నిజాం పాలన అంతం (భారత యూనియన్ లో హైదరాబాద్ విలీనం)
భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు మొత్తం 562 సంస్థానాలు ఉండేవి. వీటిలో హైదరాబాద్ సంస్థానం అన్నిటికంటే పెద్దది. వీటిలో 4 సంస్థానాలు మినహాయించి మిగతావన్నీ భారత్ లేదా పాకిస్తాన్ లో విలీనం అయ్యాయి.
విలీనం కానీ సంస్థానాలు
1. కాశ్మీర్
2. జునాఘడ్
3. ట్రావెన్ కోర్
4. హైదరాబాద్
1947 జూన్ 12 న ఉస్మాన్ అలీఖాన్ తానూ స్వతంత్రుడనని ప్రకటించుకున్నాడు. కానీ తరువాత జరిగిన కొన్ని సంఘటనలు లేదా ఉద్యమాల కారణంగా 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ భారత యూనియన్ లో విలీనం అయింది.
హైదరాబాద్ సంస్థానంకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాలను ఈ క్రింది విధంగా పేర్కొనవచ్చును.
1. జయప్రకాష్ నారాయణ్ హైదరాబాద్ పర్యటన
2. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ కార్యకలాపాలు
3. కమ్యూనిస్ట్ కార్యకలాపాలు
4. పత్రికలు
5. ఆర్య సమాజ్ కార్యకలాపాలు
6. బాకర్ అలీ మీర్జా కార్యకలాపాలు
7. యథాతథ స్థితి ఒప్పందం / స్టాండ్ స్టీల్ అగ్రిమెంట్
8. మౌంట్ బాటన్ మధ్యవర్తితం
9. ఆపరేషన్ పోలో
జయప్రకాష్ నారాయణ్ హైదరాబాద్ పర్యటన(1947 మే 7)
కాంగ్రెస్ పార్టీ కి చెందిన జయప్రకాష్ నారాయణ్ 1947 మే 7న హైదరాబాద్ లో పర్యటించి కర్బల మైదానంలో ప్రసంగిస్తూ హైదరాబాద్ భారత్ యూనియన్ లో విలీనం అయ్యేటట్లు ఒత్తిడి తీసుకు రావాలని పిలుపునిచ్చాడు
వెంటనే నిజాం ప్రభుత్వం ఇతనిని రాజ్య బహిష్కరణ చేసింది
హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ బూర్గుల రామకృష్ణారావు నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పడి జయప్రకాష్ నారాయణ్ బహిష్కరణ ఆదేశాలను ఖండిస్తూ ఉద్యమాలు చేపట్టింది.
<<<<<Previous Continue>>>>>