'ఆడబాప విధానం' గురించి, బానిసత్వం మొదలైన వాటి గురించి
తీర్మానించారు.
ఆడబాప విధానం :
తెలంగాణ రాష్ట్రంలో “ఆడబాపి అనేది ప్రధానంగా కనిపించే సాంఘిక దురాచారం కుటుంబంలో పుట్టినటువంటి ఆడపిల్లలను ఈ విధానంలోకి చిన్న ప్రాయం నుండే పంపబడుతారు
ప్రధానంగా పేదవారు ఇలా తమ పిల్లల్ని ఆడబాపగా మారుస్తారు
ఇలా మార్చబడిన బాలికలు/యువతులు జీవితకాలం వివాహం చేసుకోరాదు
సమాజంలోని జాగిర్‌దార్లు, దొరల వద్ద అన్ని అవసరాలు తీర్చే మనిషిగా, బానిసలుగా ఉండాల్సిందే.
12వ ఆంధ్ర మహిళా సభ :
12 ఆంధ్ర మహిళా సభలో 1945 సం॥లో 'మడికొండలో నిర్వహించబడింది
ఈ మహాసభలో ప్రధానంగా సమాజంలో వితంతువులు ఎదుర్కొంటున్న సమస్యలు, సాంఘిక పరమైన, మతపరమైన పుస్తకాలను మహిళలు తప్పనిసరిగా చదవాలని, సామాజిక రుగ్మతలను రూపుమాపడం వంటి ప్రధాన అంశాలను తీర్మానించారు
13వ ఆంధ్ర మహిళా సభ :
13వ ఆంధ్ర మహిళా సభను 1946 సం॥లో “కంది అనే ప్రాంతంలో నిర్వహించారు
స్త్రీ విద్యా, వెట్టిచాకిరీ, ప్రసూతి సదుపాయాలు, స్త్రీల మానసిక స్థాయి, మాతృభాషలో విద్యా బోధన, పత్రికలు, పుస్తకాలు మహిళలు చదవాల్సిన ఆవశ్యకత, వేశ్యావ్యవస్థను రూపుమాపాలని తీర్మానం చేశారు.