ముసునూరి వంశం (క్రీ.శ. 1325-1368) Musunuri Nayaks History
క్రీ.శ 1323 లో కాకతీయ రాజ్యం పతనమైన తరువాత అప్పటి ఢిల్లీ సుల్తాన్ గియాజుద్దీన్ తుగ్లక్ మొహమ్మద్ బీన్ తుగ్లక్/జునాఖాన్ ను పంపి వరంగల్ ను అంతం చేయించి దానికి సుల్తానపూర్ అని నామకరణం చేశాడు.
ఢిల్లీ సుల్తాను నాయకులను ఎదుర్కోవడానికి ఆంధ్రదేశంలోని సుమారు 75 మంది రాజులు ప్రోలయ్య నాయకుడి నాయకత్వాన ఒకటయ్యారు. ఈయన స్థాపించిన వంశమే ముసునూరి వంశం.
వీరి గురుంచి తెలిపే శాసనాలు - విలాస తామ్ర శాసనం(ప్రోలయ నాయుడు), పోలవరం శాసనం(కాపయ్యనాయుడు)
ముసునూరి వంశ పాలకులు -- 1. ప్రోలయ నాయకుడు 2. కాపయ నాయకుడు
ప్రోలయ నాయకుడు (క్రీ. శ. 1325-1333)
- ఇతని యొక్క తండ్రి పేరు పోతి నాయకుడు
- ఇతను నేటి రేకపల్లిని (నేటి భద్రాచలం) రాజధానిగా చేసుకొని పరిపాలన చేశాడు.
- ఇతను విలాస శాసనం ను వేయించాడు
- ఇతనికి కల బిరుదు ఆంధ్ర భూమండలాధ్యక్షుడు
కాపయ నాయకుడు (క్రీ.శ. 1333-1368)
- ఇతను దేవనాయకుని కుమారుడు
- ఇతనికి కల బిరుదులు ఆంధ్ర దేశాధీశ్వర, ఆంధ్రాసురత్రాణ,అనుమగంటి పురవరాదీశ్వర
- ఇతను వేయించిన పోలవరం శాసనాన్ని వేయించాడు
- ఇతను అప్పటి వరంగల్ ను పాలిస్తున్న మాలిక్ ముక్బుల్ ను ఓడించి వరంగల్ ను ఆక్రమించాడు
- ఇతను బహుమనీ రాజ్యస్థాపనలో హాసన్ గంగూ కి సహాయం చేశాడు.
- సికిందర్ ఖాన్ కాపయ నాయకుడిని ఓడించి కౌలస్ దుర్గంను (నిజామాబాదు) ఆక్రమించాడు.
- క్రీ.శ 1356 లో బహమన్ షా తిరిగి దండెత్తటంతో ఇతను పరాజయంపాలై భువనగిరి దుర్గాన్ని కోల్పోయి సంధి కుదుర్చుకున్నాడు
- క్రీ.శ 1368 లో రేచర్ల పద్మనాయక రాజు అయిన అనవోత నాయకుడు భీమవరం యుద్ధంలో కాపయ నాయుడుని హతమార్చాడు. దీనితో ముసునూరి వంశం అంతమైంది.