తెలంగాణ సమాజంలో మహిళల పరిస్థితి Devadasi System in Telangana

TSStudies
తెలంగాణ సమాజంలో మహిళల పరిస్థితి 
The Situation of Women in Telangana Society

  • ప్రతి వంటకత్తె ఒక రాజకీయవేత్త కావాలి అని అన్నాడు లెనిన్ 
  • భారత స్త్రీకి స్థాయి వచ్చిన నాడు, నిజంగా అలా జరిగితే నాటి సామాజిక వ్యవస్థ మారిపోతుంది. అన్యాయాలు అక్రమాలు అసమానత్వం హెచ్చుతగ్గులు రూపు మాసిపోతాయి. 
  • నేటి స్త్రీకి చట్టంలో లేని హక్కు లేదు. రాజ్యాంగంలో వివక్ష కూడా లేదు. 
  • విద్య ఉద్యోగాలలో స్థానాలు పెంచుతున్నారు. 73 రాజ్యాంగ సవరణ ద్వారా 20వేల పంచాయతీలలో ఆరు వేల వరకు స్థానాలను మహిళలకు రిజర్వ్ చేశారు. అత్యాచారాలను అరికట్టేందుకు చట్టాలు, శిక్షలు చాలా వచ్చాయి.  
  • కనీస వేతన చట్టం, వ్యభిచార నిరోధక చట్టం, స్త్రీకి ఆస్తిహక్కు, దత్తత హక్కులు వచ్చాయి. కాని దేశంలో ఆనాటి స్త్రీ పరిస్థితి గమనిస్తే బాల్య వివాహాలు, బహుభార్యత్వం, కన్యాశుల్కం, దేవదాసి విధానం ఉండేది. విద్యా విహీనత, అజ్ఞానం,అవివేకం, రాజకీయ నిరాదరణ మొదలైనవి కనిపించేవి. ఇదిలా ఉంటే అప్పటి తెలంగాణ రాష్ట్రంలోని స్త్రీలు దేవదాసీ విధానం, మాతంగి, ఆడ బాపి, ఓలి/కన్యాశుల్కం మొదలైన విధానాల ద్వారా అట్టడుగున అణచివేయబడ్డారు
ఓలి లేదా కన్యాశుల్కం 
  • వందల సంవత్సరాల క్రితం  ఓలి/కన్యాశుల్కం విధానం ప్రధానంగా అగ్రవర్ణాల లో కనిపించేది. 
  • అప్పటి హైదరాబాద్ రాష్ట్రంలో కూడా  ఓలి విధానం ఉండేది. 
  • బాలిక తండ్రి కాబోయే అల్లుడు వద్ద డబ్బు/పైకం తీసుకుని తన కూతురినిచ్చి వివాహం జరిపించే వాడు. తండ్రి తీసుకున్న డబ్బు/పైకం నే ఓలి అంటారు. 
  • ఓలి లేని పెళ్ళి పరువు తక్కువ పెళ్లి గా అప్పట్లో భావించడం జరిగింది. 
  • మరింత వివరంగా  ఓలి విధానాన్ని 'కన్న తండ్రి కూతురిని విక్రయించే విధానం' అని కూడా చెప్పవచ్చు. 
  • సాంస్కృతిక పునరుజ్జీవన కాలంలో గురజాడ అప్పారావు 'కన్యాశుల్కం' అనే నాటకాన్ని వ్యవస్థ గురించి రచించాడు 
పడుపు వృత్తి 
  • విధానం అతి ప్రాచీనమైనది మరియు ఇప్పటికీ చాలా దేశాల్లో కొనసాగుతుంది. 
  • హిందూ సమాజంలో వేశ్యావృత్తిని కొన్ని కులాల వారికి కేటాయించినది హిందూ సంఘం.  కులాల్లోని స్త్రీలు వివాహ మాడరాదు. అటువంటివారు దేవదాసీలుగా, జోగినిలుగా, బసివినులుగా పిలువబడే వారు. 
  • అప్పుటి హైదరాబాద్ రాష్ట్రంలో పడుపువృత్తి ఉండేది. చాలా మంది స్త్రీలు బలవంతంగా వృత్తిలోకి లాభపడ్డారు. ఫలితంగా స్త్రీలు భోగవస్తువులుగా, పురుషులకు సుఖాన్నిచ్చే పనిముట్లుగా మారిపోయారు. మరి కొందరు స్త్రీలు పొట్టకూటికి విధానం అవలంబించేవారు 
జోగిని విధానం Jogini System in Telangana
  • తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో సాంఘిక దురాచారాలు, మూఢ నమ్మకాలు ఎక్కువగా ఉండేవి. జోగిని విధానం కూడా అందులోని భాగమే 
  • జోగిని విధానం పురాతనమైనది. హైదరాబాద్ రాష్ట్రంలోని గ్రామీణ, గిరిజన ప్రాంతాలలో ఎక్కువగా ఉండేది. 
  • విధానంలో గ్రామాల్లోని బాలికలను, యువతులను దేవత/దేవుడికి బానిసగాఅర్పణ గాను చేయబడే వారు. 
  • ఇలా జోగినిగా మార్చబడిన వారు జీవితంలో మరొక వివాహం చేసుకోరాదు. దేవాలయాలకు అంకితమై పోవాలి . 
  • జాతరలో నృత్యాలు చేయాలి 
  • జోగిని లకు ఊరికి చివర ఒక గుడిసెను నిర్మించేవారు. 
  • ఊర్లో పటేళ్లు, పట్వారీలు జోగిని లను సొంత వస్తువులాగా, బానిసలా, ఉంపుడుగత్తెలాగా, అన్ని రకాల సేవలు చేయించుకునే ఆచారం తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ఉండేది.  
దేవదాసి Devadasi System in Telangana
  • విధానం కూడా దాదాపుగా జోగిని విధానాన్ని పోలి ఉంటుంది. 
  • కుటుంబంలో దేవుని మొక్కుల కోసం తమ ఇళ్లలోని బాలికలను ఒక దేవుడు విగ్రహానికి ఇచ్చి వివాహం చేస్తారు. 
  • వివాహం అనంతరం అమ్మాయిల దేవుని బానిసలుగా (దేవదాసీలుగా) పిలవబడతారు. 
  • వారు జాతరలు, పండుగలు, ఉత్సవాల్లో ఊరి మధ్య దేవదాసి నృత్యాలు చేయాలి. వారు పాఠశాలలకు వెళ్లరాదుమరొక వివాహం చేసుకోరాదు. 
  • కొన్ని గ్రామాల్లో ఆడపిల్ల పుట్టిన వెంటనే దేవదాసిగా సమర్పిస్తానని మొక్కుబడులు జరిగేవి. 
  • విధానాల్లో బాలికల ఇష్టాయిష్టాలతో పని లేదు. వారి మాటలకు విలువ ఉండదు 
మాతంగి Matangi System in Telangana
  • ఇది కూడా ఒక సాంఘిక దురాచారం. తెలంగాణ ప్రాంతంలోని గిరిజన, మారుమూల ప్రాంతాల్లో అక్కడక్కడ ఉండేది. 
  • ఇది జోగిని, దేవదాసీ విధానంలాగే దేవతా పనులకు యువతులు అర్పించ బడతారు. 
  • మాతంగిగా సమర్పించు పడేవారు కన్యలై ఉండాలి.  
  • గ్రామ పెద్దల, ఆలయ పూజారుల అన్ని అవసరాలు కూడా తీర్చాల్సివచ్చేది. మాతంగి గా మారిన స్త్రీలు తమ వయసు మళ్లిన తర్వాత బిక్షాటన చేసుకునే పరిస్థితి ఉండేది. 

