మధ్యయుగ భారతీయ చరిత్ర
ముస్లిముల దండయాత్ర:
అరబ్బుల దండయాత్ర:
అరబ్బుల దండయాత్ర:
మొట్టమొదటి ముస్లిం లేదా అరబ్బుల దండయాత్ర క్రీ.శ.712లో జరిగింది.
పర్షియా రాజు అల్ హిజాజ్‌కు శ్రీలంక నుంచి బహుమానాలు తీసుకొని వెళుతున్న ఒక నౌక ధేబాల్ వద్ద దోచుకోబడింది.
ధేబాల్ సింధ్ రాజ్యంలో ఒక భాగం. కావున అల్ హిజాజ్ సింధ్ పాలకుడు అయిన దాహిర్ నష్టపరిహారం చెల్లించాలని హెచ్చరికలు జారీ చేశాడు. కానీ దాహిర్ దానిని తిరస్కరించాడు. దీంతో దాహిర్‌ను ఓడించుటకు అల్ హిజాజ్ మహ్మద్‌బీన్ ఖాసీంను పంపాడు.
క్రీ.శ. 712లో మహ్మద్‌బిన్ ఖాసీం రేవార్ యుద్ధంలో దాహిర్‌ను ఓడించాడు.
ఈ దండయాత్ర కారణంగా భారతదేశ ఆయుర్వేదము, గణిత శాస్త్రము, చదరంగము అరబ్ దేశాలకు వ్యాప్తి చెందాయి.
జిజియా పన్ను మొదటిసారిగా భారత్‌లో ప్రవేశ పెట్టబడినది. ఇండో సరాసినిక్(అరబ్) కళ అభివృద్ధి చెందింది.
ఉదా! పద్మమహల్ లేదా లోటస్ మహల్
తురుష్కుల దండయాత్ర:
మొహమ్మద్ గజినీ దండయాత్ర(క్రీ.శ.1000-27) :
మొహమ్మద్ గజినీ బిరుదులు - షికన్ (విగ్రహాల విధ్వంసకుడు), యమిన్-ఉద్-దౌలా (ముస్లిం రాజ్య సంరక్షకుడు)
గజినీ రాజ్యాన్ని పటిష్టపరుచుటకు సైన్యం కావలెనని, దాని కొరకు భారతదేశంపై దాడి చేసి సొత్తును దోచుకొనుటకు నిర్ణయించాడు.
ఇతను క్రీ.శ.1000-27 మధ్య కాలంలో మొత్తం 17 సార్లు భారతదేశంపై దాడి చేశాడు.
ఇతను కేవలం పంట కోసే కాలంలో మాత్రమే దాడి చేసేవాడు.
ఇతని ప్రధాన దాడులు:
క్రీ.శ.1000 : కైబర్ కనుమ
క్రీ.శ.1008 : వైహింద్ -ఆనందపాలను ఓడించి జ్వాలాముఖి దేవాలయమును దోచుకున్నాడు.
క్రీ.శ.1014 : థానేశ్వర్‌పై దాడి చేసి చక్రస్వామి దేవాలయమును దోచుకున్నాడు.
క్రీ.శ.1018-19: మధుర, కనోజ్‌లపై దాడి చేశాడు.
క్రీ.శ.1021-గ్వాలియర్
క్రీ.శ.1026- గుజరాత్‌లోని సోమ్‌నాథ్ దేవాలయము (శివాలయం)ను దోచుకున్నాడు(16వ దాడి). అప్పటి గుజరాత్ పాలకుడు -భీమదేవ/ భీమరాజు
క్రీ.శ.1027: సింధ్‌లోని జాట్స్ తెగపై దాడి చేశాడు.
మహమ్మద్ గజినీతో పాటు అల్బెరూనీ అనే చరిత్రకారుడు భారతదేశానికి వచ్చి అనేక సంవత్సరములు ఉండి భారతదేశ సంస్కృతి, ఇతర విషయాలను తెలియజేస్తూ “తారిఖ్-ఇ-హింద్” అనే పుస్తకాన్ని రచించాడు.
ఈ పుస్తకాన్ని అంగ్లంలోకి అనువదించినవారు - సచావో
గజినీ ఆస్థానంలోని ఉత్చి 'తారీఖ్-ఇ-యమినీ అనే పుస్తకాన్ని రచించాడు.
ఫిరదౌసీ షానామాను రచించాడు.
మహమ్మద్ ఘోరీ దండయాత్ర:
ఘోరీ ఆస్థనిస్థాన్‌లో ఒక చిన్న రాజ్యం. దీని పాలకుడు మొహమ్మద్. అసలు పేరు -మొహమ్మద్ బిన్‌సామ్
క్రీ.శ.1175లో మోరీ మొట్టమొదటిసారిగా వాయువ్య భారతదేశంపై దాడి చేశాడు.
1178లో గుజరాత్ పాలకుడు 2వ బీమదేవుడు(మూలరాజు) గుజరాత్ యుద్ధం లేదా మౌంట్ అబూ యుద్ధంలో ఘోరీని ఓడించాడు.
క్రీ.శ.1191లో మొదటి తరైన్ యుద్ధంలో ఇతన్ని పృథ్విరాజ్ చౌహాన్ ఓడించాడు. (భటిండా ప్రాంత ఆక్రమణ కొరకు)
క్రీ.శ.1192లో 2వ తరైన్ యుద్ధంలో మహమ్మద్ ఘోరీ పృథ్విరాజ్ చౌహాన్‌ను ఓడించాడు. ఈ యుద్ధ ఫలితంగానే భారత్‌లో ముస్లిం రాజ్యస్థాపన జరిగింది.
క్రీ.శ.1193లో కుతుబుద్దీన్ ఢిల్లీని ఆక్రమించి, ఆ పట్టణాన్ని భారతదేశంలో మహమ్మదీయ రాజ్యానికి రాజధానిగా చేశాడు.
క్రీ.శ.1194 చాంద్వార్ యుద్ధంలో ఘోరీ కనోజ్ గహద్వాల రాజు జయచంద్రుడిని హతమార్చాడు.
ఘోరీతో పాటు ఇద్దరు జనరల్స్ భారత్‌కు వచ్చారు. వారు
1) భక్తియార్ ఖిల్టీ: బెంగాల్ పాలకుడు లక్ష్మణసేనుడిని ఓడించాడు.
2) కుతుబుద్దీన్ ఐబక్: ఇతడు మధ్య, పశ్చిమ భారతదేశంపై దాడి చేశాడు.
ఘోరీ భారతదేశంలో తాను ఆక్రమించిన ప్రాంతాలకు ఐబక్‌ను ఢిల్లీ వద్ద డిప్యూటీగా నియమించి ఘోరీ ప్రాంతానికి పయనించాడు.
క్రీ.శ.1206లో జీలం నది దగ్గర దమ్యక్ వద్ద కొక్కర్ అనే తెగ మహమ్మద్ ఘోరీని హత్య చేసింది. ఈ వార్త విన్న వెంటనే కుతుబుద్దీన్ ఐబక్ ఢిల్లీ వద్ద తన స్వతంత్రాన్ని ప్రకటించుకుని భారతదేశంలో బానిస వంశ పాలన లేదా ఢిల్లీ సుల్తానుల పాలనను ప్రారంభించాడు.