బాల్యమే లేని స్త్రీలు 
  • అప్పటి తెలంగాణ ప్రాంతంలో శ్రామిక కుటుంబాలలో తక్కువ ఆదాయం కలవారి ఇళ్లలో ఆడపిల్లల స్థితి శోచనీయం. వారికి బాల్యం అనేది లేకుండా ఉండేది.
  • వారి తల్లి తండ్రులతో పాటే రోజువారీ పనులకు వెళ్లడం కానీ, ఇంట్లో పసిపిల్లల ఆలనా-పాలన చూడడంతోనే ఆడపిల్ల బాల్యం ముగిసిపోయేది.  
ఆడ బా 
  • అప్పటి తెలంగాణ సమాజంలో జమీందారులు, దొరలు గ్రామాల్లోని స్త్రీలను తమ కోరికలు తీర్చే సాధనాలుగా ఉపయోగించుకున్నారు. ధరలు గ్రామాల్లోని స్త్రీల ద్వారా తమ కోరికలను తీర్చు కొనుటనే  ఆడ బా గా పిలుస్తారు.  
సంతానము కనే యంత్రం 
  • సమాజంలో స్త్రీకి విలువ తక్కువగా ఉండేది. వివాహానంతరం పురుషుడు స్త్రీని కేవలం సంతానం కనీ ఇచ్చే యంత్రంగా మాత్రమే పరిగణించేవారు. 
  • ఎంత మంది సంతానం కావాలి, ఎవరు కావాలి అని పురుషుడే నిర్ణయించి స్త్రీలకు విలువ లేకుండా చేసేవారు. 
వెట్టి-బాలికలు కానుకగా పంపబడుట 
  • పైన వివరించిన అంశాలే కాకుండా అనేక అంశాల్లో స్త్రీల స్థానం దిగువనే ఉండేది. 
  • అప్పటి స్త్రీలకు ఆస్తిలో వాటా హక్కు లేదు, విద్యా హక్కు లేదు, మగవారితో పోల్చుకుంటే స్త్రీల వివక్షత ఎక్కువగా కనిపించేది 
  • అప్పటి హైదరాబాద్ రాష్ట్రంలో మహిళలు మహిళల గా కన్నా ఒక వినోద వస్తువుగా పరిగణించే వారు.  తర్వాత కాలంలో వచ్చిన సాంస్కృతిక పునరుజ్జీవనం, సమాజంలో మార్పుతో పాటు స్త్రీలలో కూడా మార్పులు తీసుకువచ్చింది. 
  • ప్రతి ఉద్యమం లో స్త్రీలు పాల్గొనటం వలన స్త్రీ విద్యకు గల ప్రాధాన్యం తెలిసింది. 
  • 1928లో బాలికల పాఠశాల ఏర్పాటుతో తెలంగాణాలో స్త్రీ విద్యకు అవకాశం ఏర్పడింది 
  • 1930 ఆంధ్రమహిళాసభ స్థాపనతో స్త్రీల సమస్యల పరిష్కార మార్గం వేసిన ప్రారంభమైనది